వీరాజీయం

యూపీ మాజీ సీఎంలు రోడ్డున పడ్డారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఒకేసారి ఆరుగురు ఘనత వహించిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ‘కొంపలేని వారు’ అయిపోయారు. మాజీ ముఖ్యమంత్రులైనప్పటికీ పార్టీ అగ్రనేతల హోదాలో ప్రభుత్వ బంగ్లాల్లో సుఖభోగాలు అనుభవిస్తూ- ‘ఏనుగు చచ్చినా బతికున్నా వెయ్యి వరహాలే’ అన్నట్టు దర్పంగా బతికేస్తున్న రెండు బడా పార్టీలకు చెందిన ముగ్గురు బడాబాసులు ‘రోజులు మారాయ్’ అని గ్రహించాల్సి వచ్చింది. సుప్రీం కోర్టు వీరిని నిర్వాసితుల్ని చేసి, మొట్టికాయలు వేసింది. తాము సీఎం హోదాలో ఉన్నట్టుగానే అవే భవంతుల్లో ఉంటూ- వచ్చే ఎన్నికల్లో గెలిచాక అవే నివాసాలను ఆక్రమించుకోవాలి కదా! అని వీరు పాత భవనాలను ఏళ్ల తరబడి ఖాళీ చేయడం లేదు. ‘మమ్మల్ని ఎవరు అడుగుతారు?’ అంటూ నిశ్చింతగా నిద్ర, సుఖం పొందుతూ రాజభోగాలు అనుభవిస్తున్న వీరికి అనుకోని దెబ్బ తగిలింది. గతనెల ఏడో తేదీన సుప్రీం కోర్టు వీరికి ఓ ‘షాకింగ్’ తీర్పు ఇచ్చింది. పదవులు కోల్పోయినవారు ‘మాజీలు’ మాత్రమే కాదు... మామూలు మనుషులై పోతారని తీర్పు ఇచ్చింది.
దాంతో- రాజ్యం లేకున్నా ‘కిరీటం భుజకీర్తులూ ఉన్నట్టు ఫీలైపోతున్న రాజుల్లా’గా లక్నో నగరంలోని విక్రమాదిత్య రోడ్డులో ఉన్న నెంబర్ నాలుగు, అయిదు భవనాల్లో ఇరుగు పొరుగులుగా ఉన్న మాజీ సీఎంలు అయిన కారణంగా ఇంచక్కా నివసిస్తున్న తండ్రీకొడుకులు ఉలిక్కి పడ్డారు. ‘నేతాజీ’గా వాసికెక్కిన ములాయం సింగ్, తండ్రిని ధిక్కరించి పార్టీ పగ్గాలు లాక్కున్న ఆయన గారి పెద్ద కుమారుడు అఖిలేష్‌జీలు- ఇన్నాళ్లూ హ్యాపీగా కాపురాలు చేస్తూ కార్యకలాపాలు చక్కబెట్టుకుంటున్నారు. పులిమీద పుట్రలా ఎప్పుడు ఎలా ఎన్నికల రంగంలోకి దూకుతుందోనన్న భయాన్ని ప్రత్యర్థుల్లో కలిగించే ‘బెహన్జీ’ కుమారి మాయావతి కూడా మాల్‌రోడ్డులోని 13 ఎవెన్యూలో ఇన్నాళ్లూ నిర్విఘ్నంగా రాజకీయ పన్నాగాలను సాగిస్తోంది. ఆమె ఒకసారి కాదు, నాలుగుసార్లు మాజీ సీఎం. అందుకే కాబోలు ఆమెకి ప్రభుత్వం లాల్‌బహదూర్ శాస్ర్తీ మార్గ్‌లోని ఆరో నెంబర్ భవనాన్ని వేరే మంజూరు చేసింది. మాల్ అవెన్యూలోని మహల్‌లో పది బెడ్‌రూములున్నాయి. రాజస్థాన్ చలువరాతితో కట్టిన ఆ భవంతిని ఖాళీ చేసే ప్రసక్తేలేదని మాయావతి భీష్మించింది.
