వీరాజీయం

ఏడాది చివరి దాకా ‘క్యూ’లోనే కునికిపాట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అసలు నల్లధనం అంటే ఏమిటి? అక్కా!’’ ఏడేళ్ల బాలుడు పనె్నండేళ్ల బాలికని అడిగాడు.
‘‘ఐదొందలు, వెయ్యి రూపాయి నోట్లు మన దగ్గర అంటే మమీ, డాడీ, గ్రాండ్‌మా, గ్రాండ్ పా- వీళ్ల దగ్గర వున్నాయి అనుకో- అవన్నీ బ్లాక్‌మనీ అన్నమాట. అలా కాకుండా వాటిని, అంటే ఆ నోట్లని క్యూలో నిలబడి బుద్ధిగా బ్యాంక్ ‘కంత’లో నుంచి అవతలి ప్రక్కనున్న విసుగురాముడికి అందజేశామనుకో- ఆ క్షణం నుంచీ అది వైట్‌మనీ. మళ్లీ క్యూలో నిలబడి, ఎ.టి.ఎమ్‌లో నుంచో ఇస్తే గిస్తే బ్యాంకు కంతలోనుంచో, ఒకే ఒక్క మోదీగారి నోటు తెచ్చుకున్నామనుకో- అది పింక్‌మనీ. భలే ముద్దొస్తూ వుంటుంది ఆ నోటు’’- చెప్పింది వాళ్ల అక్క వాడికి తన మొబైల్ గేమ్ నొక్కుకుంటూ.
‘‘నిన్న- అనగా 15 అర్థరాత్రినుంచీ అమలులోకి వచ్చిన రూలు ఏమిటి?’’ పాత అయిదొందల నోట్లు ఎక్కడా చెల్లవు’’ అన్నదే ఆర్డరు.
దేశంలో యింతవరకూ అర్థరాత్రినుంచీ కొత్త పెట్రోలియం ధరలే అమలు అవుతూ వస్తున్నాయి కానీ యిప్పుడు నోట్ల రద్దులు, పద్దులూ అన్నీ అర్థరాత్రి నుంచే అమలవుతున్నాయి.
‘‘మరి అక్కా, రిజర్వు బ్యాంకు వారు కదా, రుూ నోట్లు అన్నీ ప్రింటు చేసి బ్యాంకులకు పంపిస్తారు? దానిమీద నేను రుూ నోటు తెచ్చిన వ్యక్తిని- ఎప్పుడయినా, ఎక్కడయినా దానిమీద ముద్రించి వున్న నగదు మొత్తాన్ని అడగ్గానే యిస్తానని వాగ్దానం చేస్తున్నాను’’ అని రాసి వుండి, క్రింద రిజర్వు బ్యాంకి అధికారి సంతకం వుంటుంది- కదా? అంటే అది ‘‘ప్రామిసరీ నోటేనా?’’ పదేళ్ల కుర్రాడు వాళ్ల అక్కయిన స్కూల్ టీచర్‌ని అడిగాడు.
‘‘అఫ్‌కోర్స్! అనుకో.. గానీ ప్రధానమంత్రి మోదీగారు నల్లధనాన్ని అంటే కేవలం దేశంలో దాక్కొని వున్న బ్లాక్‌మనీని మాయం చేస్తానని కంకణం కట్టుకున్నాడు. అంచేత జనాల్ని డొక్కచించి, డోలు కట్టి, క్యూలలో నిలబెట్టి మరీ; ‘వున్న’్ధనం మొత్తం లాక్కున్నాడు. అలాగ, 86 శాతం కరెన్సీ తిరిగి బ్యాంకుల గోడౌన్లలోకి పోయింది. దానికి బదులు కొత్త నోట్లు ఇస్తేనే కదా ప్రామిసరీ నోటుకి మన్నన యిచ్చినట్లవుతుంది? కానీ దేశంలో వున్న నాలుగు కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్సులలో ‘ఆంఫట్’ యంత్రాలు, అల్లావుద్దీన్ అద్భుత లాంతర్లూ లేవు. అంచేత ‘వెయ్యేసి నోట్లు అయితే జనాలకి తొందరగా బాకీలు తీర్చినట్లవుతుంది’ అని, వెనక్కి లాక్కున్న పదిహేను లక్షల కోట్ల రూపాయల నోట్లకి బదులు రెండువేల గులాబీ రంగు నోట్లు మద్రించమని- ప్రెస్‌లకి రెండు వేల కోట్ల నోట్‌లు- (ఒక్కోటి రెండే వేల రూపాయలు బాబూ!) ముద్రించమని ఆర్డర్లు వేశారు.
