వీరాజీయం

ఏది స్టంటు? ఏది ‘ఫ్రంటు’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గో రఖ్‌పూర్, ఫూల్పుర్ ఉపఎన్నికల ఫలితాలు ఎట్లా వున్నాయి భారుూ? అంటే- ‘కళ్లు మూసి జెల్లకొట్టినట్లు’ వున్నాయ్ అన్నాడో సామాన్యుడు. ‘ముప్ఫై ఏండ్లుగా ముట్టుకుంటే షాక్ కొడుతుంది ప్రత్యర్థులకి? అనుకున్న యోగీజీ కంచుకోట-గాలికోట అయిపోయింది- అదిత్యనాథ్ ఆశ్రమం వేపు అలా వెళ్ళిన జర్నలిస్టులకి అంతా శూన్యంగా కనబడ్డది. 1975 నాటి మనోజ్‌కుమార్ హేమమాలిని సినిమా ‘సన్యాసి’లోని ‘‘చల్.. సన్నాసీ!..మందిర్‌మే..’ అన్నట్టుగ వినిపిస్తోంది. త్రిపుర నుంచి ఎర్రరంగును తరిమేశాం.. అని సంబరాలు చేసుకుంటున్న భాజపాకి సముద్రం లేనిచోట సునామి లేచినట్లయ్యింది. సమాజ్‌వాదీ, బహుజన సమాజ్ పార్టీలు చేతులు కలిపాయి. ఎన్‌కౌంటర్ ముఖ్యమంత్రిగా వాసికెక్కిన - ఆదిత్యనాథ్‌ని ‘ఇదేమిటి? ననే్న ఎన్‌కౌంటర్ చేసేశార’న్నట్లు ‘మా అభ్యర్థిని ఓడించేసారు?’ అని ఉలిక్కిపడేలా చేశాయి ఫలితాలు.
మోదీ-యోగీల కాంబినేషన్ ఇట్లా నీరుగారిపోడంతో ఎంతటి వెలితి కలిగిస్తుందో? ఆశ్రమ ప్రాంతం చూస్తే తెలిసింది. దూరంగా వున్న సంఘ్ పరివార్ మొత్తాన్ని ఈ సంఘటన వీపుమీద చల్లున చరిచింది. గూండాలు రౌడీలు- ఆటంకవాదులు వగైరా యాన్టీ సోషల్ ముఠాలు- వీళ్ళంతా లొంగిపోయి- కూరగాయల జంగిడీలు పెట్టుకున్నారని పనె్నండు వందల ఎన్కౌంటర్లలో వీళ్ళని లొంగదీసి నలభై మంది దుండగుల్ని సఫా చేసేశామని యోగీ హెచ్చరించారు చాలాసార్లు. అంటే ఇప్పుడు సపా, బసపాలకు కిరాయి ముష్కరుల సాయం లేదన్న మాట పాపం! అన్నాడో పెద్దయన. ఈ ఫలితాలు వస్తూ ఉండగానే అఖిలేష్- మాయాజీ ఇంటికి పరుగులు తీశాడు. రేపటి పొత్తుకు ఇది సంకేతమా? దీని మీదట వ్యాఖ్యానిస్తూ యోగి ‘ఇంత అనైతికమయిన కలయిక మరీ అన్యాయం- ఆ ఇద్దరిదీ పాము, ముంగిస టైపు వైరం- ఇక్కడ చేతులు కలిపారు’’అంటూ ఎద్దేవా కూడా చేశాడు. కాని ఈ ఓటమి అనే గరళాన్ని సన్యాసి గనుక ఆయన తట్టుకోగలిగాడు కాని.. మామూలు రాజకీయవేత్తలకి ఇది నషాళానికి అంటి వుండేది. ‘వచ్చే ఎన్నికలలో మేము 80 ఎంపీ సీట్లు గెలిచి చూపిస్తాం అన్నప్పటికీ, మోదీజీకి ఏమి చెప్పాలి?’ అన్న బెంగ ఒకటి వున్నది యోగీజీకి. అది సరే- ‘ఇంతవరకు లేని ఒక కూటమి భయం’ రానున్న ఎన్నికల విషయంలో ఇప్పుడే గుబులు పుట్టించడం సహజం. ఎన్‌డీఏ కూటమిలో ఒక భూకంపమే పుట్టింది.. పెద్ద భాగస్వామ్యంగల పార్టీలు తెలుగుదేశం వంటివి విడిపోతే?. ఈపాటికే సంఘ్ పరివార్‌లో వుండీ శివసేన వారు తమ పత్రిక ‘సామ్నా’లో మోదీజీని ఉతికి ఆరేస్తున్నారు.
