వీరాజీయం

‘లెజెండ్స్’ లిస్ట్‌లో కొహ్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హమ్మయ్య! డెబ్భై ఒక్క ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ‘ఇండియాను ఇంతకాలం పట్టిపీడించిన గ్రహణం’ విడిపోయింది. కొహ్లీ సేనకు ప్రచండభాను సమాన ఘన విజయం లభించింది. మెల్‌బోర్న్ విజయం ఒక కొత్త రికార్డు, సరికొత్త చరిత్ర! అందుకే ముందస్తుగానే భారత్‌లోని క్రికెట్ ప్రియులంతా కలసి చేసిన విజయోత్సాహ నృత్యహేలని ఇప్పుడు కొనసాగించి కొహ్లీ సేనకి జయభేరి వినిపిస్తున్నాం!
మాజీ క్రికెటర్, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నట్లు ఆసియాఖండమంతా- ఇండియన్ టెస్ట్ టీమ్ నెంబర్ వన్ టీమ్‌గా- బస్తీమే సవాల్‌గా- ఇక ఏ ఖండమూ మిగిలిపోకుండా అఖండ విజయాన్ని సాధించింది. ఆమాటకొస్తే క్రికెట్ విషయంలో ఇండియన్ల కృషి, ఇక్కడివారి ప్రోత్సాహం ఇంగ్లీషు దేశాలకేమాత్రం తీసిపోలేదు. రాజపోషణ లభించింది- ఆది నుంచీ క్రికెట్ క్రీడకి. రంజీ ట్రోఫీ లాంటిదెక్కడుంది? కల్నల్ సి.కె.నాయుడు, పటోడీ నవాబ్ లాంటి క్రికెటర్లు మరే దేశంలో వున్నారు? సునీల్ మనోహర్ గవాస్కర్ తరువాతనే మరో బోర్డర్ మహాశయుడు పదివేల ‘బోర్డరు’ను దాటాడు. అందుకే ఈ ట్రోఫీ ‘బోర్డర్-గవాస్కర్ కప్’గా ఆవిర్భవించింది.
ఐతే- ‘బ్యాడ్‌లక్’ లేదా శని మహత్యం ఏమిటంటే ఆస్ట్రేలియా గడ్డమీదికి దండయాత్రగా పోయి- ‘కంగారూ’ల ముందు కంగారు పడిపోయి- నెత్తిన గ్లోవ్స్ వేసుకుని తిరిగొచ్చిన క్రికెట్ శార్దూలాలే మనవాళ్లంతా. పనె్నండుసార్లు పోయివచ్చారు. ‘బెటర్‌లక్ నెక్స్ట్ టైమ్’ అనుకుంటూ తిరిగొచ్చారు. బ్యాట్ పట్టుకున్న ప్రతి దేశం, దేశంలో ఆబాలగోపాలం- ‘మన్‌డోలే మెర తన్ డోలే’-‘‘మనసు ఉప్పొంగింది’- ‘నా ఒళ్లు పులకించిందీ’’-అంటూ నాగ నృత్యం చేస్తున్నాయి. నిన్న గవాస్కర్ దగ్గర నుంచీ గల్లీ క్రికెటర్ దాకా అంతా తిట్టారు- ‘స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగుతారా?’అంటూ. రవిశాస్ర్తీ, కొహ్లీలను కలిపి దులిపేశారు. ఇవాళ ఆకాశానికి ఎత్తేస్తున్నారు! ఇవాళ ‘రవి’ ద్రోణుడు. విరాట్ అర్జునుడు అయ్యారు. ఎన్ని రికార్డులురా బాబూ! లెజెండ్‌ల జాబితాలో దర్జాగా ఎక్కి కూర్చున్నాడు-విరాట్ ది కొహ్లీ! ఉబ్బి తబ్బిబ్బయిపోయిన చీఫ్ కోచ్ రవిశంకర శాస్ర్తీ ‘మా క్యాప్టెన్‌కి నేను శాల్యూట్ చేస్తున్నా’ అన్నాడు. ఈలోగా అభినందించడానికి దేవకన్యలాగ అక్కడ అవతరించిన ‘అనుష్కాశర్మ ద సినిమా స్టార్’ని - అక్కున అదుముకుని మరీ- ‘ఇదంతా నువ్వు మావాడి మెడలో వరమాల వేసిన దగ్గరనుంచేనమ్మా, మాకీ గెలుపుల తోరణం లభించిందీ’’ అంటూ అభినందించాడు రవి పరమానందంగా..
