వీరాజీయం

‘ఆక్రమిత కశ్మీర్’ పాక్‌దా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వెర్రి కుదిరింది, తలకి రోకలి చుట్టమన్నా’ట్ట వెనుకటికి ఒకడు. అట్లాగా కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినాయకుడికి మరోసారి పైత్యం ప్రకోపించింది. గతంలో అందాల కశ్మీర్‌కి ఆర్భాటపు ముఖ్యమంత్రి అయిన జనాబ్ ఫారూక్ అబ్దుల్లాకి ఎనభై రెండేళ్లు పూర్తయ్యాయి. ‘ఏళ్ళు ఎగసన్నా, బుద్ధి దిగసన్నా’అన్నట్లు అర్జెంట్‌గా మొన్న ‘యూరీ’ సెక్టార్‌లో- తన పార్టీ మీటింగ్‌లో మరోసారి ఫారూక్ దేశ వ్యతిరేకంగా నోరు పారేసుకున్నాడు. ‘పాకిస్తాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగం మీద హక్కు ఆ దేశానిదే.. ఇండియా స్వాధీనంలో వున్న కశ్మీర్ ప్రాంతం మాత్రం మనకు చెందినది’ అని ఆయన అన్నాడు. ఇలాగే లోగడ కూడా ఫరూక్ వీరంగం వేశాడు. షేక్ అబ్దుల్లా అనే వీళ్ల నాయనను ‘కశ్మీర్ సింహం’ అనేవారు. జవహర్‌లాల్ నెహ్రూ అతని పేరు చెబితేనే ప్రసన్న వదనుడై మురిసిపోయే వాడంటారు. షేక్ అబ్దుల్లా పుత్రరత్నం అన్నమాట తప్ప మరో ‘కితాబు’, క్వాలిఫికేషనూ లేని ఫారూక్ భాయ్ 1980లో మొదటిసారి శ్రీనగర్ నుంచి ఎదురులేకుండా గెలిచాడు. తండ్రి మరణానంతరం 1982లో ముఖ్యమంత్రి అయినాడు. అప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీమీద, ఆ పార్టీ దేశభక్తిమీద- ఇండియాలో అనుయాయులున్నారు. పరిశీలకులూ, పొలిటికల్ పండిట్స్ కూడా నెహ్రూ దయచేతనే రుూ-‘వాచాల చక్రవర్తి’, ఓ కాలు లండన్‌లో, మరో కాలు కాశ్మీర్‌లో పెడుతూ మకుటం లేని మహారాజుగా చెలామణి అయిపోయాడు.
ఇతన్ని కేంద్రంలో మంత్రిగా కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏనాడో రాజకీయాల నుంచి విరమించుకుని, లండన్ థేమ్స్ నదీ ప్రాంతంలో హిందీ పాటలు పాడుకుంటూ కాలక్షేపం చేయవలసిన ఫారూక్ అప్పుడప్పుడు వార్తల్లో ‘పడ్డం’ కోసం చెలరేగిపోతాడు.
‘కశ్మీర్ ప్రజలపై ఇండియన్ గవర్నమెంటు ఎన్నాళ్లు ‘జులుం’ చేస్తుందేం?’ అంటూ తిరగబడి విరగబడుతూంటాడు. 1947లో మొట్టమొదట జరిగిన ఇండో పాక్ యుద్ధంలో-యుద్ధ విరమణ ఒప్పందం జరిగేసరికి- 13,297 చదరపు కిలోమీటర్ల భూభాగం పాకిస్తాన్, ‘కబ్జా’లో వుండిపోయింది. అందరికీ తెలుసు ఆ ‘్భ భాగం’ భారతదేశం లోనిదేనని. ఎందుకంటే అసలు కశ్మీర్ ఎవరిది? మొత్తం మనదే... మహారాజా హరిసింహ్ సంస్థానం అది. 1947, అక్టోబర్ 26న దానిని పక్కా దస్తావేజులతో సంతకం పెట్టి- ఇండియాలో విలీనం చేశాడు.
పాకిస్తాన్ యుద్ధ విరమణ సమయంలో తిష్టవేసుకుని వుండిపోయిన భూభాగానికి ‘అజాద్ కశ్మీర్’ అంటూ పేరెట్టి అనుభవిస్తున్నారు. డెబ్భై సంవత్సరాలైనా ఈ సమస్య పరిష్కారం కాలేదు కనుక వాళ్లచేతిలో వున్న భూభాగాన్ని- వాళ్లకి ధారాదత్తం చేయాలన్న ఆలోచన గల ఫారూఖ్ అబ్దుల్లాలాంటి ‘వక్రబుద్ధులు’, పొలిటికల్ లీడర్లుగా చెలామణి అవుతూ వుండటం వల్లనే కశ్మీర్ సమస్య ఒక ‘కొరకరాని కొయ్య’ అయిపోయింది. పాకిస్తాన్‌తో చర్చించాలంట. ‘నువ్వు ఆక్రమించుకున్న భూభాగాన్ని నీకు పువ్వుల్లోపెట్టి యిచ్చి మేం నెత్తిన కొంగేసుకుని పోతాం’ అన్న ప్రాతిపదిక మీద చర్చించాలని వాదించే దేశ వ్యతిరేక బుద్ధిజీవులున్నారు కశ్మీర్‌లో. వారికి నాయకత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా వహిస్తున్న ఫారూఖ్‌లు చాలామంది వున్నారు.
