వీరాజీయం

ఏనుగులకేల ‘హైరానా’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏనుగమ్మా ఏనుగూ.. ఏ వూరెళ్తోందేనుగూ? ఏనుగమ్మా ఏనుగూ... రాముడెక్కిన ఏనుగూ... రాజులెక్కిన ఏనుగూ... మావూరొచ్చిందేనుగూ.. మంచినీళ్లు తాగిందేనుగూ..’’ ఈ పాటను రకరకాలుగా పాడుతూ- మోకాళ్లమీద వంగి పడుకొని మనుమల్ని ఆడించని తాతలూ- అవ్వలూ-అమ్మలూ, నాన్నలూ వుండేవారు కాదు వెనుకటికి.
‘అంబారీ’ అంటే ఏనుగు మీదే వుంటుంది. దానే్న ‘హౌదా’ అంటారు. ఆ ‘హవుదా’ని (డా)అని కూడా అలవాటుగా అంటారు. అదే ఒక ఉన్నత స్థాయికి, ఉత్కృష్ట స్థాయికీ క్రమేణా మారుపేరయిపోయింది. హోదా, దరజా, (క్లాసు) లాంటి మాటలు మిగిలాయి గానీ, యివాళ మనకి ఏనుగుల అంబారీలు చాలా అరుదుగా దేవాలయాల్లో మాత్రం కనపడతాయి. దీనికి కారణం మరొకటి కూడా వుంది. మన అడవుల్లో పులులున్నాయి, చిరుతలున్నాయి గానీ గజేంద్రులు మాత్రం అస్సాం అడవుల్లో వుంటాయి. మధ్యప్రదేశ్ అడవుల్లో కూడా గలవు. మైసూరు దేవాలయాల్లో, తిరుపతి కొండమీద దేవుడి ఏనుగుని పిల్లాపెద్దా కూడా చిత్ర విచిత్రంగా, కుతూహలంగా చూస్తారు. అనాదిగా మనకీ పిల్లలకీ కూడా ఏనుగు ఒక ‘వింత’! అది అన్ని జంతువుల కన్నా పెద్దదీ- బరువైనదీ కూడాను. అన్నిటికన్నా పెద్దగా పొడవైన ‘తొండం’ వున్నది. కేవలం శాకాహారం భుజించునదీ..
‘ఏనుగు ఎక్కించడం’-అంటే మజాకా కాదు. అది గొప్ప సన్మానం! కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిని ఎక్కించారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారినీ ఎక్కించారు, వూరేగించారు. సినిమా నటి సావిత్రిని కూడా ఏనుగు అంబారీలో వూరేగించారు. గానీ యిప్పుడా ఏనుగు దేవాలయాల్లో లేదా అడవుల్లో మాత్రం మిగిలి వుంటోంది. పైగా ‘షెడ్యూల్ నెం.1’ రక్షిత జంతువు అది. దాన్ని సర్కస్‌లలో, సినిమాల్లో ‘వాడొద్దు’ అంటున్నారు జంతురక్షణ సంస్థల వారు. ఐతే, ఆమధ్య సుప్రీం కోర్టు వారు ‘ఏనుగులచేత మహావృక్షాల దుంగలను మోయించరాదు’ అన్న తీర్పునైతే యివ్వలేదు గానీ- పెద్ద పెద్ద చెట్లను కూల్చివేస్తే, ‘‘తీసుకుపోయి లోపల వేసేస్తాం’’- అంటున్నారు. దాంతో- ‘‘చెట్లను కూల్చుట’’ తగ్గింది. ఏనుగులకు గిరాకీ తగ్గి, వాటి ఉద్యోగాలు ఊడిపోయాయి. కానీ, వాటికి తిండి కావాలిగా? పోనీ అదేమన్నా మాంసాహారియా? ఏవో.. రెండు గొఱ్ఱెలు, మేకలు, కోళ్లు, బాతుల్నీ తెచ్చిపడేస్తే ఆరగించి ఊరడిల్లడానికి? అలా కాదాయిరా! కాబట్టి, పాపం! వీటిని దేవాలయాలకి అమ్మేస్తున్నారు కొందరు ‘ఓనర్లు’.
అట్టితఱి- మొన్న ఇరవై ఒకటో తేదీనాడు అస్సాం నుంచి అధికారికంగా నాలుగు ఏనుగుల్ని గుజరాత్ జగన్నాథుని టెంపుల్‌కి పంపాలని ఆర్డర్లు పడ్డాయి. వారు ‘ఎఱువు’గా పంపమని అడిగారు. అహమ్మదాబాదుకి- అస్సాం నుంచి యిప్పుడు బయలుదేరితే గానీ నెలాఖరుకి గానీ, అహమ్మదాబాద్ జమాల్‌పూర్ జగన్నాథాలయానికి- రథోత్సవాల వేళకి అందుకోలేవు. రెండు మగ మత్త్భేములు, రెండు ఆడ ఏనుగులూ- ‘‘రెడీ’’చేయబడ్డాయి. అందులో చాలా ప్రాచుర్యంగల - రూప్‌సింగ్, రాణీ-లు కూడా వున్నాయి. వీటిని జులై నాలుగున- జమాల్‌పూర్ జగన్నాథస్వామినీ, సుభద్రాదేవినీ పెట్టి- రథంలో ప్రధాన దేవాలయం నుంచి పురవీధులలో వూరేగింపుగా తీసుకుపోయి ‘విడిది’ చేయిస్తారు.
