వీరాజీయం

సైకిలెక్కగలవా.. ఓ నరహరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో అదేం కర్మో కానీ, అన్ని దరిద్రాలు, అన్ని అరిష్టాలు దేశ రాజధాని ఢిల్లీ నగరానికే వస్తాయి. రెండేళ్ల నుంచి ఏటా వున్న పొగ మంచు ముంపు ఈ ఏడాదీ వచ్చింది అనుకున్నారు కానీ, నవంబరు రెండో వారంలో కన్నూ మిన్నూ గానకుండా మహానగరాన్ని పరిసరాలని కూడా దట్టమైన పొగమంచు తెరలు తెరలుగా పొరలు పొరలుగా -అల్లంత దూరాన ఏమున్నదో మిట్టమధ్యాహ్నం కూడా చూపునకు ఆనకుండా పసుపుపచ్చని చిక్కని పొర ఒకటి ధూళి దూసర విష పదార్థ మయమై కమ్మేసింది- మామూలుగానే విషతుల్య పర్యావరణ పరివేష్టితమైన మన రాజధాని - దగ్గడం, ఆయాసపడటం తప్ప మరేమీ చెయ్యలేని ఒక ముసుగు ధరించిన దీన వదనయిపోయింది. ఈపాటికే గాలిశుద్ధి యంత్రాలు - నీటిశుద్ధి యంత్రాలు - నో స్టాక్ స్థాయికి వెళ్లిపోయాయి. ముక్కుకి - డిప్పలు - కనులకి అద్దాలు ధరించి - జనాలు మృత్యుగహ్వరంలోకి ప్రవేశిస్తున్నామా? అన్నట్లు బయటికి పోతూ వుండగా, వూరవతల్నుంచి వచ్చే వేలాది ట్రక్కుల్ని, ఇతర మోటారు శకటాలని వూరు పొలిమేరల్లోనే ఆపేశారు. పిల్లలకి ఇస్కూళ్లు బంద్ చేశారు. అక్రమంగా కట్టే ఇండ్లు మాత్రమే కాదు - సక్రమంగా నిర్మింపబడుతున్న కట్టడాల్ని- ‘‘స్టాప్’’ అన్నారు. రైలు బండ్లు ఎన్నో రద్దు అయిపోయాయి - తప్పనిసరి అయిన బండ్లు ఆలస్యంగా నడుస్తామని మొరాయించాయి. మరశాసనమేదో కర్ఫ్యూ పెట్టినట్లు - విమానాలు ముందే నాగా పెట్టేశాయి. మోదీజీకి, కేజ్రీవాల్జికి మధ్య నలిగిపోతున్న ఢిల్లీ స్మోగ్ ఎమర్జెన్సీలో వుంది. ఇప్పుడు మూలగడం మానేసి దగ్గడం రొప్పడం మాత్రం చేస్తోంది. గాలిలో పిఎం 2.5 సంకేతనామంగల విషపదార్థ నలుసులు 50 లెవెల్లో ఉంటేనే డేంజర్ అనుకుంటే 500 లెవెల్‌కి వెళ్లిపోయింది సూచిక! వైద్యులు ‘మేమే దగ్గలేక రొప్పలేక ఆస్తమా రోగుల్లా చస్తున్నాం- రోగుల సంఖ్య నలభై రెట్లు పెరిగింది’ అని గోలెడుతున్నారు. అసలు ఢిల్లీ ముఖ్యమంత్రిగారికి ముందే దగ్గు- గ్రేట్ నమో గారే నువ్వు కేరళకి పోయి ఆయుర్వేద మందు తినమని సలహా ఇచ్చాడు కూడా. ఇప్పుడు కూడా, నమోగారే ఏదైనా ఉపాయం చూపించాలి - గుజరాత్‌లో ఎలక్షన్లో చీపురు భయం కూడా లేదు. కనుక మోదీజీ ఎర్రకోట, పార్లమెంటు (ఇంకా సమావేశాలు లేవేం) గట్రా దిల్లీలోనే వున్నాయి కనుక- మరి ఏదో తరుణోపాయం చెప్పాలి అనుకుంటున్నారు ఢిల్లీలో వ్యాపారాలు పెట్టుకున్న గుజరాతీలు. కానీ, కేజ్రీకి సహాయం చెయ్యడమంటే మోదీజీ మాట ఎట్లా వున్నా అనుయాయులకి, అస్మదీయులకి కష్టంగానే వుంటుంది. ఇంతకీ, గాలిలో విషనాగుల బుసలకి ప్రధాని దగ్గర మాత్రం నాగస్వరం లాంటిదేమీ లేదు గదా? జనాల్ని బస్సుల్లో వెళ్లమంటే బస్సులేవీ? మామూలుగా ఉంటేనే బస్సుల్లో ‘కూకొ’నే జాగా వుండదు. ఇదే చైనా అయితేనా? బీజిన్గు గవర్నమెంటు- నడిచీ రమ్మంటే కూడా ముక్కులకి డిప్పలు కనులకు గంతలు