వీరాజీయం

హర్యానా మర్యాదకు మేలి ముసుగు గుర్తా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముందు అట్టమీద ముఖ్యమంత్రి ఖట్టార్ గారి చిరునవ్వు మోము దర్శనమిచ్చింది అనుకోండి- సమస్యే లేదు- ఎందుకంటే అది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రచురించిన ‘కృషిసంవాద్’ అనే పత్రిక. వ్యవసాయ శాఖవారి తరఫున రాష్ట్ర సమాచార శాఖవారు తయారుచేశారు- సమాచార శాఖవారు విడుదల చేసిన మార్చి సంచిక- మార్కెట్‌లోకి బాగానే మార్చ్ చేసిందిగాని- దాని వెనుక అట్టమీద బాంబు ప్రేలింది. ప్రౌఢమయిన ఒక వ్యవసాయ కూలీ తన నెత్తిమీద తట్ట, అందులో పశుగ్రాసం పెట్టుకుని దర్జాగా నడిచి వస్తున్నది. అందంగా ఆరోగ్యంగా వున్న ఈ బొమ్మ నిస్సందేహంగా వ్యవసాయ కృషికి దర్పణమే.. కాని, దానికి పెట్టిన శీర్షికతోనే రగిలింది చిచ్చు- బొమ్మలోని వ్యవసాయ వనితారత్నం మొహం పూర్తిగా (మేలి) ముసుగుతో కప్పేసుకుంది.
‘ఘూనఘట్’ అంటారు ఈ ముసుగుని. దీనికి వర్ణనాత్మమయిన వివరణ- చక్కని ద్విపద పెట్టిలో వుంది. పరికింపుడు ఇంపుగా.. ‘గుంఘట్‌కి ఆన్ బాన్ / మెహ్రే హరియానాకి పహ్చాన్’ అంటే మేలిముసుగు శోభ- హర్యానా రాష్ట్రంలో గుజరాత్‌లాగే పరదా, లేదా ముసుగు లాంటి ఆచ్చాదన లేనిదే ఆడాళ్ళు ముఖ్యంగా పెళ్లి అయిన మహిళలు పబ్లిక్‌లోకి వచ్చేవాళ్ళు కారు. కాని ఇప్పుడు ఇలాంటి సంప్రదాయాలకు క్రమేపీ ఉద్వాసన పలుకుతున్న కాలంలో- గవర్నమెంటు వారి పత్రిక సాక్షాత్తు ముఖ్యమంత్రి ముం‘దట్ట’మీద విరాజమానుడై వుండగ ఇలా ‘పరదే మె రహ్నాదో పరదా నా ఉట్టావో’ అన్న సందేశం ఇవ్వడం అభ్యుదయ పంథాని వెక్కిరించినట్లు లేదా..? ఒక పక్కన ‘బేటీ బచావో / బేటీ పడావో’ అంటూ సమాజంలో మగవాడితో సమానంగా ప్రతిపత్తిని కల్పిస్తామంటూ భాజపా కేంద్ర నాయకులు ఊదరగొట్టేస్తూ వుంటే- పరదా మా రాష్ట్ర ప్రతిష్ఠకి పర్యాయపదం అంటూ గవర్నమెంటు పత్రికమీద విన్యాసమేమిటి? దీంతో కాంగ్రెస్ నాయకత్వానికి మనోహర్ ఖత్తర్‌గారి పిలక చేతికి దొరికినట్లయింది.
నేరుగా మాజీ ముఖ్యమంత్రి ఊపేంద్ర సింగ్ హుడా, ఆయనకీపక్క తాళంవేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రంజీత్ సుర్జిత్‌వాలాలు రంగంలోకి దూకారు.
