వీరాజీయం

రైతన్న కనె్నర్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో అటు కర్ఫ్యూ సడలిస్తూండగా ఇటు భోపాల్ దసరా మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉపవాస దీక్షకి కూర్చున్నాడు పాపం! రైతుల సమస్య పరిష్కరింపబడేదాకా ‘నేను పచ్చి మంచినీళ్ళు ముట్టను’ అన్నాడు. అలాగే, రైతు ఋణ పరిష్కార పథకం ఒకటి ప్రకటించాడు. ఈలోగా రైతులు రాళ్ళురువ్వుతూ కనబడ్డ వాహనాలు, బిల్డింగులను కూడా ‘పరశురామ ప్రీతి’ చేస్తూ పోలీసు బుల్లెట్లకు ఎదురొడ్డారు. ఆరుగురు రైతులు వాళ్ల నాయకుల దృష్టిలో ‘వీరమరణం’ పొందారు. మందసౌర్ జిల్లాలో మరో ఆరు జిల్లాల్లో భూనభోమండలంను అగ్నిజ్వాలలే కలుపుతున్నంత ఉగ్రంగా ఉద్యమం అదుపుతప్పగా- ఈలోగా ‘బికేఎస్’ సంఘం వారు ‘ప్రోగవర్న్మెంటు’గా ఆందోళనకి దూరం అవడంతో స్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో ఇదంతా 2015-2016నాటి కరువు ప్రభావమేనా? లేదా 70 శాతం వర్షాధార రాష్ట్రం గనుక, ఇవాల్టికి ఇంకా కోలుకోలేదు అంటారా?- అట్లా అనడం ‘బేవకూఫీ’అంటే ‘్ఫలిష్నెస్స్’ అన్నాడు ఓ రైతు బాంధవుడు. ఇరవై శాతం అభివృద్ధి కనబడుతోంది- రైతులు ఉల్లిపాయలు బంగాళా దుంపలు, పాలూ వగైరా తగిన ధర రాక రోడ్లమీద నిర్దాక్షిణ్యంగా ఒలకబోస్తున్నారు- అసలు గిట్టుబాటు ధరకన్నా అన్ని పంటలకి తక్కువ మార్కెట్ ధర పలుకుతోందిట.
వేలాది మంది అన్నదాతలు- అప్పులు తీర్చలేక ‘స్వేదార్జితం’ లాభాలు తేకపోడంతో ఇప్పుడు ఆత్మహత్యల బాట వదలి ఆందోళన బాట పట్టారు- ‘జై కిసాన్’ ఒక్క మధ్యప్రదేశ్‌లోనే కాదు పక్కనున్న సంపన్న మహారాష్ట్రంలో కూడా రోడ్డున పడ్డాడు. తమిళనాడు రైతు విజృంభణకి మళ్ళీ సన్నద్ధవౌతున్నాడు. వ్యవసాయ ప్రధానమైన దేశంలో జైకిసాన్ పరిస్థితి ‘అయ్యో అయ్యో! రైతన్నా’ అన్నట్లుగా మారిపోడం- ఆత్మహత్యల లెక్కలలో కర్షకుడిదే అధిక సంఖ్యా కావడం విరోధాభాసే..
