వీరాజీయం

అదుగో ‘ఇ’లోకం! మనదే ఆ నేస్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లాళ్లు క్యాష్‌లెస్‌గా, రెస్ట్‌లెస్‌గా అదేదో మరో లోకంలో సాగుతున్నట్లు గడిచిపోయాయి. ‘నమో’నల్లధనం వేట- సామాన్య ‘జనం’ తెల్లధనంకోసం వెంపర్లాట బ్యాంకు నుంచి బ్యాంకుకి- ఏ.టి.ఎమ్.నుంచి ఏ.టి.ఎమ్.కీ వేట- ప్రతిపక్షాలకి కంఠశోష- పైగా ‘బ్లాక్‌డే’పాటించి గజగజ వణికించే చలిలో- తెల్లని పొగమంచు బురఖాలో ఐకమత్యంగా నిలబడి పాడిన నిరసన పాటల- యొక్క ఫలితం లేని ‘ఇరకాటం’గా గడిచిపోయింది.
కుప్పలు కుప్పలుగా నల్లడబ్బు బ్యాంకుల గోడౌన్లలోకి చేరుతూ వున్నా- ‘ఇంకా చాలావుంది’- అన్నది ప్రధానమంత్రి ఆందోళన. అది రావాలంటే జనం ‘నొక్కుడు బిజినెస్’ నేర్చుకోవాలని శ్రీమాన్ నరేంద్రమోడీ ఉద్ఘాటనల మధ్య వెయ్యి రూపాయలు చెలామణీలోనుంచి లేచి పోయాయ్. అయిదొందలు గడువుకు ముందే లిమిటెడ్ బ్రతుకునీడుస్తున్నాయ్.
ఎప్పటికి మరో ఇరవై రోజులు గడుస్తాయిరా! రామచంద్రా!’’అని జనం- ఆధనం, రుూధనం, ఏధనం చేతిలో లేక ‘యాప్’ల పాలైపోతున్నారు. ఏం కావాలన్నా నొక్కమంటున్నాడాయన. కొందరేమో ‘‘ఆరునొక్కరాగం’’ మాత్రం నొక్కుతున్నారు.
‘జన్‌ధన్’అని మరో కొత్త ఖాతా వచ్చింది. అక్కడ కూడా నల్లధనం పేరుకుపోయిందని ప్రధానమంత్రిగారి నమ్మకం. ఈ విధంగా రకరకాల ధనాలు ధనాధన్ చక్కర్లు కొడుతున్నాయి. ‘్ధనమూల మిదం జగత్’ అన్న మాటని అవతల పారేయమన్నాడు మన నమో బాస్! మొబైలే సర్వం జగత్ అనుకోమన్నాడు. అల్లావుద్దీన్ దీపం లాంటివే మొబైల్స్ ఆయన దృష్టిలో.
‘యాప్’లో పేటైములు, రుూటైములు, ఆ టైములు- పైగా, సుప్రీంకోర్టు ఆధార్ మాట ఎత్తవద్దన్నా- యిప్పుడదే ఆధారంగా- పదంకెలు వరుసగా నింపడం- అకౌంట్ నంబర్‌లో వున్న పది మీద రెండు అంకెలు కళ్లజోడెట్టుకున్నా కానరాని కంతల్లో నింపడం- యివన్నీ, నేర్చుకోమంటున్నాడు సారు. ‘మొండివాడు రాజుకన్నా బలవంతుడు’ అంటారు. గానీ మెండివాడే రాజైతే? అదీ పరిస్థితి ఆయన ‘మన్‌కీ బాత్’ని అర్ధం చేసుకోవాలి మనం. తప్పదు. మరో మాటకి ఛాన్స్ లేకుండా, ‘అంతా ఒన్‌వే ట్రాఫిక్’ అయిపోయింది.
నమో మన్‌కీ బాత్‌కి- రేడియోద్వారా గవర్నమెంట్‌కీ నాలుగు కోట్ల డెబ్భయి ఎనిమిది లక్షల రూ.ల ఆదాయం కూడా వచ్చింది. చూశారా? ఎంత ‘వాల్యూ’నో? ఏరు దాటేశాను అనుకుని తెప్ప తగలెట్టుకుని నిలబడి పోయిన వాడెలాగుంటాడు? అందరికీ తెల్సిపోయింది. కాకపోతే నిర్విరామంగా అరిచే అప్పోజిషన్‌కి గానీ, క్రిటిక్స్‌కి గానీ, ఆర్.బి.ఐ.కి గానీ సొల్యూషన్ దొరికే ఛాన్సులేదు. ‘మనో’వేగంతో- నమో వేగంతో అవతల కరెన్సీ నోట్లు ప్రింటవటం లేదు. పిటీ!
ఆరొందల నోటు, పదకొండొందల నోటు గుద్దితే పోను- రుూ సమస్య రాకపోను. రెండు వేల నోటుని- ‘‘పింకీ...పింకీ!’’ అంటూ ముద్దాడటానికే గానీ, దానె్నక్కడ చిల్లర మల్లర అవసరాలకి చూపెట్టినా- ‘‘పోయినా! అంటున్నారు విక్రేతలు. వాహన చోదకులు. సంకల్పం గొప్పదేగానీ- దానంత వేగంగా పైసా చెలామణీలోకి రావద్దూ?
