వీరాజీయం

దేశంలో కావాలోయ్.. ‘జీన్ రివల్యూషన్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపుర ఎంత చిన్న రాష్టమ్రైతేనేమి? పెద్ద విజయం సాధించింది. పాతికేళ్ల వామపక్ష పరిపాలనకి చెల్లు చీటీ రాసేసింది. ఒక సునా మీలా కాంగ్రెస్ పార్టీని మింగేసి లోగడ ఢిల్లీలో గద్దెనెక్కినంత సంబర పడిపోయింది మోదీ గారి భాజపా ‘కమలం’లా వికసించింది. అతి పెద్ద రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినంత ఆర్భాటంగా త్రిపురలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది కాషాయ సేన. కొత్తవాడైన ముఖ్య మంత్రి-కుర్రాడు- ఉత్సాహవంతుడు- మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచలర్‌లా మెరిసి పోతున్న వాడు.. పేరు కూడా ఎంచి పెట్టినట్లు సరిపోయింది.. బిప్లబ్ కుమార్ దేబ్! కంగారుపడకండి- తెలుగులో విప్లవ కుమార దేవుడని అర్థం. అతడిని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా జగమెరుగును. పైగా, ఒక జిమ్‌ను నడపుతున్న వ్యాయామ సిద్ధుడు. అంటే అనుమానం లేదు తిండి పుష్టి, కండ పుష్టి రెండూ ఉన్నవాడు. ఈ బుల్లి రాష్ట్రం ఇప్పుడు మళ్ళీ ఓ చిన్న వివాదాన్ని తెచ్చిపెట్టు కొని -సోషల్ మీడియాలో అక్షింతలు వేయించు కుంటున్నది. గవర్నమెంటు ఆఫీసర్లు- జీన్స్ వేసుకుని ముఖ్యమైన సభలకి, సమావేశాలకి హాజరు కావద్దని - ఒక విప్లాత్మకమైన తాఖీదు కొట్టింది త్రిపురలోని భాజపా ప్రభుత్వం.
సభ్యత, హుందాతనం ఇవేమీ ప్రభుత్వ ఉద్యోగులకు అక్కరలేదా? డెనిమ్ ప్యాంట్ లేదా కార్గో జీన్ ఫ్యాంటు బిగించేసుకొని నల్లకళ్ళద్దాలు ధరించి - ఏదో పిక్నిక్కుకో -బర్త్ డే పార్టీ కో అన్నట్లు -ఆఫీసర్లు రావడం ప్రభుత్వం గమనించింది. కలెక్టరు గారా? కాలేజీ స్టూడెంట్ యూనియన్ లీడరా? అవుట్ డోర్ షూటింగుకి వస్తున్న షారూఖ్ ఖానా? అన్నట్లు బడా ఉద్యోగులు త యారవుతున్నారు! ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి -వచ్చిన సభలకి కూడా ‘జాలీ’గా- ఒంటెచర్మం బూట్లు కూడా ఫ్యాషన్ అన్నట్టు ఈమధ్య- వేంచేస్తున్నారు. ఆడ ఆఫీసర్లు, ఉన్నతాధికారులు సైతం -లెగ్గీస్-లెగ్గింగులు- టైట్ బాటం జీన్స్ బిగించుకుని దిగబడుతున్నారు. జీన్ ప్యాంట్లు ఆడామగా కుడా మోజుగా తొడిగేసుకుని తమ ఔన్నత్యాన్ని ప్రదర్సిస్తున్నారుట. దాని మీద చిన్న పల్చటి షర్టు -దానికి మళ్ళీ భుజాల దగ్గర చిన్న కిటికీలకు మల్లె కన్నాలు. చేతిలో స్మార్ట్ ఫోను.
