వినమరుగైన

కార్యేషు రంభ - శయనేషు రొంప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫీసరు అనంతం చాలా హడావిడిగా ఆ ఫైలు ఇటూ ఈ ఫైలు అటూ తిప్పుతూ, మధ్య మధ్య వచ్చేవాళ్ళకేవో చెబుతూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఇంతలో సెల్ మ్రోగింది. రిసీవ్ చేసుకున్నారు.
‘హేపీ బర్త్‌డే సార్!’ అంది అవతలి కంఠం.
ఠక్కున స్విచ్ ఆఫ్ చేసి, తిరిగి తన పని చూసుకోసాగారు. రెండు నిమిషాల తరువాత ల్యాండ్ లైను మ్రోగింది. తీశారు.
‘హ్యాపీబర్త్‌డే సార్’’ అంది తిరిగి అదే కంఠం.
‘‘ఎవరు మీరు ఎక్కణ్ణుంచి మాట్లాడుతున్నారు. న్యూయార్కు నుంచా, న్యూజీలాండ్ నుంచా, నూజివీడు నుంచా?’’ సీరియస్‌గా అడిగారు.
‘‘నేనండీ గుమస్తా గుర్నాదాన్నండీ. లీవ్‌లో వున్నాగదండీ’’
‘‘గుర్నాదమో! సింగినాదమో! ఆ ఏడ్చేడేదో తెలుగులో ఏడవలేవు’’.
‘‘ఏడుద్దామనే అనుకున్నానండీ. మొదటి అక్షరాలు గుర్తుకురాక ఇందాకట్నుంచీ మీ దినానికి.. మీ దినానికి అని ఆగిపోతూ నాలో నేను నవ్వుకుంటున్నానండీ. మీ దినానికి శుభకాంక్షలండీ అంటే బాగోదు కదండీ. ఇంతకూ వాటి ముందక్షరాలు ఏమిటండీ!’’
‘‘జన్మదినానికి శుభాకాంక్షలనవచ్చు. పుట్టినరోజు శుభకాంక్షలనొచ్చు. ఓ కాగితంపైన వ్రాసుకొని, సెలవయ్యేదాకా ఇంట్లో కూర్చొని బట్టీపెట్టు. ఇంకెవరి దినానికి ఇబ్బందుండదు’’.
‘‘చూశారా! వెంటనే ఎంత చక్కగా చెప్పేశారో! అదే మరి ఆఫీసరుకూ, గుమాస్తాకు వున్న తేడా’’.
‘‘ఈ భజన ఇక ఆపి భోజనం చేసి పడుకో!’’ అంటూ ఫోన్ పెట్టేశారు అనంతం.
‘‘కాలం విలువ తెలీదు. డబ్బు విలువ తెలీదు. భాష తెలీదు. భావం తెలీదు. కానీ, క్షణాల్లో అందర్నీ మించిపోవాలి. అసలు ఈ ఆంగ్ల భాష పదాలన్నీ వచ్చిపడి ఆంధ్రానికి రంధ్రం పడింది. అందమైన తెలుగు పదాలన్నీ ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయ్. ఒక్కడంటే ఒక్కడు, ఓ ఒక్క ఇంగ్లీషు ముక్క లేకుండా తెలుగు ముక్క లేదు కదా! తెలుగుకు ప్రాచీన భాష హోదా వచ్చినా ఏం లాభం ఎవడి తెగులు వాడిదే’’ అనుకొని తిరిగి తన పనిలో లీనమైనాడు అనంతం.
అందమె ఆనందం. ఆనందమె జీవిత మకరందం అన్నట్లుగా వున్నదామె. చీరకట్టు. జాకెట్టు పట్టు. చూడనట్టు చూసే చూపు, నవ్వనట్టు నవ్వే నవ్వు. ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. ఆఫీసులోకి అడుగుపెడుతూనే ఓ మారలా చూసింది. ఆవిడ కోసమే అన్నట్లుగా అందరి చూపులు ఆవిడ వైపే మళ్లాయి. తనసీట్లోకెళ్లి కూర్చుంది. హేండ్ బ్యాగ్ తెరిచి ఓ మారు మిర్రరు తీసి. మిరుమిట్లు గొలిపే తన ముఖాన్ని ముచ్చటగా చూసుకొని, ఖర్చ్ఫీతో అలా అలా తుడుచుకొని, బ్యాగ్ సర్ది ఓ ప్రక్కన పెట్టి, ఆఫీసర్ రూమ్ వైపు చూసింది. ఆయన మూడ్‌లో లేడని తెలుసుకొని, తన పని ఆరంభించింది. అయినా పని చేయబుద్ధి కావడంలేదు. ఏదో ఆలోచిస్తూ అలాగనే కూర్చుండిపోయింది.
మగస్ట్ఫాలో కొందరు ఈవిడ వైపు మధ్య మధ్య చూస్తూ వాళ్ళ పని చూసుకుంటున్నారు. ఆడ స్ట్ఫాలో కొందరు ఈవిడను చూస్తూ కామెంట్స్ మొదలుపెట్టారు.
‘‘తానో రంభని మురిసిపోతుంటుంది’.
‘‘పనంతా ఎప్పుడు చూసినా పెండింగే’’
‘‘పెండింగ్ గాక ఏమవుతుంది. ఆవిడకు తన్ను తాను చూసుకొని, ఆనందించడానికే టైం సరిపోవడంలేదు’’.
ఈ కామెంట్స్ ఇలా జరుగుతుండగా, ఆవిడ టక్కున కుర్చీలోంచి లేచి నిల్చుంది. తమ మాటలేమన్నా విని, తమ వైపు వస్తుందేమోననుకొని, వాళ్ళంతా తలలు వంచుకొని కూర్చున్నారు. ఆవిడ ఇవేవీ పట్టించుకోకుండా, ఎకాయకీ ఆఫీసరు రూములోకి వెళ్లింది. విచిత్రమేమిటంటే ఈవిడ వచ్చినట్లుగా, ఆటోమేటిక్‌గా ఎవరికైనా తెలుస్తుంది. పెళ్లి ఊరేగింపులో వెలుగుతూ వెళ్తున్న ట్యూబ్‌లైట్‌గా వుంటుంది. ఏమిటన్నట్లుగా తలెత్తి చూశాడు అనంతం.
‘‘టుమారో నా మ్యారేజ్! లీవ్ కావాలి సార్!’’
‘‘పెళ్లిరోజనలేవా తల్లీ! ఏమిటా డాలూ, డేలూ!’’
‘‘అ..! అవును సార్. అదే! అదే! నా పెళ్లి రోజు’’
‘‘పెండ్లి ముహూర్తం రాత్రా! పగలా! ఎన్ని గంటలకు జరిగింది’’
‘‘రాత్రి పది గంటలకు’’
‘‘రాత్రి పది గంటల ముహూర్తానికి, పగలు సెలవెందుకమ్మా! రాత్రంతా సెలవేగా?’’.
‘‘అది కాదు సార్. రేపే వాలెంటైన్స్ డే కూడా అయింది. అనుకోకుండా రెండూ కలిసొచ్చాయి సార్’’

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

షణ్ముఖశ్రీ కథలు 8897853339