వినమరుగైన

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిరీష = పర్వతములలో నివసించువాడు, శివుడు; మృడః = దయచూపేవాడు, శివుడు మృత్యుంజయ= మృత్యువుని జయించేవాడు, శివుడు; కృత్తివాసః= ఏనుగు చర్మాన్ని ధరించేవాడు, శివుడు; పినాకి= పినాకి అనే పేరుగల శూలం ధరించేవాడు, శివుడు,; ప్రమాదాధిప= ప్రమద +అధిప== ఆనందం + రాజు= ఆనందానికి రాజు శివుడు, ఉగ్రః= ఉగ్రంగా ఉన్నవాడు శివుడు; కపర్ది=జఠాఝటమ్ కలిగినవాడు శివుడు; శ్రీకంఠ= అందమైన కంఠము గలగినవాడు, శివుడు; శితికంఠ = ముదురు నీలం కంఠం కలిగినవాడు శివుడు; కపాలభృత్ = కపాలం చేతిలో పట్టుకున్నవాడు , శివుడు; వామదేవ+ శుభం ఆనందం ఇచ్చేవాడు, శివుడు; మహాదేవః= అందరిలోకి గొప్పవాడు , శివుడు; విరూపాక్ష= = మెల్లకన్ను కాలినవాడు, శివుడు; త్రిలోచన =త్రి+ లోచన=3కళ్లు = 3 కన్నులు కలిగినవాడు, శివుడు; కృశానురేతః = శివుడు ; సర్వజ్ఞ అన్ని తెలిసినవాడు, శివుడు;దూర్జటి= జఠాఝటమ్ కలిగినవాడు , శివుడు ; నీల లోహితః= నీల+ లోహిత = నీలం ఙఎరుపు= నీలము ఎరుపు కాలిన రంగు కలిగినవాడు, శివుడు ; హర= అన్నీ అడ్డంకులు తీసివేసి భక్తి పెంచేవాడు, శివుడు; స్మరః=ఎప్పుడు గుర్తు ఉండేవాడు, శివుడు; భర్గః= అన్నీ పాపములను నాశనం చేసేవాడు, శివుడు; త్య్రంబకః =త్రయ +అంబక= 3+ నేత్రములు, 3 నేత్రములు కలిగినవాడు , శివుడు; త్రిపురాంతక =త్రిపుర+ అంతక= తిపురాసురులు + సంహరించినవాడు =శివుడు (మాయ అనే రాక్షసుడు 3 (త్రిపుర) ఎగిరే పట్టణాలను బంగారం , వెండి, కంచు తో నిర్మించాడు. అవి విశ్వం అంతా తిరిగ గవు అని లింగ పురాణం పేర్కొన్నది. గంగాధర =గంగా+ ధర= గంగను తలపైన ధరించినవాడు , శివుడు; అంధకరిపుహు== అంధక + రిపు= అంధకుడు అనే రాక్షసుడు +శత్రువు= శివుడు; క్రతుధ్వంసి= క్రతు+్ధ్వంసి= క్రతువులను +నాశభం చేసేవాడు, శివుడు; వృషధ్వజః = వృష+ ధ్వజః= ఎద్దు (నంది)+ వాహనం = నంది వాహనం గలవాడు= శివుడు; వ్యోమకేశః= శ్యోమ+కేశః= ఆకాశం+ వెంట్రుకలు = ఆకాశం అంతా వెంట్రుకలతో కప్పేవాడు, శివుడు; భవః= అస్తిత్వం కలిగినవాడు, శివుడు; భీమః= భయంకరుడు , శివుడు; స్ణాణుః= కదలనివాడు, స్థిరమైనవాడు, శివుడు; రుద్ర= భయంకరుడు, శివుడు; ఉమాపతి=మ+పతి = పార్వతి+్భఱ్త =శివుడు ; అహిర్భుధ్య్నో= అహి+్భద్య్నో = పాము + పునాది = ఆదిశేషుడు = శివుని యొక్క మరొక పేరు; అష్టమూర్తి = అష్ట+ మూర్తి =8 + అవతారములు = శివుడు ; గజారి = గజ+ అరి = గజములకు శత్రువు , శివుడు ; మహానట= మహా+నట = గొప్ప+ నాట్యకారుడు = నటరాజు , శివుడు;

36 శ్లోకం
కపర్దోస్య జటాఝూటః పినాకో జంగవం ధనుః
ప్రమధః స్యుః పారిషదాబ్రాహ్మీత్యాద్యాస్తు మాతరః
కపర్దొస్య= శివుని యొక్క జకఖ్హ్పుటాఝూట =జడలు కట్టిన జుట్టు పినాకో జంగవమ్ = పినాకః+ అజగవమ్= శివుని ధనస్సు (అజగవమ్) పేరు పినాక;్ధనుః= ధనుస్సు కలిగినవాడు శివుడు; ప్రమధః =ప్రమధ గణములు, శివుని సేవకులు; స్యుః= జుట్టు జడలుగా కలిగినవాడు, శివుడు; పారిషాదా= మంత్రులు ; బ్రాహ్మీత్యాద్యాస్తు మాతరః= బ్రాహ్మీ మొదలైన సప్త మాతృకల పేర్లు (పురాణాలలో వివరించబడిన కథనం ప్రకారం వివుడు అంధకాసురుడు అనే రాక్షసుని చంపటానికి ప్రయత్నించగా ఆ రాక్షసుని శరీరం నుండి రక్తం కారసాగింది. భూమికి తగిలిన ప్రతి రక్తపు బొట్టుకు ఒక్కొక్క అంధకాసురుడు పుడ్తూ వచ్చాడు. అలా చాలామంది అంధకాసురులు పుట్టారు. వీరిని ఆపడం కోసం శివుడు యోగేశ్వరి అనే శక్తిని సృష్టించాడు. అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, కుమార, వరాహ, ఇంద్ర, యమ కూడా శక్తులను సృష్టించారు.

ఇంకా ఉంది

- తీగవరపు వనజ, 7382762152