వీరాజీయం

క్రికెట్ జిందాబాద్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిప్పులు చెరిగే ఎండాకాలంలో- క్రికెట్ బంతీ బ్యాటూ పోరా? .. జనాలు బతకాలా? చావాలా? పిల్లకాయలకి ఎంట్రన్సు పరీక్షలు లేవా? ఏప్రిల్ ఏడు నుంచి మే నెల చివరిదాకా చండ ప్రచండ ఎండలకి ఫ్లడ్ లైట్స్ వేడిమి - తోడుగా పెట్టుకొని పగలూ రాత్రీ కలిపి- నానా గోత్రస్య - నానా దేశస్థ -బహుళ జాతి క్రికెట్‌ని తిలకించి పులకించగా కోట్లాది ప్రేక్షకుల వేలం వెర్రియా? -అంటే , ఔను ఇది పదకొండో ఐపియల్ విజయవంతమైన సీజన్ అని జవాబు.
నాడు విమర్శలకి, వెక్కిరింతలకి గురి అయిన - ‘పొట్టి క్రికెట్ ‘ నిలిచి గెలిచింది పొడుగ్గా.. ఇంటింటా ఏప్రిల్ ఏడు నుంచి మే ఇర్రవై ఏడూ దాక -ఈవినింగస్ ఎర్లీ నైట్స్ అన్నీ - ట్వంటీ ట్వంటీ కే అంకితం. దోమలు తోలుకున్నాయి సినిమా హాల్స్..
తాగిన నీళళు తాగకుండా, పీల్చిన గాలిపీల్చకుండా -కలకత్తా ముంబయి పూణె హైదరాబాద్‌ల మధ్య - సర్కసు బృందాలు లాగా తిరిగి - జనరంజనం చేసినవాళ్లు క్రికెట్ క్రీడాకారులు. అసలు క్రీడ యోధులు - క్రీడా కుబేరులు అని కీర్తింపబడ్డారు. భేష్! ఎందుకంటే ఆడిన ప్రారంభంలో - ఒక దేశప్రతిష్టకు చెందని ఈ టీములకు -క్రీడా శ్రద్ద క్రీడా స్ఫూర్తి ఎట్లా వుంటాయి ? అన్నారు - ఇవాళ ఇవి నరాలు తెగిపోయే ఉత్కంఠని పెంచి పోషించాయి .. సినిమా తారలకే తారలైపోయారీ బ్యాటూ బంతి వీరులు. ఆర్ధిక సంక్షోభాలు, రాజకీయ ఒడుదుడుకులు లాంటివాటికి ఈ మినీ క్రికెట్ అతీతం.. ఇదో మినిస్కర్ట్ బాపతు గ్లామర్.. ఇదో పెద్ద జూదం - వినోద విహితమైన వీరోచిత పోరాటం .. ఒక్కో క్రికెటర్ ఒక్కో మహానటుడు.. వికెట్ పడగానే అందర్నీ మించి విదేశీ బౌలర్లు చేసే నాట్య విన్యాసాలు - వీధి వీధిన -పిల్లకాయలు -పాదచారుల కనుల పండువగా చూపెడుతూనే ఉన్నారు.. కాపోతే , ఇది గాలి - క్రికెట్.. వెనుకటి జిడ్డు క్రికెట్‌లో -బంతి గాలిలోకి లేస్తే ఆక్షేపణ. ఇప్పుడు... ? ఆట రక్తి కట్టాలంటే , మేఘాల్ని తాకి నేలకి దిగే అగ్గి బరాటాలాగ సిక్సర్లు కొడితేనే వాడు మొనగాడు.. ఆరు సిక్సర్లు నాలుగు ఫోర్లుగా -ఈ వినోదం సాగాలి అప్పుడే -అప్సరస ల్లాంటి చీర్గాళ్స్ -నామమాత్రంగా వున్న మినీ స్కర్ట్స్ ఇలా పైకి ఎగిరేలా -గిర్రున ఎగిరి గెంతాలి.. పాపం ! వాళ్‌ల పాలిట సిక్సర్లు ఫోర్లు -‘గుకీ పోట్లే ‘.. ఈ ఏడాది సిక్సర లధమాకాదే కొత్త రికార్డు. కొత్త కుర్రాడు అవార్డు అందుకున్న రిశభ్ పంత్ 37 సిక్సులు 68 ఫోర్లు తో వీరబాదుడు రికార్డు చేశాడు. మొత్తం మీద -872 సిక్సర్లుతో అదో రికార్డు- పాత రికార్డు 712 అదీ 2012లో. చివరకి వీధి క్రికెట్ లో కూడా పిల్లలు గాలిలోకి రబ్బరు బంతి లేపేసి మేడల కిటికీలకి దడ పుట్టిస్తున్నారు.. ఇదేమి ? ఎండావానా కుక్కల నక్కల పెళ్లిరా బాబూ... అని ఈసడించిన వాళ్ళే - టీవీ సెట్లకి అతుక్కు పోతున్నారు