అహమ్మదాబాద్ అనగా గుజరాత్ అని అందరికీ తెలుసు. అది మన ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం అని కూడా దేశంలోని ‘బచ్ఛాబచ్ఛాకీ’ కోనా, కోనాలో- అంటే ఆబాలగోపాలమూ ఎరుగుదురు. ఈ రథ ఉత్సవాలు మైసూర్ ‘లెవెల్’ దసరా ఉత్సవాలంత ‘యిది’గా కాదు గానీ చాలా ఘనంగా జరుగుతాయి. ప్రధానమంత్రి అయినాకా కూడా నరేంద్రుల వారు రుూ ఉత్సవాలకు లోగడ హాజరైనారనీ అయితే రుూసారి ఆయన రాకపోవచ్చుననీ అభిజ్ఞవర్గాల భోగట్టా. సరే, రుూ ఏనుగుల్ని రైల్లో పంపించడానికి రైల్వేవారు కొంత నగదు ‘అడ్వాన్సు’గా తీసుకుని మరీ అంగీకరించారు. ఐతే, మాటలా? ఏనుగుల్ని రైలెక్కించడం అంటే? ఎక్కడ అస్సాం? ఎక్కడ గుజరాత్‌లోని అహమ్మదాబాద్? సుమారు రెండువేల మైళ్ల ప్రయాణం. మొత్తం తొంభై గంటల సేపు ప్రయాణం. ఈ నాలుగు అనగా సుమారు నలభై టన్నుల బరువు- రైలు వ్యాగన్‌లలో- దారుణమైన ‘హీట్‌వేవ్’లో పోవాలీ అంటే- అది అన్యాయం, ఘోరం, అక్రమం, హింస, చట్టవిరుద్ధం-యింకా ‘దిస్’అండ్ ‘దట్’- అంటూ జంతు సంరక్షక సంస్థల వారు రోడెక్కేశారు. దొరికింది కదా? ఛాన్స్? అని- భాజపా కాని యితర పార్టీలు, కమ్యూనిస్టులు సహా రంగంలో దిగారు. ‘‘ఎట్టి పరిస్థితులలోనూ ఏనుగు చతుష్టయాన్ని అస్సాం పొలిమేరలను దాటనివ్వం’’ అని ఆందోళనకి దిగారు.
‘‘ఏమిటండీ అది? గజరాజములను, పద్దెనిమిది మైళ్ల దూరం కూడా ‘ఏకటాకి’ని, నడిపిస్తే అది నేరం అవుతుంది. అందులోనూ, ఎండలు ఎలా వున్నాయి? మనుషులే ఛస్తున్నారు రుూ హీట్‌వేవ్‌కి. ఇనుప రైలుపెట్టెల్లో- అట్నుంచి యిటు తిరిగి తొండం ఎత్తి, ఓ చిన్న ఘీంకారం చేయాలన్నా చోటుచాలదు. ఆ ఆడామగా ఏనుగులు తొండాలతో రాసుకుంటూ ఒరుసుకుంటూ, ముద్దూ-ముచ్చట్లు సాగించాలన్నా, మహాయిబ్బంది. పైగా, మనుషులు ప్రయాణం చేసే, సూపర్ ఫాస్ట్ రైలుబండ్లకి రుూ ఏనుగుల ప్రత్యేక వ్యాగన్లని తగిలిస్తారుట! ఈ రైళ్లకుండే దిక్కుమాలిన వేగానికి అవి తట్టుకోలేవు. వాటి తల దిమ్మెక్కి, ‘తిక్క రేగినా రేగుతుంది’’ అంటూ పెద్దపెట్టున ఆందోళనకి దిగారు. కానీ, ‘‘టెంపుల్ రథయాత్ర కోసం రెండోసారి- ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలోని జగన్నాథుని రథం కోసం- కేవలం బాడుగకి ఏనుగుల్ని అడిగితే యింత రభసా? గుజరాత్‌లో, ఢిల్లీలో, అస్సాంలో ప్రభుత్వాలు ఎవరివో తెల్సా? మావే..! అంటున్నారు- అధికార, అనధికార భాజపా పెద్దలు.
కాకపోతే యిట్లా ఎత్తుకుపోయిన నాలుగు ఏనుగుల్నీ తిరిగి గుజరాత్ గవర్నమెంట్ యివ్వకపోతే? ‘‘మీరే వచ్చి తీసుకుపోండయ్యా!’’అంటే? జగన్నాథుని గుడిలోపల కట్టేసుకుని లోపలికి పోలీసులొస్తే- ‘‘కళ్లుపోతాయ్...ఖబడ్‌దార్,’’అంటే? ఇలాంటి అనుమానాలున్నాయి అస్సాంలో ఏలినవారికి.
