వీరాజీయం

వాహ్! తాజ్! రాళ్లెత్తిన కూలీలు మనవాళ్లేనోయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నప్పుడు, స్కూలులో ప్రార్ధన సమయం చివర, ఒక పాట పాడేసి క్లాసులోకి పరుగులు తీసేవాళ్లం, అది ఇలా సాగేది. ‘‘ మాతా నమో హిందూ మాతా -సుజాతా నమో జగన్మాతా!విపులహుమద్రులే వేణీ భరముగా, గంగా యమునలే కంఠహారముగా-... గోలకొండ నీ రత్న కోశమట, తాజ్‌మహల్ నీ ‘దివ్య’ భవనమట..కోహినూరు నీ జడలో పువ్వట... ఆహాహా నా భాగ్యము నేమనందు? మాతా..’’
ఆ జడలేదు.. జడలో పువ్వులేదు, నెమలి సింహాసనం కూడా లేదు- ‘రతన్ గర్భ’ రెండు ముక్కలు ఆనక మూడు (బంగ్లాదేశ్) అయ్యింది... రత్నకోశము ఖాళీ...కానీ తాజ్మహల్ వాహ్! అంటూ అందర్నీ ముఖ్యంగా విదేశీయుల్ని-అలాగే అప్పటిలాగే ఆకర్షిస్తూనే ఉంది. ఫ్రాన్స్‌కి ఈఫిల్ టవర్, ఇంగ్లాండ్‌కి బిగ్‌బెన్‌లాగ చైనావాడి గోడలాగ ప్రపంచ టూరిస్టుల్ని అపారంగా ఆకర్షిస్తున్న తాజ్‌మహల్ యొక్క చరిత్ర జాగ్రఫి ఎవరు అడగడంలేదు మనవాళ్లు, ప్రపంచవ్యాప్త కళాఖండ ప్రియులు దీన్ని ‘ఎంజాయ్’ చేస్తూనే వున్నారు... ఇటీవల జరిగిన ఒక అభిప్రాయ సేకరణలో కూడా గట్టిపోటీ మధ్య-్భమీది వింతలలో ఒకటిగా ఆగ్రా తాజ్ ఎంపికయింది. దీన్నొక ప్రపంచ సాంస్కృతిక చారిత్రాత్మక వైభవ ప్రతీకగా ‘యునెస్కో’ కూడా రెండువేల సంవత్సరంలోనే ముద్ర వేసింది. వెనుకటి ప్రభుత్వాలు-తాజ్‌కి ‘వహ్వా’ అంటూ ఎక్కలేని ‘హైపూ’ ఇచ్చాయి. ఒక విదేశీ అధినేత లేదా ప్రతినిధి వస్తే భయం.. మన గవర్నమెంటు-మనకున్న ఒకే ఒక్క ‘షోపీసు’ లాగ తాజ్మహల్‌ని చూపెట్టేసి, ఓ మొమెంటో తాజ్మహల్ బొమ్మ-దానితో తీయించుకున్న ఫోటో చేతిలో పెట్టి పంపించేసేది. ‘వెనె్నట్లో దివినుంచి దిగి వచ్చిన పాల(రాతి) వెనె్నల వనె్నల బొమ్మలాగా’-రోజంతా ఎండలో పింకురంగు సాయంకాలం ధవళవర్ణ కాంతులు పున్నమి వెనె్నలలో బంగారు కాంతులీనుతుంది తాజ్. అందమైన ఆడపిల్ల లాగ ’మూడ్స్’అన్నీ ప్రదర్శిస్తూ విదేశీ పైసలు ఆర్జిస్తూ ఉన్నది ఈ ‘గ్లోరిఫైడ్’ గోరీ.
ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై వేలమంది కూలీలు-ఎండా వెనె్నలా ఒకలాగే భావించి-తమ కాయకష్టాన్ని వెచ్చించి తీర్చిదిద్దినదీ పాలరాతి కళాఖండం-అసలు వాళ్లు మనవాళ్లే-తాజ్మహల్‌కి రాళ్లెత్తిన కూలీలెవ్వరోయ్ అంటే? మన వాళ్లేనోయ్ అని వేరే చెప్పనక్కరలేదు-పెద్దశిల్పి ఉస్తాద్ అహమద్ లాహౌరి పర్షియన్ కావచ్చు కానీ చేతులు మనవాళ్లవే. రాళ్లు రాజస్థాన్‌నుంచేకాక టిబెట్, ఆఫ్గానిస్తాన్, చైనాలనుంచి కూడా తీసుకునివచ్చారు. వాటిని మోసుకు రావడానికి వెయ్యి ఏనుగుల్ని ఉపయోగించారుట. స్వర్గంలో తన ఇష్ట సఖికి ఎటువంటి నివాస ధామం ఉండాలో ఊహించి కట్టమన్నాడుట ఖుర్రం చక్రవర్తి-ఇవాళ గొప్పగా సుబ్రమణ్య స్వామి అవర్‌గళ్ తాజ్ ఆక్రమిత భూమీద కట్టినదే అని చెపుతున్నాడు ‘కొలంబస్ లాగ’ అన్నాడో బాలుడు. నాడు మన దేశమే అంతా ‘ఆక్రమిత ల్యాండ్’ కాదా/తాజ్మహల్ నీ ‘దివ్య’ భవనమని రాసిన కవిని-అది పాడుకుని మురిసిన ఆబాలగోపాలాన్నీ వెనక్కుపోయి తప్పుపట్టే ఉద్యమం లేవదీద్దామా? అసలు, యాభై అయిదున్నర ఎకరాల సువిశాల-యమునా తీర దక్షిణ భూమి మీద నిర్మింపబడిన తాజ్మహల్ నాటి ప్రపంచంలో ఏడువింతలే వున్న రోజుల్లోకూడా ఎనిమిదవ వింతగా (ఎయిత్ వండర్)గా వాసికెక్కిన రోజున-అంతకన్నా ‘వండర్స్ ఈ గడ్డమీద గలవు’ అని ఎలుగెత్తి చాటారా? ఒక్కరయినా?... తాజ్మహల్ సందర్శనకు శుక్రవారం శలవు ఎందుకంటే తాజ్ భవన సముదాయంలో ఒక అతిథి గృహం, అద్భుతమైన గార్డెన్‌తోపాటు మరో మసీదు కూడా ఉన్నాయి. అక్కడికి శుక్రవారం స్థానికుల నమాజ్‌కి వెళ్తారు. గేటుమీదే మనకి-ముంతాజ్ బేగం తన పదిహేనో కానుపు తరువాత స్వర్గస్తురాలయిందని అక్కడి ఫలకం వివరిస్తుంది-ఆమె వయస్సు నలభైకి ఒకటి తక్కువ అని తెలుస్తుంది. షాజహాన్‌కి ముగ్గురు భార్యలా? అన్న ప్రశ్న అనవసరం. ముగ్గురికి మందిరాలు కట్టిస్తే నాడు, ఇవాళ మూడు మందిరాలను మన గవర్నమెంట్లు కాపాడాల్సి వచ్చేది అన్నాడో కొంటెకుంక. అవును, తాజ్‌ని కాలుష్య దోషంనుంచి కాల దోషంనుంచి కాపాడడానికి చుట్టువార వున్న ప్రాంతాన్ని పదివేల నాలుగు వందల చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని రక్షిత మండలంగా ప్రకటించారు-ఇవాళ తాజ్‌మీదుగా విమానాలు ఎగురకూడదు. ఈ రెండంతస్తుల అందాల భవనంలోని పై అంతస్తులో షాజహాన్ ముంతాజ్‌ల సమాధి నమూనాలే ఉన్నాయి. క్రింది అంతస్తులో అసలు గోరీలు అంటే సమాధులు ఉంటాయి-ఇది ఒక సంప్రదాయం. ఇదంతా ఎవరూ చూడరు పైనుంచి చూస్తే అలౌకిమైన అందాలతో నాలుగు మీనార్లతో భాసించే ఈ భవనం అష్ట-్భజి ఆకారంలో అపురూప పద్మాలయంగా మురిపిస్తుంది. ఒకవేళ ఈ మీనార్లు కూలిపోతే అవి అసలు భవనానికి ఎడంగా పడేలాగా, కొంచెం ఆసింటా నిర్మించారు నాటి నిపుణులు! ఎంత జాగ్రత్త! ఒక్కో వరండా ఒక్కో కళాఖండం-అద్భుతమైన లతలు తీగెలు కాలిగ్రాఫీలో (ముత్యాల పేరులాంటి దస్తూరి) ఖురాన్ సూక్తులు-ముంతాజ్‌బానో ప్రశస్తి వుంటాయి-‘అల్లాహ్’కున్న తొంబై తొమ్మిది నామధేయాలు ఈ కుడ్యాలమీద పొందుపరచడం విశేషం.