పెట్టుకుని అక్కడి జనాలు ఆఫీసులకి వస్తారు. కాని ద్వంద ప్రభుత్వం నడిచే హస్తినాపురిలో - అడుగడుగునా అస్మదీయులూ తస్మదీయులే.. స్పీడు బ్రేకర్లే.. నగరంలో పొగ వచ్చే కర్మాగారాల్ని - కాకా హోటల్స్‌ని కూడా దూరంగా నిరుడే తోలేశారు. మోటారు శకతాలకి కుడి ఎడమ వంతులేసుకుంటాం మళ్లీ అంటున్నారు.. ఈలోగా దీనికి కేంద్రం నిర్లక్ష్యం కారణమని వీళ్లు అంటే వాళ్ళు కేజ్రీవాల్ డబ్బులు వుండీ ఖర్చుపెట్టలేదు- దీనికంతటికీ అరవింద్‌గారి ఇతర రాష్ట్ర అధికార దాహమేనని వాళ్ళు అంటారు. తిట్టు కవిత్వం చెప్పమంటే దుశ్శాలువ కప్పకపోయినా వచ్చి పొయెట్రీ చెప్పే రకాలే, పాపం కేజ్రీకి తటస్థపడ్డారు.. అవతల పొగ మంచు సునామీ లెవెల్లో దంచేస్తూ వుంటే.. వుంటే.. సైంటిస్టులు చెప్పారు ‘‘గాలి గట్టిగా పీలిస్తే ఓసారి రెండు సిగరెట్ల పెట్టెల ధూమపానం చేసినట్లే సుమా’’! అని. ఊపిరితిత్తులు లోపలి బూజుపట్టినలాగా పొగ ఎక్కేస్తుంది అంటారు స్మోగ్పండిట్స్. బంద్ చెయ్ చుట్టా బీడీ సిగరెట్టు దుకానాలంటే- ఓట్లు అక్కరలేదా? అనడిగాడో ప్రతిపక్ష పక్షీంద్రుడు. మీరెంత గింజుకున్నా ముక్కులు రోజుకో గంట మూసేసుకున్నా- దేముడికి అగరొత్తులు, మనుషులకు కట్టెల పొయ్యి సుఖా రొట్టెలు పొయ్యిమీద కాల్చడం మానేసినా- ఆగదూ ఆగదూ.. ఈ విష వాయువూ అంటూ దుఃఖిస్తున్నారు పురజనులు- పర్యావరణ నిపుణులు- ప్రజాప్రతినిధులు కొందరు గోవా హాలిడేయింగ్‌కని చెక్కేశారు. అయితే పబ్లిసిటీకి దొరికిన ఈ ఛాన్సుని కొందరు వాడుకున్నారు. ఆప్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన ఎంఎల్‌ఏ కపిల్ మిశ్రా- తనకు తోడుగా భాజపా పార్టీ ఎంఎల్‌ఏ సర్దార్జీ మన్జీందర్‌సింగుని కూడా తెచ్చుకున్నాడు. జనాలకి సేవ చేయడంలో వాళ్లకు చాలా అనుభవం వుంది. జన సుఖమే కోరి కేజ్రీవాలాని నిలదీస్తామన్నారు. సిఎం మనకి ఏమీ చేయడు అని దగ్గుతూనే ఎలుగెత్తి అరిచారు. ముక్కులకి గట్టి డిప్పలు పెట్టుకున్నారు గాంధీ తాతగారి విగ్రహం దగ్గరికి గొప్ప సత్యాగ్రహుల్లాగా వెళ్ళారు. మాస్కులు దొరకటం లేని సమయంలో - ఆయన బొమ్మకి కూడా ఓ డిప్ప పెట్టి దగ్గడం వాగడం మొదలెట్టారు. గాంధీజీ చేతిలో కర్ర వుంది కాని దాంతో కొట్టలేడుగా. పొగమంచులో బావ్రురు పిల్లుల్లాగా అరుస్తున్న వీళ్ళకి ఆ దగ్గరలోనే మునిసిపాలిటీ ట్రక్కులలో నీళ్ళు తెచ్చి అగ్నిమాపక దళాలు చెట్లమీద నీటి జల్లుల్ కురిపిస్తోంటే కానరాలేదు. వీళ్లు తిట్టు కవిత్వం తప్ప జనాలకి సాయం చేద్దాం- మందూ మాకూ పంచడం, పొగ మంచు మేఘాలు చెదిరేలాగా మనం కూడా నీటిపువ్వారాలను ఎత్తి సాయం చెయ్యడం ఏమీ లేవు. వీళ్ళేదో అంతర్జాతీయ ఘనకార్యం చేస్తున్నట్లు కెమెరాలు చానల్స్ సిబ్బంది వీళ్ళ వెనుక. ‘పర్యారణశిస్తు’ ఏడువందల కోట్ల రూపాయలు ఏమి చేశారు? అని ధర్నా చేశారు. కొంపలు తగలడుతూ వుంటే బావి త్రవ్వించలేదు అని సత్యాగ్రహానికి కూర్చున్నట్లు!
