వీరాజీయం

ఆదిలోనే హంసపాదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తం మీద అన్ని రాజకీయ పార్టీలూ 2018 సంవత్సరానికి ‘గుడ్ బై’ చెప్పేముందు 2019 మే నెలలో రాగల పార్లమెంట్ ఎన్నికల గాడిలో పడిపోయాయ్! ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో భాజపాని చిత్తు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఫలితాలు వెలువడడానికి కొంతముందే- ఢిల్లీలో ‘్భజపాయేతర’ ప్రతిపక్షాలు పదిహేడు ఒకే వేదికమీద- మానవ తోరణం ప్రదర్శనలో- యువజనులు చేతులూ చేతులూ కలిపి పట్టుకుని నిలబడ్డట్లు నిలబడ్డారు. తాజాగా చెన్నైలో కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా అందరి చేతుల్లోనూ ఛర్రున దూసి పట్టుకున్న కత్తులు వున్నాయ్!
ఉత్తరాదిన కాంగ్రెస్ పార్టీకి జనాలు మళ్లీ ఊపిరి పోస్తుండగా ఇక్కడ దక్షిణాదిన, ఓ ప్రాంతీయ పార్టీ- తెలంగాణ రాష్ట్ర సమితి- ఇటు కాంగ్రెస్సునీ అటు భాజపానీ కూడా చిత్తుగా ఓడించింది. ‘స్థానబలిమి గాని తన బలిమి కాదయా..’ అన్నట్లు ‘అఖండ భారత పార్టీ’ అంటూ అమిత్‌షా, యోగీ ఆదిత్యనాథ్‌లు ప్రగల్భాలు పలికిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఉపకారానికి బదులు అపకారం చేసింది. ‘మహాకూటమి’ పేరిట చంద్రబాబు చేసిన చాణక్యం కూడా వికటించింది. కానీ, ఆంధ్రప్రదేశ్ గడ్డమీదకు పిలిచి- ఐక్యసంఘటనకు ఓ వేదిక- అవకాశం ఇవ్వగల ఛాన్సు చంద్రబాబుకి లేకపోయింది. ఆ అవకాశం దక్షిణాదిన చెన్నై నగరంలోని డిఎంకె పార్టీ అధినేత కరుణానిధి వారసుడిగా రాజకీయంగా నిలదొక్కుకున్న స్టాలిన్‌కి దక్కింది.
ద్రవిడ మునే్నట్ర కజగం పార్టీ దివంగత అధినాయకుడు కరుణానిధి కంచు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఎన్.డి.ఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీని పిలిచాడు స్టాలిన్. అక్కడికి కొత్తగా జట్టు కట్టాలని ఉవ్విళ్లూరుతున్న ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, సిపిఐ నాయకులు వగైరా వగైరా హాజరైనారు. దేవెగౌడ బృందం ‘తిరుమల యాత్ర’ సందడి చేత కాబోలు చెన్నై ‘హాల్టు’ పెట్టుకోలేదు.
కోలాహలంగా మంచి ఊపుమీదున్న కరుణానిధి అనుయాయులు, భక్తుల సమావేశం ‘వేడి’గా వుంది, ‘వాడి’గా వుంది. సదరు ఆడియెన్స్‌లో కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా వున్నాడు. స్టాలిన్ తన ప్రసంగాన్ని తమిళంలో మొదలుపెట్టి- ఆ భాష అర్థం కాని ముఖ్య అతిథుల కోసమా అన్నట్లు ఇంగ్లీషులోకి మారిపోయి మోదీని, మోదీ గవర్నమెంటునీ తిట్టిన తిట్టు తిట్టకుండా ‘‘రుూ ఫాసిస్టు పాలనకి చరమగీతం పాడటానికే మేము మా దివంగత అధినాయకుడి సాక్షిగా కత్తులు దూస్తూ ఇక్కడ నిలబడ్డాం’’ అని అదరగొట్టే ప్రసంగం చేశాడు.
