వీరాజీయం

నాన్నమీది ప్రేమతో.. బాబాయ్‌కి టిక్కెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సైకిల్ పోతే పోయింది.. కొడుకు దక్కాడు’ అ నుకున్నాడు చివరికి సమాజ్‌వాద్ పార్టీ నాయకుడు, ‘నేతాజీ’ బిరుదాంకితుడు జనాబ్ ములాయం సింగ్ యాదవుడు. ‘కొడుకు సైకిల్ నీదే నాన్నా. పార్టీ ‘పిత’వు కూడా నువ్వే. కాకపోతే సైకిల్ మీద స్వారీ, పార్టీమీద పెత్తనం నాకొదిలెయ్’ అంటున్న కొడుకు అఖిలేష్ మీద కత్తులు నూరడం వల్ల లాభమేమిటి? రాజకీయాలలో గెలుపుమాట దేవుడెరుగు- కడుపు తీపి మాటేమిటి? ఆ క్షోభ కన్నా, రేపటి ఎన్నికలలో కొడుకు తిరిగి సిఎం కాగల బలం పుంజుకోవడమే ఉభయ తారకం’ అని తోచింది ములాయంకి.
పార్టీ సీనియర్ నాయకుడు ఆజమ్‌ఖాన్ కూడా ఉభయులకీ నచ్చచెప్పాడు. నేనెప్పుడూ ‘ముస్లింల మనిషినే చచ్చేదాకా అంతే’నంటూ శపథం చేసిన ములాయం మీద రాష్ట్రంలో వున్న పద్దెనిమిది శాతం సాయిబులకి విశ్వాసం వున్నదనీ- ఆ వోట్లన్నీ మాయావతి ఎత్తుకుపోతుందనీ ఆజమ్‌ఖాన్ వివరించాడు. ములాయంజీ తన పార్టీనీ, కొడుకునీ అంటిపెట్టుకుని వుంటే, కొడుకు అఖిలేష్ మరోసారి ముఖ్యమంత్రి అవుతాడనీ, అప్పుడు- నీ తమ్ముళ్ళకే కాదు - తన తమ్ముడికి కూడా పదవీ పట్టా దక్కవచ్చుననీ అనిపించింది. ‘అఖిలేష్ ఎవరి కొడుకు? నా కొడుకు కనుకనే, వాడు రాష్ట్రానికి చేయదగ్గ మేలు శక్తివంచన లేకుండా చేశాడు’ అంటూ కితాబు ఇచ్చి మరీ ములాయం రాజీపడ్డాడు. ‘ఇంటిలోని పోరు ఇంటిలోనే గానీ ఎన్నికల సమయాన పార్టీలో కాదు’ అన్న మాట ములాయంకి లేటుగా తలకెక్కింది.
‘సైకిలెక్కు బాబూ! నేను వెనుకనే నడుస్తానం’టూ ములాయం అంగీకరించినట్లే. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ములాయంజీ మాట ఆ విధంగానే ఖాయమయిపోయింది. కాకపోతే తనని నమ్ముకుని ‘పుట్టి’ ముంచుకున్న వాళ్లున్నారు. అమరసింహుడి అనుయాయులున్నారు. అంచేత, ‘‘అబ్బిగా.. అఖిలేషూ! నీ లిస్టూ, నా లిస్టూ కలిపి, యిదుగో రుూ ముప్ఫయి ఎనిమిదిమందికి టిక్కెట్లు మాత్రం ఇప్పించు’ అంటూ జాబితా మాత్రం పంపాడు. అంతేనా? అఖిలేష్ విడుదల చేసిన నూట తొంభై ఒక్కమందున్న తొలి జాబితాలో - శివపాల్ యాదవ్‌కి సీటు ఖరారైంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది గానీ, 403 అసెంబ్లీ సీట్లున్న ‘జుంబో రాష్ట్రం’ అతి ప్రతిష్ఠాత్మకమైన పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అంచేత దానిమీదే అందరి దృష్టీ వుంది. 