వీరాజీయం

కుంభ‘కోణాలు’.. తేలిపోయిన ‘తరంగాలు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజం మిధ్య.. పలాయనం మిధ్య అన్నట్లుగా వుంది పటియాలా హవుస్ స్పెషల్ కోర్టు తీర్పు - 2011 మార్చిలో ఏర్పాటు చేయబడ్డ స్పెషల్ కోర్టు సుమారు ఏడు సంవత్సరాల విచారణ తరువాత - ప్రధాన నిందితుడు టెలికం శాఖ మాజీమంత్రి రాజా ఏ పాపము ఎరుగడు నిర్దోషి అని, అందుచేత కరుణానిధి తనయ కనిమోళి అమ్మళ్ - నిర్దోషి అని - మిగతా పదిహేడు మంది ముద్దాయిలు - ముద్దుకేమో? గాని శిక్షకు అర్హులు కారని - 1552 పేజీల తీర్పులో - శషబిషలు హంసపాదులు లేకుండా - తేల్చి చెప్పేసింది. కేసుపెట్టిన సీబిఐకి ఈడీకి కూడా అక్షింతలు దండిగా వేసింది. న్యాయమూర్తి పిసి సయినీగారు ఈ కేసును ఏడు ఏండ్లపాటు విచారించినంతకాలం - ‘నేను నిత్యమూ ఒక్క ‘‘గుజ్జు’’ గల సాక్ష్యం ఏదైనా వస్తుందేమోనని పొద్దుటే పది గంటలకు దుకాణం తెరుచుకుని కూర్చొని - నిరాశ చెందు తూ వచ్చాను - కేవలం వదంతులు ఊహాగానాలతో తయారైన ఉదంతమే ఇది అన్నారు. - ఇటు దగా కేసు అటు కుట్ర కేసు రెండు కూడా నిరర్ధకాలు అంటూ మన్మోహన సింగు గారికి సమాచారం ఇవ్వకుండా తొక్కిపట్టినది మంత్రి రాజా కాదని - అసలీ గందరగోళానికి - టెలికాం కార్యదర్శి డిఎస్ మాధుర్ గారే కారణం అని వ్యాఖ్యానించింది స్పెషల్ కోర్టు. ‘ట్రాయ్’ ఉత్తరాలను పట్టించుకోలేదు ఆ కార్యదర్శిగారు - అన్నిటినీ త్రొక్కిపట్టాడాయన - ఒకవేళ మంత్రిగారు నిర్ణయాలు తీసుకోవడంలో తప్పుదోవపట్టినా ఆ విషయాన్ని మంత్రివర్గం చెవిన కార్యదర్శి వెయ్యాలి - అన్నది కోర్టు. ‘కాగ్ బాస్’ వినోదరాయ్‌గారు - అందరిమీద అక్షింతలు వేయగల అధికారం వున్నవాడు - స్పెషల్ కోర్టుకి దొరికిపోయాడు. న్యాయమూర్తి సయినీగారు కాగ్ బాస్ మీదే అక్షింతలు వేశారు - మొత్తం మూడు కేసులు కలిపి 2183 పేజీల సుదీర్ఘమయిన తీర్పును చెప్పిన న్యాయమూర్తి సయనీ రాజాని తన కేసు తనే వాదించుకుని క్రాస్ ఎగ్జామినేషన్స్ కోసం బోనులో నిలబడి అనేక వివరాలు అందించినందుకు మెచ్చుకున్నాడు కూడాను - రాజా, కనిమొళి ఇద్దరు అనుయాయులతో పండగ చేసుకుంటూ వుంటే - షాక్ నుంచి సులువుగానే తేరుకున్న సుబ్రహ్మణ్య స్వామీజీ - హైకోర్టుకి ‘అప్పీల్ చేయాల్సిందే - ఇది చాలా చెడ్డ తీర్పు’ అంటూ నిప్పులు చెరిగాడు. సీబీఐతోపాటు అసలు ఈ కేసు మొదటి పిటిషన్‌దారు సుబ్రహ్మణ్యస్వామిగారే. తరువాత గవర్నమెంటు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చింది.
