వీరాజీయం

రాష్టప్రతి అభ్యర్థి ఎవరు?.. ఓ చిక్కు ప్రశ్న..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలై 24తో ఇప్పుడు రాష్టప్రతిగా వున్న ప్రణబ్ ముఖర్జీగారి పదవీకాలం ముగుస్తుంది. కొత్త రాష్టప్రతి పదవి ఎవరికి కట్టబెట్టాలి అన్న అంశం మీద మోదీగారికే ఒక ఆలోచన కుదరటంలేదు. రాష్టప్రతి ఎన్నిక లాంఛనప్రాయం కాదు- నల్లేరుమీద బండిగా పాలక పక్షాల ఇష్టప్రకారం కొనసాగేదిగా కూడా కనబడటంలేదు. ఎన్నికకి నామినేషన్ తేదీ - పోలింగ్ తేదీ - కౌంటింగ్ తేదీ అన్నీ ప్రకటించిన తరువాత కూడా ఎన్‌డిఏ అభ్యర్థి కూడా ఇంకా తేలలేదా? అనడిగాడో క్రిటిక్.. నరేంద్రమోదీగారు ఏదయినా ఇట్టే నిర్ణయించేసి తాంబూలాలు ఇచ్చేశాను అంటూ తాఖీదు జారీ చేసేస్తాడు కదా? అంటే- ఇదేమి ‘రద్దు’ వ్యవహారంకాదు- వోట్ల పద్దు వ్యవహారం కదా? ఈలోగా ఊహాగానాలు షికార్లు చేస్తూ వుంటాయి.
లోగడ అసెంబ్లీలకి, స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిగే ముందు- అభ్యర్థుల ఎంపికకి ముందు విలేఖరులకి గుడ్‌మార్నింగ్ గుడ్‌ఈవెనింగులు కొట్టేవారు. బాబ్బాబు, అభ్యర్థి ఎంపికలో నా పేరు నలుగుతోందని చిన్న ఫీలరు వదుల్దూ- నీ పేరెట్టి దీపం పెట్టుకుంటాను అనేవాళ్ళు- అలాగా, నీకు తోచిన పేరు లేదా నీకు రాజకీయాల్లో వుండటం ఇష్టం లేనివాళ్ళ పేర్లు వుంటే చెప్పండి- ప్రచారంలో పెట్టేద్దాము అందామా? భాజాపా సర్కిల్స్‌లో మామూలుగా పెద్దాళ్ళుగా ముద్ర వేయబడ్డ పేర్లు రెడీమేడ్‌గా వున్నాయి. బీహార్నుంచి షాట్ గన్ అద్వానిగారికే నా ‘సప్పోర్టు’ అంటూ బాణాలు సంధిస్తున్నారు. మరో పేరు మురళి మనోహర్ జోషీ ఉండనే వుంది. చాలా పత్రికలు వీరి పేరున సర్వేర్లు వోటింగులు పెట్టేయి కూడాను కాని ఈ ఇద్దరు ఏరుదాటి తెప్ప కూడా తగలబడిపోయింది అనుకున్న దశలో- ‘బాబరీ మసీదు’ కేసు కాష్మోరా లేచాడు అన్నట్లు లేచింది. విధి బలీయమా? రాజకీయమా? అనడిగాడు జర్నలిస్టు- సోది అడగమన్నాను. సరే, సుమిత్రా మహాజన్- లెక్కలేనన్నిసార్లు పార్లమెంటుకి దూసుకొచ్చిన పాతకాపు. ఇంకా, విదుషీమణి సుష్మా స్వరాజ్- ఈమె ‘ట్రాక్ రికార్డ్’ జగమెరిగిన సత్యం, పైగా ఏ పదవికయినా కొలతలు యిచ్చి కుట్టినట్లు సరిపోతుంది అంటారు. ఆమెకి కిడ్నీ మార్పిడి అయింది కనుక ఈ రాజకీయ సమరం కుట్రలు పన్నాగాలు లేని పదవి వుంటే మంచిదే అన్నది ఓ విద్యావతి అయిన ఇల్లాలు. మెయిన్ ట్రాక్‌మీదనుంచి ఆమెని తప్పించినట్లవుతుంది, కనుక క్యాబినెట్‌లో వున్న నెంబర్‌వన్, నెంబర్ టులకు కొంత ఊరట కాని, సోనియాగాంధీ దగ్గరికి పోయి ఈమె పేరెత్తితే కర్రుచ్చుగుంటుందే? 