వీరాజీయం

మీడియాకి మసాలా ఎక్కడిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దొంగాడా ? కరవకుమా?’ అన్న సామెత చందాన- కొంతమంది భాజపా ప్రబుద్ధులు వ్యాఖ్యానాలు చెయ్యడం ఇటీవల పరిపాటైందని మనం అనడం కాదు.. సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే అన్నాడు . అసలు ఆ సామెత ఏమిటో ముందు చూద్దాం. వెనుకటికి ఓ ఇంట్లో దొంగ పడ్డాడు.. ఇల్లాలు మొత్తం నగలన్నీ ధరించి పడుకొని ఉంది.. అరిస్తే దొంగాడు తన పీక నొ క్కు తాడెమో నన్న భయం తో -గప్చిప్ గా ఆమె ఉంది. వాడు నగలన్నీ వొలిచేసుకుని - చేతి మురుగుల దగ్గరికి వచ్చాడు.. అంతే.. ఆమె గట్టిగా అతని చెయ్యి దొరకపుచ్చుకుంది. ఉడుం పట్టు పట్టేసింది .. వాడు విడపించుకోడానికి గింజుకుంటున్నాడు.. ఆమె వదలలేదు.. చేతి మురుగులు వాడి చేత. వాడి చేయి ఆమె చేత ఉన్నాయి. అరిస్తే చంపెస్తాడని భయం .. కాని ఒక వేళ నా చెయ్యి కరుస్తాడెమో .. ? కరచి పారి పోతాడేమో? అన్న భయంతో -‘ఒరేయ్ దొంగాడా.. కరవకుమా..’ అని అరిచిందిట .. వాడు చటుక్కున చెయ్యి కరిచాడు. నగలతో ఉడాయించాడు .. అట్లాగా.. భాజపా మేధావులు కొందరు -మీడియాకి అవసరమయిన మాసాలా అందిస్తున్నారని -మోదీజికి అనిపించింది . అందుకే అన్నాడామాటే.
మోదీ తన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర సైనికగణాలు వగైరాలను ఇటీవల సమావేశపరచి.. ఒక స్ట్రాంగ్ డోసు ఇచ్చాడు . ‘మన వాళళు కొందరు - నోరా బుర్ర కి తే కే అన్నట్లు - పబ్లిక్ స్టేట్మెంట్లు చ్సేస్తున్నారు ... దీంతో మీడియాకి మసాలా అందిపోతోంది. దాంతో -విదేశాలలో ఎర్ర తివాచీలమీద నడుస్తున్న మోదీకి -అరికాలి క్రింద మంటలు తటస్థ పడుతున్నాయి.. ఒకడు స్టేజి ఎక్కుతాడు - జై శ్రీరాం అనడం.. ఇష్టం లేకపోతె -అటువంటి వాళళు అందరూ పాకిస్తానుకి వెళ్లి పో వాలి అంటాడు- హోలికి శివరాత్రికి మదరసాలు శలవు ఇవ్వాలి అని నొక్కి వక్కా నిస్తాడు మరొకడు . అయోధ్యలో ఉన్నది రామ్‌లల్లా కోవెల. అక్కడ కోదండరాముడు కి మేఘాలను తాకేలా అతి పెద్ద విగ్రహం స్థాపిస్తాను అన్నాడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇటువంటి ప్రతిపాదనలు అయోధ్య సమస్యకి ఎంత దోహదం చేస్తాయా ? రేపిస్టులను వదిలేదు లేదు .. అంటూ పబ్లిక్ స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా అంతే.
మగాడు.. మృగాడు- అంటూ స్ర్తీ జన సంఘాలు అరచి - తిట్టి అంతటితో తమ భాద్యత తీరిపోయిది అనుకోడం -కూడా బాధ్యతారాహిత్యమే. ఉన్మాదమిది .. రుగ్మత ఇది. ఇదే మాట మోదీ గారు ఎట్టకేలకు మేలుకొని.. హెచ్చరించడం కూడా సభ్య సమాజం- గుర్తు పెట్టుకోవాలి. మన దేశంలో డిసెంబరు ఇరవై మూడు నాటి భయానక సామూహిక అత్యాచారం పట్ల దేశం, ప్రపంచం అట్టు ఉడికి పోయాయి . నిర్భయ చట్టం వచ్చింది.. దానితో మానభంగం అన్న మాటకి- అర్థం మారింది. తాకినా, తడిమినా - మహిళను ఏ విధంగా ఇల్‌ట్రీట్ట్ చేసిన - నిర్భయ కేసు పెట్టడానికి -అవకాశం వచ్చింది. కాని దేశంలో అత్యాచరాలు తగ్గాయా? దేశంలో ప్రతి ఇరవై ఎనిమిమిది గంటలకి ఒక మానభంగం అదీ సామూహిక ఘోరం జరిగి పోతున్నది అని -గణాంకాలు చెబుతున్నాయి.. ఉన్నావో, కథువా కేసులు దేశ దృష్టిని ఈ అకృత్యా కరాళ నృత్య కారణాలను అనే్వషించే దిశలో మన ఆలోచనని మరల్చగలిగింది. 2015 లో వెలువడ్డ గణాంకాలు చూడండి ఒకసారి. 2015లో స్ర్తీలపై జరిగిన నేరాలమీద మూడు లక్షల పైగా కేసులు నమోదయ్యాయి అందులో ముప్ఫై తొమ్మిది శాతం కేసులు మానభంగాలవే. దౌర్భాగ్య దేశంలో నలభై వేల అత్యాచార కేసులు విచారించి -కేవలం నల్గురిలో ఒకరికి శిక్ష విధించాగలిగాయి.. కోర్టులకు చెవులే వుంటాయి.. సాక్షాలు ముఖ్యం. అత్యాచారం చేసి సాక్ష్యం వదలి నేరస్తుడు పారిపోతాడా?!
