వీరాజీయం

‘కప్’ ఎత్తుకు రాగలరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ థావన్, కె.ఎల్. రాహుల్, విజయ శంకర్, ఎమ్మెస్ ధోనీ, కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, మొహమ్మద్ షమీ, కుల్‌దీప్ యాదవ్, వై.సి.చహల్- మొత్తం పదిహేను మందితో భారత క్రికెట్ సేన- ఈ టీమ్ మే 30వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే వరల్డ్ కప్ పోటీలో- మన దేశం కోసం- బ్యాటూ బాలూ వొడ్డి పోరాడుతారు.
సెలక్టర్లు ఇరవై మంది ఆటగాళ్లను ఎంపిక చేసి జాబితాలో పెట్టుకున్నారని, మన సెలక్టర్ ఎమ్.కె.- పదే పదే చెబుతున్నాడు. అంటే ఫైనల్ జాబితాలోనుంచి అయిదుగుర్ని వదిలివేశారన్నమాట. ఏడాదికి పైగా ‘ప్రపంచ కప్’ టీమ్ మీద కసరత్తు చేస్తూనే వున్నారు సెలక్షన్ కమిటీలోని అయిదుగురు సభ్యులు. మిగతావాళ్లకు అనుభవం కావాలి, అలవాటుపడాలి అంటూ- ధోనీకి ‘రెస్టు’ ఇచ్చి లోగడ విదేశాలకు టీమ్‌ని పంపే ప్రయత్నాలు కూడా చేశారు. మొత్తం మీద గంపెడు ఆశలు పెట్టుకున్న యిద్దరు ఆటగాళ్లు- అందులో ఒకడు తెలుగుబిడ్డ రాయుడు అంబటి, రెండోవాడు- విపరీతమైన ‘హైప్’ పొందిన రిషభ్ పంత్. వీళ్లిద్దరికీ సెలక్షన్ కమిటీ మొండి చెయ్యి చూపెట్టింది. తప్పలేదు.. ఇందులో తప్పు లేదు.
ప్రపంచ కప్- ‘స్పర్థ’ మే 30న మొదలయినా- మన టీముకి మైదానంలోకి దిగే అవకాశం మాత్రం జూన్ ఫస్టున లభిస్తుంది. ఆనాడు దక్షిణాఫ్రికా జట్టుతో ఇండియా ఆడాల్సి వుంటుంది. ఈ మ్యాచ్ లండన్‌లోని ‘ఓవల్’ మైదానంలో జరుగుతుంది. ఈసారి- 1992 నాటి వరల్డ్‌కప్ పద్ధతిలో ఆట ‘కార్యక్రమాన్ని’ తయారుచేసుకున్నారు కనుక- ప్రతి దేశానికీ తతిమ్మా దేశాలతో ఒక్కసారి ఆడే అవసరం వుంటుంది. ఇక్కడే మీమాంస, వర్రీ, చర్చ.. వగైరా జరుగుతున్నాయి.
పాకిస్తాన్‌తో మన జట్టు ఆడాలా? వద్దా? ఆడి వోడినా- ఆడకపోయినా- రెండు మార్కులు పోవడం ఖాయం. ఇది ‘ఆట’. వాణిజ్యం కాదు. వార్ అంతకన్నా కాదు. ‘పూను స్పర్థలు విద్యలందే, క్రీడలందే, వైరమును వాణిజ్యమందే’అన్నారు పెద్దలు. ముఖాముఖి, ద్వైపాక్షిక పోటీ లాంటివి ఆడటం అన్నది యిప్పుడు భారత్,పాక్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఆక్షేపణీయమేమో కానీ- అంతర్జాతీయ మైదానంలో- ప్రపంచ స్థాయి పోటీలలో ఇలా చేయడం బాగుండదు. మరింత పగకీ, అసూయకీ, ద్వేషానికీ, కక్షకీ, ఉద్రిక్తతకీ దారితీస్తుందన్న వాదన క్రీడా జగత్తులోనూ- కమర్షియల్ రంగంలోనూ కూడా వున్నది.
