వీరాజీయం

‘రామ్‌లల్లా మందిరం’ త్వరలో విడుదల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీం కోర్టు మొత్తానికి కరాఖండీగా ఓ మాట చెప్పింది. థాంక్స్ టు శ్రీమాన్ సుబ్రహ్మణ్యస్వామి. ఎందుకంటే- ఆయనే ‘ఈ కేసు సంగతి ఏమిటో త్వరగా తేల్చండి మహాప్రభో!’ అంటూ మొరపెట్టుకోబట్టే- ఈడిగల పడ్డ కేసు మళ్లీ కదిలింది. జట్టీల్లో, పేచీల్లో, వివాదాలలో- ఇలా రకరకాలుగా- బాబ్రీ, రామమందిర్ నిర్మాణం కేసులో ‘ఇన్‌వాల్వ్’ అయి వున్నవాళ్లంతా- ‘ఓ పనిచెయ్యండి!’’అంటూ ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.ఖెహార్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ధర్మాసనం- ‘ఇది చాలా సున్నితమయిన సమస్య. ముట్టుకుంటే ముత్యం- పట్టుకుంటే పగడం- అన్నమాదిరి.. పైగా ఇది జనాల మనోభీష్టానికి సంబంధించిన కేసు. కనుక కోర్టు వెలుపల ఓ సమాధానానికి రాండి’’-అంటూ... ఆదేశ పూర్వకమయిన సూచన చేశారు కోర్టువారు.
అంతేకాదు.. ఈ కేసుతో సంబంధం వున్న ‘పార్టీ’ల వారితో సంప్రదించి రుూ నెలాఖరుకి ఒక ‘నివేదిక’ని కూడా యివ్వమని- సర్వోచ్ఛతమ న్యాయస్థానం, ఓ గడువు కూడా స్వామిగారికి పెట్టింది. శ్రీమాన్ సుబ్రహ్మణ్యస్వామి చాలా గడుసువాడు. ‘తాంబూలాలు యిచ్చేస్తున్నాం... యిక తన్నుకు ఛావండి’ బాపతు తీర్మానం యిస్తే యిక్కడ చెల్లదు..
‘ఇదేం బుచ్చమ్మ పెళ్లి వ్యవహారం కాదు కనుక- కోట్లాది ఇండియన్లకి సంబంధించిన, కీలక విషయం కనుక- సుప్రీం కోర్టు వారి ఆధ్వర్యం దీనిలో వుండటం బెటర్,’అని తలచి అలా అనిపించాడు ‘సుప్రీం’ చేత. తాము మధ్యవర్తిగా ఉంటామన్నారు కోర్టువారు. కావాలంటే, రుూ కేసులోని ‘కక్షిదారులు’, తత్సంబంధీకులు అంతా తాపీగా మనసు విప్పి, చర్చించి ఆమోదయోగ్యం కాగల పద్ధతిని కనుక్కోండి- అంతేనా? అంటే, అలా చాలదు. కనుక కావాలంటే మధ్యవర్తిగా మేం కూర్చుంటాం’’-అన్నారు. స్పష్టంగా సి.జె. ఖేహార్ గారు.. బహు దొడ్డమనీషి!
అసలు రుూ తీర్మానం సుప్రీం దేనిమీద చెప్పింది? 2010లో అలహాబాద్ హైకోర్టు సుదీర్ఘకాల ‘విచారణ’ తర్వాత- వివాదగ్రస్తంగా వున్న భూమిని మూడు భాగాలు చేసుకోమంది. ఒక భాగం రామ్‌లల్లా గుడి నిర్మాణం నిమిత్తం హిందూ మహాసభ వారికీ, మరో భాగం ‘నిర్మోహీ అఖాడా’ వారికీ- సమంగా పంచేసింది. హైకోర్టు తీర్పు అది. కానీ దీని మీద సుప్రీంకోర్టుకి అప్పీలు చేయబడ్డది. అలా అప్పటి నుండీ నానుతోందా అప్పీలు! పోయినేడాది సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీం కోర్టు దీనికి సంబంధించి- పెండింగ్‌లో వున్న సంగతుల వైనం చూసి చెప్పమన్నది. ఇప్పటికీ ముస్లిం వర్గాలు కోర్టు లోపల తీర్పుకే మొగ్గు చూపుతున్నట్లు కనబడటానికి కారణం? ప్రత్యర్థి కక్షిదారుల వర్గాలు ఏదైనా పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తారనే భయం గానీ రుూసారి సుప్రీం ధర్మాసనం చేసిన ఆదేశ పూర్వక సూచనకి చాలావరకూ మెత్తబడినట్లే కనబడుతున్నారు. అందరూ...
శ్రీమాన్ స్వామి ఓ ఐడియా చెప్పాడు- ‘‘అఖాడా వర్గానికి బాబ్రీ నిర్మాణ వర్గానికీ- మందిర నిర్మాణకర్తలకి- అందరికీ మధ్య- నేరుగా, ‘మధ్యవర్తి’గా- సాక్షాత్తూ చీఫ్ జెస్టిస్- ఖెహార్ ఆసీనులయితే బాగుంటుంది’’- అన్నాడు.
అందులో తప్పేముంది? ఆయన సర్వోచ్ఛతమ న్యా యాధిపతి. శాస్త్రం, చట్టం, అన్నీ కిందా మీదా క్షుణ్ణంగా చదివి తెలుసుకున్నవాడు. ‘దీనికి రిటైరైపోయిన ప్రధాన న్యాయమూర్తియే కావాలన్న రూలు లేదు’- అన్న వాదన కూడా వుంది. మంచిదే. ఖెహార్ గారికి మరో అడ్వాంటేజ్ కూడా వున్నది. ఆయన హిందువుకాడు, మహమ్మదీయుడు కూడా కాడు. సిక్కు మహాశయుడు. కావున మూడు పక్షాల వారికీ సాంత్వన చేకూర్చగలిగే పెద్దరికం తీసుకోతగును. ఒకవేళ, రిటైర్ అయిన ‘‘సుప్రీం బాస్’’ కావాలంటే కూడా ఆయనే ఓ.కే!
