వీరాజీయం

మన రోడ్లమీద దినదిన గండం...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏక్సిడెంట్స్ ఆర్ మేడిన్ హెల్లా? హెవెనా?... అవధరింపుడు-
రోడ్డున పడ్డ మనిషి తిరిగి యింటికొచ్చేదాకా- గుబులు గుబులుగా గుండెలదురుతూనే వుంటాయ్. స్కూలు ఆటో, స్కూలు బస్సు ఓ అయిదు నిమిషాలు ఆలస్యమయితే కూడా - అమ్మ ప్రాణాలు అల్లాడిపోతాయి. రోడ్లమీద మృత్యుదేవత వలపన్నిందా? అన్నట్లుంటాయి మన రోడ్లు.
గతుకులూ, గుంటలూ, మిట్టపల్లాలూ, అనధికారిక త్రవ్వకాలూ లాంటివెన్నో నిత్యనూతన దృశ్యాలు మన దేశంలో. ఆసేతు హిమన్నగమూ- మన రోడ్లు, ముఖ్యంగా జాతీయ రహదారులు నెత్తురోడుతూనే వుంటాయి. మహమ్మారి వ్యాధులకన్నా- మధ్యేమార్గంలో జరిగే రోడ్డు ప్రమాదాలు- జనాల్ని వేల సంఖ్యలో చంపేస్తున్నాయి. ఇది మేరాభారత్ మహాన్ యొక్క ప్రత్యేకత!
పోయినేడాది, దేశంలో రాదారి మీద చావులు ఎంత ఎక్కువగా జరిగారుూ అంటే- గంటకో పదిహేడు వంతున (దామాషా) రోడ్లకి బలయిపోయారు. డ్రైవర్ల నిర్లక్ష్యమూ అపారమే. ‘‘ఇవాళ ఛస్తే రేపు రెండూ’’ అంటాడు హెవీ వెహికల్ డ్రయివర్.. తాను ఛస్తే సరే, తనతోపాటు తన బండి చక్రాల క్రింద త్రొక్కేసి నొక్కేసిన నిరపరాధులయిన బాటసారులు?- సైకిల్, మోటారు సైకిల్, మోటారు కారు శకటాల ప్రయాణీకులు కూడా- మరోమారు ‘అమ్మా’! అనకుండా ప్రాణాలొదిలేసే స్థితి తెస్తున్నారు ర్యాష్ డ్రయివర్లు...
దురదృష్టవశాత్తూ పోయినేడాది నేలమీద నూకలు చెల్లిపోయిన వారిలో టీనేజర్లు, మిడిల్ ఏజ్ జనాలు యాభైనాలుగు శాతం దాకా వున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కేంద్రమంత్రి శ్రీ నితిన్ గడ్కారీ మహాశయులే స్వయంగా ప్రకటించారు.
2015లో దేశంలో ఐదు లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ బోల్తాల్లో, ఈ ఢీకొట్టడాల్లో రోడ్ల పాత్ర అతి ముఖ్యమైంది. కనీసం లక్షా నలభై ఆరువేల మంది మృత్యుశకటాల చక్రాల క్రింద నలిగిపోయారు. పైగా నేషనల్ హైవేస్ ప్రమాదాల్లో- సిటీ లోపల, గ్రామాల మధ్య జరిగే ప్రమాదాలకన్నా- ‘అక్కడికక్కడ చావులే’ ఎక్కువ. ఇక ఆయుర్దాయం వుండి- బ్రతికినా, గాయాలై, వికలాంగులై పోయిన వారి సంఖ్య లక్షలలోనే వుంది. పైగా గవర్నమెంటు ‘‘మేం రుూసారి యింకా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’- రోడ్ల మరమ్మత్తులు చేయిస్తున్నాం’’- అంటూ ప్రకటిస్తారు అంటే, టెండర్లు పిలుస్తారన్నమాట. మొత్తానికి 2014కన్నా 2015లో ఏక్సిడెంట్ల సంఖ్య ఓ మూడు శాతం దాకా పెరిగింది. ఈ వృద్ధి రేటును ఎలా సమర్ధించాలి?
‘బాప్రే బాప్!’ అంటారు వీటి వైనం గమనిస్తే. ఓ గంట, ఓ ఐదు కిలోమీటర్ల దూరం దాకానో కాస్త జాగ్రత్తగా వుంటారు. ఆ తర్వాత రాకెట్‌లు జ్ఞాపకానికి వస్తాయి. ముట్టించి వదిలిన తారాజువ్వలు నేలబారున పోయినట్లు- దూసుకుపోతారు డ్రయివర్లు. రోజుకో 1374 ఏక్సిడెంట్లు జరుగగా- రుూ ప్రమాదాల్లో రోజుకో 400 మంది ‘హరీమన్నారు’- అంటున్నది నివేదిక!
రోజుకో పది మంది పిల్లలు తల్లిదండ్రులకు- కడుపుశోకం మిగులుస్తూ ప్రమాదాల్లో అంతమైపోతున్నారు. అంటే, గమనిస్తే ఉగ్రవాదుల దాడులకన్నా ప్రకృతి వైపరీత్యాలు, భవన పతనాలకన్నా ఎక్కువ మందిని మన రాదారులే మ్రింగేస్తున్నాయన్నమాట. ఓ జంబో విమానం కూలితే మూడునాలుగువందల మంది పోతారన్నది నిజమేగానీ- ఆకాశంలో ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి?