ఇంతకన్నా తిరోగమన విధానముందా? అని డ్రమాటిక్‌గా అడిగారు వాళ్లు. దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ ఆడవాళ్లను వెనక్కి పితృస్వామ్య యుగంలోకి తీసుకుపోవాలనుకుంటున్నది అన్నమాట అని కూడా నిందవేశారు. దీంతో గవర్నమెంటు హరి హరీమంటూ కదిలింది. ఎవరు ఈ పత్రిక ఎడిటర్, బులావ్ అన్నారు. ప్రస్తుతానికి ఎడిటర్ ఎవరూ లేరండి- వున్న సిబ్బందితోనే మానేజి చేసేశాము అని సమాధానం. పైగా ఆ బొమ్మ మన అధికారిక చిత్రరాజము కాదు.. విజ్ఞాపన అంటే అడ్వర్టైజ్‌మెంట్.. వచ్చిందే చాలు అని కళ్ళు మూసుకుని వేసేయ్యాలి. పైసలొస్తాయి గనుక ప్రకటనలని అన్నది ఒక రూలు. కాని ఎడిటర్ ఒకడు ఉంటే- ప్రకటనలు వ్యాసకర్తలు వగైరా వెలిబుచ్చు అభిప్రాయములతో సంపాదకునికి పత్రికకి సంబంధంలేదు. కవి హృదయం సదరు కవికే చెందుతుంది అని ఒక చిట్కా ప్రకటన కనీ కనపడని చోట వేసి- గొడవలు వస్తే వీపు కాపాడుకుంటానికి జాగ్రత్తపడతాడు.
ఇక్కడే దొరికిపోయారు. ఎవరికీ? అప్పోజిషను పార్టీకి. నిజమే, ‘‘పరదామే రహ్నేదో పరదా ఉట్‌గయి తో ఖేద్ ఖుల్జాయా’’ అన్న సినిమా పాట ఉండనే ఉంది. ‘‘తెర తీయగరాదు?’ అంటే ‘తీస్తే గుట్టు కాస్త గోవిందా’ అంటుంది ఆ పాట. సంపాదకుడు లేకుండా గుమాస్తాలు పత్రిక లాగించితే ఏమి అవుతుందో? ఉంటే వానిమీదకి ఈ నింద తోసేద్దుము అనుకున్నారు. కాని ముఖ్యమంత్రి నుంచి సమాచార అధికారులదాకా అందరికి తల బొప్పిగట్టేలా తెలిసింది బాధ. ఈలోగా మహిళా లోకం లేచింది. మేము ఈ దిక్కుమాలిన బురఖాలు, ఘోషాలు, ముసుగులు.. ఇవన్నీ వద్దని ఇప్పుడిప్పుడే మా మగమహారాజుల్ని, మావయ్యల్ని, అత్తయ్యలని- గ్రామ నాయకుల్ని దారిలోకి తెచ్చుకుంటున్నాము- ఈలోగా ఈ గవర్నమెంటు ‘ప్రతిష్ఠ, శోభ, మరియాదా’ అంటూ పరదాని పట్టుకొచ్చింది అని ధ్వజం ఎత్తారు లీడర్సు.
ఇక్కడో చిన్న ఫ్లాష్‌బ్యాక్ ఉంది- మేలిముసుగులో అంత మేలిమి ఏమీ లేదు, మగాడి దాష్టీకం తప్ప అంటూ తిరగబడ్డ కొంతమంది మహిళామణులు మొత్తం 44మంది ఘోంఘట ఆచారానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నారు పోయినేడాది. వాళ్లంతా చదువుకున్నవాళ్లే- వల్లభ్‌ఘడ్‌కి చెందిన మీర్జాపూర్ గ్రామ వాసులు- ఉమ్మడి కుటుంబ సభ్యులు- ఐనా అందరినీ ఒప్పించారు. ఇంట్లో ఎలాగూ ఘోంఘట్‌కి రోజులు చెల్లాయి హర్యానాలో- ఇక బయటికి ఆడది ఉద్యోగం సద్యోగం- ఇంటి అవసరం మొదలైన పనుల కోసం వెళుతున్న రోజులు గనుక గుడ్ బై టు ఘాన్గాట్ అన్నారు. ఫరీదాబాద్ డిప్యూటీ కమిషనర్‌ని ముఖ్య అతిథిగా పిలచి- గ్రామ నాయకుల సమక్షంలో ముసుగులు తీసి అవతల గిరవాటు వేశారు పోయినేడాది ఈ రోజుల్లో- ఇదొక ప్రేరణగా హర్యానా పడుచులు ఖురఖా విసర్జిస్తూ వుంటే- అంతలో, ఇదేమిటీ? విడ్డూరం? అన్నారు. అన్ని పార్టీల వాళ్లు ‘్ఛన్స్ దొరికింది గదా’ అని తలో గెడ్డా వెయ్యసాగారు.