2014లో సోనియామీద ఆమె శపథం జ్ఞాపకం వుందా? ఆమె ప్రధాని అయితే నేను గుండు చేయించుకుంటానన్నది సుష్మాజీ. ఇంకా, చక్కర్లు కొడుతున్న పేర్లలో మోహన్‌భగత్ పేరు, శ్రీమతి ద్రౌపది పేరు, మెట్రో శ్రీ్ధరన్ పేరూ కూడా వున్నాయి- కాని బిజెపిలోనే ఓ సమ్మతికి రావాల్సిన అగత్యమున్నది.. శివసేన పక్కలో బల్లెం మోడీగారి దూకుడికి కళ్ళెం అంటూ వుంటారు. వాళ్ల బౌలింగ్ ప్లాన్స్ ఇంకా రెండు రోజులకు గాని తేలవు. ఇదీ ఎందుకు అంటున్నాను అంటే మోదీజీ మళ్లీ 24న కాబోలు విమానం ఎక్కేస్తాడు. ఈలోగా పేరు తేలాలి- ఎండిఎ కూడా వోహ్! క్రిందా మీదా పడి చర్చలు సాగిస్తోంది. ఏకాభిప్రాయ అభ్యర్థి అంటున్నారుగా? పోనీ, ముఖర్జీనే రాష్టప్రతి భవన్‌లోనే ఉండండి అనేద్దామా? అంటే మహారాష్ట్ర కూటమి ఏమిగాను? ఎంతసేపు రాజకీయ కూటమిలో నుంచే రావాలా? ఏమిటి? రాష్టప్రతిగా శాస్తవ్రేత్తలు, ఆర్థిక, న్యాయ నిపుణులు తగరా? అన్న ప్రశ్నకి స్వామినాధన్ పేరు సదాశివన్ పేర్లతోపాటు రోదసీ రంగంవైపు కూడా చూడవచ్చుగా?
ఇంతకీ లిటిగేషన్ లేకపోతే ఈ సమస్య మోడీగారికి వచ్చేది కాదు గాని- అలాంటే ఆయనకన్నా ఎక్కువ తెలుసా? అని యోగిగారు కోప్పడవచ్చును.. మనల్ని అడిగితే, ఇప్పటికే జైట్లీ మహాశయుడు- చిన్నా చితకా కాదు రెండు అతి ముఖ్యమైన - డిఫెన్సు ఫైనాన్స్ మొయ్యలేకపోతున్నాడు. ఉన్న ఒక్క హ్యాండు (సుష్మా) అలంకార పదవిలోకి వెళ్లిపోతే? సరే, పొలిటికల్ పండిట్స్ చెప్పిన కూడికలు తీసివేతలు చూద్దాం అంటే ఇక్కడ వోటర్లు వేరు. కేవలం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు మాత్రమే వోట్లు- పార్లమెంటు రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వోటింగ్ అర్హత కలిగివుంటాయి. వోట్లకో వాల్యూ వుంటుంది. చిన్న రాష్ట్రాలకి చిన్న విలువ పెద్ద రాష్ట్రాలకు పెద్ద విలువ వుంటాయి. దానికో ఫార్ములా వుంది. తిరుగులేని మోదీగా పేరుగాంచిన మన ప్రధానమంత్రి కూడా వేళ్ళమీద లెక్కలు కట్టుకుని- అరె కాసిన్ని వోట్లు తగ్గాయి- అదీ అస్మదీయులు శివసేనా వగైరాలు ‘మనమాట’ వింటేనే? అంటే మనలోమాట ఉన్నమాట చెప్పుకోవాలి.. అక్కడే మడతపేజీలు వచ్చేది. మొత్తంమీద 778 ఎంపీలు, 4120మంది ఎమ్మెల్యేలు వోటర్లు- ఎంపీ ఓటు విలువ 708 కాని రాష్ట్రాలలో యుపిలో వోటు విలువ 208 అయితే సిక్కింలో వోటుకి కేవలం 7 బలం.
