వీరాజీయం

‘పుల్వామా’ నేర్పిన పాఠాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యక్తికన్నా గొప్పది దేశం. దేశ సరిహద్దుల్నీ, భద్రతనీ కాపాడే సైనికుడు అందరికన్నా గొప్ప. కశ్మీర్‌లో తరాలు మారినా శక్తిసామర్థ్యాలు, ధైర్య సాహసాలు తగ్గకుండా- టెర్రరిస్టు రక్కసి మూకల దొంగదాడులకు గురి అయి వుండి- వారిని ‘గురి’పెట్టి మట్టువెట్టే వీరజవాన్లు యుద్ధరంగంలోగాక దొంగ దాడుల నీచ నికృష్ట రంగంలో ప్రాణాలు కోల్పోడం జాతీయ విషాదం.
దేశమంతా దశదిశలా ఏకమై, శోకతప్త హృదయంతో స్పందించింది. ‘పుల్వామా’ ఘోరం జరిగి నూరు గంటలు కాకముందే- ‘పింగిలీనా’ అనే గ్రామంలో (నలభై మంది వీర సిఆర్‌పిఎఫ్ దళాన్ని బలిగొన్న దుర్ఘటనా ఘోర స్థలానికి పది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే) దాడికి కారణమైన ‘‘జైషే మహమ్మద్ ఇస్లామిక్’’ ఉగ్రవాద దళ నాయకుడు- రుూ ఘోర కృత్యాన్ని ‘‘ప్లాన్’’చేసి అమలు చేయించినవాడూ అయిన రషీద్ ఝాజీ అలియాస్ కమరన్‌ని, మరో యిద్దరు బడా ఉగ్రవాదుల్నీ కలుపుకుని- పద్దెనిమిది గంటల హోరాహోరీ తుపాకుల పోరులో హతం చేయగలిగాం’’- అని సగర్వంగా లెఫ్టినెంట్ జనరల్ కె.జి.ఎస్.్థల్లాన్ ప్రకటించడంతో మృతవీరుల ఆత్మకు కొంతయినా శాంతి కలిగినట్లయింది.
ఈనెల 14వ తేదీన జమ్మూ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరిన డెబ్బయి ఎనిమిది సైనిక శకటాలను లక్ష్యంగా పెట్టుకుని దాడి చేసింది తామేనని జైషే మహమ్మద్ సంస్థ అంగీకరించింది. శకటాలలో రెండు వేల అయిదువందల మంది సిఆర్‌పిఎఫ్ జవానులు ప్రయాణం చేస్తున్నారని ముందుగానే తెలుసుకుని, చాలా ముందుగానే ప్లాన్ చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. పుల్వామాలోని ‘పింగ్లావ్’లో రుూ టెర్రరిస్టులు- సర్వసన్నద్ధంగా- ఒక యింట దాక్కొన్న రుూ జైషే నాయకుల్ని ఎన్‌కౌంటర్ చేయడానికి పద్దెనిమిది గంటలు ‘యుద్ధం’ చేయాల్సి వచ్చింది. అంటే పుల్వామా ప్రాంతంలో టెర్రరిస్టుల పన్నాగాలూ, దురంతాలూ ఎంత లోతుగా వున్నాయో ఆలోచించాలి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మేజర్ సహా మరో ముగ్గురు మన జవాన్‌లు వీరస్వర్గం అలంకరించారు. పోలీసులు, సైన్యం, సరిహద్దు భద్రతా దళాలూ- ముగ్గురూ కలిసి చేసిన రుూ సైనిక చర్యలో పోలీసులు, డి.ఐ.జి. కూడా గాయపడ్డాడు. ఈసారి కిరాతక దాడి తర్వాత-వెంటనే మరొక ప్రతీకార చర్య కూడా చేసింది మన గవర్నమెంటు..్భష్!
హురియత్ కాన్ఫరెన్స్ నాయకులకు, ఇతర ఏర్పాటువాద సంస్థ నాయకులకూ సౌకర్యాలు, భద్రతా కల్పిస్తూ వస్తున్నారు మన వాళ్లు ఏనాటి నుంచో. ఎట్టకేలకు భారత జనుల మొరాలకించి హురియత్ చైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ షారూఖ్‌కి మరో నాయకుడు అబ్దుల్ ఘనీభట్ సహా మరికొంతమందికి యిస్తున్న సర్కారీ భద్రతా సదపాయాలు ఉపసంహరించారు. ఏటా పదకొండు కోట్ల ప్రజాధనాన్ని దేశవ్యితిరేక చర్యల కుట్రదారులకోసం గవర్నమెంటు వెచ్చిస్తూ వచ్చింది. ఈసారి రుూ ఘోర దురంతం తరువాత ఇండియన్ గవర్నమెంట్ సంకోచాన్ని వదిలి టెర్రరిస్టు ‘అడ్డా’ల మీద ఎన్‌కౌంటర్ దాడులకు, దాంతోపాటే యిలా సదుపాయాల ‘ఉపసంహరణ’కు చర్యలు మొదలెట్టింది.