2012 ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ నేతాజీ నాయకత్వంలో 399 సీట్లకు పోటీ చేసింది. అతి కష్టం మీద 224 నియోజక వర్గాలను దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో- ఒకప్పటి యు.పి ‘కింగే’ గానీ, యిప్పుడు ‘పాపర్’ అయిన కాంగ్రెస్ పార్టీ చచ్చీ చెడీ 393 స్థానాలకు అభ్యర్థుల్ని నిలబెట్టింది. అయితే, ఇరవై ఎనిమిది చోట్ల మాత్రం ఆ పార్టీ జెండా ఎగురవేయగలిగింది. అటువంటిది, నేడు యుపి లోనే కాదు మొత్తం దేశంలోనే మారిన రాజకీయ చిత్రపటంలో ఇమడాలీ అంటే- ఎస్‌పి, కాంగ్రెస్‌లకే కాదు- ‘బసపా’కి కూడా కాలూ చెరుూ్య అందటం లేదు. అయితే, ‘తొందరపడి ఒక కోడి ముందే కూసింది’ అన్నట్లు మాయావతి 97 సీట్లు ముస్లిం సోదరులకి ‘అట్టేపెట్టాను మీకోసమే’నంటూ ప్రకటించింది. ఇలా మొత్తంలో 18 శాతం వోట్ల మీద అటు సెక్యులర్ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మొదలు ఇటు ‘బసపా’ దాకా ఆధారపడితే మిగతా వోట్లన్నీ ఎక్కడికి పోవాలి? 25 శాతం దాకా అగ్రకులాల వారి ‘సీట్లు’న్నాయి. ఇతర బి.సిల శాతం కూడా 26 శాతం వున్నదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక దళితులు 21 శాతం వున్నారు. ఇదంతా ఆలోచించుకునే కాంగ్రెస్ పార్టీ రుూసారి మొదటినుంచీ అఖిలేష్‌ని ‘గుడ్‌బోయ్’ అంటూ మస్కా కొట్టడం మొదలెట్టింది. రాహుల్ గాంధీకి మోదీ విలన్‌గా కనబడ్డట్లుంది. ‘మంచాల సభ’ల్లో, ప్రయివేటు సభల్లోనూ కేవలం మోదీ మీదే సకల రకాల శస్త్రాస్త్రాలూ సంధిస్తూ చివరికి అఖిలేష్ సైకిల్‌మీద యుపిలో ఆబోరు దక్కించుకోలన్నదే కాంగ్రెస్ యువరాజా ప్లాను. ఇది జరిగేనా?
ఎన్నికల నెలగంట మ్రోగిందే తడవుగా- రాహుల్ గులామ్‌నబీకి ఆదేశాలిచ్చాడు. దాంతో ‘చెయ్యి’జాపి మరీ అడిగాడు, నబీగారు- ‘నూట మూడు సీట్లుదాకా యిస్తాం. అదీ ఏమిటి? జాట్‌ల పార్టీ ఆర్.ఎల్.డిని కలుపుకోకుండా- మేము వుంటేనే’’ అన్నాడు, అఖిలేష్ పార్టీ తరఫున పార్టీ ఉపాధ్యక్షుడు కిరణ్మయ్ నందా తెగేసి చెప్పాడు- ‘ఉప ముఖ్యమంత్రి పదవి మాకు కావాలి’ అంటూ. నీళ్లు నములుతున్నాడు రాహుల్‌జీ. మొత్తం ‘సైకిల్’మీద ‘చెయ్యి’ వేసుకునే ప్రయాణం తప్పదు. ప్రకటనే తరువాయి. కానీ ఈలోగా అనుకోని మడతపేచీలు వచ్చినా ఆశ్చర్యం లేదు. జనవరి ఇరవై నాటికి ఒక కొలిక్కొచ్చిన యుపి సంకుల సమర వ్యూహచిత్రం