ఖెహార్ గారు చర్చలు కొనసాగుతూండగా పదవీ విరమణ చేస్తున్నాడు కనుక అదీ సాధ్యమే. ఆగస్ట్ 27తో ఖెహార్ పదవీ కాలం పూర్తవుతుందిట. అంచేత ఫుల్ టయిమ్ మధ్యవర్తిగా అటు తరువాత కొనసాగవచ్చును. సరే.. ‘ఏరియా’ని మూడుముక్కలు చేసుకున్న తర్వాత- మందిరం, మసీదుల నిర్మాణం లాంటి అంశాలు కూడా సెటిల్ అవుతాయి, ఆటోమాటిక్‌గా.. ఔనా? కాదా?- ఇదిలా వుండగా- అసలు అభ్యంతరం వెలిబుచ్చుతూ వస్తున్న- ‘ది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు’కు చెందిన ముఖ్య సభ్యుడు ఒకరు ఈ సూచనకి సూత్రప్రాయంగా స్వాగతం చెప్పాడు. లోగడ బోర్డు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు కానీ, ఇపుడు సుప్రీం కోర్టు కనుసన్నలలోనైనా కథ సుఖాంతం కాగలదేమోనన్న ఆశ వెలిబుచ్చారు చాలామంది.
చిన్నచిన్న ‘హంసపాదులు’ వున్నప్పటికీ- లాయర్లు లేకుండా ఎవరి వాదనని వాళ్లే వినిపించే ‘గుండ్ర బల్ల’ సమావేశానికి- అంగీకరిస్తున్నట్లే అనిపిస్తున్నది. కేంద్రంలో మోదీజీ, ఉత్తరప్రదేశ్‌లో యోగీజీలు కొలువుదీరి వున్నందువల్ల- రెండు గవర్నమెంట్లకూ అయోధ్య మీద అధార్టీ వున్నందువల్లనూ- రుూ రెండు గవర్నమెంట్ల దోహదం ఎలాగూ వుంటుంది. నో డౌట్!
మళ్లీ- ‘రెడ్డొచ్చె మొదలాడు’-అన్నట్లు ఆర్కియాలజీ, సైకాలజీ, బోటనీ, జువాలజీ, అదీ యిదీ అనకుండా, అన్నీ క్షుణ్ణంగా పరిశీలించినాకనే అలహాబాదు హైకోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది కదా? ‘అక్కడ ఒక దేవాలయం వుండేది’, అన్నమాట చారిత్రిక సత్యం కూడాను. పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలోనే సెటిల్ అయింది. అంతేనా? లోగడ అప్పటి ప్రధానులు రాజీవ్‌గాంధీ, చంద్రశేఖర్‌ల హయాంలో కూడా రుూ వివాదం యించుమించు ఒడ్డునపడ్డట్లే కనిపించి, మళ్లీ ఈడిగిల పడ్డది. తాళం కప్ప పడ్డ గేట్లు తెరిపించినవాడే రాజీవ్‌గాంధీ. అంచేత అన్ని అంశాలూ క్లియర్‌గానే వున్నాయి. కావల్సింది- కేసుపెట్టి అప్పీలుచేసి, కోర్టువారి తీర్పుకు వెంపర్లాడుతున్న ‘కక్షిదారులు’- లాయర్లు లేకుండా మాట్లాడుకుంటే- మొదట కొంత ‘హీట్’వచ్చినా- సదరు వేడిమి నుంచి క్రమేపీ ‘వెళుతురు’ కూడా వస్తుంది.. (ఆశ చెడ్డది) అవతల రాముడి మ్యూజియానికీ కూడా నిధులు ప్లస్ ఏర్పాట్లు రెడీ. శ్రీమాన్ స్వామిగారు మళ్లీ చిన్న ‘కిరికిరి’కాదు గానీ, సూచన చేశాడు. సరయూ నది కావల మసీదూ, ఈవల గుడీ వుంటే బెటర్ అంటున్నాడు... ‘‘ఆగవయ్యా భారుూ! ‘రామలల్లా’- జన్మభూమి అనుకున్నచోట మందిరం లేవాలి అన్నంత వరకే నీ మాట. అంచేత, పట్టుదల వుంటే చాలు. సమస్య విడిపోతుంది. ఇండియన్స్ అంతా ప్రశాంతంగా ‘మన’గలిగే మంచి రోజులకిది నాందీ ప్రస్తావన అయితే- నిజంగా గ్రేట్!
ఇదేదో ఘోరమో, పాపమో, నేరమో అని ‘వర్రీ’ అయ్యేవాళ్లని ఇగ్నోర్ చెయ్యొచ్చును. హిందూ, ముస్లిం, సిఖ్, ఇసారుూ- బౌద్ధ, జైన, పార్సీ- యింకా ఆస్తికేతరులంతా- అంటూ అనకుండా, అలా విడివిడిగా పేర్కొనకుండా- ఒక ‘కామన్ నౌన్’ వుంది. అదే- ‘ఇండియన్స్’ అన్నమాట. దాన్ని వాడాలి అందుకే. రాజకీయాలనొగ్గేయండి! రాజీలో కూడా గౌరవప్రదత వున్నది.
బెటర్ వర్క్ అవుట్ ఎ మెథడాలజీ!...
*