అలాగే ముద్రించారు కూడాను. అయితే, అవి రిజర్వు బ్యాంకు నుంచి - మనీ ఛెస్ట్‌లకీ, అక్కడినుంచి బ్యాంకు స్ట్రాంగ్ రూమ్స్‌ల్లోకీ వస్తూ వుండగా- అనగా, తేబడుతూ వుండగా- గాలి’ ఎక్కువగా వీచుతూ వున్నందున మార్గమధ్యంలోనే తిరిగి బడా ఆసాముల దగ్గరికి చేరుకుంటున్నాయి.
తెల్లారేపాటికి లక్షలు, కోట్లు విలువచేసే పింకు ధనం- ‘హుష్‌కాకీ’ అయినంత అయిపోతూ వుండగా- కొంత మాత్రం దొరుకుతోంది. పేపర్లలో, టీవీలలో- మనందరికీ కనుల పండువుగా , గులాబీ పూల గుత్తులులాగా, దర్శనం యిస్తోంది. అది ఎలాగంటే? అదే అనుమానం- దేశంలోనే అత్యున్నత- ‘ఉచ్చతమ’ అంటారు- ఆ సుప్రీంకోర్టుకే రుూ అనుమానం వచ్చింది. ముగ్గురు ఉన్నత న్యామూర్తులున్న ‘ఖండపీఠ్’ రుూ ‘రద్దు’ వ్యవహారంపై విచారణ చేస్తూ- అడిగిన సూటి ప్రశ్న యిదే- కట్టలు కట్టల నోట్లు బయటికి ఎలా పోతున్నారుూ?
అసలు పాత ఐదొందల నోట్లు చెలామణీలో వుంచవచ్చునుగా? ఆసుపత్రులలో, పెట్రోలుల బంకుల్లో ఖర్చుపెట్టుకుంటారుగా జనం? అంటూ సూటిగా సుప్రీంకోర్టు అడిగింది. ఇలా తొమ్మిది ప్రశ్నలు సంధించింది. మొత్తం ఎనిమిది పిటిషన్లు ‘రద్దు’ను ఛాలెంజ్ చేస్తూ వచ్చాయి. వాటిని విచారిస్తూ సుప్రీంకోర్టు పై ప్రశ్నలు అడిగింది.
దేశంలో ఇరవై లక్షల, ఇరవై వేల ఎ.టి.ఎమ్‌లు వున్నాయి. వాటిలో పదమూడు శాతం బజ్జున్నాయి. మిగతా వాటిల్లో కరెన్సీ నోట్లు ‘వైర్‌లెస్ మెస్సేజ్’ల్లాగా వచ్చి చేరవుగా? ప్రతీ ఏ.టి.ఎమ్‌లోనూ మూడు రకాల క్యాసెట్లుంటాయి. ఒక దాంట్లో వెయ్యి కాయితాలు, మరో దాంట్లో ఐదు వందల కాయితాలు- ఇక మూడో దాంట్లో వంద నోట్లు అమర్చే ఏర్పాటుంటుంది. కానీ, మన నమో నారాయణగారు ఐదొందల, పదివందల నోట్లను ఆదికి ముందే లాగేసుకున్నాడు. దాంతో లక్షలాది ఖాతాలు కూడా కాగితంమీద అంకెలయిపోయాయి. ఎ.టి.ఎమ్‌లలో కొత్త రెండు వేల నోట్లు పట్టడానికి అరలు వుంచారు. ఐతే పాత వెయ్యి రూపాయల నోటంత సరిగ్గా కొత్త రెండు వేల నోటుని చేస్తే సరిపోయేది. అలాగే కొత్త అయిదొందల నోటుని పాత ఐదొందల నోటులానే చేస్తే బాగుండేది- కాని అలా జరగలేదు.
ఐతే, మట్టితలకాయలు మన జనాలవి. వాళ్లు ఆలోచించినట్లు దేశ భావి భారత భాగ్య నిర్మాతలు, మేధావులూ థింకరుగా! ఎంతసేపూ నకిలీ నోట్లు వచ్చేస్తాయేమో- తన ప్రతిష్ఠ ఎక్కడ పోతుందోనన్న బెంగ మన ప్రధానమంత్రిగారికి అన్నాడు ఒక పొలిటికల్ వ్యవహారాల దిట్ట అయిన సీనియర్ నెట్‌జనుడు.