లల్లూప్రసాద్‌గారు కోప్పడ్డాడు- ‘‘్ఫకీర్‌నంటావ్! మళ్లీ నీకంత డబ్బు ఎందుకు?’’ - అని. ఆమాట సామాన్యుడు విని ఏమాట అనడం లేదు.
మమతాదీదీ- ‘‘నువ్వొక డిక్టేటర్‌వి’’ అన్నది. కాని ఆ మాటా, పాపం! ఓపిక లేక- ఆబాలగోపాలం అనడం లేదు. ‘‘పార్లమెంట్‌కి అతీతంగా వ్యవహరిస్తున్నావ్’’- అంటాడు ఏచూరిగారు. హూ కేర్?
ఈమాట అందరూ విన్నారు కానీ మన రాజ్యాంగం ప్రతిపక్షానికి నోరు తప్ప యింకేమి హక్కులూ అక్కరలేదని భావించటంతో- నోరు మూసుకుంటున్నారు. పైగా, ఎన్నడూ లేనిది- పూర్వాశ్రమంలో ‘ఆర్థిక వ్యవహారాల’ దిట్ట పాలనా మతలబుల పుట్ట’ అయిన రాష్టప్రతీజీ కలిగించుకుని చీవాట్లు వేస్తున్నాడు.
‘ఆప్ సేమ్ పార్టీ’ ఆడేస్తున్నారు గురూగారూ!’ అందామా, అంటే- పార్లమెంట్ లోపల భీష్మాచార్యులంతటివాడు- లాల్‌కిషన్ అద్వానీగారు- బోలెడంత ‘హర్ట్’అయిపోయిన మొహంతో- చెలరేగిపోయి- రెండువేపులు అక్షింతలు వేశాడు.-
ఈ పరిస్థితిలో మరో సమస్య వచ్చిపడ్డది. నల్లధనంధురులు ‘పింక్’్ధనంకోసం గాలం వేశారు. బ్యాంకులకి, పోస్ట్ఫాసులకి ‘దొడ్డిదారి’ వుంటుందన్న సంగతి అంతటి ధీరోదాత్త నాయకుడు అయిన ‘నమో’కి తెలియలేదు. వామ్మో! వాళ్లు ‘కేటు’గాళ్లు. బ్యాంకులకి చేరకుండా, కొంత డబ్బూ చేరేకా, మరికొంత కరెన్సీ యిలాగా- ఘటోత్కచుడు నోరు తెరిచి, ఆవలించి- లడ్డూలని లాగేసుకుంటున్నట్లుగా లోపలికి లాగేసుకుంటున్నారు. సి.బి.ఐ. వాళ్లు సదరు పింకు రంగు కారణంగా సదరు మణీని యిట్టే పోల్చి పట్టేసుకుంటున్నారు. ‘‘నలుపు’’ ‘‘తెలుపు’’కావాలన్నా - సామాన్యుడి తపస్సు, తపనగా మిగిలిపోగా- ‘నలుపు’ బ్యాంకులలోకి పోయి- శంఖులో పోసిన తీర్థంలాగా మారిపోయి లెక్కలికి ఎక్కి- గవర్నమెంట్‌ని, ఆర్.బి.ఐ.నీ సంతోషపెడుతూ వుంది గానీ- దాని జాగాలో రావాల్సిన ‘పింక్’ (ఒక్కటే ‘టూథౌజండ్’ నోటు అని, దొరల భాషలో చెప్పుకుంటున్నాం- గొప్పగా) నోటు, మళ్లీ నల్ల-పాతరలోకి జారుకుటున్నది అంటున్నారు.
‘‘వారెవ్వా! ‘అక్రమార్కుడిదే పై చెయ్యి’గా మారుతోందా?
‘‘బై ది బై?’’ అడిగాడో ఫ్రెండ్, ‘‘కోట్ల’’-కొలది దొరుకుతున్న రుూ గులాబీ ధనాన్ని బ్యాంకులలోకీ, జనాల్లోకీ త్రోసెయ్యకూడదా? అంటే కేసులోపల యిరుక్కున్న వాణ్ని డిన్నర్ పార్టీకీ, సినిమా హాలుకీ పంపించుతారా? ‘‘కేసు సెటిల్ అవ్వొద్దా?’’ అన్నది జవాబు.
సో... అల్లుడు అను వోటరు చేత మొబైలూ- నోట డాష్ డాష్...
‘‘జై’’గారున్నాడుగా మనకి. అదేనండీ! ఆర్థిక శాఖామాత్యులు. రాజుగారు- ‘‘మోదీ’’గారిని ఆదుకునే రుూ ‘ఇ’మేథావి మంత్రివర్యుడు అర్జంటుగా- తొలి మాసికోత్సవానికి ఎన్నోరకాల రాయితీలు అనగా డిజిటల్ రాయితీలు (యిదో కొత్తమాట. టీకా తాత్పర్యాలు అనేకం) ‘‘కురిసింది వానా చిరుజల్లుగా’’ అన్నట్లు పార్లమెంటులో కురిపించాడు.
పెట్రోలు, జర్నీలు- భీమాలు, ఆన్‌లైన్ మీద పొందితే ‘ముదరాలు’ యిస్తారు. ఇకనేం? ‘రోటీ కపడా మకాన్’లాంటివి ఏప్రిల్ ఫస్ట్‌దాకా ఆగితే అప్పుడు కొందారి. ఈలోగా ఏం చేద్దారి?-
అంటిల్ దెన్ హోల్డాన్ లైన్ టు హ్యాంగ్!

- వీరాజీ