వీరాజీయం

బహుపరాక్.. దోమాసురులు వస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగేళీ రంగంలోకి దూకడానికి అవతల ఐపిఎల్ వీరులు బ్యాటూ బాలూ పట్టుకుని ఉరికిస్తూ ఉండగా -నువ్వేమిటి? అసుర సంధ్యవేళ -ఇంట్లో ర్యాకట్ ఝళిపిస్తూ గెంతుతున్నావ్? పైగా- ‘కిల్.. కిల్..’ అంటూ ఈ గెంతులేమిటి? నేవ్వేమయినా సింధూవా? సానియావా? ..
-రెండూ కాను... నీ ఇల్లాలిని నేను, ఇంటావిడను నేనూ... అంటూ.. ఎలక్ట్రిక్ రాకెట్తో ఒక్కటి ఇచ్చుకుంది భామామణి. అఫ్కోర్స్.. దోమని అనుకోండి.
-ఐసీ .. అందుకా ?అసుర సంధ్య వేళ తలుపులు బిడాయించు కొని లోపల .. ఈ ఫటాఫాట్స్ ఏమిటి? తలుపులు తెరిచియే ఉంచుము- అని యేసు చెప్పలేదా? అని అందుకున్నాడు పురుష పుంగవుడు. ..
-ఏసుగారు చెప్పినా, యహోవా గారు చెప్పినా ... ఆగవూ .. ఈ, దోమలు ఆగవూ.. రాగం ఆపి -కిల్లింగ్ దోమ్స్ ఈ జ్ మై జాబ్ ! అది నేరము కాదు. ఇంతకీ నేను చెప్పినవి తెచ్చావా? లేదా? .. తలుపులు మూసేస్తూ ఓ విసురు చూపు విసిరింది..విరిబోణి.
-ఓ అదా? .. సీజన్ కొంచెం లేటుట .. మామిళళు ఇల్లే .. మల్లే పూలూ నహీ .. ఇంకా దిగలేదుట ..
-ఓరిమీ ఇల్లు బంగారం గానూ.. అంత సీన్ లేదు మనకి కాని ..’ దో మలచుట్టలు ..’ బ్రింగు బాబోయ్ బ్రింగు!’ అంటూ రెండు ఎస్సెమ్మెస్‌లు కోట్టాను కదండీ .. బ్యాట్ ఆవతల పడేసింది సుదతీమణి. ‘జబ్బలు పులిసిపోయాయ్. ఇంక చుట్ట వెలిగించాల్సిందే -
-చుట్టా ? ... చుట్టా బీడీ సిగరెట్ లు నిషిద్దములు అన్నాడు చాయ్ వాలా .. అని తన షాపులో వున్న ఈ బుడ్డీ ఇచ్చాడు మన చాయ్‌వాలా.. ఇంద .. ‘ఎలక్ట్రిక్ దోమసంహారక’ అందమయిన ‘ద్రవ- కుప్పెము’ ను ఇలా తీసి అందించాడు మొ’గుండు’ వాడు. ఈ మధ్యతిరుపతి పోయొచ్చేరు లెండి..
-మన మేమయినా అపార్ట్‌మెంటు వాళ్లమా ? .. చాలీ చాలనికొంప ..ఓల్డ్ మోడలు టూ బెడ్ రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అంటూ మా అత్తాదేవి ఇందులో పడేసింది.. కరెంటు పోయిచచ్చే.. సీజనూ కూడా ఇదే .. దోమ్స్ దండయత్రా మొదలు లేట్టే సీజను రెండూ కూడబలుక్కున్నట్లు ఒకే సారి తగలడతాయ్.. అశోక్ నగర్‌కు మారిపోదామా?
-బ్యాట్ చార్జింగ్‌కి పెట్టి -వస్తూ -మా అమ్మ వూసేందుకూ? ..ఏదైనా ఈ సీజన్ లో ‘శోక’నగరమే.. అంటూ పెళ్ళాం రుస రుస లాడుతూ అందించిన టీ కప్ అందుకుంటూ- ’చాయ్‌వాలా జిందాబాద్ ..’ అన్నాడు.
-చాయ్‌వాలా జిందాబాద్ అనండి .. అంది వేలాకోళంగా..ఈ సారి నమో గారి మన్‌కీ బాత్‌లో దోమలు లేని రాజ్యం ఎలా వస్తుందో చెప్ప మనండి ..
దోమల్ని వలస పంపించుతామని -విభజన చట్టాల ఒప్పందంలో ఎక్కడా రాసుకోలేదు.. అంచేత దోమ రాజ్యాన్ని తొలగించ వలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వనికి లేదు. అది స్టేట్ సబ్జక్టు. నిజానికి కేటీఆర్ -పూనుకుంటే తప్ప ఉమ్మడి రాజధానిని పీడిస్తున్న దోమల,కుక్కల పీడ ఇంకెవ్వరూ తీర్చలేరు.. అన్నాదో కాలేజీ గాళ్. అన్యాయం -ఇది కేటీఆర్ మీద అపవాదులు వేసే కుట్ర అన్నాడో మ్యునిసిపల్ లెవెల్ పోలిటీషియన్...
