వీరాజీయం

టాక్సీ ఎక్కంగానే ‘మతి’పోతుందేల..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ‘సైకిల్ యుగం’లో వున్నాం అనేవారు. ఇవాళ మనం చాలా దూరం ‘మోదీ’ యుగంలోకి వచ్చేశాం. సైకిలో, మోటర్ సైకిలో ఎవడూ ఎక్కడు- కనీసం మూడుచక్రాల ఆటో లేదా నాలుగు చక్రాల టాక్సీ (క్యాబ్) అయినా వుండాలి. మిడిల్ క్లాసు మాష్టర్లకి, మాడమ్స్‌కి ఇప్పుడు ‘క్యాబ్’ మోజు..
‘‘ఏంటండీ బాబూ! ‘‘సామాన్యుడూ’’ అంటూ తీసిపారేస్తారు- ‘‘బేకారు’’గాళ్ళు అంటూ మమ్మల్ని రుూసడిస్తారు. కాని మాకూ ‘‘ఆండ్రాయిడ్’’ ఫోనుంది. ‘‘యాప్’’లున్నాయి సవాలక్ష రకాలు. క్యాబ్ కోసం యాప్ నొక్కి హాయిగా వూపిరి పీల్చుకోవాలి అంతే.. అపార్టుమెంట్ ‘డ్రయివ్‌వే’లో టాక్సీ హాజరు.. డోర్ తెరువు.. దూరిపో అంతే హాయి ‘హాయి’- ఏ.సి. హాయ్! అంటూ చేరబడిపో- గమ్యం చేరుకొని టాక్సీ ఆగిందా! ‘‘కార్డు’’పీకు.. పైసలు ‘‘డిర్’’మంటూ మరో కంటికి తెలియకుండా పోతాయ్. టాక్సీ ఓనర్ల దగ్గరికి- అంటే వాళ్ల ఖాతాలోకి- అదీ మిడిల్ క్లాసు స్టయిలు!
ఇలాగే మొన్నీమధ్య రాజాచందర్- తాను బుక్‌చేసిన టాక్సీ అపార్టుమెంట్ ‘‘డ్రయివ్‌వే’’లోకి రాంగానే ఇలా లిఫ్ట్ డోరు లాగి దిగాడు. టాక్సీ ఎక్కేశాడు. ‘‘రిలాక్స్’’అయి వెనక్కి వాలిపోయాక ‘‘వాట్సప్’’ నొక్కాడు. తనను తాను మరిచిపోయాడు. తంతే కూడా తెలివి రాకుండా మరో ప్రపంచంలోకి వెళ్లిపోయాడు.
‘‘దిగన్నా’’అన్నాడు టాక్సీవాలా. దిగాడు మనవాడు.. అంతే దిగ్భ్రాంతి చెందాడు. సెక్రటేరియట్‌కి కాకుండా ‘ఎర్రంమంజిల్’కు చేరుకున్నానని తెలుసుకున్నాడు. టాక్సీ ఊబర్ వాలా తాపీగా చెప్పాడు- ‘‘సారూ, నువ్ బుక్ చేసిన కాడికి వచ్చినమ్. దింపమన్న కాడా దింపినమ్’’-
అంటే తనకోసం ఆగింది అనుకున్న టాక్సీ ‘‘త్రీజీరో ఫోర్ భానుచందర్ కోసం అన్నమాట- తను బుక్ చేసిన టాక్సీ ఏమయింది?’’ మైగాడ్ అది భానుచందర్‌ని సెక్రటేరియట్ దింపేసిందన్నమాట! ఔరా! వెంటనే ‘సెల్’ తీశాడు. నొక్కాడు.
‘‘అరే! ఇది నాది కాదు’’.. అని ఉలిక్కిపడ్డాడు. అక్కడ మరి తన ఫోను. ప్రొద్దున్న బాత్‌రూమ్‌లో పెట్టాడు భానుచందర్! బాప్‌రే ‘అఫ్‌కోర్సు బాత్‌రూమ్‌లోనుంచి ఎక్కడికి పోదు, గాని ‘‘ఇదెవరిది?’’ అన్నాడు..
