వీరాజీయం

చిచ్చు పెట్టిన చిన్నకోడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటిలోని పోరు ఇంతింత కాదయా..!- అన్నాడు వే మన. దేశం మొత్తం మీద అన్ని రకాలా అతి పెద్ద రాష్ట్రం- దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ప్రసాదించిన రాష్ట్రం గనుక అక్కడ- ఎన్నికలపై అందరి దృష్టి కేంద్రీకృతం కావడం సహజం. ఆ రాష్ట్రంలో ‘నేతాజీ’ జనాబ్ ములాయంసింగ్ యాదవ్ తన ఇంట్లో కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టలేకపోయాడు. పార్టీలోని లుకలుకలు సర్దుబాటు చెయ్యలేకపోయాడు. ‘పెళ్లాం చెబితే వినాలి’ అన్న సూత్రం యింట్లోను, తమ్ముడు చెబితే గంగిరెద్దులాగా తల ఊపాలన్న సంగతిని బయట రాజకీయ రణరంగంలోనూ పాటించి ఊగిసలాడుతున్నాడు.
ఇంట్లోకి వెళ్తూ- ‘అఖిలేష్ ఎవరు? నా పెద్దకొడుడు. వాడికన్నా నాకెవరు ఎక్కువ? ఎవరూ కాదు’ అంటాడు. లోపలికి పోయి చిన్న భార్య సాధనాగుప్తా- గూటాయించే సరికి, బయటికొచ్చి- ‘ఒరే అబ్బాయ్! కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరిమీదా, మనం పోటీ అభ్యర్థుల్ని పెడదాం’’ అంటూ వీరంగం వేస్తాడు. అటువంటి చిత్రమైన క్లిష్ట స్థితిలో- ములాయంజీ చిన్నకోడలు- తన భర్త ప్రతీక్ యాదవ్ (రెండో భార్య కుమారుడు) ని రాజకీయ అరంగేట్రం చేయించుకుంది.
‘‘కుటుంబం అన్నాకా ఏవో అభిప్రాయ భేదాలుండకపోతాయా?’’ అంటూ నవ్వుతూ ఆమె సర్దుబాటు చేయజూస్తుంది. ఇరవై ఆరేళ్ల చిన్నకోడలు అపర్ణ బాగా చదువుకున్నది. సాంఘిక సేవారంగంలో బాగా నాలుగైదు సంవత్సరాల అనుభవం గడిచింది. క్లాసికల్ సింగర్ కూడాను. ములాయం కుటుంబం దేశ రాజకీయ రంగంలో బహుశా అతి పెద్ద కుటుంబం అయ్యుంటుంది. రాజకీయాల్లోకి దూకిన ఈ ఆధునిక ఇల్లాలి ‘నెంబర్’ ఆ కుటుంబంలో చూస్తే ‘ఇరవై రెండు’. ప్రతీక్ జిమ్‌ల చుట్టూ తిరగడం, శరీర దారుఢ్యం కోసం వ్యాయామం చెయ్యడం- తన వ్యాపారం చూసుకుంటూనే నేతాజీ, భయ్యాజీ- ఇద్దరూ గొప్పవాళ్లేనంటూ బరువు బాధ్యతల నుంచి తప్పుకోవడం అలవాటు. తండ్రిలాగా కుస్తీలు పట్టడు గానీ బాడీ బిల్డరు. నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే మోటారు కారు వేసుకుని తిరుగుతూంటాడు. కారు పేరు లంబోర్ ఘినీ. కాని పార్టీ గుర్తు సైకిల్. సైకిల్‌ను పట్టుకుని గెలవాలనే కోరిక అతనికి లేదు. తన తండ్రి చేష్టలన్నీ చిలిపి చేష్టలుగా నెట్టేస్తూ ‘‘పాపం.. అఖిలేష్ తన సైకిల్ మీద రాహుల్ భాయ్ ‘చెయ్యి’ కూడా వేయించుకున్నాడు’’ అంటాడు. ప్రతీక్ అందుకే సైకిలెక్కడు. ‘‘నేతాజీ, భయ్యాజీ- యిద్దరూ నాకు పరమ పూజ్యులు. నేను యిప్పట్లో రాజకీయాల్లోకి రాను అంటాడు. మరి నాకు సైకిలెందుకు? ఈ లగ్జరీ కారు కోసం నేను జీవితం అంతా ధారపోసి కొనుక్కున్నాను అంటున్న తన భర్త ప్రతీక్‌ని వెనకేసుకొస్తుంది అపర్ణా యాదవ్.