అసలామాటకొస్తే ‘డాన్ బ్రాడ్‌మాన్’ని కూడా చరిత్రలో మొనగాడిగా నిలబెడుతూనే మన భారత బ్యాట్స్‌మన్ పరుగుల రికార్డును ఒక్కరోజు అయినా వదిలిపెట్టకుండా ‘ఇండియా’లోనే వుంచేసుకున్నారు. సునీల్ నుంచీ సచిన్ దాకా ‘నెంబర్ వన్ బల్లేబాజ్’ మనవాడే. ఒక ద్రవిడ్ మరొక గంగూలీ లేని లోటుని జేగీయమానంగా- పుజారా ఛటేశ్వరుడు.. దూకుడు కొహ్లీలు మరింత ఎత్తుగా ఎగురవేస్తూ- పదమూడో ప్రయత్నంలో అయితేనేం ప్రత్యర్థి జట్టుకి, వాళ్ళ నాయకుడు ‘పెయిన్’కి మరిచిపోలేని పెయిన్ (నొప్పి)గా మూడు చెఱువుల నీళ్లని తాగించి మరీ- జెండా ఎగరేశాడు!
మరో కొత్త సంప్రదాయం నెలకొంది. ‘స్పిన్ మాంత్రికుల’ దేశంగా వాసికెక్కిన ఘనత మనది. మన్‌కడ్ నుంచి అనిల్ కుంబ్లే మీదుగా అశ్విన్ దాకా- అది ఏ దేశం బ్యాటింగ్ జట్టు అయినా- వాళ్లని డ్యాన్స్ చేయించేవారు. కానీ ఈసారి- ‘విరాట్ ది విన్నర్ బోయ్’ అన్నట్లు మన ఫాస్ట్ బౌలర్లు నిజంగా ‘పిచ్’మీద పిచ్చిగా నిప్పులు చెరిగారు. బూమ్రా (21వికెట్లు) షమీ (18) ఇషాంత్ (11)లు- ‘కంగారూల’ను మొదటి బంతినుంచే కంగారు పెట్టేశారు. ఇక కొత్త ‘గోడ’గా కీర్తికిరీట ధారణ చేసిన పూజారా 74.42 సగటుతో- 521 పరుగులు- మూడు శతకాలతో చేసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ కిరీటాన్ని ఎగరేసుకుపోయాడు. అమ్మాయి పుట్టిన కారణంగా రోహిత్, పొత్తికడుపులో మెలిదిరిగిన గాయంతో అశ్విన్- ఫైనల్స్‌లో ఆడలేకపోయినా- ఇండియన్ టీమ్‌కు విజయంలో భాగస్వాములు కాదగ్గ క్రికెట్ జెగజెట్టీలే. ఇటువంటి టీమ్.. పాతకొత్తల మేలుకలయికగా రాణించిన జట్టు మరొకటి లేదు. లేదండీ లేదు.. గెలుపు బృందగానమే.. ఇది ఏ ఒక్కరి ‘సోలో’ షో కాలేదు. అదే గొప్పదనం. మయాంఖ, హనుమ విహారి, కుల్‌దీప్ లాంటి కొత్త కుర్రాళ్లు టెస్ట్‌లో కూడా అద్భుతంగా రాణించిన వృషభ్ పంత్‌లు- ‘విజయలక్ష్మికి ప్రత్యేక ఆభూషణాలు’. 2018 ఇండియాకి క్రికెట్ శుభాంతం చేసింది. ఇవాళ ఇండియా- ‘ఏ’టీము, ‘బి’టీము, ‘సి’టీమూ కూడా ఉన్న మైదానంలోకి- కాలికి కత్తికట్టుకున్న కోడిపుంజుల్లా దిగే అవకాశాలున్నాయి. అంతమంది మెరికల్లాంటి కొత్త కుర్రాళ్లు రంగంలోకి దిగారు.
క్రికెట్ ఆట ‘బోర్డు’ వారికి కనకవర్షం కురిపిస్తున్న అష్టలక్ష్మి. అందుకే ఆ బృందంలో ఆడినవారికి పదిహేను లక్షలు, టీమ్‌లో సభ్యులుగా వున్న ప్లేయర్స్‌కి ఏడున్నర లక్షలు, కోచ్‌లకి, సిబ్బందికీ- ఆ దామాషాలో నగదు పారితోషికాన్ని బోర్డు ప్రకటించింది. ఇక కొహ్లీ టీముకి వూపిరి సలపకుండా- సన్మానాలు, సత్కారాలు, మంగళ హారతులు, బాజా భజంత్రీల స్వాగతాలు మొదలవుతాయి. కానీ, వాళ్లు ఇటురారు అటే వుంటారు. అటు న్యూజిలాండ్‌కి మళ్లీ బంతీ, బ్యాటూ, ‘కిట్టూ’ పట్టుకుని వెళ్తారు. మళ్లీ వొళ్లు పులిసేలాగ వ్యాయామం, అభ్యాసం చేయడానికే తప్ప ‘సంబురాల’కిది టైముకాదు వాళ్లకి.
మన ప్రజలకున్న వెర్రి వ్యామోహాన్ని సంతృప్తిపరచగల వెరైటీ టీము ఇవాళ మనకి వున్నది. టెస్ట్ క్రికెట్‌కి కొత్త ‘వూతం’ యిచ్చిన ‘నెంబర్ వన్’ టీమ్ ప్రస్తుత ‘కొహ్లీ సేన’- జయహో!
‘యు కెన్ పిచ్ ఆన్ క్వీక్కీస్ నౌ!’

సెల్: 92900 99512