మన ప్రథమ ప్రధాని నెహ్రూ ‘కశ్మీర్ చిచ్చు’ని ఈ దేశానికి వదిలిపెట్టి మరీ తనువు చాలించాడు. ఈనాటి యువతరానికి తెలియదు కానీ, కశ్మీర్ సమస్య- ఆనాడు దేశంలో దాదాపు ఐదువందల యాభై సంస్థానాలతో పాటు ఎందుకు ‘సాల్వ్’ కాలేదు? ఎందుకు మన నెత్తిమీదా, గుండెల మీదా, ఆదాయం మీదా గుదిబండై- మనసులో మానని గాయమయింది? అబ్దుల్లాలు చాలామందే వున్నారు కనుక. పరిశీలకులు, చరిత్రకారులూ చాలామంది ఇదంతా నెహ్రూ నిర్వాకమేనంటారు. రష్యా వాళ్లు- ‘స్టాలిన్ చేసిన ఎనిమిది తప్పులు’ అంటూంటారు- కేవలం కొన్ని ‘బిల్డింగ్స్’ని చూపెట్టి. కానీ, యిక్కడ నిరంతర, నిర్విరామ ఉగ్రవాద బెడద నెత్తుటేరులకు దారితీస్తూన్నదే వున్నది. ‘కశ్మీర్’ నెహ్రూ తప్పిదాలలో ఒకటి అని అంటూ వుంటారు విజ్ఞులు.
భారత పార్లమెంటు- ‘కశ్మీర్’ భారత రిపబ్లిక్‌లో అంతర్భాగం అని తీర్మానించినప్పుడు కూడా మండిపడ్డాడు ఫారూఖ్. ‘కశ్మీర్ ఎవడబ్బ సొమ్ము?’ అ నడిగాడు. ‘కశ్మీరీల సొమ్ము-అని కశ్మీర్‌లో అందరూ, ‘కశ్మీర్ ఇండియాదే’అని ఆనాడే చెప్పాల్సిన భారత ప్రభుత్వం ఫారూఖ్ అబ్దుల్లాని దువ్వడం, బుజ్జగించడం చేస్తూ వచ్చింది. నాడే అన్ని సంస్థానాలతోపాటూ దీన్నీకూడా సర్దార్ పటేల్‌కి ఎందుకు అప్పగించలేదు? నెహ్రూకి యిష్టం లేదుట. ఆయన తన మంత్రివర్గంలో అనంతశయనం అయ్యంగార్‌ని పోర్ట్ఫోలియో లేని మంత్రిగా నియమించి, కశ్మీర్ వ్యవహారాలను ఆయనకి ‘విడిగా’ అప్పగించారట. ఎందుకనో..? అన్ని సంస్థానాలుండగా- చివరికి ‘ఇండియాలో కలవను, పాకిస్తాన్‌లోనే కలుస్తాను’’-అన్న నిజాం నవాబు సహా ఎందరో వుండగా అన్నిటినీ, పటేల్‌గారే పరిష్కరించారు. కశ్మీర్ సమస్యే అలాగే వుండిపోయింది. ఆ సమస్యల్ని యునైటెడ్ నేషన్స్‌కి ఎందుకు రిఫర్ చెయ్యలేదు? మహారాజా హరిసింగ్- ‘నేను భారత్‌లోనే ఒక ‘హిస్సా’గా కలిసిపోయాను’’-అన్నా కూడా ‘సమితి’కి ఈ విషయం ఎందుకు రిఫర్ చెయ్యాలి? వౌంట్ బాటెన్ ఎవరు? అని రుూ తరం కుర్రాళ్లు ప్రశ్నించి, వెనక్కివెళ్తే తప్ప యిది అర్థం కాదు.
కశ్మీర్‌కు నేడు శాపమైంది ఉగ్రవాదుల బెడద. ఇది ‘నెహ్రూ చేసిన నిర్వాకం’ అంటూ దులిపేసుకుంటే చాలదు. దాన్ని పరిష్కరించాలి. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రజల ‘మేండేట్’-దిట్టంగా దట్టంగా వున్న భాజపా గవర్నమెంటు జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఎంతవరకూ చెప్పుకోదగ్గ కృషిచేసింది? ఫారూఖ్ అబ్దుల్లా లాంటి ప్రమాదకరమైన శక్తుల్ని అణిచివేసిందా? అన్న ప్రశ్న కూడా- ఇవాళ్టి ‘తరం’ అడగాలి. చరిత్ర తెలియని పిల్లలు ‘కశ్మీర్‌ని ఇండియాయే ఆక్రమించుకున్నది’ అని నమ్మితే- అది వాళ్ల తప్పా? ఉగ్రవాదం కన్నా ‘డేంజర్’ ఈ దేశ వ్యతిరేక ‘వితండ వాదాలు’. ఇట్టి అంతర్గత శత్రువుల్ని ముందు ‘మట్టువెట్టాలి’.
టేక్ కేర్..! బీవేర్ ఆఫ్ ఫారూఖ్స్!!