ఈ ముగ్గురు మాజీలతో పాటు సుప్రీం తీర్పుతో మరో ముగ్గురు ‘మహా మాజీ’లకు అనగా- వారు బాగా పాతవారులెండి.. వారికి కూడా గట్టి దెబ్బ తగిలింది. అది వారికి అకస్మాత్తుగా తగిలిన (ప్రహార్) దెబ్బ! మన జోలికి ఎవరొస్తారులే అన్నట్టు సర్కారు వారు ఇచ్చిన నివాస భవనాలను ఖాళీ చేయకుండా ధీమాగా ఉన్న మరో ముగ్గురు మహనీయుల్లో ఒకరు ఎవరంటే- మాజీ సీం కల్యాణ్ సింగ్. పార్టీని మునివేళ్ల మీద నడిపించిన ఆయన కూడా మరపురాని నేతే కదా! ఆయన మామూలుగా చెబితే ఇల్లు ఖాళీ చేస్తాడా? ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్‌గా హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. మరొక మాజీ సీఎం ఎవరంటే- ప్రస్తుతం కేంద్రంలో ప్రధాని మోదీజీ తర్వాత రెండో స్థానంలో కూర్చున్న హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్. రాజకీయ కురువృద్ధుడు, మాజీ సీఎం ఎన్‌డీ తివారీ కూడా ఇదే బాపతు.. మోదీజీ వెనుకటి శకం నేతలు కొందరు ఇన్నాళ్లుగా సర్కారీ సదుపాయాన్ని అనైతికంగా అనుభవిస్తున్నారు.
ఇక ప్రస్తుతానికి వస్తే- ఆ ఆరుగురు మాజీ సీఎంలకు కేవలం పదిహేను రోజులు గడువిచ్చి మరెక్కడికైనా ఇల్లు మారండి అంటూ సుప్రీం కోర్టు హూంకరించింది. ఆ ఆదేశాన్ని బట్టి ‘సుగ్రీవాన’ లాంటి తాఖీదులు వచ్చాయి వాళ్లకి. ఒకే ఒక ‘ప్రహార్’కి ఆరుగురు మాజీలు ‘్ఫనిష్’! ‘ప్రహర్.. ప్రహర్’ అని ఏమిటీ బాధ అనకండి. ‘ప్రహర్’ అనే ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ (ఎన్‌జీవో) సుప్రీం కోర్టులో ఓ ‘పిల్’ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేసింది. దాని కార్యాలయం అస్సాంలో ఉంది. ఈ కేసులో సుప్రీం ‘స్ట్రాంగ్ డోస్’ ఇచ్చింది. యూపీలోని మాజీ సీఎంలకు ఇది గట్టిగా తగిలింది. పాపం.. వీళ్లు ఈ మధ్యనే- నివాసాలు వగైరా కేటాయింపులు చేసే ‘ఎస్టేట్ చట్టాని’కి సవరణలు తెచ్చుకున్నారు. దీంతో ఇక ‘మాకు భద్రత ఉంది.. మమ్మల్ని ఇల్లు వదలిపొమ్మనే దమ్ము ఎవరికుంది?’ అనుకున్నారు. గానీ జస్టిస్ రంజన్ గగోయి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ‘సవరణ చెల్లదు’ పొమ్మంది. అది రాజ్యాంగ విరుద్ధం అని అడ్డంగా పెద్దగీత గీసి కొట్టివేశాడు- ‘గో..గో..’ అంటూ గొగోయ్. వెంటనే మాజీలంతా యూపీ సీఎం యోగి వద్దకు పరుగుతీసి తమకు గడువు కావాలన్నారు. ‘కోర్టు ఇదే ఎక్కువ అన్నట్టు చూసింది.. సారీ బాసులూ’ అన్నాడు యోగి. అఖిలేష్ అన్నాడు- ‘నేను మాజీ సీఎంని, సమాజ్‌వాదీ పార్టీకి జాతీయ అధ్యక్షుడిని, నాకు జడ్ క్యాటగిరీ భద్రత ఉంది, నా చుట్టూ ఉండే కమెండోలకు ఎక్కడ బస చూపాలి? కనీసం ఓ రెండేళ్లు గడువు ఇవ్వండి, ఈలోగా మంచి ఇల్లు కట్టుకుంటా, అది పూర్తయ్యాక గృహప్రవేశానికి అందర్నీ పిలుస్తాను..’ అన్నాడు. అయినా ఉలకలేదు కోర్టు. ‘నేను నేతాజీని, నా వద్దకు నిత్యం బోలెడు మంది వస్తుంటారు, పైగా నాకు బాగా సుస్తీగా ఉంది, ఇప్పటికిప్పుడు నా లెవల్‌కు తగ్గ కొంప ఎక్కడ దొరుకుతుంది?’ అన్నాడు ములాయం యాదవ్.
