వీరాజీయం

మొబైల్స్‌తో ఆషామాషీ వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుళ్లో రైల్లో బళ్ళో ఆఖరికి.. ఆడుకునే పసికూనల వొళ్ళో - ఇంట్లో.. హాల్లో .. కిచెన్లో .. బెడ్ రూంలో.. చివరికి వాష్‌రూంలో - ఇక్కడ.. అక్కడ.. ఎక్కడపడితే అక్కడ ఉండునది ఏది? మార్నింగ్ వాకిం గులో, ట్రైనింగు క్యాంపులో, కాలేజీ క్యాన్టీనులో -క్లాసురూములో ఇలా ‘‘నీ నీడను నేను... నిను వీడను నేను...’’ అంటూ నీ వెంట వచ్చే ఫ్రెండ్- ఫిలాసఫర్- గైడ్ అండ్ మాస్టర్ ఎంటర్‌టైనర్ ఎవరు..?
ఓస్- ఇంతేనా...? ఏదో ఇంతపొడుగు చెబితే ‘పొడుపు కహానీ’ అనుకున్నాం - ఇదుగో... ఇటు చూడు- నా చేతన్ నీ చేతన్ హరిచేతన్ గిరి చేతన్ ప్రతి వారి చేతన్.. చేన్.. తోడన్ తోన్ అంటూ ఇందు అందు ఇంకెందు ఐనా వెదుకకనే కనపడునది మొబైల్ ఫోన్. ది స్మార్ట్ ఫ్రెండ్ ఫర్ యంగ్. ఆబాల గోపాలం సేతానసూయా శ్యామలం -సర్వులూ సెల్‌ఫోను వ్యామో హితులే.. నిజం చెప్పాలంటే బానిసలే ... వ్యసనపరులే!
మా పిల్లవాడు ‘‘గేమ్స్ బ్యాండ్’’ ... వాడు మొబైల్ చేతబెడితే తప్ప ముద్దే కాదు.. వెన్నముద్దా కూడా మింగడు అంటుంది -జానీ మేడమ్ -నువవు అట్లా అంటావా? మా చంటిది మొబైల్‌ని ఇలా దాని కుక్క బొమ్మలాగ పక్కలో పెట్టుకుని -దాన్ని దగ్గరిసా లాక్కుంటూ - హాయిగా నిద్దరలోకి జారు కుంటుంది- అంటుంది సయానీ మేడమ్. ఇద్దరికీ జాబ్స్ వున్నాయి - పైగా.. ఓ ‘‘లకారం’’ నెలాఖరున చేతికందే ఉద్యోగాలున్న మొగుళ్లున్నారు. అ యిననూ ఈ పడతులు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం- ఉద్యోగాల నిమిత్తం ఆఫీసులకు రేసు గుర్రాల వలే పోటీగా పోవుచుందురు ..
అరె..? వీళ్ళకి ఇద్దరా? ఇంకా పెళ్ళే కాలేదు అన్నట్లున్నారు.... అని డంగ్ అయిపోతారు కొందరు.- వీళ్ళకి ఎల్కేజీ లేదా యూకేజీలు అంటూ ఇద్దరేసి మిల్లీ గరిటల్లాంటి ముద్దొచ్చే పిల్లలా? అని- అదేదో సబ్బు ‘‘యాడ్’’లో చూపెటినట్లు -ఆశ్చర్యపోతూ వుంటారు కొందరు. వీళ్ళ సంగతే, మనకి ఇవాళ-వర్రీ - అంటే ... నిజంగా వాళ్ల గురించే బెంగనుకోకండి- వాళ్ల ముద్దుపిల్లల గురించి మన మనసులలో ఆందోళన కలగడం మన వీక్‌నెస్. ఇప్పుడు-అరిచే కుక్క పిల్లకి బిస్కట్ పడేసినట్లు - పిల్లలకి ఓ ఖరీదైన ఇంపోర్టెడ్ - చాకొలెట్ పడేస్తే కుదరదు -వాడికో లేక దానికో -‘హాయ్.. స్వీటీ! అనో లేదో హోయ్ క్యూటీ’ అనో పిలిచి -మొబైల్ వాళ్ల చేతిలో పెట్టాలి.. కింద పడేయకు - అరగంటలో ఇచ్చేయాలి మరి- లేదా నా అంతటి రాక్షసి మరొకర్తి ఉండదు తెలుసా?... అంటూ హెచ్చరిస్తూనే ఉంటుంది తల్లి. కానీ ఆ పాప ఆ పాటికే సెల్ మొహం మీద వేలెట్టి చెరిపేస్తూ -మరో ప్రపంచంలోకి -ఎప్పుడో జారుకుంటుంది. ‘‘చెరపకురా చెడేవు’’ అన్నది -ఇంటర్నెట్. ఇది వెనుకటి మాట- ఇప్పుడు చేరిపితేనే పని సాగుతుంది.. స్మార్ట్ ఫోన్లు ‘స్వర్గం’ లేదా నరకం అల్లాయితేనే చూపెట్టేది. అంతా టచ్ మహిమ. ఏందయ్యా! నీ చూపుడు వేలు అంతలాగా అరిగిపోయింది? అని అడిగేముందు -నీ చెయ్యి ఓ సారి చూసుకో..!