టెలికాం - టుజి కుంభకోణం కేసుగా ప్రపంచంలో వాటర్‌గేటు తరువాత అంత పెద్ద కేసుగా చర్చించబడ్డ ‘స్కాం’ లోని మూడు కేసులు ఈ తీర్పుతో ‘ఆర్కోణం వెళ్లిపొయ్యాయని వేళాకోళం చేస్తూ చెలరేగి పోయారు డీఎంకే శ్రేణులు - దీనికి కొంచెంసేపు క్రితమే - ట్వీట్స్ ముఖ్యంగా కార్పొరేటు చానెల్స్ నుంచి వచ్చాయి. కొన్ని కోట్లు ప్రజాధనం స్వాహా చేసిన స్పెక్ట్రమ్ కేసు తీర్పు వెలువడుతున్నదహో అంటూ దంచేసాయి. పాపం! భజన చానెల్స్ మూడ్ మార్చుకోవడానికి - కూడా టైం పట్టింది. స్పెక్ట్రమ్ కేసులో ఏడు రంగులుంటాయని వాళ్లు అనుకుంటే అది కాస్తా తుస్సుమంది. మాజీ పీఎం శ్రీ మన్మోహన్ సింగు మాత్రం రాజా తరువాత కనిమోళి అమ్మళ్ పడినంత ఆనందపడి ఉంటాడు. పాపం! - ఈ కేసులో ఉన్నవాళ్లంతా పాపాల భైరవులు, బ్రహ్మాండమైన శిక్షలు ఖాయం అనుకున్న వాళ్లు డీలా పడిపోయారు - ఆ రెండువేల పుటల తీర్పుని చదవడానికి ఉత్సాహం ఇప్పుడు ఎవరూ చూపెట్టలేదు. కానీ, తమిళనాట డీఎంకే, కాంగ్రెస్సు వర్గాలలో - ఉత్సాహం రోడ్ల మీదకి ఉరకలు వేసింది. ఈ స్కాముని పట్టుకునే ఎన్‌డిఎ - మొత్తం యూపీఏని ఎన్నికలలో పచ్చడి చేసింది - కాని, అసలు స్కామే లేదు - టెలికం మాజీమంత్రి రాజా చేసినందంతా ప్రభుత్వ ప్రయోజనం కోరుకునే చేశాడు అని కోర్టువారు - ఏడు ఏండ్ల విచారణ తరువాత కితాబు ఇస్తూ వుంటే - మనీలాండరింగు - ముడుపులు మ్రింగడాలు ఎక్కడయ్యా? ఆ ప్రశ్న లేదుకదా? అంటున్నారు తంబి స్టాలిన్ మొదలు సామాన్య కార్యకర్తదాకా చెన్నై నగరంలో. లోగడ - బోఫోర్స్ కేసు లాగే ఈ ఆరోపిత కుంభకోణం కూడా - ఎన్నికల మీద బ్రహ్మాండమయిన ప్రభావం చూపించింది అని సామాన్యుడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. - ‘గలీ గలీ షోర్ హై - రాజీవ్‌గాంధీ చోర్ హై’ అంటూ ప్రచార రథాల మీద సాగిన ఎన్నికల బాకాలు జనాలకి కొంతమందికయినా - గుర్తుకొస్తున్నాయి - చివరికి నిందితులు నిందలు కూడా కాలగర్భంలో కలసిపోయాయి - అలాగ ఇప్పుడు, ఏందయ్యా? టూజీయా? త్రీజీయా అంటూ లోకోక్తిగా - అవినీతికి పర్యాయపదంగా - జనాల మధ్య నానిన వ్యవహారం - ఓ పెద్దమనిషి అన్నట్లు -టు జి లేదు త్రి జీ లేదు.. ఉన్నది పైనగల ‘శివ్ జీ’ కృపయే అన్నట్లు అయిపోయింది - అంటున్నారు. టెలికాం మంత్రిని - ఆ దిన అబ్బాయ్! నువ్వు - వేలంపాట పెట్టి ‘లయ్యంసులు’ ఇవ్వాల్సిన వాటిని - ఎవరు ముందొస్తే వాళ్లకే అంటూ సంప్రదాయానికి భిన్నంగా ఇచ్చేసావు.. ఆగక్కడ? అని ప్రధాని మందలిస్తే - కథ ఆనాడే కంచికి వెళ్లేది - కానీ వౌనమునిగా వాసికెక్కిన సింగ్జీ - పరోక్షంగా - టూజీ కి ఫ్లడ్ గేట్లు తెరిచాడు - జడ్జ్‌మెంట అన్యాపదేశంగా చెప్పినది అది. ఇదంతా - కాగ్ - బాస్ వినోద్‌రాయ్ - నివేదిక నుంచి పుట్టినది - ఇవ్వాళ వినోదరాయ్ పద్మభూషణుడై వెలుగొందడానికి దోహదం ఇచ్చిందే తప్ప - ప్రభుత్వ ఖజానాకి సంభవించిన... వామ్మో ! - ఒక లక్షా డెబ్బయ్ ఆరు కోట్ల రూప్యముల నష్టం ఒక్క పైసా కూడా తిరిగి రాకుండా కరి మ్రింగిన వెలగపండు