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్- ‘‘ఇండియా ఒకడుగు ముందుకేస్తే నేను రెండుగులు ముందుకు వేస్తానంటూ’ పొయిట్రీ చెప్పాడు లోగడ. కానీ యిప్పుడు అతని కనుసన్నలలోనే పాక్ టెర్రరిస్టు మూకలు రెండడుగులు ముందుకొచ్చాయి. ‘నాలుగు అడుగులు’ యిప్పుడు మనం ముందుకు వేయడానికి సిద్ధం అయ్యాం అన్న సూచనలు బాగా కనపడుతున్నాయి.. జయం! ‘‘పార్లమెంటు మీద లోగడ జరిగిన దాడి మొదలు ‘పఠాన్‌కోట్’ దురంతం వరకూ సాగిన ఘోర భయానక నీచ నికృష్ట పిరికి దాడుల తర్వాత కూడా.. యింకానా? రుూ శాంతి ప్రవచనాలు?’’ అన్న జన వాక్యాన్ని కేంద్రంలో వున్న గవర్నమెంటే కాదు, ప్రతిపక్షాలు కూడా గౌరవించాలి. ఇరవై నాలుగ్గంటలు ‘బ్లేమ్ గేమ్’తో పరస్పర నిందారోపణలతో ఎవర్ని మభ్యపెడతారు? ఇమ్రాన్ ఖాన్‌ని మన క్రికెట్ ప్రముఖుల పీఠం మీద కూర్చుండబెట్టిన వాళ్లు కూడా నేడు ఆ పటాన్ని లాగేసి అవతల పారేశారు. ..ఓ.కే.! ఇక శషభిషలు, మొహమాటాలూ వద్దు, కశ్మీర్‌కు ఉన్న ఆర్టికల్ 370కి మంగళం పాడేయాలి. లేదా ముఫ్తీలనూ, షారూఖ్‌లనూ, అర్థం పర్థం లేని సోకాల్డ్ మానవతావాద వాదుల్ను ఏరిపారేసేటందుకు చర్యలు తీసుకోవాలి. అంటే యుద్ధం చెయ్యమని కాదు. యుద్ధం పరిష్కారమే అయితే డెబ్భై ఏండ్లు రుూ నెత్తురు కూడు తినే దురదృష్టం కాశ్మీరీలను వెంటాడేది కాదు. యుద్ధం ‘‘పరోక్షంగా’’ ఎక్కడ వీలయితే అక్కడ చేయాలి. పాక్ తోక కత్తిరించే రీతిలో చర్యలు తీసుకోవాలి. దౌత్య రంగంలో, అంతర్జాతీయ రంగంలో మనవాళ్ల ‘‘చాకచక్య చేష్టలు’’ ఎల్లప్పుడూ ‘‘డల్’’గానే వుంటున్నాయి. ‘‘జరుగుతున్న రగడ అంతా ఎక్కడ బాబూ? అంటే ఇండో-పాక్ సరిహద్దులలో కాదు. మా (భారత్) సొంత గడ్డమీద- మా అందాల కశ్మీరంలో- ఆక్రమిత కశ్మీరం సాక్షిగా సాగుతున్న ఘోర మారణహోమం యిది’, అని ప్రపంచాన్ని నమ్మించలేని మన నాయకత్వం ‘వేస్టు’ అంటూ, అన్ని పార్టీలనూ తిట్టిపోస్తున్నారు సీనియర్ సిటిజనులు. ..రైట్..