ఎందుకంటే లోగడ 2011కీ 2015కీ మధ్య అస్సాం యిలాంటి పుణ్యకార్యాల కోసం ఒక నలభై మచ్చిక అయిన గజరాజములను ఆయా సందర్భాలలో, అద్దెకి యిచ్చారుగానీ-అట్నుంచి, సదరు తీసుకున్నవారు- ‘వాటిని తిరిగి ‘అంప’లేదు. ‘‘మరొక్క ఆరునెలలు చాలు.. ఇంకొక్క పది నెలలు ప్లీజ్’’ అంటూ లీజ్ పీరియడ్‌ని పెంచుకుంటూ పోయారే తప్ప యింతవరకూ ఒక్క ఏనుగునయినా పోనీ, వాటి సంతానాన్నయినా తిప్పి పంపలేదు. ‘ఏనుగు చచ్చినా, బ్రతికినా వెయ్యి వరహాలు’ అన్న సామెత వుందిగా? ఆ విధంగా, వేరే రకంగా ‘సొమ్ము’లైపోయాయా?’ అన్న అనుమానం వుంది అస్సాం వారికి.
‘ఓకే..! అది అట్లుండనిండు. ఈ నాలుగు ఏనుగులనీ, అడుగులకి మడుగులొత్తుతూ- కూలర్‌లూ, చన్నీటి జల్లులు, తడికలూ గట్రా పెట్టి కాపాడుతారే అనుకోండి- వాటితోపాటు ‘మావటీ’లే కాదు- వెటర్నరీ డాక్టర్లని కూడా ‘వ్యాన్’ ఎక్కించాలీ!’’అంటున్నారు ఏనిమల్ ఏక్టివిస్ట్‌లు (ఇంగ్లీషులో అంటేనే రుూమాటకి ‘హౌదా’కదూ?) ‘‘ఐతే, పెళ్లాం పిల్లలకి చెల్లుచీటీ రాసి రావాలా? మేం ‘రాము మహాప్రభో...’’ అంటున్నారు ‘వెట్’లు - అనగా, పశువుల వైద్యులు.
ఇదిలావుండగా కేంద్రమంత్రి పేర స్థానిక ఎంపీ గారు లెటర్ రాశాడు, ‘‘తక్షణం రుూ ఏనుగుల హింసాత్మక తీర్థయాత్రలను ‘‘ఆపుడు’’ అంటూ. ఏనుగు బొమ్మలు వున్న అట్టలు పెట్టుకుని అట్టహాసంగా మండుటెండల్లో- ఏనుగు ప్రియులు, అప్పోజిషన్ కాంగ్రెస్ వగైరా పార్టీల కార్యకర్తల వెంటరాగా రోడ్డున పడ్డారు. ‘‘బాబులూ! గుజరాతీ సేఠ్ బాబులూ! అక్కడ మీ పక్కనే వున్నాయి మధ్యప్రదేశ్ అడవులు. అక్కడ ఏనుగుల మందలు కూడా గలవు. అక్కణ్నుంచి మీరు, ‘బై’అనగా ‘కొని’ లేదా ‘బారో’అనగా ‘ఎరువు’ అడిగి లేదా ‘స్టీల్’- అంటే ‘దొంగిలించి’ ఏనుగుల్ని తీసుకుపోయి, మీ జగన్నాథుని రధయాత్రని జేగీయమానంగా చేసుకోరాదా?’’అంటున్నారు బోలెడుమంది వన్యమృగ సంరక్షక దళాలవారు.
ఇది మామూలు విషయం కాదు అని, రైల్వేవారు-గట్టివైన పెద్ద వ్యాగన్‌ల కోసం వెతుక్కుంటూ వుండగా- ఓ ‘ఎన్‌జీవో’- అవినాష్ ప్రయాస్ అనే పెద్దమనిషీ, మరొక కెనడా అమ్మడూ- విడివిడిగా అస్సాం హైకోర్టులో ‘పిల్స్’ పడేశారు. పిల్ అనగా ‘మాత్ర’కాదు. జనహిత వ్యాజ్యం. జులై నాలుగున అహమ్మదాబాద్, జమాల్‌పూర్‌లోని జగన్నాథుడు అస్సాం ఏనుగులపై అంబారీలో ఉపవిష్టుడై వూరేగుతాడా? అన్నది సందేహమా? ఐతే, చిలక ప్రశ్న అడుగుడు. ‘ఏనుగును తన ఎన్నికల ‘సింబల్’గా వాడుకుంటున్న ఏకైక మహావనిత బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని అడుగుడు. లేదా వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ ఏక్ట్ (1972)లో సెక్షన్ 43(1)ని తిలకించుడు. లేదా నిత్యమూ న్యూస్ పేపర్ చూడుడు. గౌహతి హైకోర్టు కొత్త ‘‘పిటిషన్’’ పెట్టండయ్యా అంటూ ‘‘పిల్’’ మీద పిడుగులాగ ఆర్డర్ వేసింది!. ఔరా..!
‘నౌ... రైల్వేస్ ఆర్ ఇన్ డైలమా...!

-వీరాజీveeraji.columnist@gmail.com 92900 99512