మధ్యప్రదేశ్‌లో కొన్నాళ్ల క్రితం ముఖ్య మంత్రి గారిని రిసీవ్ చేసుకోడానికి ఓ కలెక్టర్ గారు - సన్ గ్లాసెస్ పెట్టుకుని డెనిమ్ జీన్ మీద అడ్డ చారల సిల్క్ టచ్ ఉన్న టీ షర్టు వేసుకుని ఎయిర్ పోర్టుకి పోయాడట. హోంమంత్రి గారు తన సెక్రటరీని పిలచి - ఆ కలెక్టర్‌కు ఓ ‘డోస్’ ఇవ్వమని హుకుం జారీ చేసేడట. త్రిపుర కొత్త గవర్నర్‌గా కెప్టెన్ సింగ్ సోలంకీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున- ఈ కొత్త డ్రెస్ కోడ్ ఎంత దాకా అమలు అయ్యిందోనని పౌర అధికారులు జాగ్రత్తగా పరిశీలిం చారుట. అవతల ముఖ్య మంత్రి గారు లేదా వీవీఐపీయో సీరియస్‌గా ప్రజల యోగక్షేమానికి సంబంధించి -ఏదో చెబుతూంటే - ఓ అధికార పుంగవుడు తన సెల్‌ఫోన్ తీసి దాని మీద సందేశాలు నొక్కేస్తూ ఉన్నాడు. మరో అధికారి అర్జంటుగా క్రికెట్ స్కోర్ చూసేస్తూ ఉంటాడు. చితుకూచితుకూ మెసేజీలు నొక్కడమో లేదా ఏదో ఫోను వస్తే - సిరికిన్ జెప్పడు అన్నరీతిలో అవతలకి దూస్కుపోతూ మరో ఆఫీసరు... ఇలాంటి విచ్చల విడి కలాపాలు జరగకుండా - మెడ మీద తలకాయ ఉన్న ప్రతీ వాడు- వాడు బ్యూరోక్రాట్ అయితే - చచ్చినట్లు మొబైల్‌ని మడచి జేబులో తోసేసుకోవాల్సిందే.. ఎస్‌ఎంఎస్‌లు నై చలేంగే అని ముఖ్య కార్యదర్శి - సుశీల్ దేవ్ ‘లకోటా’ కొట్టడంతో - మంత్రులు పాల్గొన్న సభలకు, సమీక్షలకు వెనుకటి సందడి లేకుండా పోతుందని -కొంచెం మంది పెద్దబుర్ర ఉద్యోగుల మూగ ఆవేదన. పేరు చెప్పని ఓ ఉద్యోగి అన్నాడు- వాళ్లు వస్తారు, పోతారు, మేము అరవై ఏళ్ల దాకా ఇక్కడే ఉంటామని.
కాగా, రాజస్థాన్‌లో పోయినె్నలలో ‘నో జీన్స్ - నో గాగుల్స్ మేమో’లు కొట్టారు. లెగ్గీస్ లెగ్గింగులూ- గుండె భాగంపై ఆచ్ఛాదన లేని కుర్తీలు బాన్డ్.. అని గవర్నమెంటు ఉద్యోగులపై జులుం అనదగ్గ ఆదేశాలు జారీచేశారు. ఏమిటో ? ఇలా అందరికీ జీన్స్ -టీషర్ట్లులు అంటే ఈర్ష్య అసూయ ఎక్కువైపోయాయి. రాజస్థాన్ లేబర్ శాఖ వారు- డ్రెస్ కోడ్ ప్రకటించారు. మగాళ్ళంతా - నాన్ గెజిటెడ్ వాళ్లయనా సరే- డ్రెస్ కోడ్ తప్పదు. సాదా ఫ్యాంటు దాని మీద బుష్ షర్టు ఒకే.. కానీ- ఫ్యాన్సీ దుస్తులు, గొట్టం ప్యాంట్లు వాటి పిర్రలమీద ఐలవ్ యూ లేబిల్స్ వేసుకొస్తే.. జాగ్రత్త- తగిన చర్య తీసుకొనబడును. ఆడపిల్లలు కాదు ఆడవారు కదా? ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసేది. జఘన నితంబ సౌందర్య ప్రకర్షని దశ దిశలా ప్రదర్శించే బిగుతు దుస్తులు ధరించి వస్తే - సెట్ మీదకి పోయే ఐటెం డ్యాన్సర్‌లా మేకప్ దంచేసి వస్తే - ఫైల్స్ కదులుతాయా? అసలు కళ్లు ఫైళ్ల మీదకి మల్లటం లేదనేగా - బ్రిటిష్ దేశంలో కూడా ఆఫీసులలోకి మినీ స్కర్టులకు నో ఎంట్రీ ప్రకటించారు. డెనిమ్ ‘ఆపిల్ బాటమ్‌లు, ,లెగ్గింగ్సూ.. ఆ పైన కుర్తీలకు - ‘షో కేసు’ మాదిరి పూలచొక్కాలు -ఇంటి దగ్గరే దాచుకొని రమ్మంటున్నారు ప్రతీ చోటా ప్రభుత్వ శాఖల ‘హెడ్స్.’