ఇవాళ, దీన్ని కోట్లాది సందర్శకులు చూస్తారు తప్ప చరిత్ర అడగరు-ఒక కళా ఖండముగా తాజ్ అందాలు చూసి మురిసిపోవడమే వాళ్లకి తెలుసు. చలువరాయి చబూతర్ మీద జంటలు కూర్చున్నా బ్రహ్మచారులు లేదా కనె్నపిల్లలు కూర్చున్నా తాజ్ నేపథ్యం ఫోటోలో అంత ముచ్చటగాను దిగుతుంది-దాని లోపలికి చెప్పులతో వెళ్లొద్దు అంటే దాని నాజూకుతనం వర్ణశోభా తగ్గుతాయేమోననే?-జోళ్లు విప్పలేకపోతే విదేశీ సందర్శకులకు చాటల్లాంటి తోలువి, పాద తొడుగు (చెప్పులు) అద్దెకిస్తారు-మంచి చలికాలంలో-వెళ్లాను నేను. అదీ మిత్రులు అందాక పోయి-తాజ్‌ని చూడలేదా? అని అదేదో నేరంలాగ నిలదీస్తారేమోనన్న భయంతోనే.. కేంద్ర ప్రభుత్వం వారు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ స్క్రీనింగ్ కమిటీ సభ్యునిగా తీసుకుపోయంది. అదే అదనుగా ఈ ’మొక్కుబడి’ కూడా తీర్చేసుకుంటే? అనుకున్నాను. మొదట నాకు గేట్లోనే-మొహల్లల్లోని (గల్లీలు) పిల్లలు అర్ధనగ్నంగా పేదరికానికి శాంపిల్స్‌లాగ- గోలీకాయలు లాంటి ఆటలు ఆడుకోడం దృశ్యాలు-తాజ్ దాకాపోయే ‘టోంగా మార్గం’లో గతకుల రోడ్డు కనుక ఇచ్చిన కుదుపులు ఇవే మిగిలాయి-పదిహేనో కానుపు అదీ పిన్న వయసులోనే-కంటూ ఆ తల్లిపడ్డ మరణవేదనే-మొదట ఇవే అనిపించేయి. తాజ్ వెలుపల ఈ ఖచడా చెత్త, జనసందోహపు అల్లరి ఇవి లేకపోతే ఇవాళ యుపి ముఖ్యమంత్రి ఆదిత్యనాధ యోగీజీకి చీపురు, చేట పట్టుకుని పడమటి-గేటు దగ్గరికి వెళ్లేసరికి ఆ ప్రాంతం అంతా ‘తలా తలా’ అద్దం లాగ మెర్సిపోతూ వుంటే ఏమి పని ఉంటుంది? పబ్లిసిటీయే దొరికేది కాదు. తాజ్మహల్ ముందు ఊడ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రికార్డే దక్కేది కాదు- ముట్టుకుంటే మాసిపోయే వెనె్నల కుడ్యాలమీద-ఒకటి అరా కళాప్రియులెవరో బొగ్గు గీతలు కూడా తమ ప్రతాపానికి ప్రేమైక తన్మయత్వానికి గుర్తుగా పెట్టినట్టు- కనబడుతాయి. కమనీయ కళాఖండంగా ఎందరికో అది జ్ఞాపకం వుండిపోతుంటే- భాజపా పార్టీ ఎంఎల్‌ఏగారు మన చరిత్రమీద ఒక మచ్చ అన్నాడు- అదో వివాదమయింది. అధినాయకత్వం ఉలిక్కిపడ్డది- ‘డామేజీ రిపేరు’ మొదలుపెట్టాల్సి వచ్చింది. మంచి సమయం చూసి ఇలాంటి వివాదాలు తెస్తే ఎట్లాగ? అస్మదీయులు అంటే మన వోటర్లు- తస్మదీయులంటే వాళ్ల వోటర్లు- అంతేకాని వీళ్లందరూ మరో లాగా కనబడే సమయం కాదు ఇది. వాః! తాజ్! అన్నది కాస్తా; మరో తలకాయి నొప్పిగా మారిపోయే ప్రమాదం ఉందని భజపా ‘తిన్క్-ట్యాంక్’ ఉలిక్కిపడి లేచింది. ఆమాటకొస్తే తేజోమహాలయ ఇది అంటూ వాట్స్ అప్‌లో చాలా కాలమై చక్కర్లు కొడుతోంది. పురావస్తు శాఖవారు అటువంటిదేమీ లేదు అని తేల్చేశారు. కాపోతే వాళ్ల పరిశోధనలలో, చరిత్రకారుల చిట్టాలలో-తాజ్మహల్ మూడున్నర శతాబ్దాలుగా లోక వింతగా రాణిస్తూనే ఉన్నప్పటికీ ఒక అపశృతి