నగర్ సుందరీకరణ’కై’ అంటే ‘కోసం’- అహర్నిశలు తపించే శ్రమించే మంత్రుల్ని ఆర్టీసి సిటీ బస్సులు కావాలి -,దోమల్ని పట్టుకోండి - కుక్కల్ని తీసుకుపోండి లాంటి లోకల్ లెవల్ కోరికలు కోరకూడదు.. డ్రీమ్ హై అండ్ ఆస్క్ ఫర్ ఫ్లై ఓవర్లు ‘అన్నాడు భర్త.
-కిం కర్తవ్యమ్? హబ్బీ సాబ్ ! ...కార్పొరేషన్ మీద కేసు పడేద్దామా?
- మనం ఉమ్మడి రాజధాని హైదరాబాదులో వున్నాం. కార్పొరేషన్ ఉమ్మడి కాదు.. కొంతమంది ఉద్యోగులు విభజన తరువాత వెళ్ళిపోయారు గాని -దోమ్స్‌ని వదలిపోయారుగా .. వాటిని తీసుకొని పోలేరుగదా?
నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో దోమలు తక్కువా? అవి సర్వాంతర్యాములు -‘‘రోదసీ యాను’’లు సుమా .. చట్టాలు వాటిని బంధించలేవు.. వెరైటీ కోసం ఆర్ టీసీ బస్సుల్లో ఉచితంగా విజయవాడ కి పోయి - అక్కడి రక్తమును గ్రోలి - తిరిగి చార్మినార్ నగరాన్ని చేరుకోగల ‘బ్యాండ్’ అంబాసిడర్లు మశక బృందములు... అద్సరే, బాబుగారు ప్రపంచ టెక్నాలజీ హబ్బుగా చేసేస్తున్న వైజాగ్లో -తెల్లార్లూ’ జాగో.. జాగో ‘అని పాటలు పాడి మగ దోమలూ -చితుకూ చితుకూ మని కుట్టి ఆడ దోమలు -వేపుకుని తింటున్నాయిట జనాల్ని అన్నాడో ప్రోఫసర్ . సెమినార్ కి వచ్చాడు లెండి. బెజవాడ సంగతి ఏమిటిట ?నువవు పేరుమార్చేవు కష్టపడి ‘విజయవాడ ‘అని బట్ ..దోమ్స్ డోంట్ కేర్ నేమ్స్. - పేరు మారినా వూరు మారునా? అని- అక్కడి దోమలు అమరావతికి కూడా స్వేచ్చగా ఫ్రీగా, వెళ్లి వచ్చేస్తున్నా యిట .. వీటికి ప్రత్యెక హోదా ఒకరు ఇవ్వనక్కరలేదు . మన హైదరాబాద్ బాధ ఏమిటీ అంటే ? దోమ్స్ కి హెల్ప్ చెయ్యడానికి డిన్గూ - చికున్గున్యా వైరల్ ఫీవర్ లాంటి జబ్బులు రెడీ గా వస్తుంటాయి. దోమల్ని జాగ్రత్తగా టాకిల్ చెయ్యలి.. ఉత్త ఫాగ్గింగు చాలదు.
-మా ఫ్రెండు హైటెక్కు కంచన్- మరో ప్రశ్న అడిగింది - నాకు ఇంకో ఫ్రెండున్నాది.. వాళ్ల ఇల్లు కొత్తది ట- తలుపులకి- లతలూ పూలూ గట్రా షో గా పెట్టేరుట అవన్నీ. దోమ జల్లెడలతో, మూసుకోడమేనా? పోనీ వేరే మర్గాలున్నాయేమో? చుద్దురూ .‘రేపు రుూవనింగ్ మనల్ని -వాల్ల ఇంటికి - చిన్న ‘్ఫలూదా’ వెజ్ పిజ్జా పార్టీ కి పిలవమను షరా మామూలే,-చెబుతా.. పార్టీ పార్టీ కి రిప్లే లు గలవు అన్నాడు మనవాడు.
-మర్నాడు చెప్పాడు మన వాడు వాళ్ళ ఇంట్లో పార్టీ స్వీకరిస్తూ - దోమలను నిరోధించుటకు పలు మార్గములు గలవు కాని -చంపుట కష్టము - ఒక దోమను చంపిన వంద దోమలు ఇంద్రజిత్తులా జన్మించుట తథ్యము..
’ఆగండి... గ్రాంధికం వద్దు అన్నా! .. తెలుగు లో చెప్పండి..’