హర్యానా పల్లెటూరి అమ్మాయిలు ఆదర్శంగా నిలుస్తున్నారు. పరీక్షలలో ఆల్ ఇండియా ర్యాంకులు కొట్టేస్తున్నారు. హర్యానాలో ఆడాళ్లేమీ వెనుకబడి లేరు. ఆడపిల్లలు గోలీలాడ్డం, బిల్లంగోడు ఆటలో మగాళ్ళతో సమానం అంటూ ముందుకు రావడమే కాదు, ఏకంగా కుస్తీలో బస్తీమే సవాల్ అంటూ గీత ఫోగాట్ సోదరీమణులు మన దేశానికి బంగారు పతకాలు కొట్టుకురాలేదా? వాళ్ళ కధ దంగల్ సినిమాగా చైనాలో కూడా ధూమ్ మచాయించడంలేదా?
పరదాలో నొక్కేస్తున్నారు ఇలా ప్రకటనలు వేసి- గాని మగువల తెగువ మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతూనే ఉన్నది అంటూ భాజపా ఎన్నో సంఘటనలు ఏకరువు పెడుతున్నారు. కాని ఏమి లాభం? ‘వెయ్యి అప్పదాలకి ఓ సొడ్డు’ అన్నట్లు ఈ కృషి సంవాదం పత్రికమీద కార్మిక పడతికి ముసుగు తొడిగి కార్మిక లోకాన్ని కించపరిచారుగా అంటున్నారు కిట్టనివాళ్ళు. కవి ఏమన్నాడు? ‘ముఖ్డే కో ఆంచల్ మీ చుపాలో- కహిన్ కిసీకా నజర్ నాలాగే’’ అని కదా? దిష్టి తగులుతుందేమో ఓ అమ్మడూ! పయ్యెదలో మొహం దాచేసుకో అని అర్థం. అబ్బ! ముసుగులోపల ఇంత మంచి మనసు మర్మం దాగి వున్నదా? మగాడికి అని ముక్కున వ్రేలేసుకుంటున్నారు, మన లెగ్గీ, కుర్తీ, జీన్ అమ్మాయిలు. సరే, ఈ డిబేటు ఇలా కొనసాగుతుంది కానీ, మొహానికి దిష్టి తగులుతుంది అని ఏ మాడర్న్ గాళ్స్ ముసుగులు, బురఖాలు పైటలు వల్లెవాట్లు ధరించి బయటికి వస్తారు? మొహమే కదా పెర్సనాలిటీ అంటే..
ఇప్పుడే హర్యానా అమ్మాయి కుమారి మనీషా చెల్లర్ ఫెమినా పోటీలో గెలిచి మిస్ ఇండియాగా కిరీటం పెట్టించుకున్నది. మిస్ వరల్డ్ పోటీలకి కూడా వెళ్తుంది ఆమె- హర్యానా మంత్రి ఒకరు దీనికి కూడా ‘మాదే క్రెడిటు’ అన్నాడు. అంచేత, హర్యానాలో కూడా ముసుగులు ఆడపిల్లలకి ఆమడదూరం వెళ్లాల్సిందే.. అసలు ఈ సంప్రదాయం మంచిది కాదు అని హర్యానా యువతులు నిర్ణయించారు.
లెట్ ది ఫేస్ నాట్ ది వీల్ రిప్రజెంట్ ది స్టేట్!