ఉన్నది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ సిపాయిలు కొందరు తాజ్ అందాలని కొద్దిగా పాడుచేశారట. కుడ్యాలమీద తాపితం అయిన రత్నాలను పెరికేసుకున్నారట. కాని వైస్రాయ్ లార్డు కర్జన్ దొర-మరమ్మతులు చేయించి- ఈ కళంకంనుంచి బ్రిటిష్ ప్రతిష్ఠను కాపాడడమే గాక పరిహారంగా మహల్‌కి ఒక పెద్ద దీపాన్ని సీలింగునుంచి వ్రేలాడే దీపాన్ని- కానుకగా ఇచ్చి సెభాసులు కొట్టేశాడు. అంతేకాని, దానిజోలికి మరెవ్వరూ వెళ్లలేదు. రెండు వేల సంవత్సరంలో-శ్రీ పి.యెన్.ఓక్ అనే రచయత ఈ గోరి స్మారక మందిరం కాదు-ఒక పెద్ద శివాలయం పడగొట్టి నిర్మించిన కట్టడం అని పుస్తకం రాయడమే కాక సుప్రీంకోర్టులో దీన్ని తవ్వి చూడాలంటూ కేసు పెట్టాడు. కోర్టువారు ఈ వాదాన్ని తిరస్కరించారు. ఇటువంటి దాఖలాలు ఏమీ లేవు గాని కొన్ని కథలు వున్నాయి-దీన్ని కట్టించిన ఖుర్రం ఉరఫ్ షాజహాన్-మరో నల్లని చలువరాయి తాజ్మహల్‌ను కట్టాలనుకున్నాడన్న మాట ఒకటి ఉంది-తాజ్మహల్ కట్టిన కార్మికులు అవే చేతులతో మరో మందిర నిర్మాణం చెయ్యకూడదంటూ-వాళ్ల చేతులు నరికేశాడుట. ఇదీ వదంతి.
అది సరే, గతంలో ఒక్కనాడు -విదేశీ అధినాయకులు- అతి ముఖ్యులు వస్తే తాజ్ మహలు కన్నా గొప్ప కట్టడం ఉన్నది అంటూ మనవాళ్లు దేన్నీ చూపెట్టలేకపోయారు. అదే పిటీ! ఏదైనా హైందవం అయిన కళాఖండం చూపెడితే సెక్యులరిజం మూస దెబ్బతింటుంది అన్న వెధవ బెంగ ఒకటి నెహ్రూ స్కూలు శిష్యులకి ఉండేది (ఇసీ!)-బుద్ధుడి బొమ్మ మాత్రం మతాతీతం. కాని, వౌంట్ అబు-అర్బుదాచల్ అంటారు-రాజస్థాన్‌లో ఉంది- దానిమీద-నాలుగు అంతస్తులలో కొండల అడవుల మాటున-దండయాత్రల్కి అందుబాటులో లేకుడా నిర్మించిన దిల్వాడా (దిల్వారా) నాలుగు అంతస్తుల పాలరాయి దేవాలయాల సముదాయం చూస్తే-పదకొండవ శతాబ్దం నాటికే మన పాలరాయి శిల్పి కళా నైపుణ్యం-దేవతలే దిగివచ్చి నిర్మించారా? అన్నంత వైభవంగా వుంటుంది. దాన్ని, గవర్నమెంట్లు ఎందుకు-విఐపి పర్యాటకులకు చూపరాదు? హిందూ కాదుగా! తిరుమల ఘాట్ రోడ్డుకి రెట్టింపు నిడివిగల ఘాట్ రోడ్డుమీద వున్నదా జైన మందిరం. దాన్ని ఒక్క స్తంభం చాలు- ఆ గోపురాల క్రింది సీలింగ్ చూస్తేచాలు- వేసుకున్న మన ముక్కున వేలు లాక్కుంటే తప్ప ఇవతలికి రాదు. అదంతా వేరే స్టోరీ. కాకపోతే ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి గారు -గడుసుగా తాజ్మహల్ మన హెరిటేజ్‌లో అమూల్య రతనం అని డిక్లేర్ చేసి -లిస్టులో లేదూ అంటే- అంత ముఖ్యం కాని కొత్తవాటికి చోటు ఇద్దామని మాత్రమే అలా చేసామని -అని నాలిక్కరుచుకోవడంతో-అభివృద్ధి ప్రాజెక్టు ప్రకటించడంతో-ఈవివాదం సమసినట్టే అనుకుందామా?...తాజ్ అందరిదేలే అని పడుకున్దామా?
‘ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ తాజ్! ఇట్‌సే జాయి ఫర్ ఎవర్!’

veeraji.columnist@gmail.com