-సరే - ఇల్లు కొత్త అయినా దోమలు కొత్తా? అన్నారు- కదా.. విద్యుత్ మందు-బుడ్లు ప్లగ్గులో పెట్టం గానే పొగలు వస్తాయి, దోమ్స్ పారిపోతాయి.లేదా సోమ్మ సిల్లిపోతాయి .. తప్ప చావవు.. మంచం క్రిందనో.. బల్లక్రిందనూ నక్కుతాయి.. కాని ఇంకా పవర్ ఫుల్ చిట్కా వుంది..అంటే కంచన్ - నిజమా? అన్నది బుగ్గలు ఇలా పూరించి -అది ఇంకా పవర్ఫుల్లా? అనడిగింది.. ఆశగా.. నిన్న రాత్రి పడ్డ కాటు చూపెట్టింది ,,
-పాపం !చాలా పెద్ద దద్దురు పడ్డది .బై దిబై , తార్నాకా లో సాయంకాలం పార్కు కి వచ్చేవా ళ్ళంతా ఆరుగంటల లోపున ఉడాయిస్తారు. - ఎందుకంటే’ థగ్గులా? పిండారిలా అన్నట్లు దోమాసురులు దండెత్తి వస్తాయి పార్కు మీదకి .. కనీసం ఒక్క దోమాక్షి కుట్టినా అదురుతుంది గుండె. అని చెప్పాడు మన వాడు అనుభవం మీద.
- దోమక్షా? దుశ్శాసనుడు ఏలకారాదు? అడిగారు సదస్యులు- టీ చప్పరిస్తూ
-మగదోమలు కుట్టవు; కుట్టినా రక్తం పీల్చవు .. ఎందుకంటే అవి ‘శాకాహారు’లు .. ఆడవి మాత్రమే - కుల మత జాతి వర్గ పార్టీ విచక్షణ లేకుండా రక్తం పీల్చుకుంటాయి.. మరొక్క సంగతి .. దోమల సంగీతం అని మనము రిఫర్ చెసే మశక గానం కేవలం మగ దోమ మాత్రమే వినిపిస్తుంది.. ఆడ దోమను పరవశింప చేసి వశం చేసుకోడం కోసం తప్ప మానవుల రక్తం తాగే టేస్టు వాటికి లేదు.చాలా చిత్రమైన వెజ్,నాన్ వెజ్ కపుల్ యొక్క కామ్బినేషను ఇది.. అందుకే కలబంద మొక్కలు తెచ్చి వెయ్యి గాని ‘బోగన్విల్లా తీగలు ప్రాకించకు ... దోమలకి పెట్టని కోట బోగాన్విల్లా తెలుసా?.
-్థంక్స్ అండీ.. అల్లోవేరా కి ఆర్డర్ చేసేస్తాము.. ఒకటి కొంటె ,రెండు ఫ్రీ అని ఫెసుబుక్కులో యాడ్ పెట్టేడు ..
సంగీతమ్ పాడే చిన్న ‘‘ఎలిక్త్రిక్ ప్లగ్గు మూజిక్ బాక్సులు ‘వచ్చాయి..అవి -కరంటు వున్నప్పుడే సుమా -అవి కిచ్ కిచ్ చేసే ధ్వనులు అల్ట్రా సౌండ్స్‌ట .. ఆ శబ్దం వింటే చాలు -దోమలు తిరోగమన వేగం పెంచి చాటు మటుకి పోయి దాక్కుంటాయి.. వాటికి ఎల్లేర్జీ అన్న మాట , ఇంకో చిటకా ... బజార్లో చిన్న ఆటోగ్రాఫ్ పుస్తకాల్లాంటి విషపు పూతలున్న కాగితం బుక్లెట్స్ దొరుకుతాయ్.. అవి గులాబీ రంగు కాగితాలు ఆకుపచ్చ కాగితాలు వగైరా రంగుల్లో వుంటాయి. వాటిని తెచ్చి.....
- పడకగదిలో వెలిగించాలా అండీ ! .. మేము రెడీ !.
- అదేమిటీ? .. హారతి కర్పూరమా? అది కాలుతూ వుంటే పొగ వస్తుంది.. దానితో మంట పుడుతుంది.. దోమలు చస్తాయి- బ్యాట్ తో కొడితే నేరుగా కాలిపోయి వచ్చే కంపు కన్నా - ఈ కాగితాలు తగలెడితే అంత స్మెల్ రాదు..ఏదైనా సరే.. దోమలతో జాగ్రత్త మంచిది... బహుపరాక్ !
మన పేటలో సంతకాలేవో సేకరిస్తున్నా రుట కార్పొరేటర్లు.. పాహిమాం రక్షమాం అని రాసి దోమలకి సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారా- అంటూ దోమలు తోలుకుంటూ ఘర్ వాపస్ అయ్యారు వాళళు!
మస్కిటోస్ ఫాలోడ్ దెమ్ విత్ వెంజెన్స్!