అలాగుంది. తండ్రీ కొడుకులు గ్యాంగ్‌వార్‌లాగా ఎన్నికలలో నిలబడి లేదా కలబడే ముప్పు తప్పింది. అతి పిన్నవయసులోనే నేరుగా సిఎం సింహాసనం మీద అఖిలేష్, అతని భార్య డింపుల్ పార్లమెంట్‌లోనూ ఖుషీఖుషీగా ఎంజోయ్ చేస్తున్నారూ అంటే- అక్షరాభ్యాసం నుంచీ, స్నాతకోత్తర పరీక్షల దాకా గురువుగా నిలిచింది- తను గెల్చిన సీట్లు ఖాళీ చేసిచ్చిందీ కూడా ములాయమ్ అనే ‘డాడీ’యే! కానీ రుూ మాజీ వస్తాదు ఎన్నోరకాల మతలబులు, ఆయువుపట్లు తెలిసినవాడు. రకరకాల ‘నామ్’ ‘బద్నామ్’లు కలిగినవాడు. ‘కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువే’ అన్నట్లు ఇవాళ నేతాజీకి బదులుగా ‘పార్టీ పితాజీ’గా నిలబడిపోయాడు. యుపిలో బిహార్ ఫక్కీలో ఒక ఐక్య సంఘటన స్థాపించాలన్నా కుదరదు. కేవలం ‘పొత్తు’ మాత్రమే కుదురుతుంది. అక్కడ భాజపా, బసపా తప్ప మిగతా పార్టీలన్నీ చిల్లర మల్లర పార్టీలే. గల్లీ స్థాయి పార్టీలు, జెండాలున్నా కేవలం ఇన్‌కమ్ టాక్సు మినహాయింపు కోసం- పెద్ద పార్టీ ప్రాపు కోరి నాలుగు రాళ్లు చేసుకోవడం కోసం ఏర్పడ్డవే. ‘యస్‌పి’ అన్నది రెండక్షరాలుగా విడిపోకుండా వుంటేనే భాజపా, బసపాల తాకిడికి నిలవగలదు- అది చేదు నిజం!
ఈసారి యుపిలో ఎన్నికలు ఏడు దఫాలుగా జరుగుతాయి. ఫిబ్రవరి 11 తొలి విడత- మార్చి ఎనిమిది చివరి పోలింగ్ ఘట్టంతో ఈ వోట్ల పండగ ముగుస్తుంది. ఈసారి అఖిలేష్, ములయాం యాదవ్ బొమ్మలు, వారి పార్టీ గుర్తు సైకిలూ రుూపాటికే ప్రతిగోడమీద పోస్టర్లుగా దర్శనం యిస్తూ వున్నాయ్. పెద్దకోడలు డింపుల్, రాహుల్ గాంధీ సోదరీమణి ప్రియాంకాలు ఒక జంటగా వేదికలమీద తమ గ్లామర్‌నీ, వాగ్ధాటినీ ప్రదర్శించాలనీ- రాహుల్, అఖిల్ జంట మరోవైపు ప్రచారం చెయ్యలని బేరసారాలు సాగుతున్నాయి. కాకపోతే ‘4జి’ ప్లాన్‌తో రంగంలోకి దిగాలనుకుంటున్న మోదీ గారి పార్టీ ‘గ్రామం- గంగ- గోవు- గీత’మీద ఓట్లు డిమాండ్ చేయడానికి కుదరదేమో! అలాగే మద్యం, నల్లధనం తగు మాత్రంగానే వుంటాయి. అదో హ్యాండీక్యాప్. ఈపాటికే యుపిలో కరెన్సీ కట్టలు, మద్యం సీసాలు దొరికిపోతున్నాయి. అది వేరే సంగతి. కాగా ప్రచారం- పోస్టర్ల వార్‌గానే వుండొచ్చును. కాగా, సీనియర్ జూనియర్ యాదవులిద్దరూ- ‘పాములూ పాములూ కరుచుకుంటే విషాలుండవు’ అన్నట్లు డ్రామా సుఖాంతానికి తెరదించారు. సారీ! దించలేదు- ఎత్తారు!
‘ఎగ్రీ ఆర్ నాట్, ఏ టెస్టింగ్ టైమ్ ఫర్ బిజెపి!’
*