వినమరుగైన

సతీ ఉక్కుబాయి (షణ్ముఖశ్రీ కథలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ భజతాం కల్ప వృక్షాయ సమతాం కామధేనవే’’ అంటూ పూజ ముగించారు హయగ్రీవాచారిగారు. హనుమాయమ్మగారు మహానైవేద్యం తెచ్చి పెట్టారు. ఆ నైవేద్యాన్ని దేవునికి నివేదన చేస్తున్నట్లుగా చెయ్యి చూపించి, హనుమాయమ్మగారి కొంగు పట్టుకొని లేచారు.
‘‘పూజంటే మీదేనండీ! ఓ దీపారాధనతో, ఓ అగరుబత్తితో, ఓ కర్పూరబిళ్లతో, చివరగా ఓ శ్లోకంతో ముగుస్తుంది. పట్టు పంచె కట్టు మొదలు, గంధం బొట్టు పెట్టు వరకూ, ఏ మహా యజ్ఞమో చేసే సోమయాజిలా అనిపిస్తారు’’ అన్నారు హనుమాయమ్మగారు.
‘‘నీ సోమయాజి పొగడ్తలను వింటూ పొంగి పోతూ కూర్చుంటే ఆలస్యమైందని మా ఆఫీసరు తెగవాగి యాగీ చేస్తాడు. ఆ టిఫిన్ పెట్టి, నన్ను త్వరగా అవతలికి నెట్టు’’ అన్నారు హడావిడిగా లేచి వెళ్లి డ్రస్సు వేసుకుంటూ హయగ్రీవాచారి గారు.
‘‘ఇదుగో! ఇప్పుడే...’’ నంటూ హనుమాయమ్మగారు శరవేగంగా తెచ్చిన వేడివేడి ఉప్పాను కసాపిసా స్పూనుతో కొట్టి నోటిలో కుక్కుకుంటూ ‘‘కోడలేం చేస్తోంది’’ అన్నారు హయగ్రీవాచారి గారు.
‘‘అబ్బాయిని వదలి గదిలోంచి రానంటోంది’’ అంది ఆమె వెటకారంగా.
‘‘వాడికివాళ ఆఫీసు లేదా’’
‘‘ఉంటే మటుకేం. ఆ సక్కు వెళ్లమన్నప్పుడే వెళ్తాడు.’’
‘‘అవునే్ల కొత్త దంపతులు కదా! నువ్వు మటుకు నన్ను వెళ్లనిచ్చే దానివా ఆ కొత్తల్లో, తల్లో పూలి నలిగిపోయేదాకా. ఇప్పుడేమిటో కోడలు కులుకుతోందని ఒకటేమైన నీలుగుతున్నావు. వాళ్లూ మనలాంటి వాళ్లే అనుకోవాలి. అసూయతో అగ్గిమీద గుగ్గిలం కాకూడదు. చూస్తూ ఊరుకోవాల్సిందే.’’
‘‘ఊరుకోక నేనేం పీక్కు తినటం లేదు. నేనే తెల్లారకే లేచి నాలుగు డబ్బాల మినపప్పు నానబోశాను. రోజూ ఈ దిక్కుమాలిన ఉప్మా తినీతినీ మీ పళ్లన్నీ పాచి కంపుకొడ్తున్నయ్. ఏ ఇడ్డెను ముక్కలన్నా వేసి పెడదామని. ఆ గ్రైండర్‌లో పోస్తుందేమోనని చూస్తున్నా. ఆ రోజుల్లోలాగా దంచడాలూ, వీళ్ళ దుంప తెంచడాలూ లేవుగా. కోడలన్న తరువాత ఈ మాత్రమన్నా చెయ్యలేకపోతే ఎలా’’ అంది విసుగ్గా హనుమాయమ్మ.
‘‘అవునవును. ఆ రోజుల్లో అయితే వీళ్లకు చేతకాకపోతే పూజగది వదలి రాలేని దైవభక్తులను కనికరించి, ఏ పాండురంగడో వచ్చి ఆ పని చేసి పోయేవాడు. కాలం మారిపోయింది. ఇప్పుడు బెడ్‌రూమ్ వదిలి రాలేని పతిభక్తులెక్కువయ్యారు మరి. ఆ దేవుళ్లు కూడా మనం పెట్టే కల్తీ నైవేద్యాలు తిని, ఆరోగ్యాలు చెడి, నీరసించి పోయారు. పోనీ ఆ నైవేద్యాలతో పాటే, బి.పి., షుగర్, కొలెస్ట్రాల్ నివారణ టాబ్లెట్సు కూడా నివేదన చేద్దామనుకుంటే అవీ కల్తీవేనైపాయ. ఎవరం ఏం చేయలేని పరిస్థితి వాళ్లకు కూడా ఓపిక నశించి రెస్టు తీసుకుంటున్నారు. ఎవరినీ పట్టించుకోకుండా ఎవరి కర్మకు వాళ్లను వదిలేశారు.’’
‘‘మీకేది చెప్పినా సీరియస్‌గా తీసుకోరు. సిల్లీగా తీసుకుంటారు.’’
‘‘సీరియస్‌గా తీసుకొని నీతో పాటు నేనూ అరిస్తే ఇంకేమన్నా వుందా’’ టిఫిన్ పూర్తి కానిచ్చి గడగడా మంచినీళ్ళు తాగి లేచారు.
‘‘అరిస్తే ఏమవుతుందేం’’.
‘‘పేపర్లు చదవడం లేదా టీవీ సీరియల్స్ చూడ్డం లేదా’’
‘‘ఏమున్నయ్ అందులో చంపుకోడాలూ, చావడాలూ, చిత్రహింసలూ.’’
‘‘ఆ! అవే! కోడల్ని రాచి రంపాన పెడితే, ‘గృహహింస, గృహహింస’ అంటూ సింహ గర్జన చేసిందంటే మనపని సునామీయే. అందుకని ఒళ్లు దగ్గర పెట్టుకొని లౌక్యంగా కోడల్ని లొంగదీసుకో’’ అంటూ హనుమాయమ్మగార్ని హెచ్చరించి బయటకు పరుగుదీశారు హయగ్రీవాచారిగారు.
‘‘బాగానే వుంది. సంబండం. సంబండం అయినా గానీ సంబండం.’’ అనుకుంటూ కోడలి గదివైపు ఓసారి చూసి వంట గదిలోకెళ్లి తనే గ్రైండర్‌పని మొదలెట్టింది. ఆ శబ్దానికి, గదిలోంచి సక్కు లేచి వచ్చింది.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

షణ్ముఖశ్రీ కథలు 8897853339