అఖిలేష్, ములాయం- ఇద్దరూ తన లక్నోకాంట్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారనీ, తన ప్రత్యర్థి రీటా బహదురీ ఎంత కాకలుతీరిన యోధురాలైనా ఆమెమీద గెలుస్తాననే నమ్మకం తనకు వుందనీ చెబుతున్న ‘చిన్న కోడలు’ అపర్ణ చాలా గడుసుగా మాటా, పాటా కూడా మార్చి ముందుకు దూసుకుపోతున్నది. బావగారు అఖిలేష్ బయట వెన్నలాగ వున్నా లోపల వజ్రం- అతి గట్టి మనిషి. అఖిలేష్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు. ఆ విషయంలో కుటుంబంలో యిప్పుడు వేర్వేరు అభిప్రాయాలు లేవంటున్నది అపర్ణయాదవ్-
‘నోట్ బందీ’ తర్వాత మోదీజీ మీద గౌరవం పోయింది అన్నదామె. భాజపా జాతీయ అధ్యక్షుడ అమిత్ షా తనంతటతానే రుూ ఎన్నికలు పెద్దనోట్ల రద్దుపై తీర్పు కాగలదు అంటున్నప్పుడు మేమెందుకు కాదంటాము? చూద్దాం. నోట్ బందీ వల్ల జనాలు అన్ని రకాల యిబ్బందులూ పడ్డారు చికాకుల పాలైనారు.. అంటున్నది అపర్ణ.
ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య కూడా లోపల లోపల లుకలుకలు ఎలాగూ తప్పవుగానీ, భారతీయ జనతాపార్టీని నిలవరించడంలో, ఎన్నికలలో నిలదొక్కుకోడానికి సమాజ్‌వాదీ పార్టీకి పొత్తు అవసరం. ముందే రాహుల్, అఖిలేష్ అపురూప గంగా యమునా నదుల సంగమంగా మేం ముందుకు సాగిపోతాం అనడాన్ని అందరూ సమర్థిస్తున్నారు. ‘అందరూ’ అంటే? నేతాజీ ములాయం సహానా? మరో మార్గం ఏముంది? ఆయనకి మాత్రం- అసలే కాంగ్రెస్ పార్టీ పెద్దది- రాహుల్ గాంధీ తన పార్టీ కార్యకర్తల చేత నిందలూ, నిష్టూరాలూ మోస్తూనే వున్నాడు. ‘403 సీట్లున్నాయి. అందులోనుంచి ముష్టి నూట మూడు స్థానాలేనా మాకు?’’ అంటారు కాంగ్రెస్ వాళ్లు. కానీ, ఈ విచిత్ర సోదరులు- రాహుల్, అఖిలేష్ అచ్చం ‘అపూర్వ సహోదరులు’ అనే అలనాటి సినిమాలోలాగా తయారై, ఒకే రకం దుస్తుల్లో గాంధీ విగ్రహానికి జమిలిగా దండవేసి బయలుదేరినపుడు- భారీగా జనాలు తరలి వచ్చారు. ఈ మహాయాత్రకి దారిపొడగునా ఎవరి నాయకుడికి ఆ పార్టీ వాళ్లు జయజయ ధ్వానాలు గట్టిగా చేశారు. రోడ్లమీద అంత ఎత్తు వున్న వీళ్ల ‘విజయరథం’ సంరంభంగా నడుస్తున్నప్పుడు- ఎలక్ట్రిక్ తీగలు అడ్డు వస్తున్నప్పుడు- రాహుల్ ముందుగా ‘షాక్’కి భయపడి బాగా తల వంచేస్తూ వచ్చాడు. కాని అఖిలేష్ తలవంచని వీరుడిలాగా ‘మానేజ్’ చేశాడు. విద్యుత్ వైర్లు కిందకి దిగేలాగా, కర్రలతో, చేత్తో కార్యకర్తలు వంచుతూ వచ్చారు దారిపొడవునా. ‘‘మనకి షాక్ తగలదు రాహుల్ భాయ్! ఆప్ బేఫికర్ హూయియే!’’ అన్నాడు అఖిలేష్.
అవతల పంజాబ్‌లో పోలింగ్ అవుతూండటం రకరకాల అంచనాలు, ఊహాగానాలు ప్రస్తుత పాలక పార్టీలమీద రావడంతో, రుూ యిద్దరు నాయకులూ హుషారుగా ఆగ్రా చేరుకుని అంబేద్కర్ బొమ్మ మెడలో పూలమాలలు వేసి అక్కడ యాత్ర మొదలెట్టారు. ఏది ఏమైనా పోయినసారి నలభై కన్నా ఎక్కువ శాతం వోట్లు చూరగొన్న భాజపా పట్ల ఏమారకూడదన్నదే రుూ నవనాయకుల లక్ష్యం.
‘‘నేతాజీ మాటలు సీరియస్‌గా తీసుకోవద్దు. ఆయన మన పాటే పాడతాడు’’ అంటున్న అఖిలేష్- మరదలు పోటీ చేస్తున్న లక్నోకాంట్‌మీద ఆగ్రా నియోజక వర్గంమీదా గట్టిగానే కనే్నద్దాం’’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడికి సూచించాడు. ఈనెల పదకొండవ తేదీ నాడు చిన్నకోడలు అపర్ణ నియోజకవర్గంలో వోట్లు పోలైపోయి దాక్కుంటాయి. కనుక యిక చిన్నకోడలు సాధనాగుప్తా, ములాయంలను బుజ్జగించే కార్యక్రమంలో మునిగిపోవచ్చు. అందుకు ప్రాతిపదిక వేసుకున్నది కూడా. ఇంతకీ పెద్దకోడలు, సమాజ్‌వాదీ ఎంపీ డింపుల్ యాదవ్ ఎక్కడ? అత్తగారికీమెతో సరిపడుతుందా?
ఇట్స్ టైమ్ ఫర్ నేతాజీ టు కీప్ క్వయిట్!
*