విదేశీ రాయబారుల వర్గాలలో - ఇదేదో లండన్‌లో 1952లో వచ్చిన మహామంచు ప్రళయం అన్న భయం పట్టుకుంది. వాళ్ళకి ఏసీలు- వాయుశుద్ధి యంత్రాలు అన్నీ వున్నా- బెంగే వాళ్లకి. అప్పుడు నాలుగువేలమంది మంచు వినాశనానికి బలి అయిపోయారట. ఒక హెలికాప్టర్‌ని పైకి వెళ్లి మేఘాల మాదిరి వ్రేలాడుతున్న పొగ మంచు మీద నీళ్లు జల్లమన్నారు. అసలు హెలికాప్టర్‌కి ఏమీ కానరాక రెక్కలెత్తేసింది. పైకి లేచే దమ్ము లేదు దానికి. అదీ స్థితి. నువ్వు ఎంత తన్నుకు చచ్చినా, కేజ్రీవాలాభాయ్‌కి దగ్గుతెర పెరిగింది అంతే- ‘‘వూళ్ళో వాళ్ళందరిన్నీ కట్టడిచేసావ్- డీజిల్ బళ్ళు బందు అన్నావు. చలి నెగళ్లు బ్యాన్ చేశావ్- ఆవిరి పట్టే శాల్తీలు కూడా ఆవిరితో విషవాయువు దూరిపోతుందేమోనని దగ్గడమే బెటర్ అనుకుంటున్నారు. ఇంట్లో కూడా ముక్కు డిప్పలు చెవి తొడుగులు నెత్తిమీద కోతి గూడు టోపీలు పెట్టుకు చస్తూన్నారు. అట్టి తరి- అసలు కారణం తెలిసింది. నలభై శాతం గల్ఫ్ దేశాలనుంచి దండయాత్ర చేసే (ఘజనీ ఘోరీల లాగ) ఎగబడి వస్తున్న ధూళి దూసరాలు కారణం కాగా- చుట్టూ వున్న పెద్ద రాష్ట్రాలు మిగతా కారణం- పొగంతా హర్యానా పంజాబ్ రాజస్థాన్, యుపిలునుంచి, రోజుకి మూడు షిఫ్టులు వేసుకున్న ఫ్యాక్టరీ గొట్టాల కాలుష్యంలాగా వచ్చి పడిపోతోంది. ఆ ధూమకేతువుని ఆపాలి. హర్యానా ముఖ్యమంత్రిగారు దండాలయ్యా అంటే కేజ్రీ పోయి, తమ్ముడు నేను బిజీ అంటాడు. పంజాబ్ వాడు మాకు వోట్లు వద్దా? రైతులకి కోపం వచ్చుద్ది అంటారు. అసలు సంగతి ఏమిటీ అంటే పంటల కోతలైపోయాయి హరియాణా పంజాబ్ రాష్ట్రాలల్లో- మలి పంటకి పొలాన్ని లాయకీ చెయ్యాలి అంటే చేలో మిగిలిన చొప్పా అక్కరలేని పంటచెత్తా, గడ్డీ గాదరా వగైరాలని లంకాదహనం లెవెల్లో పరశురామప్రీతి చెయ్యాలి. ఆ పని మీద వున్నారు వాళ్ళు- ఎంత ఘోరం? దయలేదా? ఢిల్లీకి యమునలో కలుద్దాం అనుకున్నా, ఆ నది చాలదు- అల్లాంటిది సాయం చెయ్యొద్దా? అంటే ‘పాలిటిక్స్ తెల్సీ మాట్లాడుతున్నావా?’’ అంటారు. నమోగారి ‘మంకీబాతులు’ మరిగిన రేపటి పొలిటీషియన్ ఒకడు. న్యాయంగా అయితే నమో టూర్ ‘కట్’ చేసుకొని వచ్చి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని చాయ్‌పె అనగా ‘ఓవర్ ఎ కప్పాటీ’ మీద ‘పిలచి మీరు పొలాలలో అగ్గిమంటలు ఆర్పించండి అని సదరు ముఖ్యమంత్రుల్ని కోరవద్దా? అన్నాడు కాంగ్రెస్ వాలా ఒకడు’. క్రేజ్ ఎత్తుతోంది.. ఎంతమంది మొగుళ్లు నాకు? లెఫ్టినెంటు గవర్నర్ ఒకడు, కేంద్రం రెండు, పార్టీలోని రెబెల్స్ మూడు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూన్ నాలుగు అన్నిటిని మించి సుప్రీమ్ కోర్టు.. అంటూ వాపోతున్న అరవింద్ ఝాడూవాలా (అతని నిక్‌నేమ్)కి తాజాగా సుప్రీంకోర్టు ‘బ్యాటరీ బండ్లు ఏల వాడరాదు?’ అంటూ ప్రశ్నించింది (మందిపోడా?) గల్ఫ్ పత్రికలు అమెరికన్ పేపర్లు ఎన్నో సంపాదకీయాలు రాశాయి. అందరూ కేజ్రీవాలాకి అక్షింతలు వేసేవాళ్లే...
