వీరాజీయం

‘మో-దీదీ’ ఢీ ఢిక్కీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సకల జనులు ‘ఔరా!’ యనగా- పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి- వీర వనితగా వాసికెక్కిన ‘ధర్నా దీదీ’ మమతా బెనర్జీ నడిరోడ్డుమీద- కటిక చలిలో- లంఘించిన బెబ్బులి మాదిరి రాత్రి తెల్లవార్లూ బైఠాయించింది. ఈ ‘గయోపాఖ్యానం’లో ‘గయుడు’- కలకత్తా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్, కలకత్తా మేయర్ కూడా ఆమె పక్కనే ఒదిగి కూర్చున్నారు. దీదీ దీక్ష చేస్తున్నారని తెలిసి దేశం నాలుగు చెరగులా ఉలిక్కిపడ్డది. అర్జెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదలు, అక్కడ ‘నయా దిల్లీ’లో ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ దాకా- మొత్తం ఇరవైమూడు రాజకీయ పార్టీల నేతలూ - ‘‘దీదీ! హమ్ తేరే సాథ్ హైఁ’’-అనగా- ‘‘మేం నీతోనే వుంటాం. తాడోపేడో తేల్చుకుందాం’’- అంటూ లేచారు.
దీదీ తాను కప్పుకున్న ఖరీదయిన శాలువా తీసి, అవతల పారేసి- వో పల్చని శాలువా మాత్రం కప్పుకుంది. ‘‘మోదీ హటావో- దేశ్ బచావో’’- అన్నదే తన లక్ష్యం తప్ప.. సి.బి.ఐ. వారి మీద నాకేం కోపం లేదంటూ- ఆడపులిలా అటూ యిటూ పచార్లుచేస్తూ- సింహం లాగా గర్జించింది.
అవతల అరివీర భయంకరంగా కదం తొక్కుతూ నగర పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటి ముంగిటకు- చెప్పా పెట్టకుండా, నోటీసు యివ్వకుండా దాడి చేసిన సి.బి.ఐ. దండుని దీదీ పోలీసులు తరిమి తరమి కొట్టేశారు. సుప్రీం కోర్టుకి ‘శరణు శరణు’.. అంటూ పరిగేత్తేలా చేశారు. కప్పం కడుతూ, ‘‘జోహుకుమ్ సర్కార్’’ అంటూ వుండాల్సిన (కనీసం మోదీ అనుయాయుల కోరిక) సామంత రాజ్యాలు యిట్లా ఈస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ దాకా- ఎదురుతిరుగుతున్న వైనం మోదీజీకి ‘పంచ రంగుల్లో’ కనపడి వుంటుంది. జనాలు మాత్రం టెలివిజన్ తెరల మీద- ‘మో- దీదీ’వార్‌ని- ‘‘ట్వంటీ-ట్వంటీ’’ క్రికెట్ మ్యాచ్ లాగా తిలకించారు.
అక్కడ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బెంగాల్ గవర్నర్‌ను నివేదిక అడగటం అంటే- ‘రాష్ట్రపతి పాలన అనే బ్రహ్మాస్త్రంతో కొడతాం..’ అని దీదీని బెదిరించడమే!
‘గవర్నర్ నామినేటెడ్- మమతా ఎలక్టెడ్’- ‘‘నా జనం కోసం రాష్ట్రపతి పాలనకే కాదు, నా ప్రాణాలయినా తృణప్రాయంగా యెంచి, యిచ్చేస్తాను’’ అంటూ మమతాజీ జవాబు చెప్పింది. ‘ భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాలు లేని ప్రతిచోటా- కేంద్రం సమాంతర పరిపాలన సాగిస్తోంది. నా బెంగాల్‌లో తిరుగుబాటుకీ, మోదీ నేతృత్వంలోని కేంద్రం కుట్ర పన్నుతున్నది’ అంటూ ఆరోపించింది- ‘కలకత్తా కాళిక’గా అనుయాయులు కీర్తిస్తున్న మమతా బెనర్జీ.