కొత్తగా బిజెపికి మొన్న ఎన్నికల తరువాత వోట్ల శాతం ఆరు పాయింటూ అయిదు దాకా పెరిగింది. అయినా చెయ్యి జాపక తప్పదు. ఎందుకంటే రెండు వర్గాలకి మధ్య తేడా ఓ లక్షదాకా వుంది. ఎలెక్టోరల్ కాలేజీతో వచ్చిన పేజీ ఇదే. విప్పులు, క్లిప్పులు చెల్లవు.
ఈసారి లేడీసుకు అవకాశం ఇద్దామేమిటి? అని ముందరకాళ్లకి బంధం వేశారు కాని అదీ ప్రతిపక్షాలను కంగుతినిపించాలనే- ఎస్టీలలో ఒక మహిళకి అత్యున్నత పదవి ఇచ్చాము అన్నమాట దక్కుతుంది కదాని..? పోగా బాగా పండిపోయిన పాపులర్ అయిన వయోవృద్ధుల్ని వెతికి వాళ్ళ నామధేయాలు ఘనంగా టాం టాం కొట్టి.. ప్రతిపక్షాలు వద్దు అనే విధంగా జాగ్రత్తపడాలి అన్నదో ట్రిక్కు.
మోదీ మనసులో మాట అమిత్‌షాకి అమితంగా తెలుసు గనుక- ముందుగా ముగ్గురు సభ్యుల కమిటీని రంగంలోకి దించారు. అయితే, అసలు మీరో పేరు లేదా రెండు పేర్లు పట్టుకుని వచ్చి- ‘మీకు’ తక్కువ అవుతాయనుకున్న వోట్లకి బేరం పెట్టాలిగాని - ఏమీ అనుకోకుండా ‘మాకు మీరు జైకొట్టండి’ అంటే ఎట్లా? అన్నది సోనియామాత. చల్లకొచ్చి ముంత దాచేసినట్లు మాట్లాడితేనే ఎవరికైనా మండేది అన్నాడు కంపా అభిమాని.
అట్లుండనిండు- దక్షిణాదిన పార్టీలకు వున్న బలం కలసిరావాలి, ఇండిపెండెంట్లు కలసిరావాలి. బాబుగారు జైకొడుతున్నాడు సరే, కాని బిజెడికి 36,500, టిఆరెస్సుకి 23,200 బలం వుంది. అన్నీ బేరీజు వేసుకుని రంగంలోకి దిగడం ఇప్పుడు బిజెపి చేస్తున్న పని. హేమ్మలినినా? ఐశ్వర్యా? ‘మన’ అమితాబ్‌బచ్చన్నా? సల్మాన్‌ఖానా లాంటి సరదా కబుర్లకు వేళ మించిపోయింది. సీరియస్సుగా అందరూ కూర్చోండి- కోతిబట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి.. అన్న వేమనగారి సూక్తిలాగ వుండకూడదు కదా- లేదు కదూ, నాన్ పొలిటీషియన్ అనంగానే మేధావులు, సైంటిస్టులు ‘నోటి దురద చెయ్యివాటం’ లేనివాళ్ళు కళంక చరిత్ర లేకుండా డొక్కశుద్ధిగలవాళ్ళు వున్నారు కుప్పలు మన దేశంలో వెతికి తియ్యండి.
ది డిగ్నిటీ అండ్ ది ప్రెస్టేజి ఆఫ్ ది నేషన్ డిపెండ్ అప్‌ఆన్ యువర్ ఛాయిస్!