‘‘కొత్త ఫైవ్ హండ్రెడ్ చిన్నదిగా, డెలికేట్‌గా వుంది’’ అన్నదో సోషల్ లేడీ వర్కర్.
‘‘అదృష్టవంతురాలివి, కనీసం చూశావు దాన్ని’’ అన్నాడు టిఫిన్ సెంటర్‌వాలా.
అంటే, సుప్రీంకోర్టుకే అర్థంకాని విషయం మనకెలా అర్థమవుతుంది? అంటావ్? ‘‘మోదీగారు ఏం చేసినా మన మంచికే అనుకోవాలి’’ అన్నాడు మోదీ భక్తుడు. పైగా, యిలా అన్నాడు- ‘‘నిరక్షర కుక్షులు కార్డు పెట్టి సరకులు కొంటున్నారయ్యా! చదువుకున్న వాడిలాగా వున్నావ్. నువ్వు కార్డు గోకీ, మొబైల్ గోకీ- సరుకులు, సినిమాలూ ఎంజోయ్ చెయ్యలేవా? బ్యాంకులు సొమ్ములు నీకివ్వకుండా నీ ఖాతాలో అందుకేగా నొక్కిపెట్టిందీ గవర్నమెంటూ?’’ ఇది ఒక సూటి ప్రశ్న.
కానీ, దేవెగౌడగారు అనగా మన మాజీ ప్రధానిగారు ఏమన్నాడు? ‘‘నాకే రాదు మొబైల్ బ్యాంకింగు కామన్ వోటర్స్‌కి ఎలా వస్తుంది?’’ అని. అందుకే ‘కంప్యూటర్ సావీ’ అయిన మన ఆం.ప్ర. ముఖ్యమంత్రి చంద్రబాబుగారికే డిజిటల్ బిజినెస్ ప్యానల్ ఆధిపత్యాన్ని నమోగారందించారు.
ఈ కమిటీలో ఐదుగురు ముఖ్యమంత్రులు సహా పదమూడు మందున్నారు. ఇకనేం వాళ్లు రూపాయల ముద్రణ పెట్టే ఎటి.ఎమ్‌ల ‘అరల’ సంస్కరణ వగైరా సలహాలు యివ్వొచ్చుగా?
‘‘ఓరి వాజమ్మా! కార్డు గోకి సరుకులు కొనడం, మొబైల్‌నే మనీ పర్సుగా, కాపర్స్‌గా వాడుకోవడం వగైరా చెప్పడం నాయుడుగారి పరిధి. అందుకనే, ఆయన మొన్న పదిహేనున మీటింగెట్టాడు, అధికార గణాలందర్నీ కొలువు తీర్చాడు. ‘‘మీలో ఎంతమంది ‘నొక్కుడు టెక్నిక్’ని వాడి ‘బండి’ లాగిస్తున్నారు? చేతులెత్తండి!’’ అన్నాడు. బెరుకు బెరుకుగా కొంచెంమంది అరచేతులెత్తారు. ‘‘వార్నీ! ఇరవై శాతం కూడా లేరు. ఇలా అయితే డిజిటల్ విప్లవం ఎలా వస్తుందీ?’’ అంటూ నవ్వుతూ ప్రశ్నించారు. వాళ్లు కూడా ఏడవలేక నవ్వేశారు. ‘‘కానీ, చూశారా, మీకన్నా తాగుబోతులు నయం. లిక్కరు దుకాణాలన్నింటా కార్డ్ పేమెంట్ చేసే, సదరు జనాలు తీర్థం పుచ్చుకుంటున్నారు’’ అని చెప్పాడాయన.
అది సరేగానీ జనవరిలో అంటే కొత్త సంవత్సరంలో సుప్రీం నోట్ల రద్దుమీద తీర్పునివ్వవచ్చునంటున్నారు కాబట్టి ఈలోగా ఎంజోయ్ చెయ్యండి క్రిస్‌మస్ గిఫ్ట్‌లు!
డోంట్ ఫర్‌గెట్ యూ ఆర్ యిన్ ది క్యూ!
*