ఇండియా! నువ్వు తెగ వాగుతూ ఉంటావు.. అనేది ఓ ఐడియా మొబైల్ ఫోను ప్రకటన లోగడ. ఇప్పుడు వాగుడే కాదు ‘నొక్కుడు’ - ‘చెరుపుడు’ - కూడా చేస్తోంది మాడరన్ భారత్ !- అన్నట్లు - తప్ప తాగి చక్రం తిప్పే శాల్తీల్లో - లేడీస్ కూడా ‘టాప్’ లోనే ఉన్నారు?! బార్ బార్ కి లేడీస్ రష్ పెరుగుతున్నది అని సిటీ ఎడిషన్లు ఘోషిస్తున్నాయ్. ఇంత కామెడీ ఎందుకు చెబుతున్నాను? అంటే - తరువాత చెప్పబోయే ట్రాజడీ ని తట్టుకుని దాన్ని ఒక హెచ్చరికగా తీసుకుంటారనే ఆశతో...
***
న్యూఢిల్లీలో తన భర్త , రెండేళ్ళ పాప ‘శేహవార్’తో హాయిగా నివాస ముంటున్న రజియా - గత శుక్రవారం నాడు మీరట్‌కి వచ్చింది. బులంద్ షహర్‌లోని జహంగీరాబాద్ లో నివాసం ఉంటున్న తల్లిని చూద్దామని. తన పాప అమ్మమ్మతో అడుకుంటుందని గంపెడు ఆశతో పోయిన శుక్రవారం ఆ ఇల్లాలు వచ్చింది. పాపకి ఇంకా రెండేళ్లే కనుక ఎక్కడికి పారిపోతుందిలే! అని తల్లితో కబుర్లలో పడ్డది రజియ బేటీ.. ఆ చిన్నారి ఆడుకుంటూ -గోడకి ఉన్న మొబైల్ చార్జర్‌ను చూసింది పట్ట పగ్గ్గాలు లేని ఆనందంతో. దానికి చార్జర్ వైరు అట్లానే వేలాడుతోంది. చంటిది అదే మొబైల్ అనుకున్నదేమో? ఇలా కొసపట్టుకుని లాగింది.. అది వూడలేదు. గోడకి ఉన్న ప్లగ్‌లో చార్జర్ వైరు ఆకర్షణీయంగా వేలాడుతోంది. వైరు కొసన ‘వెండి ముచ్చిరేకు’ ముక్కలాగా మెరిసి పోతూ ముచ్చిక ఉంది. ఎవరో అర్జంట్ ‘‘కాల్’’ కాబోలు- సెల్‌ఫోన్‌ను ‘చేత్తో’ లాక్కుని -సంరంభంగా -సిగ్నల్స్ బాగా వచ్చే చోటుకోసం వడివడిగా వెళ్లి పోయినట్లుంది. ఇక్కడ పాప ఇంచక్కా -ఆ వయస్సు పిల్లలందరిలాగే -చార్జర్ కొసని -అంటే ముచ్చికని నోట్లో పెట్టేసుకుంది. అంతే .. క్షణాల్లో షాక్ కొట్టి.. పాపనోరు కాలిపోతోంది.. కేవ్వుమన్నది ఒకే ఒక్కసారి ... షార్ట్ సర్క్యూట్ అయింది చార్జర్ ... అంతే, పాప నోట్లో విద్యు దాఘాతమైంది. అమ్మ, అమ్మమ్మ ఇద్దరూ గుండెలు బాదుకుంటూ,పరుగున వచ్చి - పాపని ఎత్తుకుని దగ్గరలో ఉన్న డాక్టరు దగ్గరికి ఉరుకులు పెట్టారు. -అప్పటికే ఆలస్యమైపోయింది!