‘‘రోడ్డుమీద నిత్యం- అదేదో యమధర్మరాజుకు బలియివ్వాలి అన్నట్లు- 750 మంది చొప్పున పైకి పోతూంటే- రోడ్లు యమకింకరుల ప్లేగ్రౌండా?’’అన్నట్లు వుంది అన్నాడో స్కూల్ బోయ్!
ఢిల్లీ నగరం ప్రమాదాలకు కూడా మకుటాయమానమే! అలాగే పెద్ద నగరాలు- ముంబాయి, కొలకొతా, చెన్నై, బంగలూరు, పూనా, జైపూర్, హైద్రాబాద్ లాంటి నగరాలలో ప్రమాదాల సంఖ్య తగ్గటం లేదు. రాష్ట్రాలలో ప్రగతిదాయకం అనుకుంటున్న పెద్ద రాష్ట్రాలలోనే- రోడ్లు నరబలి కోరుతున్నాయి.
తమిళనాడు టాప్! పోతే ప్రపంచంలో ఎన్నిచోట్ల మనం నెంబర్ వన్‌గా వుంటామో చెప్పలేముగానీ ప్రమాదాల సంఖ్య- ప్రమాదాల జోరు, ప్రమాదాల దౌర్భాగ్యం తీరు- వీటిలో మాత్రం మనమే నెంబర్ వన్ అని మరెవరో కాదు- రోడ్ల సమాఖ్య ఛైర్మన్‌గారే సగర్వంగా చెప్పాడు.
అంచేత కొంచెం లోతుగా చూస్తే- ట్రక్కుల, ఆటోల, ‘బుల్లికారున్న షోకిల్లా యువతీ యువకుల - చోదకుల వొళ్లు- పొగరు, కండకావరం, నిర్లక్ష్యధోరణి, తప్పతాగి వున్న స్థితీ వగైరాలు కూడా - రోడ్లమీద జనాల్ని మట్టేస్తున్నాయ్!
అసలు రోడ్ల భద్రత అంటే, వాటి క్వాలిటీ సహా ఎలా వుండాలి? అన్న అంశంపై- ఎప్పుడో దశాబ్దం క్రిందట ‘సుందరం కమిటీ’అని వొకటి వేశారు. ఇంతలావు ‘పొస్తకం’ వేశారు వాళ్లు. దాని సిఫార్సులన్నీ ‘్ఫర్సు’లయి పోయాయిట! కేంద్రమంత్రి గడ్కారీగారు చాలా విచారించారు. ‘‘మొత్తం మూడువేల కిలోమీటర్ల రోడ్లన్నింటినీ- ‘ఆడిట్’చేయిస్తామండీ! ఎక్కడెక్కడ లోపాలున్నాయో రోడ్ మ్యాప్ వేసి మరమ్మత్తులు చేపడతాం’’అన్న అర్థం వచ్చేలాగా, చాలా సీరియస్‌గా ప్రసంగం చేశాడాయన.
‘‘ఇదేదో అమరావతి అయిపోతుంది లెండి’’- అన్నాడో సామాన్యుడు సణుగుడూ. అమరావతా? అనడక్కండి. ఈపాటికి అర్ధం అయిపోవాలి. లేదంటే మీరు నడుస్తున్న చరిత్రను తలక్రింద పెట్టుకొని, నిద్రోతున్నారన్నమాట!
ఇక మరోటుంది. పోయినవారం హైవే మీద- బార్‌లు బార్లాతెరిచే టైము పెంచారు. కస్టమర్లు దారిలో ‘మధ్యమధ్యే లిక్కర్ కరిష్యామి’అంటూ, గొంతు తడుపుకుంటూ డ్రయివింగ్ చేసుకోడానికి. మందు ప్లాస్టిక్ సంచులు విత్ స్ట్రాస్ (గడ్డి గొట్టాలు) యిచ్చి- వాళ్లకి ‘‘బై సార్!’’లు చెబుతున్నారుట. తాగితే తప్పేమీ లేదు. (అది నీ ఖర్మ) కానీ, త్రాగి,- తప్పత్రాగి కూడా కాదు- మామూలుగా కూడా త్రాగి కారులు తోలకూడదు-అంటూ పోలీసులు వెంటపడుతున్నారు. వాళ్లని బురిడీ కొట్టించబోయి- వీళ్లు అనగా పెట్రోలు రథసారధులు తడబడి- తందానా తిల్లానాగా పడిపడి దొర్లుకుంటూపోడమో- పోలీసోడి చేతిలో చిక్కాడు మిడతంభొట్లు అన్నట్లు పడిపోడమో చేస్తున్నారు.
‘ఈ దశలో ఏక్సిడెంట్లు మరీ ఘోరం, కావున పాదచారులుగా వుందాం’- అనుకుంటున్నారా? పాదచారుడికే మన వూళ్లో, మన రాష్ట్రంలో, మన దేశంలో యింకా డేంజర్! ‘వీడికి నడకారాదు- వాడికి డ్రయివింగూ రాదు’ అదీ దుస్థితి-
‘సే, ఏక్సిడెంట్స్ ఆర్ మేడిన్ హెవెన్!