వినమరుగైన

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృష= ధర్మము గలవాడు, ఇంద్రుడు; వస్తోష్పతిః= స్వర్గమునకు రక్షకుడు, ఇంద్రుడ; సురపతిః= స్వర్గమునకు అధిపతి, ఇంద్రుడు ; బలారాతి= బల+ ఆరాతి=బలం కలిగినవారు+శత్రువు= రాయసులు+ శత్రువు = రాక్షసులు+శత్రువు =ఇంద్రుడు, శచిపతిః= ఇంద్రుడు; జంబ+్భది= వజ్రాయుధం పేరు జంబ+ ఛేదించిన= జంబ అనే వజ్రాయుధమును ఛేదించుట వలన ఇంద్రునకు జంబభేది అనే పేరు వచ్చింది. హరిహయః= బంగారు రంగు కలిగిన అశ్వములు గలవాడు ,ద్రుడు; శ్వారాన్ =ఇంద్రుడు; నముచిసూదన= నముచి+ సూదన = నముచి అనే రాక్షసుడు +చంపినవాడు = నముచి అనే రాక్షసుని చంపినవాడు, ఇంద్రుడు; సంక్రాంద= ఇంద్రుడు; దుష్యవనః= నిశ్చలమైనవాడు, ఇంద్రుడు ; తురాసాః= ఇంద్రుడు ; మేఘ వాహనః = మేఘములు వాహనముగా కలిగినవాడు, ఇంద్రుడు, అఖండల= ఇంద్రుడు; సహస్రాక్షః= సహస్ర +అక్ష= వెయ్యి + కన్నులు = వెయ్యి కన్నులు కలిగినవాడు, ఇంద్రుడు, రుబుక్ష = ఇంద్రుడు.
49 50 51 శ్లోకాలు
పులోమాజా సచీంద్రాణి నగరీ అమరావతి
హయ ఉచ్చైశ్రవా సూతో మాతలిర్నందనం వనం
స్యాత్ ప్రాసాదో వైజయంతో జయంతహ పాకశాసనిసి
ఐరావతో అభ్రమాతంగ గౌరావణా భ్రమువల్లభః
హ్రాదిని వజ్రమస్ర్తి స్యాత్ కుశిలమ్ బిందురం పవి
శతకోటిః సరుహ శంభో దంబోలిర్శ నిర్ద్వయోః
పులోమాజా- రాక్షసుడైన పులోమన్ పుత్రిక; శచీ= ఆమె సప్త మాతృకలలో ఒకరు; ఇంద్రాణి= ఇంద్రుని భార్యై నగరి= పట్టణం, అమరావతి= అమరావతి ఇంద్రుని పట్టణం, హయః= అశ్వం, ఉచ్చైశ్రవః ఇంద్రుని యొక్క 7 తలల అశ్వము, సముద్ర మధనంలో లభించిన ఈ అశ్వం రాక్షస రాజైన బలికి ఇవ్వగా, విష్ణువు బలిని అణిచివేసిన తరువాత అశ్వం ఇంద్రుని ఇవ్వబడ్డది; సూతః =రథ సారథి; మాతలి = ఇంద్రుని రథ సారథి పేరు; వనం= తోట, నందనం = ఇంద్రుని నగరం అమరావతి ఉన్న తోట పేరు నందనం ప్రాసాదః =్భవంతి వైజయంత =ఇంద్రుని భవంతి పేరు వైజయంతి! జయంతిః = ఇంద్రుని యొక్క పుత్రుడు జయంతః = పాక శాసనః= అజ్ఞానులకు గురువు, అర్జునుడు, ఇంద్రుని కుమారుడు, ఐరావత= తెల్ల ఏనుగు పేరు, సముద్ర మధనం లో లభ్యమైనది, ఇంద్రునికి ఇవ్వబడింది. అభ్రమాతంగ= ఏనుగుల యొక్క మేఘము, ఐరావతం యొక్క మరియొక పేరు ఐరావణ =ఐరావతమును ఇలా కూడా పిలుస్తారు. అభ్రము వల్లభ= అభ్రము+ వల్లభ= ఏనుగు పేరు+ పతి== అభ్రము యొక్క పతి ఐరావతము, హ్రదిని, బీదురమ్, పవి, శంభ, దంబోలి, ఆశని, స్వరూ, బాణములు 1000 ఆయుధములు ఇవి అన్నీ ఇంద్రుని వజ్రాయుధములు అవి దధీచి మహర్షి యొక్క ఎముకలతో తయారు అయినవి.

52 శ్లోకం
వ్యోమయానం విమానోస్ర్తి నారదాద్యః సురర్షయః
శ్యాత్ సుధర్మ దేవ సభ పీయూషమ్ అమృతం సుధా॥
వ్యోమయానం = దేవతల యొక్కరథం; విమానః= విమానం, నారదాది= నారదుడు( మొట్టమొదట బ్రహ్మ చేత సృష్టింపబడిన ఋషి) దేవలుడు, (అశిత మహర్షి పుత్రుడు, కశ్యప మహర్షి యొక్క మనుమడు) సురర్ష+ సుర+ఋషి= దేవఋషులు, సుధర్మ= దేవతల సభస్థలి, దేవసభ= దేవతల సభ, పీయూషమ్ = అమృతం,; అమృతం= దేవతల పానీయం; సుధా= అమృతం; ఇవి అన్నీ దేవతల విమానముల, ఋషుల సభ భవనముల , పానీయముల పేర్లు ;
53 శ్లోకం
మందాకినీ వియద్గంగా స్వర్ణదీ సురదీర్ఘికా
మేరుః సుమేరూర్హేమాద్రీ రత్నసానుః సురాలయః
మందాకిని= దానవ రాజైన బలి చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నపుడు, విష్ణువు వామనుడిగా బ్రాహ్మణ బాలుడి రూపంలో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చాడు.
ఇంకా ఉంది

- తీగవరపు వనజ, 7382762152