Others

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబోదిబో ప్రొడక్షన్స్ వారి అబ్బో అబ్బో
- షణ్ముఖశ్రీ - 8897853339
*
ఏ.వి.: మాక్కూడా చాలా ఆనందంగా ఉంది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు మీరు దొరకడం మా అదృష్టం. మా సినిమా ఆరంభమైనట్లే.
హీరో: మీ సినిమా ఆరంభం కావడం మంచిదే కానీ ఇంతటితో మమ్మల్ని వదిలేయండి. మీ సినిమాలో మమ్మల్ని మాత్రం హీరో, హీరోయిన్స్ చేయకండి. ఆ బాధలు మేం పడలేం. మమ్ముల్ని ఇలా బతకనివ్వండి.
ఏ.వి.: మీరేం బాధపడనక్కర్లేదు. మా సినిమా కథలో వెనకటి విషాద చిత్రాల్లో లా బాధలు పడటాల్లాంటివి ఏవీ లేవు. మానసిక సంఘర్షణ అసలే ఉండదు. ఆరంభం నుంచీ అంతం దాకా ప్రేమించుకోవడమే ప్రేమించుకోవడం. నేటి తరానికి కావాల్సింది ఇటువంటి కథే కదా.
ఏ.వి. : మా సినిమా అయ్యేంత వరకూ హాయిగా ప్రేమించుకుంటూనే ఉండొచ్చు. మా చిత్రంరిలీజు కాగానే పేరుప్రఖ్యాతులతో మంత్రులు, పురప్రముఖులు సమక్షంలో రాజదర్బారు సెట్ వేయించి మీ పెళ్లి మేమే ఘనంగా జరిపిస్తాం. ఆ ఖర్చంతా మాదే. ఊ అనండి. మీరొప్పుకుంటే మా సినిమా టాపే. లేకపోతే మాకు రొప్పే. ఒప్పేసుకోండి కాదనకండి ప్లీజ్
హీరో: ఇంతకూ కథేంటి?
ఏ.వి.: వెరీ సింపుల్ హీరో బీదవాడు. అతనిపేరు నోఇస్ర్తి టే ఉతికిన డ్రస్సు వేసుకుంటాడు. డబ్బున్న హీరోయిన్‌తో పరిచయం పెంచుకుంటాడు. హైక్లాస్ డ్రస్సులో క్లాసుగా ఉంటాడు. హీరోయిన్ పేరు నోవస్ర్తి . నేటి ఫ్యాషన్ కు తగినట్లుగా తగినట్లుగా వంటికి అంటీ అంటనట్లుగా ఏదొ మొహమాటం కొద్దీ అతికించుకొన్నట్లుగా ఉండే డ్రస్సు వేసుకుంటుంది. అందువలన వస్తమ్రే ధరించని స్ర్తిలా సమ్మోహనాస్త్రంతో కుర్రకారును వెఱ్ఱెత్తించేలా మెరిసిపోతుంటుంది.
జయ: అబ్బ ఏం చెప్పావరా!
ఏ.వి.: ఇంకేమీ ఆలోచించకండ ఒప్పేసుకోండి.
హీరో: మీ పిక్చర్ని ఎప్పటిలోపల పూర్తిచేసి ఎప్పుడు రిలీజు చేస్తారు.
జయ: ఎప్పుడు రిలీజైతే మీకేమిటండి ! అప్పటిదాకా మీరు ప్రతిరోజూ వాలంటైన్స్ డే.
ఏ.వి: ఇంకా ఏమిటి మీ డౌట్
హీరో: ఏం లేదు. మీ పిక్చర్ ఆలస్యం అయితే జూనియర్ హీరో వెలుగులోకొస్తాడు. అపుడు మీరు మమ్మల్ని వదిలేసి టీ.వి సీరియల్ లాగా వాడితో సినిమా తీయాల్సి వస్తుందేమో?
(ఇంకా ఉంది)
*
హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు - ఈ జీవితం ఓ నాటకం - రచన: షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.