ఉద్యోగులు ముఖ్యంగా మహిళా సంఘాలు -కస్సున లేచాయి. ఎంతో మంది ప్రజా ప్రతినిధులు జీన్స్ ధరిస్తున్నారు. మీరేమో మమల్ని బామ్మల మాదిరి రమ్మంటారు- రాజ్యాంగంలో ఎవరి ఇష్టం వాళ్ళది- అన్న హామీ ఉంది తెలుసా? అంటూ కొందరు హస్తావిన్యాసంతో ప్రొటెస్టు చేశారు క్యాంటీన్‌లో. వారి చేతులకి గాజులు లేవు, కనుక గలగలలు లేవు. అసలు జీనే్సనే డ్రెస్‌కోడ్‌గా, భుజాలమీదకి కిటికీ లాంటి కంతలున జాకట్లను డ్రెస్ కోడ్‌గా ప్రకటిస్తే పోదా?- అన్నాడో సెక్యూరిటీ ఉద్యోగి. అందరూ దేవతా వస్త్రాలే ధరిస్తే ఫినిష్.. ఇంకేం గ్లామర్ ఇంకేమి సెక్స్ అప్పీల్ గట్రా ఉండవు అని కొందరు జోకేరు.- ధోవతి, షరాయి ఒకే అన్నారు సర్కార్ వారు. మరి దోతీ అని చెప్పి గావంచా కటుకొని వచ్చేస్తే..! - ఓ గడుసుబుర్ర వాడి వ్యాఖ్య.
కాలేజీ పిల్లలమీద కర్నాటకలో ఆంక్షలు పెట్టారు- కస్సు మన్నారు వాళ్లు. పాశ్చాత్య దుస్తులతో కళాశాల ప్రాంగణం లోపలకి రాకూడదు అన్నారు. ఆడపిల్లలకి టీనేజీ మంచి జోరు హుషారు కాలం కదా?- ఆ టైములో రకరకాల దుస్తులు వేసుకోవద్దు అంటే ఎట్లా? ఎట్లా?? అని ఓ కాలేజి భామ మెటికలు విరిచింది, ‘బుల్షిట్’ అంది.
చుడీదారు లేదా పరికిణీ వోనీ లేదా చీర మాత్రమే (మినీ చీర ఓకేనా? ) ఆడపిల్లలకి శోభనిస్తాయి అని కిట్టని వాళ్ళ వాదన - అది మన సంప్రదా యమన్నారు. సెల్ ఫోన్లతో క్లాసులోకి రాకూడదు (ఇంక కాలేజీలెందుకు?) సెంటు, లిప్‌స్టిక్‌లూ పార్టీలకే కానీ క్లాసులకి కాదు. పల్చనిదైనా వల్లెవాటు వుండాలి. దాన్ని పిన్నులు పెట్టి ఎగరకుండా బిగించాలన్నారు దొరవారు. ఓ టీనేజర్ మండి పడ్డది. ‘గో టు హెల్’ అన్నది.
పోయిన డిసెంబర్లో చెన్నైకోర్టు -పెద్ద జాబితా చెప్పింది గుడిలోకి వచ్చేవారు జీన్స్ షార్ట్లు అంటే నిక్కర్లు.. వగైరా ధరిస్తే - వాకిలి దగ్గరే శఠగోపం పెట్టి - రైట్ ఎబౌట్ టర్న్ కొట్టించమన్నారు. ఫ్యాంటు, పంచె, షరాయి వేసుకుంటే ( పంచెతో కట్టుకునే లుంగీ వరకు ఒకే అంటున్నారు) ఓకే అంటూ ఒక జాబితా విడుదల చేసింది కోర్టు. బడిలోకి గుడిలోకి కూడా ఇట్లా రూల్స్ పెట్టడం ఘోరం అంటున్నారు ప్రతిపక్షాల వారు . కాని మిలిటరీ వాళ్‌లకి యుద్ధంలో- యునిఫారం లేదా? అలాగే చిన్నపిల్లలకి డ్రెస్సుకోడ్ లేదా? పోస్ట్‌మ్యాన్‌కి, బస్ కండక్టర్‌కి, ఆటోవాలాకి, విమాన సిబ్బందికి దుస్తులే గుర్తింపు హోదా ఐడీ కార్డు కాదా? కొన్ని లారీలకు ‘డోంట్ కిస్ మీ’ అని వెనుక వేపు బోర్డ్లు లు ఉంటాయ్ ఒకసారి చూడండి.. అలాగే టీషర్ట్ మీద ‘కిస్ మీ’ అంటూ లేబిల్స్ ఉంటున్నాయ చూడలేదా? విప్లవ దేవ్ గారూ.. డ్రెస్ కోడ్‌లో జీన్స్ షార్ట్స్ పెడితే -త్రిపుర స్ట్ఫా -శభాష్ సర్కార్ అనేవారు కారా? ఏది ఎమైనా....
ఉయ్ కేర్ ‘జీన్ రివల్యూషన్’ ఇన్ మాడ్రన్ ఇండియా!

-- 92900 99512