వీరాజీయం

జార్ఖండ్ ఇచ్చిన షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరికన్నా ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీమతి మమతా బెనర్జీ.. హేమంత్ సొరేన్‌కి, కాంగ్రెస్ పార్టీకి అభినందనలు పంపించింది. ‘జార్ఖండ్ ప్రజలు మహాసంఘటనకి తమ ఆశలను తీర్చే బాధ్యత అప్పగించారు. జార్ఖండ్ సోదర సోదరీమణులకి నా శుభాకాంక్షలు.. ఎన్నికలు అక్కడ సి.ఎ.ఏ., ఎన్.ఆర్.సి... వ్యతిరేక నిరసనల సమయంలో జరిగాయి. ఇది ప్రజల పక్షాన లభించిన తీర్పు..’ అంటూ ట్వీట్2చేసింది. జార్ఖండ్ మోర్ఛా స్కోరు అప్పుడు నలభై ఏడు వున్నది. భాజపా 37 స్థానాలలో పనె్నండు సీట్లు పోగొట్టుకొని, స్కోరు 25 దగ్గర వున్నది. అదే టైమ్‌లో మిగతా పార్టీలన్నీ కూడా మునుపటికన్నా తక్కువ సీట్లు మాత్రమే దక్కించుకున్నాయి. భాజాపాకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ2అన్న లేబిల్ కూడ దక్కకుండా జె.ఎమ్.ఎమ్. తనంతట తాను ఆ హోదాను దక్కించుకున్నది.
కొండ ప్రాంతం స్థానాలలో ఒక్క రెండు తప్ప మిగతా అన్నీ మహా సంఘటన జేబులో పడ్డాయి. అయితే దేశంలో ఎన్.ఆర్.సి.కి వ్యతిరేకంగా నిరసన జ్వాల భగ్గుమనడానికి ముందుగానే జార్ఖండ్‌లో చివరి విడత పోలింగ్ తప్ప మిగతా అంతా వోటింగ్ అయిపోయింది. కేవలం ఒక్క ముప్ఫయి సీట్ల మీద మాత్రం రుూ ఉద్యమ ప్రభావం పడ్డది.
శిబూసొరేన్ తనయుడు హేమంత్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అయింది. అపార మెజారిటీతో మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో విజయ బావుటా ఎగరేసిన మోదీ, షాల నాయకత్వం క్రింద దూసుకుపోతున్న పార్టీ- సదరు ఎన్నికల తర్వాత మూడు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొన్నది. హర్యాణాలో పార్టీకి సొడ్డు పడ్డది. మహారాష్టల్రో తిరస్కారం లభించింది. ఇక జార్ఖండ్‌లో పరాభవం సంభవించింది.. అంటూ మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కసిగా యిచ్చిన ట్వీట్‌లో ఆక్షేపణకేమీ లేదు. కానీ మనదేశంలో ఓటరు కేంద్రానికి జరిగే లోక్‌సభ ఎన్నికలకి రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరు కొలమానంలో చూడడం అన్నది మొదటినుంచీ వున్నదే! 37 సీట్లువున్న బి.జె.పి.కి రుూసారి పనె్నండు సీట్లు తగ్గడం ఒక షాక్!
ఎన్నికలు మొత్తం రుూ ఆందోళనల తరువాత జరిగితే, యింకా ఎంత పెద్ద దెబ్బ తగిలేదో?! అన్నవాళ్లు కూడా వున్నారు. ఈ రాష్ట్రం ఎన్నికల మీద ప్రధాని, హోంమంత్రీ కూడా ప్రత్యేక దృష్టిపెట్టి- మొత్తం ఎనిమిది ప్లస్ ఐదు- ర్యాలీలు నిర్వహించారు. కాకపోతే ప్రధానమంత్రి మొన్న ఆదివారం నాడు ఢిల్లీ ర్యాలీలో యిచ్చిన వివరణ ముందుగానే యిచ్చి వుంటే బాగుండేది అని కొందరు వీరాభిమానులు అన్నారు. అసలు ఎన్.ఆర్.సి. మీద మేము కేబినెట్‌లో చర్చించనే లేదు. అది కేవలం సుప్రీంకోర్టు యిచ్చిన తీర్పు ఫలితంగా- ఒక్క అస్సోంలోనే అమలు అవుతున్నది అంటూ చెప్పుకొచ్చారు ప్రధానమంత్రిగారు. ఏది ఏమయినా జార్ఖండ్‌లో తగిలిన దెబ్బ గట్టిది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వున్న నాయకుడు కూడా వోడిపోవడం ఒక షాక్2మోదీ, షాలకి2అని ఒక పరిశీలకుడు వ్యాఖ్యానించాడు.
నిజంగా ఎన్నో సాహసవంతమయిన సంస్కరణలు- ముఖ్యంగా, కాశ్మీర్ సమస్యకి ఒక పరిష్కారం తెచ్చిన మోదీ గవర్నమెంటు కంగు2తినడం మొదలెట్టింది. అంటే- ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు.. అవుతాయి అన్న సామెతను టి.ఆర్.ఎస్. కార్యకర్త ఒకరు జ్ఞాపకం చేశారు. నిజానికి అయిదేళ్లపాటు ఈ కొండ రాష్ట్రంలో భా.జ.పా. పాలన లాగించిందీ అంటే.. అది మరో విద్యార్థి సంఘ పార్టీతో కలిసి మాత్రమే సుమా! ఈ అయిదేళ్లలో భయంకరంగా ఎదగాల్సిందిపోయి.. 12 సీట్లు నష్టంతో పడిపోడం దారుణం.
