వీరాజీయం

ఒడిశా రసగుల్లా శభాష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఒడిశా రసగుల్లాకి జై!’ అనాల్సిన స్థితి వచ్చింది. బంగదేశ్ అనాలి - వెస్ట్ బెంగాల్ని అని మమతా దీదీ అన్నప్పటికీ- బెంగాలీలు మాత్రం పశ్చిమ బెంగాల్ అనే వ్యవహరిస్తున్నారు. అలాగే బెంగాలీవాడు ‘రాస్గుల్లా’ అంటాడు. మన తెలుగువారు రసగుల్లా అని అంటూనే ఈ స్వీటు స్పెషాలిటీని మెచ్చుకొంటారు. కాని ఒడిశావాడు మాత్రం ‘రసగోలా’అనే అంటాడు. అది గోళాకారంలో వుంటుంది- ఒక్కసారి అండాకారంలోను వుంటుంది.
ఏది ఏమైనా బెంగాల్, ఒడిశాల మధ్య- రసగుల్లా వార్ కొన్నాళ్ళు కోల్డ్‌వార్‌గా మొదలయ్యింది. కాని, రెండువేల పద్దెనిమిదిలో అది ఓపెన్ వార్ అయిపోయింది. అప్పుడు రెండువేల పదిహేనులో- మంచికోసం ఆమాట అంటాము గాని- అటు ఒడిశా మనది కాదు- (బె)వెస్టు బెనగాలు కూడా మనది ఎంతమాత్రమూ కాదు. అది సరే, కలకత్తా గవర్నమెంటు రెండువేల పదిహేనులో- రసగుల్లా దినోత్సవం అంటూ ఊరువాడా ఏకం చేసి- రాస్గుల్లాని వూరేగించింది. ఇలా రసగుల్లా తమదేనంటూ రసగుల్లా దినాన్ని బెంగాల్‌లో ఎంతో సంబరంగా జరుపుకున్న సంగతి మనకి జ్ఞాపకం వుంది. అపుడు ఒడిశా వాళ్లకి కారాలు మిరియాలు- వొళ్ళంతా రుద్దుకున్నట్లుగా అనిపించింది... అది మాదే అన్నది ఒడిశా కూడా. బెంగాలీ వాళ్ళు టూరిస్టులని ఈ రోస్గుల్లాతో దోచేస్తోవుంటే- అదే రాస్గుల్లాతో విదేశీ మార్కెట్టులో భంగపడ్డ ఒడిశా జాతి మొత్తం- ఈ రసగుల్లా మీద హక్కుల కోసం యుద్ధానికి దిగింది. దాన్ని ప్రతిష్టాత్మకంగా చేసుకుంది. వందేమాతరం అన్న మాటని- బందే మాతరం అన్నంత మాత్రాన అది బెంగాలి సొమ్ము, హక్కు అయిపోతుందా..? అట్లాగా రసగుల్లాని - ‘సంధి’ చేసి- రస్గుల్లా అన్నంత మాత్రాన- అది పూర్తిగా మీ వారసత్వపు హక్కు అవుతుందా? - కాదు- అది మాది- మా హెరిటేజ్ (వారసత్వ).. మా ప్రాంతంలో అనగా ఒడిశా రాష్ట్రంలో అది ఒక కాటేజీ ఇండస్ట్రీ కూడాను.. అంటూ భువనేశ్వర్ భూనభోంతరాళం- పిక్కటిల్లెలాగ అరిచింది. అదంతా ఫ్లాష్‌బ్యాక్.
ఇక అసలు కథ తెరకెక్కింది. నాడు ఒడిశాకి ‘రసగుల్లా’వున్నా లాభం సున్నా- ‘బంగదేశ్’కి ప్రామాణికమైన సర్ట్ఫికెటు వున్నది- దానివద్ద ప్రామాణికమైన ‘ట్రిప్స్’ అను ప్రపంచ వాణిజ్య సంస్థ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం- సర్ట్ఫికెటు- వున్నది. జీఐ ముద్ర వుంది. జీఐ అనగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ - దీన్ని సాగదీస్తే అనగా తెలుగులోకి మారిస్తే భౌగోళిక గుర్తింపు అవుతుంది. దీన్ని ‘ట్రిప్స్’సంస్థ ఇవ్వాలి- దాన్ని కనుక సంపాదించుకుంటే ఒక ప్యాకెట్టు మీద- లేదా ఓపిక వుంటే స్వీటు స్వీటు మీద కూడా జీఐ ముద్ర వేసుకోవచ్చును- అట్లా, అంతర్జాతీయ మార్కెట్‌లో కాలరెత్తుకుని సదరు సరుకును అమ్ముకోవచ్చును. అందువల్ల- ఈ విషయంలో మేల్కొన్నవాడు తన దృష్టిని అటు మళ్ళించి జీఐ కోసం ఉద్యమం.. ప్రచారం.. పోరాటం- వగైరా అన్నీ కేవలం ఒరియా భాషలోనే గాక అంతర్జాతీయ భాషలో కొనసాగించారు.