‘మోదీ గవర్నమెంటు దేశాన్ని పదిహేను ఏళ్లు వెనక్కి తీసుకుపోయింది. దేశాన్ని కాపాడటం కోసమే మేమందరం ఏకం అవుతున్నాం. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించేది- ఎలాగూ -తనంతటతానుగా వంద సీట్లు గెలవగల సత్తా వున్న కాంగ్రెస్ పార్టీయే అవుతుంది. కనుక ఆ పార్టీ అధ్యక్షుడు, సోనియా తనయుడూ రాహుల్ గాంధీ పేరుని తాను ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదిస్తున్నాను’’ అన్నాడు స్టాలిన్. స్టాలిన్ మాటలకు- మిగతా నాయకుల మొహాలు అంతటి తళతళా మెరిసే వెండికత్తుల కాంతుల్లోనూ కూడా ముకుళించుకుపోయాయి. ఆ సంగతి జనాలు సైతం గమనించారు.
‘‘దాని భావమేమి తిరుమలేశా?’’ అని అడగనక్కరలేదు. తృణమూల్ కాంగ్రెస్, సమాజవాద్ పార్టీ అంతకన్నా ముందు-బసపా, ఎన్‌సిపి అండ్ టిడిపి, సిపిఐ తదితర పార్టీల నాయకులు ఇదేమిటి? అంటూ సంభ్రమాశ్చర్యాలను ప్రదర్శించేరు. ‘‘ఎన్నికల యుద్ధం అయినాకా, కూటమి జెండా ఎగరేశాక కదా.. మన ‘అజెండా’లో ప్రధానమంత్రి ఎవరన్న అంశాన్ని చేర్చుకుందామనుకున్నాం?’’ అంటూ చెవులు కొరుక్కున్నారు.
సరే, ఒక సామెత వుంది- ‘‘కలలో పాలు త్రాగటానికి వొట్టి గ్లాసెందుకు? వెండి గ్లాసే సరి’’ అని. అలా మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ వగైరాలు అందరికీ ఆశయాలతోపాటు ఆశలు కూడా వుంటాయి. కాకపోతే రుూ సందర్భంలో అనవలసిన మాటలు- కమ్యూనిస్టు పార్టీ నాయకులు అనేశారు. సిపిఐ నాయకుడు డి.రాజా అన్నాడు- ఎన్నికలయినాకా సెక్యులర్ పార్టీలు, వామపక్షాలు తలలు ఏకం చేసి అపుడు ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించాలి అని. అయితే సిపిఐ(ఎమ్) నాయకుడు కూడా ఆ మాటలకే వంత పలుకుతూ రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కాగల సత్తా, సామర్థ్యాలున్నాయి అన్నాడు కానీ పేరు వద్దన్నాడు. ఇక్కడేమైంది? అసలు లక్ష్యం ‘మోదీని ఓడించడమా? లేక రాహుల్ గాంధీని అందలమెక్కించడమా?’ అంటే సహజంగా సోనియా గాంధీకి- ‘అవ్వ పేరే ముసలమ్మ’ అన్నట్లు-బిడ్డని ప్రధానమంత్రిగా చెయ్యాలనే వుంటుంది. ఐతే, ప్రజాస్వామ్య విలువలను అడ్డం పెట్టుకుని, అందరిచేతా ఔననిపించాలనుకోవడమే ఆమెకు అనుభవం నేర్పిన పాఠం.
తొందరపడి స్టాలిన్ అనడంలో కూడా అంతరార్థం ఉంది. మాయావతి, మమతా బెనర్జిల నాయకత్వం మాకు ‘సొక్కదు’ అన్న మనసులో మాట బయటపెట్టడం ఐనా కావచ్చును. ఏది ఏమైనా రాహుల్ గాంధీ మాటలలో - ‘‘తనకి తన పదవికన్నా ముందు మోదీజీ పదవి గల్లంతవ్వాలన్నదే పట్టుదల’’గా కనపడుతున్నది. మొదట భాజపాకి మోదీ ‘గొడుగు’ క్రింద అతని పేరే ప్రధానిగా పెట్టుకుని పోరాడటం తప్పదు. కానీ, ఫ్రంట్ విషయంలో ‘యూనిట్’ అన్నదొక్కటే గొడుగు- వ్యక్తి పేరుకు తావులేదు అన్నదో వాదన.
యూనిటీ ఇన్ డైవర్సిటీ రుూజ్ మస్ట్!
*

సెల్: 92900 99512