అభం శుభం ఎరుగని పసికూనల మీద జరిగే అమానుష దారుణ హత్యకాండ ని కామోద్రేక గుడ్డి మానభంగ చేష్టని ఒక సెక్షన్ క్రింద పరిగణించలేము. ఇది ఒక మానసిక రుగ్మత. మందు మార్గం రెండూ లేకుండా - వ్యాప్తి చెందుతున్న ’ పెర్‌వర్షన్’ . ఇక్కడ ఒక్కోసారి నేరస్తుడు కూడా మైనర్ అవుతున్నాడు. వీటి అధ్యయనం విడి విడిగా జరగాలి . అందుకనే నాలుగింట ఒక్క కేసులోనే కోర్టులు శిక్ష వేయగాలిగాయి. దేశంలో బండ మెజారిటీతో గెలిచిన భాజపా సంఘ్ పరివార్‌ల మధ్య సదవగాహన - సహకారం చాలా అవసరం.
ఇది కేవలం మోదీ, రాహుల్ గాంధీ ఫాన్స్‌ల మధ్య ఎదో సినిమా అభి మానుల మధ్య పోరాటం లాగా సాగవలసిన దుస్థితి కాకూదు.. మోదీ, రాహుల్ కూడా దేశకాలమాన పరిస్థితులకు అతీతులు కాదు. ఈ రెండు పొలిటికల్ పార్టీలను కకక్షి దారులనుచేసి ,ఎవరో ఒకరి పక్షాన వకాల్తా తీసుకుని వాదించే కేసు కాదు ఇది.. ఒక వ్యాధికి ఒక రుగ్మతకి ఒక పెర్వెర్షన్‌కి ఇది పరిమితం . ఈ మధ్య కొత్త అభిమాన వాదాలు బయలుదేరాయ్ డెభ్భై ఎండ్లు -వికాసం లేదు .. నిరాధారం గా వున్న మనకి ఆధర్ కార్డు ప్రసాదించిన మోడీ దీని పల్లెత్తు మాట అనకూడదు- అంటూ ప్రతి చోటా ప్రతీ నోటా ఈ పాట ఇలాగె పాడుకుంటాను అనే దురభిమానం ఎక్కువ అయింది. ముందు- సీజర్ భార్య తప్పు చేయదు అన్న ధోరణిపోవాలి. ఈ దేశకాలమాన పరిస్థితులు -లొంగి వుండవు- సంగతి సందర్భం వీటిని చూసి - పబ్లిక్ గా నిలబడ్డ నాయకుడు సాక్షాతూ దిగి వచ్చిన దేవుడే అయినా ‘నిలదీస్తాం’ అనాలి. అలా చెయ్యక పొతే ఇది ప్రజాస్వామ్యం కాదు.. ఈ సందర్భంలో ఒక పెద్దాయన మార్నింగు వాక్‌లో ఫ్రెండ్స్‌ని కూర్చోబెట్టి మరీ అన్నాడు... ‘సంఘ పరివార్ పార్టనర్స్ ని మెచ్చుకోవాలి. మోదీజీని నిలబెట్టి విమర్శిస్తున్నది ఎవ్వరు? మీరూ నేనూనా? వాళ్లే .. డిమోనాటై జేషన్ , డిజిట లై జేషన్ మాత్రమే తారక మంత్రాలు- కాంగ్రెస్సుని నిర్మూలించడమే -సర్వ సమస్యలకి -పరిష్కారంగా అన్నా కూడా -హొయ్ హొయ్ నాయక హే హే నాయకా అంటూ భజనచేస్తున్న సామాన్య జనాల సంఖ్య ఎక్కువగానే వున్నది..