ఈసారి - ధోనీ లక్కీ నంబర్ ఏడు అన్నది -రుజువైపోయంది. ‘తాతగార్ల టీము’’ ఇది అందరూ మూడు పదులు దాటినవాల్లె ఇందులో - చెన్నై సూపర్ ‘‘కింగ్స్’’ -అనగా ఇది ముసలి రాజుల దసరా పండుగ అన్న కుర్రకారు -పెద్ద కారులెక్కి పటాపంచలైనారు... రెండేండ్ల ‘‘దేవిడీ మన్నా’’ తరువాత చెన్నై సూపర్ కింగ్స్ రంగ ప్రవేశం చేశారు. ధోనీ బృందంలో ఒక్క అశ్విన్ తప్ప అంతా జూలు దులుపుతూ క్రికెట్ ఎరినాలోకి -దిగేసరికి ఈ సారి ఐపియల్ కి కొత్త ఊపు వచ్చింది.. కుర్రాళ్ళ తోక ఊపుడు కూడా తగ్గింది. అశ్విన్ వేరే పంజాబ్ కింగ్స్ కి నాయకుడయ్యాడు. గురుశిష్యులుగా వాసి కెక్కిన కోహ్లీ ధోనీలు, వారి సేనలు క్రికెట్ కురుక్షేత్రాన -ద్రోణార్జునులై - అభిమానులకు కన్నుల పండువ చేశారు.. సిల్లీ క్రికెట్ కాదిది మిర్చీ క్రికెట్ అంటూ - జాతి వైషమ్యం, దేశ పక్షపాతం మరచి- కొమ్ములు తిరిగిన ప్లేయర్లు మోయలేని భారంగా ఉన్న భుజకీర్తులతో.. గోదాలో దిగి - తమ తమ వీర నైపుణ్యాన్ని సంకోచం లేకుండా ప్రదర్శించారు.. గాలిలోకి బంతుల్లేపి జేబులను కాసులతో నింపుకున్నారు. మూడు సార్లు కప్ అందుకున్న ముంబయి ఇండియన్స్ వీరులు- ముందే తప్పుకున్నారు.. చివరిదాకా నువ్వా? నేనా? అంటూ ఉన్న టీమ్స్‌నీ ఓడించిన హైదరాబాదు- పొడుచు కొచ్చే సూర్య బృందం అన్నారు. కాని చెన్నై సూపర్‌కింగ్స్‌తో మూడుసార్లు తలపడి తట్టుకోలేకపోయింది- అందరికి ధోనీభాయ్‌గా మకుటదారి అయిన మహేంద్రసింగ్ కూడా చివర - ప్రత్యర్ధి జట్టుని ప్రశంసిం చేలా ఆడారు ఈ జట్టు. -ఆఫ్ఘనిస్తాన్ కొత్త కుర్రాడు రషీద్ నీ -్భవీ అనగా భువనేశ్వర్‌కుమార్ నీ బద్నాం అయిపోయిన పాత క్యాప్టన్ వార్నర్ బదులుగా వచ్చిన కొత్త విలియమ్స్ నీ కూడా శభాష్ అన్నాడు దోనీభాయ్ . ఈ పొట్టిబవ్లర్ గూగ్లీ రషీద్ అయితే - వామనుడు కాని మూడు అడుగులు వేసి విశ్వ విక్రముడై నట్లు- ధోనీ కోహ్లీ డి విల్లెర్స్‌ల వికెట్లు జేబులో వేసుకుని -ఆ ఆనందంలో ఒంటికాలు మీదే వాళ్ళ దేశం పరిగడుతున్నాడు.. ‘మా దేశంలో అంటే ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రెసిడెంటు తరువాత నేనే పాపులర్ అన్నాడు..
