వినమరుగైన

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలిచక్రవర్తిని మూడు అడుగులు కోరగా, ఒక అడుగు భూమి మీద, రెండవ అడుగు ఆకాశంలోని ఆధ్యాత్మిక ప్రపంచాన్ని రంధ్రం చేయగా, అక్కడి నుంచి పవిత్ర ధార (గంగ) బయటకు వచ్చి మేఘం రూపంలో తేలుతుంది. (గంగని సంస్కృతంలో జలనభ అంటారు. జల= నీరు, నభ= ఆకాశం, ఆకాశంలో నీరు అంటే మేఘం అని అర్థం) విష్ణుపాదం తగిలినందువలన గంగను విష్ణుపది అని, భగవత్ పది అని పిలుస్తారు. ఇక్ష్వాకు వంశానికి చెందిన భగీరథ మహారాజు ఆయన పూర్వీకులైన 60,000 సగర కుమారుల యొక్క మోక్షం కోసం బ్రహ్మను, శివుని ప్రార్థించి తన ఝటాఝూటంలో బంధించారు. అక్కడి నుంచి గంగోత్రి అనే మంచుగడ్డలుగా కిందకు దిగుతూ గోముఖ్ ద్వారా గంగోత్రి దగ్గర భాగీరథి (్భగీరథుడు తెచ్చుట వలన) అనే పేరుతో మిగిలిన నదులతో కలసి హృషీకేశ్ దగ్గర నుంచి గంగగా పేరుగాంచి ఉత్తర భారతంలోని రాష్ట్రాలలలో ప్రవహించి చివరకు బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో కలసి పాతాళమునకు వెళ్లి సగర పుత్రులకు మోక్షం ప్రసాదించెను. అప్పటి నుంచి సముద్రమును సాగరము అనే పేరుతో కూడా పిలుస్తారు. అలా ఝటాఝూటం నుంచి వస్తున్న గంగ యొక్క తుంపరలు హిమాలయ పర్వతములలో కేదారనాథ్ దగ్గర మందముగా ప్రవహించుట వలన అక్కడ గంగను మందాకినిగా పిలుస్తారు. వియద్గంగ = వియద్ +గంగ= స్వర్గం +గంగ= స్వర్గంలో నివసిస్తుంది ; సురదీర్ఘిక = సుర +్ధర్ఘికా= దేవతలు+సరస్సు = దేవతల సరస్సు; ఇవి అన్నీ ఆకాశగంగ (ఆకాశగంగ) (ఆకాశంలో తేలడం లేక ఆకాశం నుంచి కిందకు ప్రవహించుట) యొక్క పేర్లు మేరు, సుమేరు హిమాలయ + బ గారు రంగు కొండ, రత్నశాను= రత్న+ సాను= రత్న+శిఖరం= రత్నములు పొదిగినట్టుగా ఉండే శిఖరం; సురాలయ= సుర+ ఆలయ= దేవతల +స్థానము= దేవతల యొక్క స్థానము, ఇవీ అన్నీ ఉత్తర్ ఖండ్ రాష్ట్రం , ఇండియాలో హిమాలయ పర్వతముల యొక్క నామములు.
54 శ్లోకం

పఞ్చతే దేవతరవో మందారః పారిజాతకః
సంతానః కల్పవృక్షశ్చ పుంసి వా హరిచందనం
మందారం, పారిజాతం, సంతాన, కల్పవృక్షం, హరిచందనం అనేవి కోరికలు తీర్చే 5 కల్పవృక్షాలు మేరు పర్వతం మీద ఈ వృక్షాలు మరియు దేవవృక్షములు వ్యాపించాయి.
55 శ్లోకం
సనాత్కుమారో వైధాత్రః స్వర్వైధ్యాశ్వినీసుతౌ
నాసత్యావశ్వినౌ దస్రావాధిశ్వినే
స్ర్తియామ్ బహుష్వప్సరసః శ్వర్వేష్యా ఊర్వశీముఖః
హహ హూహూ శ్చైవ మాధ్య గంధర్వాస్ర్తీదివౌకసామ్‌॥
సనత్‌కుమార= సృష్టి మొదలుపెట్టినపుడు బ్రహ్మ నలుగురిని సృష్టించారు. వారు సనత్ కుమార్, సనత్ సుజాత, సనక, సనందన, సృష్టి కర్త బ్రహ్మ కనుక ఆయనను వైధాత్ర అని కూడా అంటారు. స్వర్వైద్య= స్వర్గమునకు వైద్యులు; అశ్వినీసుతా= అశ్వినీ కుమారులు, వీరు దేవతల ఆయుర్వేద వైద్యులు; వీరిద్దరూ అశ్వరూపం కలిగిన కవలలు,; వీరు వైవస్వతుడు (సూర్యుని యొక్క మరియొక రూపం) సరణ్య, (మేఘముల దేవత యొక్క కుమారులు; నాసత్యావశ్విన, దాస్రాశ్విన =నా సత్యా, దాస్రా అనునవి , అశ్విని కుమారుల పేర్లు, వీరిలో నా సత్యా పెద్దపుత్రుడు, దాస్రా స్ర్తియామ్= స్ర్తిలు; బహు= చాలా; అప్సరసా= అప్సరసలు,;స్వర్వేశ్య= స్వర్గలోకంలోని నృత్యకారిణులు; ఊర్వశిముఖాః= ఊర్వశి మొదలగువారు, వారు ఊర్వశి, మేనక, రంభ, ఘృతాచి, తిలోత్తమ, సుకేశి, మంజుఘోష మొదలగువారు, ; హాహా, హూహూ+ఐవ+మాధ్య+ గంధర్వులు+ త్రిదివౌకసం= హాహా , హూహూ మరికొంతమంది గంధర్వులు దేవలోకానికి సంబంధించిన సంగీత విద్వాంసులు.

ఇంకా ఉంది

- తీగవరపు వనజ, 7382762152