‘బంతి గొగోయ్ గారి బెంచ్ (్ధర్మాసనం) కింద ఉంది’ అని పొమ్మన్నారు అధికారులు. ‘అకటా దయలేని కోర్టువారు’ అనుకుంటూ అఖిలేష్ తాను ఓ గెస్టుహౌస్‌లోకి మారిపోయి ఇల్లు ఖాళీ చేయించేశాడు. కల్యాణ్ సింగ్ మాత్రం యూపీలో మంత్రిగా ఉన్న తన మనవడి ఇంటికి సామాగ్రిని తరలించాడు. గోమతిలో తన సొంత ఇంటికి సామాన్లు తరలిస్తానని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించాడు. తివారీ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారని, ఈ పరిస్థితిలో ఇల్లు ఖాళీ చేయకుండా ఉండేందుకు అనుమతించాలని ఆయన భార్య వినతి..
అయితే- గడుసు పిండం మాయావతి అధీనంలో రెండు ప్రభుత్వ భవంతులు ఉన్నాయి. హుకుం తనదైనప్పుడు తీసుకున్న మాల్ ప్రాంతంలోని అవెన్యూ (మహల్ 13) దొడ్డ గొప్పది. అదిగాక రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన వేరే భవంతి కూడా ఉంది. మహల్ మీద- బహుజన సమాజ్‌పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ స్మారక మందిరం అని మొన్ననే మాయావతి బోర్డు పెట్టించింది. అందులోని రెండు గదులను తాను ‘దేఖ్భాల్’ కోసం ఉంచుకున్నానంది. అలా చెబుతూ రెండో చిన్న ఇంటిని ‘డెడ్‌లైన్’ లోగానే ఖాళీ చేసేసింది. అయితే- ‘మేం అడిగింది పెద్ద భవనం మేడమ్’ అన్నారు ఎస్టేట్ అధికారులు. ‘అదేం కాదు.. స్మారక మందిరాన్ని ఎలా ఖాళీ చేస్తాను? తప్పుకాదా?’ అని ఆమె వాదించింది. మీరు నాకిచ్చిన ఇంటి తాళాలు తీసుకోండి అని ఆమె పంపితే ఎస్టేట్ ఆఫీసు తిరస్కరించింది. ఆమె స్పీడ్ పోస్టులో బిల్లులు చెల్లించినట్టు రశీదులు, తాళం చెవులు భద్రంగా పార్సిల్‌లో పంపించింది. ఈ వ్యవహారం లిటిగేషన్ అయ్యిందో.. యూపీ సీఎం యోగి మహరాజ్‌కు ఏం చేయాలో తెలుస్తుందా? ఇది అతని మీదకు ‘ప్రహర్’ అయ్యే ప్రమాదం ఉంది. లేకుంటే ఆయన ఏం చేయాలో తోచక అమిత్ షాకి ఎస్‌ఎంఎస్ పంపాలా?
‘నేను దళిత నాయకురాలిని.. నాపై కక్షగట్టి వీళ్లు నన్ను దుఃఖపెడుతున్నారు.. బహుజనులారా వినుడు..’ అని మాయావతి గళం ఎత్తిందంటే- క్యాకర్నా హాయ్ భారుూ..? ఆరుగురు మాజీ సీఎంలలో ‘టాప్’ బెహన్‌జీ మాయావతి, ఆనక నేతాజీ ములాయం, అఖిలేష్ తాజా మాజీ.. పార్టీమీద పట్టున్నవాడు. ఈ ముగ్గురితో యోగికి ‘బద్నాం బాల్’ ఆట ఆడక తప్పదు. ఇది రగిలే కిరికిరి అంటారు కలహప్రియులు. అది అట్టుండనిండు.. ఆ ఎన్‌జీవో సంస్ధను అభినందిద్దాం రండి..
త్రీ చీర్స్ టు ఎన్జీవో ‘ప్రహార్’!

వీరాజీయం..... సెల్: 92900 99512