శివసేన పార్టీ పత్రిక సామ్నా నిత్యదినచర్యగా మోదీని ఏకి ఏకి వదిలిపెడుతున్నది. మీడియా కి మసాలా అందిద్తున్నది మోదీజీ యే - అని ఆ పత్రిక -శషబిష లు లేకుండా రాసింది- మసాలా ఇస్తున్నది మోదీజీ అయితే దానికి మిర్చీ పాపడ్, సాస్ లు అందిస్తున్నది రాహుల్గాంధీ అని .. ఉద్ధవ్ తాకరే -విమర్శలకి మనమా కారణం? అన్నదో వీరాభిమాని.. ఔను ఔను .. సీనియ ర్ నాయకుడు -యశ్వంత్ సింహాని -మనమే ఎక్కేస్తున్నమా? సాంఘిక సమస్యలన్నీ ప్రక్కన బెట్టి -ఆధార్ కార్డు -మరుగు దొడ్ల మధ్య నే అభ్యున్నతి వున్నది ఇంకెవరికి వికాస్ గురించి -మాట్లాడే హక్కు లేదు అన్నట్లు -్భజపా ప్రవర్తిస్తున్నది- అని గోనుగు తున్నది మనమేనా? మోదీ ధోరణిని వెనకేసుకొస్తున్న వీరాభిమానులు- కొందరు- ఈ మానభంగాలు వగైరా ‘‘ఫేక్’’ అనే స్థాయలో ఉన్నాయని అంటున్నారు - ఆశ్చర్యమే- అందుకేగా రెండు మాసాల కాలం లో దర్యాప్తు పూర్తి కావలి అంటూ అత్యవసర ఉత్తరువు షరతు పెట్తింది.
70 సంవత్సరాలుగా వికాసం లేదు అని భాజపా నాయకుడు ఒకరు గంభీరంగా అరుస్తో వుంటే - ఒక యువకుడు అన్నాడు - కరక్షన్ ప్లీజ్ - 73 సంవత్సరులుగా నో వికాస్ -అనాలి బాబాయ్ అంటూ అరిచాడు. మాట మాటకీ - గన్ ఎత్తి నిందలు, నిష్టూరాలు విమర్శలు అన్నీ ఒకే లెవెల్ లో సంధిస్తున్న శత్రుఘ్న సింహా ని మనమే రోజూ ప్రోవోక్ చేస్తున్న్నమ్మా? సర్?.. అని అడిగాడు ఏటి ఎం నుంచి ఏటిఎం కి చక్కర్లు కొడుతున్న మాజీ బ్యాంకు ఆఫీసరు దీనంగా . డెబ్భై ఏండ్లు తిప్పలు పడ్డారు గనుక ఇప్పుడూ అల్లాగే ఏడవండి అంటున్నారు అని ఓ కాలేజీ అధ్యాపిక మెటికలు విరిచింది. .. ఇటువంటి విపత్కర పరిస్తితిలో రేప్ లాంటి డెలికేట్సమస్య ని రాజకీయం చెయ్యడం రాహుల్‌కైనా తప్పే మోదేకైనా ఒప్పు కాదు అన్నాడు సానుభూతి పరుడొకడు. ఔనా.. సర్వేలు అధ్యయనాలు చేస్తున్న వాళ్ళంతా.
ఇంత పెద్ద దేశం కదా - ఎక్కోడో అక్కడ ఒకటో, ఆరో మానభంగం కేసులు సంభవిస్తే.. గోరింతలు కొండంతలు -చెయ్యడమా ? దేశభక్తి లేని వాళళు మీరంతా అంటాడు. ఇంకో ఉత్సవ విగ్రహం.. ఇలా నోటికి ఏది వస్తే ఆ మాట సమయం సందర్భం లేకుండా వాగే ఊత్సహ పరులు నోరు అదుపు లో పెట్టుకోవాలి.. అని మోదీ హెచ్చరిస్తున్నాడు. ఉత్తరాదిన హాస్య కవి సమ్మేళనాలు చూడండి .... మోదీయే ముడి సరుకు- జనం సంగతీ సందర్భం లేకుండా - భాజపాని - వెనకేసుకొస్తే ఇదే జరుగుతుంది. అందరికి ‘యోగి’ వేషమే గతి- అన్నాడో కవి పుంగవుడు. మొన్నటి విదేశీ పర్యటనలో ప్రధాని సారు -తన కీర్తి గ్రాఫు కాస్త తగ్గు తున్నట్లు గమనించాడు.. పారీలో దండ నాయకులు ఎక్కువ అయిపోయారు. అదీ అతనికి సరిపడలేదు.. ఇప్పుడు యుద్ధం వెబ్ సైట్‌ల మీద, కుళళు మీదా సాగాలి .. జనాల్ని మానసిక రోగులుగా మార్చేసే ఈ వెబ్ సైట్ లను పాతి పెట్టడం - రుగ్మతకి ఒక చికిత్స కాగలదు- ఆర్డినెన్సుని క్రిమినల్ రింగుల మధ్యకి తీసుకుపోయి భయపెట్టండి, బెదిరించండి !
యూ హాడ్ బెటర్ స్టాప్ ది నానె్సన్స్ ’ వైరల్ యూ ట్యూబ్ స్ట్ఫ్’

సెల్: 92900 99512