అయింది. - పైగా, ఈ కేసువల్ల గవర్నమెంటు ఖజానాకి ఎంత పైకం ఖర్చు అయ్యిందో ఆడిటింగులో కాని తేలదు. న్యాయమూర్తి - నేరుగానే ఈ కేసును తయారు చేసిన అందరిమీద అక్షింతలు వేశారు. ఎంఫోర్స్మెంటు డైరక్ట్‌రేట్ మొత్తం పందొమ్మిది మంది మీద కేసులెడితే - అన్నీ తేలిపోయాయి - ఈ కేసు మీద స్వామి చెప్పినా చెప్పకపోయినా - ఇడి, సీబిఐలు రెండూ స్వామి తోక పట్టుకుని - పై కోర్టుకి శరణు అంటూ పోవాల్సిందే. లేకపోతే ఆబోరు దక్కదు. గుడ్డిలో మెల్ల ఏమిటీ అంటే - సయనీ గారు - ప్రస్తుతం ప్రధానమంత్రి ప్రిన్స్‌పల్ సెక్రటరీగా ఉంటున్న నృపేంద్ర మిశ్రాకి శాభాషులు చెప్పారు. లోగడ ఆయన ట్రాయ్ చైర్మన్‌గా వున్నప్పుడు అద్భుతంగా వ్యవహరించారు - నిజానికి ట్రాయ్ రాసిన అన్ని ఉత్తరాలు కూడా తొక్కిపట్టింది టెలికం మంత్రిత్వ శాఖ కార్యదర్శి డిఎస్ మాధుర్ గారేనని జడ్జ్మెంటు పేర్కొన్నది. ఏది ఏమయితేనేమి? మనం సామాన్య టాక్స్ పేయర్సుగా - కోర్టు తీర్పును మన్నిస్తామేగాని - కోర్టు తీర్పుని - ఆరోపించలేము - అది మనకి అక్కర లేని పని. వల్లమాలిన పని. ఒక స్పెషల్ కోర్టు - ఇచ్చిన తీర్పు మీద రేప్పొద్దున్న పైకోర్టు విచారణ చేస్తే ప్రజాస్వామ్యయుతంగా అప్పుడు - ‘కాబోలు’ - అనుకుంటాము. మరో తీర్పు వచ్చేదాకా - ఈ తీర్పుని పరిగణనలోకి తీసుకోవడం తప్పా? అంటే కాదు., దీనిని కాదు అనడానికి - మన దగ్గర సాక్ష్యాధారాలేమి వున్నాయి? ఔను అనడానికి న్యాయమూర్తి సయనీగారు పేర్లుకూడా పెట్టి అధికారులను - నేరుగా దోషులుగా పేర్కొని - నిందితుల్ని నిర్దోషులుగా చెప్పి - పోయి పండుగ చేసుకోండి అని వదిలేస్తే? ఎవరికీ చెంచాకాని సామాన్యుడెలా ఆలోచించాలి? ఈ కుంభ‘కోణం’లోంచి గాక దీనివలన - మొన్నటి ఎన్నికలో ఎన్‌డిఏకి ఎంత ‘హైజీ’ (హైపు) దొరికిందో - యూపీఏకి ఎంత ‘లోజీ’ దొరికిందో చూసి కాసీపు ముక్కున వ్రేలు పెట్టుకోవాలి? రాజా ఏడాదిన్నరపాటు కటకటాలను లెక్కపెట్టవలసి వచ్చింది అని గాని, కరుణానిధి తనయ - కనిమోళి ఆరుమాసాలు జైల్లో ఉండాల్సి వచ్చింది అని గాని - మనం ఎంతో వర్రీ అయిపోవడం లేదు - రాజకీయంలో ఈ వ్యవహారం - ఏమేమి మార్పులు తెచ్చింది? అని మాత్రమే చూస్తాం - పాలితుల చేత అస్మదీయులుగానో - లేక తస్మదీయులుగానో ముద్ర వేయించుకోకుండా వున్న వాళ్లమ్ మనం అదే ఆలోచిస్తాము? మాజీమంత్రి రాజా - మిశ్రమ మంత్రివర్గం కోటాలో వచ్చినవాడు స్వయం రాజా స్వయం మంత్రిగా వ్యవహరించి - ఉన్న ఫళాన ‘పాలసీ’ మార్చేశాడు - అది తెలుసుకోవలసింది - పత్రికలూ ప్రజలూ కన్నా ముందు - ప్రధాన ప్రభుత్వంలో భాగస్వాములైన మన్మోహన్‌సింగ్ అండ్ కో మాత్రమే.. ఎన్నికలముందు అప్పన్‌గా - ఇలాంటి కుంభకోణం దొరికితే దానిని ఆయుధంగా వాడుకోని పొలిటికల్ పార్టీ వుంటే అది - ఎన్నికలకే ‘అన్ఫిట్’ అన్నాడు ఓ యువ కార్యకర్త. హాయిగా వున్న పొలిటికల్ బంధం కరుణానిధి అండ్ కాంగ్రెస్సులది - అది పోయే.. అవతల మోదీ అండ్ కో చూస్తు ఉండగానే కంపాకి ఏకు మేకు అయిపోయే. కంపా తిప్పలు పాపం!
