వినమరుగైన

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయకః= అడ్డంకులను తీసేవాడు, గణేష- (గణ+ఈశ=గణములకు అధిపతి, గణములు అనగ శివుని అనుచరులు): విఘ్నరాజః = విఘ్న +రాజ= అడ్డంకులు+రాజు= అడ్డంకులకు రాజు; ద్వైమారుతరః= ద్వై+ మాతు= ఇద్దరు + తల్లుల , పార్వతి కుబుసము నుడి గణేశుడు జన్మించుట వలన గణేశుడు ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డగా భావించబడుతున్నాడని పురాణాలు పేర్కొన్నాయి.
జైన గ్రంథకర్త ఐన అమరసింహుని ఉద్దేశంలో శివుని మూడవ కన్ను నుంచి కిరణములు శరవణ జలపాతంలో నుంచి గంగానదిలో ప్రవేశించి కార్తికేయుని జన్మకు కారణం అయినాయి. గణేశుడు కార్తికేయుని సోదరుడు అగుట వలన గణేశునకు ఇద్దరు తల్లులు గా భావించడమైనది. గణాధిప= గణ+అధిపతి= గణములకు అధిపతి; అపి= ఇంకా ; ఏకదంత= ఏక +దంత = ఒక + దంతము= ఒకే దంతము కలిగినవాడు; హేరంభ =గణేశుని యొక్క తాంత్రిక పూజలలో హేరంభ రూపం ఎక్కువగా పూజిస్తారు.
ఈ రూపం 5 ఏనుగు తలలతో శివుని యొక్క తత్త్వములను తెలియజేస్తుంది. అంతేకాక 4 తలలు 4 ప్రధానమైన దిక్కులవైపై 1 తల ఉర్ధము వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది. లంబోదర= లంబ+దర= లావు+పొట్ట= లావు పొట్ట కలిగినవాడు గజానన= గజ+ ఆసన= ఏనుగు +ముఖము = ఏనుగు ముఖము కలిగినవాడు ఇవి అన్నీ గణేశుని నామములు.
42, 43 శ్లోకాలు
కార్తికేయో మహాసేనః శరజన్మా షడాననః
పార్వతి నందనఃస్కందః సేనానిరఘ్ని భూగృహః
బాహులే యస్తారకజిద్విశాఖః శిఖివాహనః
షాణ్మాతురః శక్తి ధరః కుమారః క్రౌంచధారణః
కార్తికేయ= వివుని కుమారుడు, శివ, పార్వతులకు పుట్టిన కుమారుడు, రూపు లేని బ్రహ్మమునకు రూపము, ఆ బ్రహ్మమునకు సు కలిపి సుబ్రహ్మణేశ్వరునిగా పిలవబడుతున్నాడు. శివుని మూడవ కంటి నుండి వెలువడిన కిరణాలు శరవణ జలపాతాల నుంచి గంగా నదిలోకి జారిపడి కృత్తికలు అనే ఆరు నక్షత్రాల చేత పెంచబడ్డాడు అని పురాణం లోని కథనం. అందువలన ఆయన కార్తికేయ అనే పేరుతో పిలవబడుతున్నాడు.
మహాసేన= శివుడు విడుదల చేసిన బీజము అగ్ని కొంతకాలమే భరించగలిగి గంగా నదిలోకి విడుదల చేశాడు. మొదట అగ్ని భరించుట వలన ఆయనకు మహాసేన అనే పేరు వచ్చింది అని శివపురాణంలో వివరించారు. శరజన్మ = శర+జన్మ = బాణం లాగా ఉండే రెల్లు గడ్డి+ జన్మించుట = బాణం లాగా ఉండే రెల్లు గడ్డి మీద జన్మించినవాడు ; షడాన=షడ +ఆనన= 6+ ముఖములు= 6 ముఖములుకలవాడు, పార్వతినందన= పార్వతి+నందన= పార్వతి యొక్క పుత్రుడు; స్కంద(సంస్కృతంలో స్కంద అంటే విరజిమ్ముట అని అర్థం) శివుని బీజము విరజిమ్ముట వలన జన్మించినవాడు కనుక ఆయనకు స్కంద అనే పేరు కలిగింది. సేనాని= దేవతలకి సైన్యాధిపతి కనుక సేనాని అనే పేర్లు వచ్చాయి.
అగ్ని భూః= అగ్ని= పుత్రుడు (శివుని బీజం అగ్ని పట్టుకున్నాడు,) గురుగుహ= సుబ్రహ్మణ్యుడు భక్తుల హృదయం (గుహ)లో నివసించేవాడు, బాహులేయ = ద్వారపాలకుడైన నందిని అధిరోహించగలిగిన బలవంతుడు; తారకజిత్ = తారక+జిత్= తారకుడు (రాక్షసుడు) +గెలుచుట = తారాకాసురుడిని గెలిచినవాడు;
విశాఖ =స్కందుని యొక్క కేకకు ఇంద్రుడు భయపడి ఆ బాలునిపై శక్తి ఆయుధముప్రయోగింగా అది బాలునికి తగిలి బాలుని కుడి భాగము నుండి మరియొక బాలుడు జన్మించాడు. అతని పేరు విశాఖ అని మార్కండేయుని సమస్య పర్వంలో వివరించబడ్డద. శిఖివాహనాయ= శిఖి+ వాహనాయ= నెమలి వాహనం కలిగినవాడు;

ఇంకా ఉంది

- తీగవరపు వనజ, 7382762152