చివరికి - ధోనీ బృందం -సూపర్ కింగ్స్ అన్న పేరు నుంచి సుప్రీమ్ కింగ్స్ అన్న కీర్తి కిరీటాన్ని నెత్తిన పెట్టుకుని - ముంబయి నుంచి చెన్నైకి గాలిలో ఎగురుతూ వెళ్ళింది.. ‘మహీ’ అన్నట్లు ‘షేన్న్ వాట్సన్’ కాదు షాకింగ్ వాట్సన్ (37) అయ్యాడు మిస్టర్ వాట్సన్. హైదరాబాదు వీరుల్ని - ఆఖరుసారి -ఉతికి ఆరేశాడు .. యాభై ఏడుబంతుల్లో శతకం బాది -చివరికి ప్రత్యర్ధుల శభాషులు కూడా బుట్టనిండా నింపుకున్నాడు.. ధోనీ బృందం అని అందుకే అన్నాను- ధోనీ ఎంత ‘‘ కూల్’’గా ఉన్నా, వీళ్ళంతా ముప్పయ ఎనిమిదిలో అడుకెట్టుతున్నా - నోటి దురుసు భజ్జీ కూడా అంత ‘‘కామ్’’ .అందుకే సేన -ముఠా .. గ్యాంగు లాంటి మాటలు అనకుండా -కలసికట్టుగా ఒక జట్టుగా ధోనీ మాటమీద నడచిన బృందంగా ముచ్చటగా మూడోసారి- అదే నాయకత్వం కింద -ఇరవై కోట్ల రూపాయల కప్పును జేగీయమానంగా సాగిన సంబరం లో ఎత్తుకుపోయారు.. అన్నట్లు ఈ సుప్రీం కింగ్సే ‘‘ఆరు’’ బాదేరు బంతిని అదేపనిగా- 147- సార్లు మేఘాలను ముద్దెట్టుకు రమ్మని పంపించారు.. ఈ సారి మరో క్రెడిట్ థాంక్స్ టు ఆల్ లీడర్స్ అండ్ ప్లేయర్స్ -ఆట మొత్తం -ప్రసన్న సుహృద్భావ వాతావరణంలో -మండు టెండలో - అపర సూర్య కాంతులను కక్కే ‘ఫ్లడ్ లైట్ ‘వేడిలో చల్లగా జోరుగా, హుషారుగా సంపన్నమయ్యాయి .. వచ్చే ప్రపంచ కప్ పోటీలో మన వికెట్ కీపర్ ఎవరు? అన్న ప్రశ్నకి జవాబు కూడా దొరికింది.. ఎవరో చెప్పలా? -ఇంకెవరు? ధోనీ.. ధోనీ.. అంటున్నారు అందరూ రాగతాళ యుక్తంగా.. వినపడలేదా? ఆ ఘంటారావం ?
హిప్ హిప్ హుర్రే టూ గ్లామరస్ క్రికెట్..! సో లాంగ్!
*

-- వీరాజియం....92900 99512