వినమరుగైన

సతీ ఉక్కుబాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆ చూడు సక్కూ వాళ్లకు బత్తాయికాయల రసం తీసి, తలో పెద్ద గ్లాసెడు ఇవ్వు’’ అంటూనే బత్తాయి కాయల మూట, కత్తిపీట తెచ్చి సక్కు ముందుంచింది హనుమాయమ్మగారు.
ఓపిగ్గా క్రింద కూర్చుని బత్తాయికాయల్ని తరగడం మొదలుపెట్టింది సక్కు. వచ్చిన వాళ్లంతా ముక్కు మీద వేలేసుకుని, కొత్త కోడలి చేత వెట్టి చాకిరీ చేయించడం అప్పుడే మొదలెట్టిందే. కోడల్ని పొగిడినట్లే పొగిడి పొడుచుకుతింటోంది- అని అనుకుంటూ, అందమైన ఆ సక్కు కళ్లవంక, లేతగా వున్న ఆమె చేతుల వంక చూడసాగారు.
‘‘తరిగిన వరకూ చాల్లేమ్మా! తలా కాస్త రసం పోసివ్వు. మంచి పిల్లవు. చేతులు చూడు ఎలా కంది పోయాయో’’ అన్నారు సానుభూతిగా వాళ్ళు.
‘‘అత్తగారి మాటకు విలువ ఇవ్వబట్టే నా చెయ్యి తెగకుండా, ఈ బత్తాయి కాయలు కోయగలుగుతున్నాను. లేకుంటే అవి తిరగబడి వుంటే నా పనేమయ్యేది’’ అంటూ అన్నీ కోసి రసం తీసి అందరికీ ఇచ్చింది.
‘‘ఏమిటో మీ అత్తగారి చాదస్తంగానీ, ఓ కూల్‌డ్రింక్ బాటిల్ తెచ్చి తలా కాస్తా పోసిస్తే పోయేది. చూడబోతే ఈ గొడ్డు చాకిరీ నీ చేత చేయించడానికే అన్నట్లుగా వుంది’’ అన్నారు మెల్లగా సక్కుతో.
‘‘ఆ కల్తీ కూల్ డ్రింక్సు ఇస్తే మీరు కళ్లు తిరిగి పడిపోతారని మా అత్తగారి భయం. మా అత్తగారికి పేపరు నాలెడ్జి ఎక్కువ. అందుకని ప్రకృతిసిద్ధమైన రసములనే వారు తాగుతారు, ఇంకెవరికైనా ఇప్పిస్తారు’’ అంది అత్తగార్ని వెనకేసుకొచ్చింది సక్కు. వాళ్లు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
‘‘ఏమోనమ్మా! చాలా మంది ఇళ్లల్లో ముఖ్యంగా ఈ రోజుల్లో ఇంటి కొచ్చే వాళ్ల హోదాల్ని బట్టీ మర్యాదలు చేస్తుంటారు. వాళ్ల హోదాకన్నా తక్కువ వాళ్లయితే కనీసం కూర్చోమనరు. మంచినీళ్లు కూడా అడగరు. ముభావంగా మాట్లాడి పంపిస్తారు’’ అన్నారు మరికొందరు ఏదో అనాలని.
‘‘చూడమ్మా! నీకే సాయం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు. మేమందరం నీతోనే వుంటాం. పాత రోజుల్లోలా అందిరికీ అణిగిమణిగి వుండాల్సిన పనిలేదు. ప్రభుత్వం వారు మన మహిళల కోసం ఎన్నో చట్టాలు చేశారు. బాగా చదువుకున్న దానివి. నీకన్నీ తెలిసే వుంటాయ్’’ అంటూ ఇంకొందరు హితబోధ చేశారు మెల్లగా లేస్తూ.
ఆ తరువాత హనుమాయమ్మగారు వచ్చి, అందరికీ కోడలు చేత బొట్టుపెట్టించి జాకెట్ ముక్కలు ఇప్పించింది. వాళ్లు వెళ్లారు.
ఆ తరువాత హనుమాయమ్మగారు సోఫాలో కూర్చుంటూ ‘‘సక్కూ మరోగ్లాసు రసం తీసుకురామ్మా!’’ అంది. క్షణాల్లో వెళ్లి బత్తాయి రసం తీసుకొచ్చి అత్తగారి ఎదురుగా కూర్చొని, రెండు కాళ్లూ టీపాయ్ మీద పెట్టి, ఆ గ్లాసు రసం తాగి, ఏదో వీక్లీ తీసి పేజీలు తిరగెయ్య సాగింది సక్కు.
‘‘అదేమిటే నా కిమ్మంటే నువ్వు తాగేశావ్’’ అంది హనుమాయమ్మ పెరుగుతున్న బీపీని అదుపులో పెట్టుకుంటూ.
‘‘ఇప్పటి దాకా కష్టపడి రసం తీశాను. బాగా నీరసంగా వుంది. అందువలన నా కోసం తీయమన్నారనుకొని తాగేశాను. మీక్కూడా కావాలా’’ అడిగింది.
‘ఆ!ఆ! కావాలి. తీసి తీసుకురా!’’ అంది హనుమాయమ్మ కొంచెం హెచ్చు స్థాయిలో.
‘‘ఐ యామ్ నాటే సర్వెంట్ మెయిడ్. మైండిట్. పో. పోయి తీసుకొని తాగు అంతేకాదు ఆ తర్వాత ఈ బత్తాయి తొక్కలన్నీ తీసి, ఈ గ్లాసులన్నీ కడిగి బీరువాలో పెట్టు. పిచ్చి పిచ్చిగా వాగావంటే ఈ ఫ్యానుకు వేలాడదీస్తా. ఆ నలుగురిలో నన్ను అవమానించింది చాలక రసం తీసుకు రావాలా! లే లేచి ఈ హాలంతా శుభ్రం చెయ్. మీ ఆయనొచ్చే వేళయింది. ఆయనకేం టిఫిన్ కావాలో చెయ్. అందులోనే మా ఆయనక్కూడా వుంచు. నువ్వు తర్వాత తిని తగలడుదుగాని. నా సంగతి తెలీదు.మంచిగా మర్యాదగా వుంటే వైలెన్‌లాగా సంగీతం వినిపిస్తా. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే విలన్‌గా మారి నీ జీవితాన్ని ముగిస్తా’’ అంటూ ఆవేశంగా ఊగిపోతూ తనగదిలోకి వెళ్లింది సక్కుబాయ్.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

షణ్ముఖశ్రీ కథలు 8897853339