కాంగ్రెస్ రహిత దేశం కావాలి అన్న నినాదం కాస్తా అరిగిపోయింది. కాంగ్రెస్, భాజపా రెండూ లేని ఫ్రంటు కావాలి అన్న కొత్త కేకగా ఓ ప్రతిపాదన అంతటా ప్రతిధ్వనిస్తోంది. యుపిలో యోగీజి ప్రథమ వార్షికోత్సవాన్ని నిరుత్సాహ భరిత వాతావరణంలో జరిగింది. భాజపా అధ్యక్షుడు మాత్రం బుకాయింపు స్వరంతో పదకొండు రాష్ట్రాలు పోయాయి అన్నట్టు ఏదో పదకొండు స్థానాలు గెలిచేసరికే ఘన విజయం మీదే అన్నట్లు గెంతులేస్తున్నారేమిటి? అంటూ వ్యాఖ్యానించినప్పటికీ, కొత్త కూటమి అన్న మాట అతనికి పంటి కింద రాయిలాగా తగులుతోంది. 1967 దాకా దక్షిణాదిన డిఎంకే తలెత్తే దాకా ఫ్రంట్‌లు, పొత్తులు లేవు. జాతీయ పార్టీలు మాత్రమే ఎన్నికల బరిలోకి దిగేవి. రానుర్రాను చక్రం తిప్పినా, వ్యూహం పన్నినా రాష్టస్థ్రాయి కొత్త పార్టీలకే అది సాధ్యం అన్నట్లుగా తయారైంది. కాంగ్రెస్ నుంచి పాయలుగా విడిపోయిన చిన్న పార్టీలు గాక- ప్రాంతీయ సెంటిమెంటుమీద పుట్టిన పార్టీలు బుస్సున పడగలు విప్పేయి. అవి అవడానికి ‘తోక’లే అయినా, తల ఆడించే స్థాయికి కొసరు పార్టీలు వచ్చాయి. కొసరు పార్టీలు బ్యాలెన్సింగులో అతి కీలకమైపోయాయి.
యుపిలో సమాజ్‌వాదీ, మహారాష్టల్రో శివసేన, ఏపీలో తెలుగు దేశం గర్జిస్తూ గాండ్రిస్తూ లేచాయి. బీహార్లో ఆర్జెడి, జేడియులు పుడుతూనే నడవడం మొదలుపెట్టేయి. ‘బడేమియా’- చోటేమియాల్ని- ఇవి చేతులు కావు కాళ్ళు అంటూ బ్రతిమాలుకోవలసి వచ్చింది. కేరళ, పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ రైట్‌లదే మార్చింగు. ద్రావిడ పార్టీలు ఉత్తరాది పార్టీలకి సూదిమొన మోపడానికి కూడా చోటు ఇవ్వలేదు. పాతకథ చూస్తే, అసలు ఈ థర్డ్ ఫ్రంట్ ఐడియా లెఫ్ట్ పార్టీల నుంచే వచ్చింది. ప్రకాష్ కారత్ (సిపిఎం) ఈమాటను తయారు చేశాడు. చోటా పార్టీల్లోని బడా నాయకుల్ని కలసి ఒప్పించాడు. ములాయం సింగ్ , నితీష్‌కుమార్లు రెడీ అన్నారు. జయలలిత వీళ్ళకి పెద్ద ‘అసెట్’.. అని, ఆమె వీళ్లకి చక్మా ఇచ్చింది. అది వేరే సంగతి కాని ఈ ఆరు రాష్ట్రాల బలం చూస్తే మొత్తం 269 అయ్యింది. ఒకవేళ పెద్ద పార్టీలు బోల్తాకొడితే గ్యాప్‌లో దూరి గద్దెని దక్కించుకోవాలన్నది వీళ్ల ఆశ (య)మ్.. కొత్తగా పుట్టిన ‘ఆప్’ లాంటి బుల్లిపార్టీ ధిల్లీ పీఠం ఎక్కింది.
ఇవాళ కూటమి అనగానే- ఆ వాళ్ళ బొంద ఏం చేస్తారులే- అనగల దమ్ములు ఎవరికీ లేవు- జైల్లోవున్నా బెయిల్లోవున్నా ఎన్నికలలో జయభేరి మ్రోగించే చాన్సులు పుష్కలం. వాళ్లమీద కేసులు మోపుచేసినా వాళ్ళ వోటు బ్యాంకులు చెక్కుచెదరటం లేదు. ఇక, కేసిఆర్ పరుగులు మనం చూడాలి. చంద్రబాబు అనుయాయులు ఇది చూసి తస్మాత్ జాగ్రత్తలు చెప్పుకోవాలి- అమిత్‌షాలు, యోగి ఆదిత్యనాథ్‌లు తమతమ భుజకీర్తులు చూసుకుని మిడిసి పడటానికి స్కోపు లేదు. యోగి స్పీడు తగ్గించాలని అమిత్‌షా అడిగినా ఆశ్చర్యపోనక్కరలేదు.. ఇక, పార్లమెంటులో డ్రామాలు, వెలుపల వేషాల ఎంటర్‌టైన్‌మెంట్ షోలు అంటూ పేర్గాంచిన స్థితిలో అవిశ్వాస తీర్మానంతో ఏదో ఒక సాకున ప్రభుత్వాన్ని నోరు కడుగుకొని తిట్టడానికే తప్ప- ఇంక దేనికీ పనికిరాదు- అంకెలు చూసుకుంటే ప్రత్యర్థులు అంతా కలిసినా 150 సీట్లు దాటని స్థితి.కాని, మేజర్ పార్టీల నాయకుల మైత్రి, సలహా, పొగడ్త లాంటివి ఎక్కువ అయిపోతే. యుపి, బీహార్, పశ్చిమబెంగాల్‌లో పార్లమెంటు సీట్లకి గండి తప్పదు. అదే భయం, మోదీ అండ్ భాజపాకు నిద్రపట్టకుండా చేయగలదు. అయినా అమిత్‌షా- చంద్రబాబు మీద- వార్ డిక్లేర్ చేసినట్లే- బయటకి కనపడుతున్న సంగతులు చెపుతున్నాయి.