‘‘అమ్మా! నేను నీతోనే’’ అన్నాడు తక్షణం స్పందిస్తూ, ‘ఆప్’బాస్ అరవింద కేజ్రీ- విమానం ఎక్కేశాడు. ఆం.ప్ర. నాయుడు గారు ‘చలో కలకత్తా’ అంటూ బయలుదేరాడు. 2006లో 26 రోజులు ప్రతిపక్షంలో వుంటూ ‘సింగూర్’ వివాదం మీద అసెంబ్లీ ఎదుట ఉద్యమించిన మమతా బంధోపాధ్యాయకి- ‘ధర్నా దీదీ’గా విశ్వఖ్యాతి లభించింది. ఇవాళ ఆమెకు మూడు రోజుల ‘ధర్నా’ ఒక లెక్కలోది కాదు.
అందరూ కాకపోయినా మోదీగారి బలగం యావత్తూ ‘దీదీ రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నది’-అన్నారు. ‘మా జనవరి 19 నాటి ర్యాలీ మోదీజీ గుండెల్లో గుబులు పుట్టించింది. ఇవాళ పగ రాజకీయాలు సాగిస్తూన్నాడు’అంటూ నేరుగానే ఆరోపణాస్త్రాలు సంధిస్తున్న మమతా బెనర్జీ, 2019నాటి ఎన్నికలలో అనుసరించే యుద్ధవ్యూహంలో ప్రధాన నాయకురాలిగా అందరికీ కనపడ్డది. ఐతే సమయానికి దేశంలో రాజకీయ ‘సంక్షోభం’ ఏర్పడి పోయిందంటూ భాజపా మిత్రపక్షాలు చేస్తున్న ‘ఆర్తనాదాలకు’ సుప్రీం కోర్టు చాలా చాకచక్యంగా ‘బ్రేక్’ వేసింది- (గ్రేట్!) ‘గయుడు’ అనగా కలకత్తా పోలీస్ చీఫ్ రాజీవ్‌కుమార్ శారదా స్కామ్‌కి సంబంధించి విచారణ నిమిత్తం సి.బి.ఐ. అధికారుల ఎదుట హాజరుకావల్సిందే అని, తటస్థ ప్రాంతంలో (మేఘాలయా, షిల్లాంగ్‌లో) సమావేశం ఏర్పాటుచేయాలన్నది సుప్రీం కోర్టు.
‘‘ఓహో! మాదే విజయం’’ అంటూ రసగుల్లాలు, లడ్డూలూ పంచేసుకున్నారు- మోదీ మిత్రపక్షాలు. సగం మిఠాయి దుకాణాలు ఖాళీ. కానీ, ‘రాజీవ్ కుమార్‌ని అరెస్ట్ చెయ్యకూడదు. థర్డ్ డిగ్రీ మెథడ్స్ అమలు చేయకూడదు’ అంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు యివ్వడంతో- తృణమూల్ పార్టీ, యితర మిత్రపక్షాలూ కూడా లడ్డూలు పంచేసుకున్నాయి. అట్లా, ప్రస్తుతానికి మిఠాయి దుకాణాలు ఖాళీ అయి, ఒక సంక్షోభానికి ‘కామా’ పెట్టబడింది!
‘‘వాస్తవం’’ అందరికీ ఒకటే. గానీ దానిమీద, టి.వి. తెరల మీద- పురుషులు, తేనెటీగలూ వాలినట్లు వచ్చే వ్యాఖ్యానాలు రకరకాలు. అస్మదీయ, తస్మదీయులు మాత్రమే కాకుండా, దేశంలో మనలాంటి ‘తటస్థులు’కూడా వుంటారు. వాళ్లకి దేశంలో దారులు వేరైనా ‘లక్ష్యం’ మాత్రం మోదీని ఓడించడంగానే అధిక సంఖ్యాక వర్గాలు పావులు కదపడం కనబడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో భాజపా అధ్యక్షుడు అమిత్‌షాకి జనాలు మొహం చాటు వెయ్యడం, బెంగాల్‌లో మోదీగారి ‘టైగర్’గా అందరూ కీర్తించే- యోగీ ఆదిత్యనాథ్ హెలికాప్టర్‌కి దిగటానికి పిసరంత చోటులేక రోడ్డున పడటం- ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ‘సైజు’నీ, త్రివిక్రముడై పెరిగిపోయిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ ‘సైజు’నీ - ప్రక్కప్రక్కన పెట్టి చూడటం జరిగిపోయింది. చివరికి దీదీ సమరశంఖం నేరుగా పూరించింది.