టాక్సీవాలా- ‘తెల్వదు సార్! పాసింజెర్ వదిలిపోయుంటాడు.. పోలీసుస్టేషనుకాడ వదిలేయ్. సా ర్!’ టాక్సీ ఏక్సిలేటర్ నొక్కాక పోయింది ముందుకి. ఇట్లాంటి భానుచందర్‌లు, రాజాచందర్‌లు చాలామందే వున్నారు. ఊబర్ కంపెనీ చాలా కష్టపడి ఇటువంటి మతిమరుపు మహారాజుల మీద టాక్సీలలో వదిలిపెట్టిపోయిన వస్తువుల మీద సర్వేచేసి ఒక పెద్ద ‘‘సూచిక’’ ఒకటి తయారుచేసింది- ఓపికగా.. విదేశాల మాట మనకు ఎందుకు గాని- మన దేశంలో టాక్సీలోపోయి వస్తువులు పారేసుకున్న శాల్తీలు కొల్లలున్నాయి.
తాజాగా జరిగిన సంగతి 15 లక్షల రూపాయల చెక్కునొకదానిని మరిచిపోయాడో ‘ఆ బ్సెంట్ మైండెడ్ ప్రొఫెసరు’. సరే, ‘మందు బాటిల్స్’ అలాగే కుక్కపిల్లల్ని కూడా- మరిచిపోయినవాళ్ళు వున్నారు. సెల్‌ఫోన్లు, వెడ్డింగ్ రింగులు కూడా- అన్నింటికన్నా ముఖ్యంగా కీ చెయిన్‌లు, ఐ.డి.కార్డులు, పాస్‌పోర్టు కార్డు వున్న పర్సులు కూడా మరిచిపోతారు- కొందరు మాడ్రన్ మజ్నూలు-
ఈ మతిమరుపు వున్న మారాజులలో రకాలున్నారు. శనివారం నాడు తమ వస్తువులను టాక్సీలలో మరిచిపోయే వాళ్ళే జాస్తీ అంటున్నది ఊబర్ నివేదిక. 2016లో ఈ సర్వే- ఆరాతీసిన రోజులలో ‘‘లాస్ట్‌డే డిసెంబర్ 31’ అన్నింటికంటే టాప్! ఆనక డిసెంబర్ 11, 27, నవంబర్ 27, 12 తేదీలలో టాక్సీలలో చార్జర్లు, టోపీలు, సామాన్ల సంచులు, నాన్ వెజ్- టేక్‌హోమ్ ప్యాకులు మరిచిపోయి టాక్సీ దిగి యించక్కా ఇంట్లోకి పోయినవారి సంఖ్య ఎక్కువ. ఆనక నాలిక కరుచుకున్నా, జుట్టు పీక్కున్నా, ‘‘్ఫయిదానై’’కదా? మొత్తం 2900 కేసులు బుక్ అయినాయి పోయినేడాది. ఇంతమంది జీనియస్‌లున్నారన్నమాట టాక్సీ ఖాతాలలో. పెద్ద సిటీలలోనే ఊబర్ లాంటి టాక్సీల వాడకం బాగా పెరిగింది. ఆటోలు ‘యాప్’లు లేనివారు తప్ప మిగతావాళ్లకి. వద్దు- ఇది ‘‘సమ్మర్’’ యమాగా వుంటుంది అంటున్నారు. కదా! అంచేత ఏ.సి.లు లేని ఆటోలకన్నా ‘‘యాప్’’ల మీద పిలిస్తే ‘‘పెంగ్విన్’’ల లాగ దొర్లుకుంటూ మనం వున్నచోట వాలే టాక్సీల మీద స్ర్తి, పురుషులు యిద్దరికీ సమంగా మోజు పెరిగింది.
‘‘సుఖం కావాలి అంటే మరో రెండువేలు ఎలాగో తంటాలుపడి లేక తస్కరించి అయినా సంపాదించాల్సిందే. సిటీ లైఫ్ మజా అంతా అదే మరి! ఎంత సంపాదిస్తే అంత సుఖం అంటారు. సిటీజనులు! సుఖం కోసమే కదా? జీవితం!