ఈ తర్జన భర్జనలకి యింకా టైముంది. మనవాళ్లు మొట్టమొదటగా వో ‘నమూనా పోటీ ఆట’- న్యూజిల్యాండ్‌లో మే 25న అదీ- ఓవల్ మైదానంలోనే ఆడతారు. అక్కడ కంగుతింటే- ‘టూరు’ అంతటా మనవాళ్లకి మనస్తాపం తప్పదు. మరో మ్యాచ్- అదీ వార్మప్ మ్యాచే- బంగ్లాదేశ్‌తో- కార్ట్ఫిలో జరుగుతుంది. లిమిటెడ్ ఓవర్స్ పోటీలలో- చిన్న దేశం, పెద్ద టీము- లాంటి వాదనలు చెల్లవు. ఆట ఆడుతున్నరోజు ఎవడు బాగా ఆడుతాడో వాడే ‘కింగు’. ఆ దృక్పథంతో చూస్తే మన సెలక్షన్ కమిటీ వారు గడువుకు వారం రోజులు ముందే ఫైనల్‌గా పదిహేను మందినీ ఎంపిక చేసి పడేశారు. ‘తాంబూలాలు యిచ్చేశాం- యిక తన్నుకు ఛావండి’ అన్నారు. ఐపీఎల్ లాంటి ‘కురచ’ క్రికెట్‌లో కేవలం-వాణిజ్య దృష్టితో ఆడేచోట- దేశాభిమానం, ప్రతిష్ఠ వగైరాలు వుండవు. పైగా యిది ‘సర్కస్’ టైపు- ఎంటర్‌టైన్‌మెంట్. ఇందులో కలగాపులగం విదేశీ క్రీడాకారులు- ప్రతీసారీ నలుగురాడతారు. అందుకనే కమిటీ వారు ‘‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలను ప్రాతిపదికగా తీసుకుని టీముని ఎంపిక చేయడం లాంటిది పొరపాటున కూడా చేయము’’ అన్నారు.
అయితే, వదిలివేయబడ్డ అయిదుగురి విషయంలో పైరవీలు చేసి, ప్రచారం చేసి దెబ్బతిన్నవర్గాలు కొంత హడావుడి చేస్తాయి. నిజంగా ఐపీఎల్‌లో నాలుగు ఆర్లు- ఇరవై నాలుగు బంతులలోనే- రెండు ‘నోబాల్స్’, రెండు, మూడు ‘వైడ్‌బాల్స్’వేసే బౌలర్లను- వరల్డ్ ‘పోటీ’దృష్టితో చూడటం అన్నది సాధ్యం కాదు. ఇది మండుటెండాకాలం క్రికెట్. ఆషామాషీ అంపైరింగ్ వున్న క్రికెట్. ఎవరి దేశం జెండా కింద వాళ్లు ఇంగ్లండ్ వాతావరణంలో ఆడటం లేదు. ప్లేయర్స్ విషయంలో మాత్రం రుూ ఐపీఎల్ పోటీలు గొప్పవి. వాళ్లు ప్రయోగాలు చేసి చూడవచ్చును. స్టామినాని, మానసిక శక్తిని పరీక్షించుకోవచ్చును. ఫీల్డింగ్ విషయంలో మనం ‘‘వీకు’’. కనీసం రుూ నెలాఖరువరకూ ఐనా వొళ్లు వంచి పరిగెత్తాలి. ఐతే, మూడురకాల క్రికెట్‌లలోనూ-ప్రశాంతంగా, వైరం, వివాదం లేకుండా ఆడి, నాయకత్వం వహించిన మహేంద్రసింగ్ ధోనీ బహుశా- ఆఖరుసారి ప్రపంచ క్రికెట్ మైదానంలో తన సత్తా- చిత్ర విచిత్ర విన్యాసాలూ హెలికాప్టర్ షాట్స్, మెఱుపు స్టంపింగ్స్ వగైరా చూపడానికి వస్తూ వున్నాడు. అదో ప్లస్ పాయింట్. ఇప్పటికి రెండు సార్లు మాత్రం వరల్డ్‌కప్ తేగలిగారు ఇండియన్ క్రీడాకారులు- ఇవాళ మన ధోనీ ఒక్కడే కాదు- విరాట్ కొహ్లీ నుంచీ రవీంద్ర జడేజా దాకా అనుభవం గలవాళ్లు వున్నారు. అది మరొక ప్లస్ పాయింటు.