తీర్పు వింటూనే, రాజా తన బాస్ కరుణానిధికి నీ దయవల్లనే నాకు మోక్షం లభించింది - నా వల్ల పార్టీకి - రాజకీయ పొత్తుకి గట్టి దెబ్బ తగిలింది - అయినా కడుపులో పెట్టుకుని నన్ను కాపాడేరు దొరా! అని - ఈ గెలుపు నీకే అంకితం అన్నాడు.. సోదరుడు స్టాలిన్‌కి అప్పా కరుణానిధికి కూడా థాంక్స్ చెప్పింది ‘కలి’మొళి - దిశానిర్దేశం కోసం అల్లాడుతున్న తమిళనాడు యొక్క పోలిటిక్స్ మీద - ఈ తీర్పు తక్షణం ఆశల హరివిల్లును ప్రసరించింది. అరుణ్‌జైట్లీ గారు సిబ్బాల్ గారు కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్లే. లిటిగేషన్ మర్మాలు, మతలబులు తెలిసినవారే - మాజీ లా మంత్రిగా సిబ్బలుడు మాత్రమే ‘బున్గుల్’ చేయగలడు అంటారు గానీ ప్రస్తుత ఆర్థిక మంత్రిగా ఈయన కేసును అద్భుతంగా ‘షో కేసు’ చెయ్యగలడు? దొందు దొందే అన్నాడో తటస్థ పౌరుడు. జైట్లీ గారన్నారు - దీన్ని (తీర్పుని) అదేదో పతకం అనుకొని మురసిపోనక్కరలేదన్నాడు - సుప్రీంకోర్టు ఏనాడో చెప్పింది అన్నాడు - సుప్రీంకోర్టు 2012లో ఒక పిల్‌ని విచారించి - ‘లయిసెన్సు’ల కేటాయింపు ఏకపక్షంగా జరిగింది - అది రాజ్యాంగ విరుద్ధం అని, సదరు లైసెన్స్‌లను కొట్టివేసింది. కేటాయింపులు అవినీతిగా జరిగాయా, ముడుపుల సంగతి ఏమిటి? అన్నది తేల్చడానికి సీబీఐ స్పెషల్ కోర్టు ఏర్పాటు సుప్రీమ్ ఆదేశాల మేరకు జరిగింది. అందువల్లనే ఇవాళ - ఈ ప్రత్యేక కోర్టు విచారణకి - తీర్పుకి బరువు వస్తుంది అనే వాదన కూడావున్నది. మిగతా విషయాలటు ఉంచితే - కొత్త రకం ఆరోపణతో కుంగిపోతున్న వౌనముని మంమోహన్ జీ కి ఇది ఊరట. కాం గ్రేస్సుకి ఆ పార్టీ - కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీకి - ఒక టానిక్. ఇక అభిమాన సంఘాలు - రాజకీయ రంగంలో రెండు రకాలు - ఒకటి వీరపూజ టైపు - రెండోది చెంచాగిరి - వీరభక్తులు ఏ కోరికలు, పారితోషికాలు అడగరు... పైగా ఇస్తారు.. సరే, చెంచాల సంగతి చెప్పడం మన తరం గాదు. చూపరులకి ఈ రెండు వర్గాల మధ్య వాదులాట, మనలాంటి తటస్థులకు ఒక ఉచిత వినోదం మాత్రమే. కాకపోతే, తమిళనాడులో పొలిటికల్ వ్యూహరచన ‘‘ఎప్పిటి ఇరుక్కం?’’ అన్నది చూడాలి..
-స్కామ్ టుజి.. లేట్ మీ సే సోలాంగ్ టు యూ!

veeraji.columnist@gmail.com