2015 నుంచి మొదలైన ఈ స్వీట్‌వార్ హాట్‌హాట్‌గా కొనసాగింది గాని మనం మోదీజీ మన్‌కీబాత్ వినడంలో, యడ్డ్యూరప్పని కర్ణాటక గద్దెమీద కూకోబెట్టడంలో భాజపా ఎంత భారమైన కృషిచేస్తున్నదో చూస్తూ ఆరాటం, అలసట పడడంలో మునిగిపోయాము.. కాని, ఒరియా గోసాయి తన ఆధిక్యతని యుగయుగాలుగా వున్న రసగుల్లా తయారీ ప్రత్యేకతని ఒదులుకోలేదు- ఫైట్...ఫైట్ అంటూ ‘వార్’కొనసాగించాడు. మన గోంగూర చట్నీకి, అరిసెలకీ ఇలాంటి పోటీ లేదా డిమాండు కానీ అటు బెంగాలీ వాడి నుంచి కాని ఇటు ఒడిశా గవర్నమెంటు నుంచి గాని పోటీలేదు. కనుక మనం యుద్ధరంగంలోకి దిగలేదు- మనం ‘జగన్-కేసీఆర్ భారుూ భారుూ’ అనే ఆరాటంలో మునిగిపోయి వున్న ఈ దశలో రసగుల్లా వార్ ఊసు పట్టించుకోలేదు. అది అట్లు ఉండనిండు- ఒరియా వాడు గెలిచాడు. రసగుల్లాని రస్గుల్లా అని అన్నంత మాత్రాన అది బెంగాలీ వాడి జన్మహక్కు కాబోదు.. అని ఒరియా సోదరులు వాదించి గెలిచారు. అదీ తాజావార్త.
అబ్బా! రసగుల్లా అనగా తెల్ల గులాబ్జామున్ అంతేగా అనకండి.. కానే కాదు- రసగుల్లా ఇలా నోట్లోవేసుకుంటే అలా కరిగిపోవాలి.. ఇప్పుడు-ఒడిశా రాష్ట్రంలో తయారయ్యే రసగుల్లాలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఈ రాష్ట్రంలో తయారయ్యే రసగుల్లాలకు భౌగోళిక గుర్తింపు (జియాగ్రాఫికల్ ఇండికేషన్) జీఐ ట్యాగ్‌ను జారీచేస్తూ భారత జీఐ రిజిస్ట్రార్ ఆర్డర్లు పక్కాగా జారీచేశారు. ఒడిశా చిన్నతరహా పరిశ్రమల కార్పొరేషన్‌తోపాటు, రసగుల్లాల తయారీదారులు ఇందుకోసం దరఖాస్తుచేశారు. దాన్ని మేము పరిశీలించేము. బెంగాలీ, ఒడిశా రసగుల్లాలను ఆరగించి చూశారా? ఏమో మరి అది తెలవదు. కాని సదరు క్లయిము దరఖాస్తును పరిశీలించిన అధికారులు వహ్వా వహ్వా అని ఆమోదించారు.. వహ్వా వహ్వా అన్న మాట- బెంగాలీదా? ఒరియాదా? అంటే అది రసగోలీ తిని అనాల్సిన మాట అన్నాడు తెలుగువాడు- ‘‘వహ్వా’’కి పేటెంటు కాపీరైట్స్ లేవు. అవసరం వుండాలి అంతే.
జీఐ రిజిస్ట్రార్ ‘ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ చట్టం 1999’ కింద ఆమోదం తెలిపారు. గో ఎ హేడ్.. జిఐ ముద్ర వేసుకోమన్నారు. ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్నిరకాల వస్తువులకు సహజంగా ప్రత్యేక నాణ్యత ఉంటుంది. సదరు ప్రత్యేకతని, సదరు విశిష్టతను దృష్టిలో ఉంచుకొని జీఐ ట్యాగ్‌ను జారీచేస్తారు. దీనివల్ల ఆయా వస్తువులు, పంటలు లేదా కళలను అదే పేరుతో మరో ప్రాంతంలో వేరేవాళ్ళు వాటిని రూపొందించి విక్రయించడం చట్టరీత్యా చెల్లదు. ఆ విధంగా అసలు హక్కుదారులకు ఇది రక్షణ కల్పిస్తుంది. రుణాలు పొందటానికి- అమ్మకాలకు పెంచుకోవడానికి ఇది ఒక సర్ట్ఫికెట్ లాంటిది. డయాబెటిస్ వస్తుందా? రసగుల్లా తింటే- జానేదేవ్ భాయ్... మాత్రలున్నాయ్.. మింగుదాం..
బాస్మతి బియ్యం, డార్జిలింగ్ టీ పొడి, పోచంపల్లి చీరలు, బొబ్బిలి వీణలు- గద్వాల్ చీరలు, కొండపల్లి- నిర్మల్ బొమ్మలు.. ఇవన్నీ జీఐ ముద్ర గల గొప్ప సరుకులు. తిరుపతి లడ్డూ, బంగినపల్లి మామిడిపళ్లు సహా మన ఉత్పత్తులకు ప్రస్తుతం భౌగోళిక గుర్తింపు ఉంది. పశ్చిమ బెంగాల్ తమ రసగుల్లాలకు జియోట్యాగ్ పొందాలని పోరాడి ఓడినా, గెలిచిన ఒడిశా రస్గుల్లాలను గర్వంగా భుజిస్తూ భజిస్తూ- టూరిస్టులను కవ్విస్తూ ఉన్నది- కాని, రంగంలోకి దిగిన ఒడిశా సర్కార్‌ని మమతా దీదీ హర్షించదేమో? పోనీ, మోదీజి తప్పక శభాషులు అందిస్తాడు. ఒడిశా రసగుల్లాలకు జియోట్యాగ్ దక్కింది. మరమరాల్ని ‘మురీ.. మురీ’ అని మురిసిపోయే రాష్ట్రం- ఆంధ్రప్రదేశ్. ఈ ఆనందంలో మన జగన్‌కో ప్యాకెట్టు, కేసీఆర్‌కో ప్యాకెట్టు- గిఫ్టుగా పంపరాదా? (మరమరాలు కాదు రసగోలీలు) అన్నాడో టీడీపీ లిటికెంటు..
బిట్టర్ వార్ టర్న్‌డ్ ఇన్ టూ ఏ స్వీట్మీట్ చాట్.. శభాష్!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512