***
మొబైల్‌ని చార్జింగులో పెడతారు.. ఆనక ఫోన్‌ని పీక్కు పోతారు- కొంపలు అంటుకు పోయినట్లు. ఇవతల ప్లగ్గులో ఉన్న,చార్జర్ ని అట్లా ఆన్ లోనే వదిలేస్తారు- మళ్ళీ రాత్రిపొద్దుపోయాక వచ్చి -వేలాడుతూ ఉన్న సెల్ వైరు- మూతిని లాగి ముచ్చిక సెల్ నోట్లో గుచ్చేసి -వాష్ రూమ్ కి పరిగెడతారు టీనేజర్స్. కొంచెం చార్జ్ అయ్యేసరికే ఆత్రంగా పీక్కుని -చెవిలో ఇయర్ ఫోన్స్ తగిలించుకొని -ఒకచేత్తో ముద్ద ఇలా కలుపుకొని మింగుతూ - టాకింగ్ టాకింగ్ ....అవతలి శాల్తీ -మగ అయినా ఆడ అయినా ఒకటే- ఏ సర్ట్ఫికేటు జోకులు పేల్చేస్తూ భోజనం ముగిస్తారు. రాత్రి కూడా అంతే . వెంటనే కాల్ పూర్తిచేసి వాట్సప్ లోకి అర్జంటుగా పోయి వీడియోలు లాగి -పైకి తోసుకుంటూ -వాటితో కూర పులుసు నంచుకుంటూ -సప్పర్ అనగా రాత్రి భోజనం పూర్తి చేస్తారు. ఇదీ వరస - వరస కాదు, వావి కాదు. ఇదొక మొబైల్ కల్చర్ !
‘డై’ విత్ ఇట్ - ఇషం లేకపోతే ఛార్జింగ్‌లో పెట్టబడ్డ ఫోను -రింగ్ అయనదో - ఒక్క ఉదుటున పోయి మొబైల్ని ఠక్కున ఎత్తుకు వెళ్ళే ముందు- ముందా ఫోను చార్జర్ స్విచ్ ఆఫ్ చేసి -తగలడండి...-అని పెద్ద వాళ్లు అంటే -
‘‘ఏమిటి గురూ.. ? రామాయణ కాలం నుంచి వచ్చావా? అన్నట్లు చూస్తారు. ‘నథింగ్ హేపెన్స్ .. మాకు అలవాటే డోంట్ వర్రీ అంటూ పోతారు - అదే కండకావరం మరి. ఒక్కసారే పేలుతుంది- ప్రమాదం చెప్పి రాదు. క్షణంలో ఫినిష్... పిల్లలు ఎంత స్మార్ట్‌గా సెల్ మానేజిమెంటు చేస్తున్నారో? చెప్పుకొని మురిసిపోయే పేరెంట్స్‌కి ఇది ఓ హెచ్చరిక.. పిల్లలకి ప్రయాణాల్లో మొబైళ్లు పారేసి - వీళ్ళ రసకందాయం లో వీళ్లు పడిపోతారు. ఈ సెల్‌ఫోన్ - పొతే మరొకటి - ఎక్స్‌ఛేంజి ఆఫర్లో బుక్ చేస్తే పరిగెట్టుకువస్తుంది!! కొత్త్ఫోను ఆన్ లైన్ లో కొంటాం.. హూ కేర్స్? అంటారు- చార్జర్ తీసి ప్రక్కన పడేసి వెళ్ళొచ్చుగా.. స్విచ్ ఆఫ్ చెయ్యొచ్చు- ఇవన్నీ నామోషీ పనులు- గేమ్స్, సాంగ్స్, మిస్సయపోతాయి .. కనుక ఛార్జ్ లో ఉండగానే పాటలు వింటాం -న్యూ డౌన్లోడ్స్ మిస్ కాకూడదు.. అలా కు(లు)నుకుతారు తన్మయత్వంలో .. చెవుల్లో మృత్యువు ఢంకా భజయించే ప్రమాదం పొంచి ఉంటుంది.. ఒంటి చేతి దుస్సాహస డ్రైవర్లకు కూడా సదా యమధర్మరాజు ఆగ్రహం కాచుకొని ఉంటుంది...
డోంట్ కేరా..? ఓకే.. ఇట్స్ యువర్ ఫేట్..!

-వీరాజీveeraji.columnist@gmail.com 92900 99512