ఏకంగా జెనరల్ సెక్రేటరీ రామ్నారాయణ్‌జిని సైన్యాధిపతిగా ఆంధ్ర మీదికి పోయి- చంద్రబాబు మొదలు మిగతావారి అందరి గుట్టు కూపీ లాగి జనాలకి వెల్లడి చెయ్యాలని ఆదేశించేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘మాకు తెలుగుదేశం ధర్మమా అని 48వేల మంది ‘బూతు’ కార్యకర్తలు (హిందీలో బూతు అన్న మాట అశ్లీలం కాదు) వున్నారని అమిత్‌జీ గొప్పగా వ్యాఖ్యానించడం నేరుగా ఎన్నికల పోరులో కలుద్దామన్న సవాలుగానే టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.
ఇక, మోదీజీని నువ్వేమిచేస్తే అదే ఘన కార్యం అంటూ- నోట్ల రద్దు మొదలు- డిజిటలైజేషన్ దాకా అన్నిటికీ జైకొట్టి- ‘పల్లకీ పట్టిన’ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు- విడివిడిగా మోదీతో జట్టు విప్పేసుకున్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశబెట్టే చిత్రమయిన తీరు రభసగా మారుతూ వుండగానే తెలంగాణ సీఎం కెసిఆర్ మమతాబెనర్జీని సంప్రదించడానికి కలకత్తాకి ఎగిరిపోయి వ్రాలాడు. అవిశ్వాస తీర్మానానికి కేవలం మోదీమీద కోపంతో మద్దతు ఇస్తామని అంటున్నారే- హోదా కేవలం తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ప్రతిష్ట సమస్యయే అయినా అన్ని పార్టీలు ‘్భల్లే’ అంటూ తీర్మానం ప్రవేశపెట్టబడితే వెంటనే బాబుకి జైకొట్టారు. అదే మోదీజిని వారికి ఇష్టంలేని ఆయన చర్యలని ఎండగట్టాలి అనుకుంటూనే సైసై అన్నారు వాళ్ళు. ఒకరు ఎన్‌డియే ఫ్రంటు లోనుంచి బయటికి వచ్చేస్తే- మరొకరు ఏకంగా భాజపాకి ప్రతిగా కూటమి కట్టి చక్రం తిప్పుతాం అంటూ రెక్కలు గట్టుకుని ఢిల్లీలో వ్రాలడం- రెండు తెలుగు రాష్ట్రాల నాయకులూ కనీసం ఈ విషయంలోనయినా తలలు ఏకం చెయ్యకపోవడం తెలుగులో ‘కర్మం’ అంటారే అదీ... అన్నాడో ఉమ్మడి రాజధాని పౌరుడు.
అమరావతిని అరచేతిలో చూపిస్తూ- అతి పెద్ద బుద్ధవిగ్రహాన్ని అదేదో ప్రపంచ వింత అన్నట్లు జనాల్ని మెస్మరైజ్ చేద్దాం అనుకుంటే- సాగే రోజులా ఇవి? నిరాశకు గురైన ఆంధ్రా జీవులు ప్రత్యామ్నాయం కోసం చూసే తరుణం ఇంకోటి వుండదు అన్నాడు బెజవాడ పౌరుడు విలంబక సంవత్సరానికి స్వాగతం చెబుతూ. తానూ చెయ్యలేని పనులను హోదా పేరుమీదకి భాజపా మీదకి నెట్టేస్తున్నాడు చంద్రబాబు అన్నాడు ఒక కమ్యూనిస్టు. కాంగ్రెస్ వారు హోదా రెడీగా పట్టుకొని నిలబడ్డారు చూడు అన్నాడు ఒక మాజీ కార్యకర్త. ‘ఆం ఫట్’ అంటే తెల్లారేపాటికి లేచేది కాదు ఫ్రంట్- పైగా నీ హోదాకోసం వాళ్ళంతా గచ్చపిక్కలు తీసే పిల్లులవుతారా? బాబూ గారూ.. చక్రం ఒకటి కాదు రెండు తిప్పాలి మీ సైకిలుకి. తిప్పవలసిన టిడిపి బాస్ బాబుగారే - జగన్‌మోహన్ రెడ్డిని, గతంలో చిరంజీవిని ఎదుర్కొన్నట్లు ఇప్పుడు తమ్ముడు పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్‌‘గాలిని’ ఎదుర్కోవాల్సి వుంటుంది తెల్గుదేశం.
యాజ్ ఇటీజ్ లుక్స్ ఎ రియల్ అప్‌హిల్ టాస్క్!

-వీరాజీ