అది కాదండి, ప్రాణపదిలంగా చంటిపిల్లనో, పెంపుడు పిల్లినో, కుక్క పిల్లనో హత్తుకున్నట్లు గుండెలకు అదుముకుని సుఖప్రయాణం చేసే వాళ్ళు టాక్సీలలో వాటిని ఎలా మరిచిపోతారండి? అంటూ అడిగింది ఓ ఘరానా యిల్లాలు. తీరా ఆమె ఇంటిలోకి పోయి ఏసీ ఆన్‌చేశాక మెడ తడుముకుంది. గుండె ఝల్లుమంది- తన రవ్వల నెక్లెస్ ఫంక్షన్‌కు వెళ్లినపుడు పెట్టుకుందా? తీసేసి బ్యాగులో పడేసుకుని టాక్సీ ఎక్కింది. ఎందుకేనా, మంచిది... మెడలో ఎందుకు? హైద్రాబాద్ ‘‘చైన్ స్నాచర్స్’’కి మహా స్వర్గం అని పేర్గాంచింది కదా? అని ‘బ్యాగ్ సీటు మీద ఒగ్గేసింది’ అన్నమాట-
మన దేశంలో యాదస్తు లేని మందమతి జాతివాళ్ళు ఎక్కువగా హైదరాబాద్‌లో వున్నారు అనుకుంటున్నారా? కాదు! బెంగళూరులో వున్నారట.. ఐ.టి. మహానగరం అన్నింటిలోనూ ‘‘టాప్’’. ఈవ్ టీజింగ్ సంగతి.. అడగకండి. కాకపోతే జంట నగరాలకీ టాప్ ర్యాంక్స్‌లో చోటుంది సుమా! న్యూఢిల్లీ సంగతి సరేసరి. అది రాజధాని ఆలిండియాకు కదా! ఆనక ముంబయి, కలకత్తా మన జంటనగరాలు.
మతిమరుపుకి లేదా నిర్లక్ష్యానికి పోటీపడే టాక్సీ మోజుగాళ్లలో ఆడవాళ్ల సంఖ్య ఎక్కువ. కూరగాయలు, టమాటాలు, ఉల్లిపాయలు లాంటివి కూడా వెనకన వదిలేసిమరీ వెళ్ళిపోయే సుందరాంగులు ఎందరో గలరు- అందరూ గాజులు ధరిస్తుంటారు. అవి ధరించేవారు చాలాసార్లు వాటిని మరిచిపోతుంటారు. కాకపోతే దీనికొక ‘‘యాప్’’ వుందిట. అందులో తమ వస్తువులు గల్లంతయినవాళ్లు ‘కంప్లంయిట్’ బటన్ నొక్కుకోవచ్చును. అది టాక్సీ డ్రయివర్‌ని పట్టుకుంటుందిట!
అయితే గ్యారంటీ ఇవ్వదు టాక్సీ కంపెనీ. పోయిన వస్తువు టాక్సీలో పోయిందన్న మాటకి దాఖాలా ఏమిటి? మీ వస్తువులు ‘జాగ్రత్త’ అన్న హెచ్చరిక షరామామూలే- పైగా సెల్‌ఫోన్‌లే మరిచిపోయే అపర బృహస్పతులకు విడిగా ‘యాప్’లు జేబుల్లో వుండవుగా- కాకపోతే భీమ్, భామ్, ధామ్, ధన్ లాంటి యాప్‌లున్నాయి ఎన్నో.. స్మార్ట్ ఫోన్ల కడుపులో ఇలాంటి యాప్‌లు లెక్కలేనన్ని.
మీకు ఈల వేయడం వచ్చునా? వేయండి! ఈల వేయడం రాదా? ‘‘దెన్’’.. హైదరాబాద్‌కు ఎందుకు వచ్చావ్? కాకపోతే దానికి కూడా ఒక యాప్ వుంటుందేమో! ‘సెర్చ్ ఇంజన్’ వెంటపడు. ‘డేటాకార్డు లేదా’? ఇంత బ్లాక్వార్డా? ఔ! మతిమరుపుగాళ్ళు చిన్న చెయిన్ ఒకటి కట్టి తమ మొబైల్స్‌ని మెడకి తగిలించేసుకుంటే అంతవరకూ సేఫ్ అనుకోవాలి.
సెల్ వుంటే.. లైఫ్ వుంటుంది మరి- ఔనా?
టేక్ కేర్! టాక్సీ మైట్ టేక్ యూ ‘్ఫర్ ఏ రైడ్!’ *