దీనికి భాజపా మిత్రపక్షమైన శివసేన పరోక్షంగా హర్షం ప్రకటించడం- నిన్నటి సినిమా స్టార్ శత్రుఘ్న సిన్హా- నేటి రాజకీయ నాయకుడిగా మారి ‘ట్వీట్స్’ సంధిస్తూ- తమ పార్టీ అగ్ర నాయకుణ్నే హెచ్చరించడం, కొన్నిసార్లు హేళన చెయ్యడం- రామమందిరం విషయంలో కాషయాంబరధారులంతా మడత పేచీ పెట్టి- తటస్థ స్థలంలో- ‘‘రాళ్లెత్తవోయ్’’ అంటూ ఉద్యమించడం- యివన్నీ వ్యతిరేక పవనాలేనన్న సంగతి గ్రహించవలసింది.. ‘మోదీ-షా’ థింక్ టాంక్ మాత్రమే!
లోగడ దిల్లీ రోడ్డుమీద గడ్డకట్టించే చలిలో రోడ్డుప్రక్కన కంబళ్లు, కోట్లు ధరించి- పోలీసుశాఖని ఢిల్లీ గవర్నమెంటు అధీనం చెయ్యమని ‘‘ప్రొటెస్ట్’’ చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఎందరికో కళ్లకుకట్టినట్లు జ్ఞాపకం వచ్చాడు. సైకిళ్లు, చీపురుకట్టలు మాత్రమేనా? కేరళ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రీ కూడా మోదీ అంటే ఇవాళ ‘్భగ్గు’మంటున్నారు.
‘సామాన్య ఓటరు మాత్రం వరాల జల్లులో తడిసి మురిసిపోతాడు’- అన్నది ఒక ఆశావాదమే గానీ ‘ఫెడరల్’ అదే.. సమాఖ్య విధానంలో యింకా రాష్ట్రాలలో- ఆయా రాష్ట్రాల గవర్నమెంటులకీ, ముఖ్యమంత్రులకీ కూడా యిటువంటి వరాల మూటలు విప్పే అవకాశం వుంటుందన్నది గ్రహించాలి. లోగడ జయలలితమ్మ చాలాసార్లు రుూ మాట రుజువు చేసింది. జైళ్లలో మగ్గుతూ కూడా ప్రభుత్వాలు నడిపిన ప్రజానాయకులు, ప్రతిపక్షాలూ వున్నాయి.. నిందలు, నేరాలు మోస్తూ కూడా..
‘కాంగ్రెస్ బూచి’’ని మాత్రం చూపించి- మోదీ గారు కాలయాపన చేయడం మానెయ్యాలి’ అని అన్నాడో వృద్ధ భాజపా అభిమాని. నల్లషర్టు ధరించినా, గులాబీ కండువా వేసుకున్నా- నడిరోడ్డుమీద- గజగజ వణికే చలిలో అల్లాడినా- అయ్యా! రేపు 2019లో వచ్చే ఎన్నికల దృష్టి- తమ రాష్ట్ర ప్రజల మీద అనురక్తి మాత్రం ప్రాంతీయ పార్టీలకీ, నాయకులకీ ఉంటుంది. మోదీని అందరూ ఉత్సవ విగ్రహం చేసుకుంటారు అన్నది భ్రమ! కాదా?...
మైండ్ యూ! ఏ వార్ హేజ్ బీన్ డిక్లేర్‌డ్!

సెల్: 92900 99512