ఇట్టితరి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగారి ‘‘గాంధీగిరి’’ ఏమయినా ఫలించేనా? శివరాజ్‌గారు ఉల్లిపాయలు కిలో ఎనిమిది రూపాయలకి కొంటామన్న మాట ఇంకొంచెం ముందుగా అని వుంటే అవతల రుతుపవనాలు వస్తున్న దశలో రాష్ట్రం జ్వాలామయం అయ్యేది కాదేమో? అన్నది సామాన్య జనవాక్యం- అసలు జూన్ ఒకటి నుంచి పది రోజులు తాము ఉద్యమం చేస్తామని మూడు ‘పెద్దరైతు’ సంఘాలు ప్రకటించి- ఇండోర్ వద్ద రోడ్లన్నీ పాలు, కూరగాయల వరదలతో ముంతెత్తేదాకా పాలక వర్గాలు ఏమిచేస్తున్నట్లు? జూన్ ఒకటిన మా కు ధర గిట్టుబాటు అ వటం లేదు అని పది రోజుల తిరుగుబాటును అన్నదాతలు మందసౌర్ నుంచి ఇండోర్ సెంటర్ దాక ప్రతిధ్వనించేల్లాగా అరిచారు. నాలుగు తేదీ నాటికి సహౌర్, ఇండోర్, భోపాల్ జిల్లాల దాకా ఆందోళన చిచ్చు చెలరేగింది- ఒక రైతు పోలీసుస్టేషన్‌లోను మిగతా అయిదుగురు రాహుల్‌గాంధీ అన్నట్లు ‘రణ రం గం’లోనూ బలి అయిపోయారు- ఈలోగా, భారతీయ కిసాన్ సంఘ్ ముఖ్యమంత్రిని కలుసుకొన్నాక- ‘మేము ఆందోళన వాయిదావేస్తున్నాము’ అంటూ తప్పుకుంది- మి గతా, రెండు సంఘాల వారు దీనికి మండిపడ్డారు- ఆ మంటల మధ్య ముఖ్యమంత్రి సారు ఉల్లిపాయలకి మేము కిలో ఒక్కంటికి ఎనిమిది రూపాయలు ఇస్తామండీ అంటూ ప్రకటించారు. అప్పటికే యుద్ధమేఘాలు ఉధృతం ఐయ్యాయ్- అత్యవసరంగా మీడియాని పిలిచి- ఆందోళనకి రాళ్ళు ఎవరో అందిస్తున్నారని-అంటే?... కారు దాన్ని అడ్డితే బస్సు- అదీ కుదరకపోతే స్కూటరుమీద వెనుకనుంచి వేరే దారంతా రంగస్థలానికి చేరుకుంటూ పోలీసులకు బందీ అయిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఈ రాళ్లు అన్నీ అందించాడనా? అడిగాడో కర్షక్ కాంగీ నాయకుడు.
రైతులతో, డెయిరీ ఫారం ఓనర్లతో, సిబ్బందితో, పాల ఉత్పత్తిదారులతో ఒక్కసారి తిరుగుబాటు స్థితిని తెచ్చుకోవడమే అధికార యంత్రాంగం చేసిన బుద్ధి పొరబాటు. దారికడ్డం వచ్చిన గేదల్ని తోలినట్లు రైతన్నల్ని లాఠీతో బెదిరించడం సాధ్యం కాదు అన్న నిజాన్ని కేంద్ర నాయకత్వమయినా చౌహాన్ గారికి చెప్పి వుండాల్సింది- సీనియర్ నాయకుడు మంత్రివర్యుడు వెంకయ్యనాయుడుగారు- మధ్యప్రదేశ్ ము ఖ్యమంత్రి కోసం బ్యా ట్టింగ్ చెయ్యడం చూ స్తే ఈ ఉద్యమ గరిమని, గరిమనాభిని కూడా ఒప్పుకోడానికి కేంద్రం సిద్ధంగా లేదా? అనిపిస్తోంది. ప్రధానమంత్రి ఫసల్ భీమా లాంటి పథకాలు- మండీదగ్గర నిలబడి చె ప్పాల్సినవి కాదు- ధిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు- ఇక, కర్నాటకలోను రైతులు ఆత్మహత్య మార్గాన్ని వదిలి హింసాత్మక దారి- దహనకాండ- ధ్వంసకాండ బాట పట్టడం- స్పష్టంగా కనబడుతున్నది- ఒక రకంగా. జైకిసాన్ల ప్రాణాలు దక్కడం- మంచిదేకాని లాఠీలకి, తూటాలకి వాళ్ళు బలికావడానికి కారణాలు, నిష్కామకర్మగా వెతకాలి- దీన్ని వ్యక్తీ లేదా పార్టీ ప్రతిష్టలకి అతీతంగా పరిశీలించాలి- బజారున పడటానికి అసలు కారణాలు- ప్రతిష్టకన్నా ముఖ్యమయిన అతి ముఖ్యం- ఎందఱో అంటున్నారు. చిన్న కమతాల రైతులు నోట్లరద్దు తరువాత ప్రయివేటు- అప్పులు దొరక్క బ్యాంకు రుణాలు సడలింపులకి నోచుకోక- సిద్ధాన్నం ముందునుంచి లేచి- విరక్తిచెంది ప్రాణాలకు తెగించుతున్నారని- ఇది ఆలోచించవలసిన అంశమే..