అసలు ఎంత మందికి యితర రాష్ట్రాలలోని జనాలకి కాశ్మీరం గురించి తెలుసు? అక్షరాలా కోటి ఇరవై అయిదు లక్షల జనాభాగల కశ్మీరంలో ఏరియా చూస్తే- పాకిస్తాన్ దురాక్రమణ క్రింద పోయింది పోగా, మిగతాది లక్షా పదమూడు వేల మూడువందల ఎనభై చదరపు కిలోమీటర్ల వైశాల్యం జనవాసరంగా శోభిస్తున్నది. అందులో కశ్మీర్ 15 శాతం, జమ్ము 26 శాతం, లడఖ్ 59% ‘ఏరియా విభజన’గా తెలుస్తోంది. పైగా కశ్మీర్ కశ్మీరులదే అని పాకిస్తాన్, దాని భక్తులు, కిరాయి సైన్యాలు చేస్తున్న గోలకి చెందినది అరవై తొమ్మిది లక్షల మంది మాత్రమే. ఇక పదమూడు లక్షల మందికి కాశ్మీర్ భాష రానే రాదు. ఇతర భాషలే జీవితం. ఇరవై రెండు జిల్లాలున్నాయ గానీ అందులో కేవలం ఐదే ఐదు జిల్లాలు వేర్పాటువాదం విజృంభించిన ప్రాంతాలు. అందరికీ తెలియదీ విషయం. మొత్తం కాశ్మీర్ అంతా పాకిస్తాన్ ‘‘ప్రేమికులే’’ అనుకునే జనాలు కూడా వున్నారు. అదీ మన గవర్నమెంట్, దాని నాయకత్వం మొదట్నుంచీ యివాల్టిదాకా చేస్తున్న ‘నిర్వాకం’. వ్యక్తుల లేదా పార్టీల ప్రసక్తి ఏల?
కశ్మీరం కల్లోలం అంతా పాకిస్తాన్ బోర్డర్‌కి దూరంగానే వున్నది. దాని ఊడిగానికి దగ్గరగా వున్న ప్రాంతాలు రుూవీ- శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా, కులుగా యిదిగో రుూ ‘‘పుల్వామా’’ జిల్లా- ఇక్కడే దౌర్భాగ్య దుర్మార్గ దుష్ట చేష్ట్భారిత వేర్పాటువాదం చెలరేగుతూ వస్తూన్నది. అనగా మిగతా 17 జిల్లాలు ‘ఇండియా.. మదర్ ఇండియాకీ జై’ అంటున్నారు. మారణ హోమం యిన్నాళ్లు సాగి, యిదొక భయంకర, భయానక చరిత్రగా పేరుకున్నదీ, అంటే, ఎవరిది తప్పు?.... (తాపీకా థింకండి!)
అందరూ అందరే. చెయ్యి కాలకుండా మంటలార్పుదామని, కాలు తడవకుండా నీట దిగుదామని- వోటు ఖాతాలకిది యేమయినా పనికొస్తుందా? అని యోచిస్తున్న ఉద్దండ పిండాలే. ఆలోచించండి.. హురియత్‌లకు- హుష్‌కాకి అని చెప్పి, ఆర్టికల్ 370కి ఉద్వాసన చెప్పండి! అందుకు మన నేతలకు ‘గట్స్’ వున్నాయా? కశ్మీర్‌లో యుద్ధం జరగని క్షేత్రంలో మన వీరుల రక్తం చిందకుండా చూడండి. చైనాతో కూడా- ఆసియాలో ఒక పెద్ద దేశంగా అది- మన పక్షం వచ్చేలాగా- అవసరమయితే ‘బేరం’ పెట్టయినా సరే, పాకిస్తాన్‌ని ‘ఏకాకి’ని చెయ్యండి. కొంతమంది ‘అభిమతం’ చేస్తున్న బీభత్సం తప్ప యిది మతానికీ సంబంధించిన ‘పోరు’ కాదు అని చెప్పండి (మన్‌కీ బాత్). కాశ్మీర్ అంతటా ఒక్కసారి ‘తిరిగి’ చూస్తే తెలుస్తుంది. మంటలని ఎగదోసి, ఫైరింజన్‌ల సంఖ్య పెంచే దగుల్బాజీ రాజకీయాలకు స్వస్తి చెప్పండి. ‘‘అవతల దుష్ట మూర్ఖులచేత, అణుబాంబుల బటన్ దొరికిపోయే ప్రమాదం వుందని పాకిస్తాన్ ప్రభుత్వం కూడా గుర్తించడం మంచిది’’ అని నచ్చ చెప్పండి- (వాళ్లకే నష్టం!)
‘స్టాప్ వెర్బల్‌వార్ ఎమాంగ్ యువర్ సెల్వ్స్.. ఐ సే!’

సెల్: 92900 99512