ఓ ఉద్యమాల స్టూడెంటు లీడర్ అంతలో ఊడిపడ్డాడు. ‘‘మాస్టారూ విదేశీ పేపర్లు చదవకండి. నా మాట వినండి. బ్యాటరీ కార్లు సైకిళ్లూ ఇవన్నీ గవర్నమెంట్లు మారేదాకా ఏమీ జరగదు కాని, చెయ్యాలని వున్నా డీజిల్ కార్లు అమ్ముడైపోతే తప్ప కంపెనీలు ఉలకవ్.. అందాకా ఓ ఐడియా అన్నాడు. ఓహో!మన్నాను వేళాకోళంగా.. కానీ అతను ఎగిరి గంతేశాడు- ‘‘సైకిలెక్కగలవా? సారూ నువ్వు?’ అనడిగాడు. ఓ, ఈ పాత పాట విను- ఇది చెంచులక్ష్మి పాట- సైకిలెక్కగలవా? ఓ నరహరి? సైకిలెక్కి నువ్వు అసెంబ్లీకి పోగలవా? అని కూనిరాగం తీశాను. సైకిలే పొల్యూషన్‌కి ఫటాఫట్ సొల్యూషన్- నువ్వు లెస్స పలికితివి రేపటి పౌరుడా? జయమ్ము జయమ్ము! అసలు పూర్వం తెల్గు సినిమాలు తీసుకుని చూడండి- జగ్గయ్య జానకిని ఎక్కించుకుని చెట్టుమీన.. పుట్టవుంది.. సారీ పుట్ట కాదు పిట్టా వుంది.. అని పాడాలి- సరే పిట్ట నోటా పిలుపు వుంది.. చల్మోహనరంగా! అంటూ అలా హీరో హీరోయిన్లు చెక్కేశారు. చూళ్లేదా? అక్కినేని సరోజాదేవి ప్రేమకానుకలో- వాడుక మరచితివేని.. అంటూ సైకిల్లెక్కి ‘నిన్ను చూడని క్షణమూ నాకొక యుగము’ అంటూ పాతిక వారాలు గల్లాపెట్టెలు నింపేశారు కాదా? హీరో దిలీప్‌కుమార్ గుర్రమేనా ఎక్కేవాడు సైకిలైనా ఎక్కేవాడు- ఆనాటి దేవానంద్- మానా.. జనాబ్ నే పుకరానహీన్.. అంటూ రెండు చక్రాల కీలుగుర్రం మీద అమ్మాయి- (నూతన్) వెంటపడ్డాడు. రజనీకాంత్ దాకా ఆటోకి దశ తిరుగలేదు- అట్లాగా చైనావాడిని అనుసరిస్తూ- సైకిళ్లకి బ్యాటరీ సైకిళ్లకి సెటిల్‌ఐ పోవాలి- ‘‘అమ్మో- బాబుకి- అఖిలేష్ వాళ్ళ బాబుకి ప్రచారం చేస్తావా?’’ అన్నాను. సైకిళ్ళు ఇమ్మని కూడా వాళ్ళనే అడుగుతాము అంకుల్ అన్నాడు ఈ కాలం కుర్రాడు కనుక. సైకిలు రిక్షాలు వాటికి బ్యాంకు లోన్లు మళ్లీ రావాలి అన్నాడు. లేదా మన హైబా కూడా ఢిల్లీ అయిపోతుంది. మారథాన్ రన్ ఏర్పాటుచేయాలి అన్నాడు.
రైడే బైసికిల్ అండ్ లైవ్ లాంగ్!