నదుల అనుసంధానం- భారీ నుంచి చిన్నపాటి వరకు జల వనరుల నిత్యనూతన పథకాలు ఇవన్నీ - ఏమి అవుతున్నట్లు? - వర్షాధార ప్రాంతం- నిత్య జల ధారల ప్రాం తం అంతటా- జైకిసాన్ నినాదం ప్రతిధ్వనించకపోడానికి కారణం అతి బలహీనంగావున్న ప్రతిపక్షాలు అని సముదాయించుకోడం- ఏమి నీతి? చిన్న కమతాల కూరగాయల ఫల తోటల రైతునయినా నిస్పృహ చెందకుండా చెయ్యగల విధానం కావాలి. పంట సర్వం ఒడ్డి కుప్పపోసి రోడ్డుపాలు చెయ్యడం? రాజకీయమా? పరిహారాలు- సమయానికి ఆదుకోను సబ్సిడీలు. పనిచెయ్యని ఎరువులు, క్రిములనుకాక రైతులను ఏడిపించే పురుగుమందులు- బ్యాంకుల పీడింపులు, ప్రైవేటు ఋణదాతల దాష్టీకం ఇవన్నీ చిన్న రైతుని ‘చావు లేదా చంపు’ దశకి తీసుకువస్తున్నాయేమో? అది అలావుంచి, కాంగ్రెస్సు , ఆప్ నేతలు చౌహాన్ గద్దెదిగాలి అన్నందుకు ‘హర్ట్’ అవడం మానెయ్యాలి. చస్తున్న రైతుకి కానీ అల్లాడుతున్న అధికార పార్టీకి కాని దీనివల్ల ప్రయోజనం లేదు. చెత్త కార్యక్రమం అవుతుంది.. దిగమంటే దిగకు- సమస్యని పార్టీకి అతీతంగా ఆలోచించి సాల్వ్ చేయి.. అదే ముఖ్యమంత్రి తక్షణ కర్తవ్యమ్.
ఎంతసేపూ 2019 మీదేనా ధ్యాస? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నిరాహారదీక్షా శిబిరం నుంచే అందరితో మాట్లాడుతాను అంటున్నాడు- ఎవరెవరికి ఏమేమి కావాలో చర్చించండి- ఆరు జిల్లాలను కుదిపేసిన రైతు ఆగ్రహం- కర్షకులే ఎక్కువమంది గల వర్షాధారిత ప్రదేశంలో ప్రమాదమే. ముఖ్యమంత్రి శిబిరంలో వెల్తురు వేడిమికాదు వెంటనే రావాలి అంటే మొదట, చేతికందిన ఫలసాయం నేలపాలు కాకుండా చూడాలి... కేంద్ర నాయకత్వం మంత్రులూ కూడా కిసాన్ శాంతికి చేయూతనివ్వాలి- ‘‘త్రోయ నేర్చు కుక్క దొంతులు పెట్టనేర్చునే?’’ అన్నట్లు నేలబాలయిన పాలు పండ్లూ కాయగూరలు ఎవడబ్బ సొమ్ము? అది ప్రజల హక్కు మొదట అది చూడండి. మీరే పిలచి మాట్లాడండి- ముఖ్యమంత్రి ‘‘గాంధీ గిరీ’’ పిలిస్తేనే అందరికి దేశానికి కూడా మంచిది.
దిస్ టైప్ ఆఫ్ ఏజిటేషన్ షుడ్ నాట్ బికమ్
ఎ ట్రెండ్ సెట్టర్! *