ఇండియన్ ఓటర్‌కి మొదటినుంచీ వున్న మహిమ యిది. నిజానికి ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా ఏమీలేదు. జాగ్రత్తగా గెలుపు గుఱ్ఱం తోక పట్టుకొని, ఆబోతు దక్కించుకోడం మాత్రమే- గడుసుగా చేసింది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలోని ఉత్తర భారతంలో డెబ్భైశాతం ప్రాంతంలో భా.జ.పా. గాలి జోరుగా వీస్తూండగా.. యిప్పుడది ముప్ఫయి అయిదు శాతానికి పడిపోయిందని అంచనా.. పైగా రుూ ఎన్నికలలో, పోలింగ్ అవగానే వెలువడిన 3ఎగ్జిట్‌పోల్స్2కూడా.. హంగ్ వస్తుందేమోనంటూ నీళ్లు నమిలితే అది కూడా వమ్ము అయింది. హంగ్2కాదు హ్యాంగ్2అన్నాడు ఓటర్.
మహారాష్టల్రో ప్రేగు తెంచుకుని కుటుంబంలో అంతర్భాగంగా పుట్టిపెరిగిన- శివసేన- ఏకు మేకైనప్పుడు అయినా అమిత్‌షా మేల్కొనక పోవడం చివరికి ముంచింది. కాంగ్రెస్ పార్టీ కూడా శివసేనకు జై4కొట్టడం అన్నది మామూలు విషయం కాదు. పార్టీ సిద్ధాంతాలు అంటూ వల్లెవేసేవారు ఆలోచించాలి. పోయినసారి జార్ఖండ్‌లో భాజాపాకి చెయ్యి అందించిన విద్యార్థి మోర్ఛా కూడా ఎన్నికలలో విడిపోయి తనంట తానుగా పోటీ చేసింది. కాకపోతే రుూసారి ఎన్నికలు కాంగానే మేము తిరిగి భారతీయ జనతాపార్టీకే మద్దతు యిస్తామేమో? అందుకు మేము సిద్ధమేనంటూ ప్రకటించింది.
ఐతే.. మహాకూటమికి నిర్ద్వందమైన, అవసరమయిన సంఖ్యలో నలభై ఆరు (31లో) లభించడంతో, ఆ కూటమిని చీల్చడం కూడా అంత సాధ్యంకాదు.
కొంతమంది భక్తులు.. యిది తాత్కాలిక అపజయం మాత్రమే అనుకోడం ఆశావాదమే అవుతుంది. ప్రతీ రాష్టమ్రూ కర్నాటక2కాదు. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ భాగం.. హింసా జ్వాలకి గురి అయిపోవడం యింకా బాధాకరం. అందరికీ ఇంటర్‌నెట్, డిజిటల్ లావాదేవీలు, నగదు రహిత చెల్లింపులు.. అంటూ, ఎన్నో సదుపాయాల రూపకల్పన చేసిన మోదీగారి హయాంలోనే ప్రతీచోటా చీటికీమాటికీ నెట్ సదుపాయాన్ని నిలిపివేయవలసి రావడం కూడా అమిత్‌షాగారి ప్రతిష్ఠకి దెబ్బ కాదా? 34ఇదేదో మావాళ్లు కొరివితో తల గోక్కుంటున్నట్లు చేసుకుంటున్నారేమోనని ఒక కమలం పార్టీ వీరాభిమాని వాపోవడంలో తప్పేముంది?
మమతాదీదీతో పాటు మరి ఎనిమిదిమంది ముఖ్యమంత్రులు- రాజ్యాంగ సంక్షోభానికి అయినా రెడీ, అంటూ వుంటే- ఆఖరికి బీహార్‌లో నితీష్ కూడా- మేం అమలు చెయ్యం- అంటూ వుంటే దేశంలో- ప్రశాంత సుస్థిర స్థితిగతులకి ఆపద వస్తుందన్న భయం- లాజికల్‌గా, ఇస్స్యూబేస్డ్‌గా, ఆలోచించేవాళ్లకెవరికయినా అనిపిస్తుంది.
ముందు మంటలు ఆర్పు- ఆనక దర్యాప్తు చర్య- అంటూ యు.పి.లో యోగీ ఆదిత్యనాథ్ నేరుగా రంగంలోకి దిగి- అల్లర్లు చేసే శక్తుల తోక కత్తిరించే సాహస కృత్యానికి పూనుకున్నాడు. ప్రజల ఆస్తులు తగలెయ్యడం ఆపడానికి- సి.సి. కెమేరాలున్నాయి రుూ రోజులలో- అనేక మార్గాలున్నాయన్న చిట్కా యోగి పుంగవుడు చూపెట్టాడు. క్రికెటర్ కపిల్‌దేవ్ అన్నట్లు ఎవడూ తన కారు, మోటారు సైకిలూ ధ్వంసం చేసుకోడు కానీ, పబ్లిక్ శకటాన్నీ, బస్సుల్నీ తగలెడతాడేం? ఇవాళ అటువంటి చేష్టలు చేయించేవాళ్లకీ చేస్తున్నవాళ్లకీ, 3శాస్తి2చేసే మార్గాలలో ఒకటి అనగా దుండగుల ఆస్తిపాస్తులు 3జప్తు2చెయ్యడం- అన్నది యోగి కనిపెట్టి, అమలు చేస్తున్నాడు కూడాను. ఇది దేశంలో మంటలు చల్లార్చే అత్యవసర సమయం. గవర్నమెంటు, ప్రతిపక్షాలూ కూడా ప్రజలకి బాధ్యులన్నది గ్రహించాలి. భాజపాకిది3చింతన, అంతర్మధన్- రెండింటికీ అవసరమయిన సమయం!
ఈజిట్ నాట్ టైమ్ ఫర్ ఇన్‌ట్రోస్పెక్షన్?

veeraji.columnist@gmail.com 92900 99512