‘‘రవీంద్ర జడేజానా? జాదవా?’’అనుకున్నారు. గానీ, భడవలు యిద్దరూ వున్నారు. చహల్, కుల్‌దీప్‌లు కూడా జంటగా సెలక్ట్ అయ్యారు. వరల్డ్‌కప్ పోటీల్లో ఫాస్ట్ బౌలింగ్‌దే ‘హవా’. గానీ మన వాళ్లు- స్పిన్ మాంత్రికుల్ని ధైర్యంగా వేసుకున్నారు. ఐదుగురు బ్యాట్స్‌మెన్ మనకి ఎప్పుడూ వుంటారు. రోహిత్, కొహ్లీల సరసన కెఎల్ రాహుల్, ధావన్‌లు అదనం అవుతారు. విజయ శంకర్ అంబటిరాయుడుని పక్కకి నెట్టేశాడు. బాగా అనలైజ్ చేస్తే ఇది న్యాయమే. ఈ కొత్త కుర్రాడికి స్టామినా ఎక్కువే. కాకపోతే- మనవాడు.. గుంటూరువాడు అయిన మన్నవ శ్రీకాంత్‌ప్రసాద్ రాయుడిని వదులుతాడా? అతను వికెట్ కీపర్ కూడాను. అయితే, సెలక్షన్ కమిటీలో వున్న సభ్యుల పేర్లు క్రికెట్ అభిమానులకి తెలియవుకదా? ఈ సభ్యులెవరూ అంటే- దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్, జతిన్ పరంజపే, గగన్‌ఖోడా ప్లస్ ఎమ్.ఎస్.ప్రసాద్. కాగా- రుూ అయిదుగురుతోపాటూ రవిశాస్ర్తీ, కోహ్లీలు- అందరూ తలలు ఏకం చేశారు.- రుూ టీముని ‘్ఫల్డర్’ చేశారు. పంత్ అయినా, కార్తీక్ అయినా ఒక్కటే. కార్తీక్‌కి ధోనీతోపాటూ చాలాసార్లు మ్యాచ్ ఫినిష్ చేసిన అనుభవం వుంది. దుందుడుకుతనం తక్కువ. ఇక రికార్డుల విషయానికి వస్తే- రుూ అయిదుగురికీ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం అంతంత మాత్రమే. వాళ్లుకాదుగా ఆడేది. ఆడబోయే విరాట్, రోహత్, ధోనీల రికార్డ్సు చూస్తే- కళ్లు చెదురుతాయి. ధావన్, రాహుల్, జాదవ్‌లు తడబడకపోతే- ఇండియన్ టీముకి బూమ్రా, షమీల స్పీడు చాలా ఎక్కువ. ‘్భవ’ వుండనే వున్నాడు. హార్దిక్ పాండ్యాది ‘దైవాధీనం’ సర్వీసు. ఎప్పుడు గాయాలపాలు అవుతాడో తెలీదు. కాని గొప్ప ఫీల్డర్- ‘మస్టు’. ఏదిఏమయినా జడేజా, చాహల్, కుల్‌దీప్, జాధవ్‌ల స్పిన్ మాజాయాలం రుూసారి ప్రపంచ కప్ పోటీలో బాగా అందివస్తుంది’, అన్నది క్రికెట్ పండిట్స్ ఉవాచ! అంతా ‘టాప్’ ర్యాంకర్సే మనవాళ్లు. ఈ క్షణం నుంచీ ‘కప్’ని దృష్టిలోపెట్టుకుని, దీక్షబూని ముందుకుసాగితే అంతా సుఖాంతమే!
వుయ్ హావ్ ఎవ్వెరి ఛాన్స్ టు గెట్ ది కప్!

-వీరాజీveeraji.columnist@gmail.com 92900 99512