వినమరుగైన

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

28 శ్లోకం
చాపః శాంగ మురారేస్తూ శ్రీవత్సలాంఛనం స్మృతమ్
ఆశ్వాశ్చ శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప బలాహకాః ॥
మురారేసూత = మురారి యొక్క ( ముర అనే రాక్షసుని సంహరించటం వల్ల విష్ణువు, మురారి, మురహరి అనే పేర్లతో పిలవబడుతున్నాడు.) చాపం= విల్లు ; శాఙ్గ = పాలసముద్రంలో సముద్రమధనం అయినపుడు శాఙ్గ అనే చాపం (విల్లు) వెలువడి విష్ణువుకు ఇయ్యబడింది. శ్రీవత్స లాంఛనం అనే మచ్చ. భృగు మహర్షి విష్ణువు ఛాదీ మీద కాలితో తన్నినపుడు ఏర్పడినది. కృష్ణుని నాలుగు అశ్వముల పేర్లు శైబ, సుగ్రీవ మేఘ పుష్ప బలాహకములు
29 శ్లోకం
సారధిర్దారుకో మంత్రి హ్యూ ద్ధవోశ్చనుజో గదః॥
సారథి= రథం నడిపేవాడు, దారుక = దారుకుడు, మంత్రి = మంత్రి; ఉద్ధవ= ఉద్ధవుడు అనుజ= తమ్ముడు ; గద= వసుదేవుని , దేవకీ యొక్క పుత్రుడు వాసుదేవుని తమ్ముడు.

30 శ్లోకం
గరుత్మాగరుడస్తాక్షర్యో వైనతేయః ఖగేశ్వరః
నాగాంతకో విష్ణురథః సుపర్ణ పన్నగాసనః॥
గరుత్మాన్ = చాలా శక్తివంతమైన పక్షి; గరుడ= గరుడ అనే పక్షి పురాణాలకి సంబంధించింది కశ్యప మహర్షి ఆయన భార్య ఐన వినత కు జన్మించిన వాడు గరుడుడు ఆయన బలశాలి. కశ్యప మహర్షి మరియొక భార్య కద్రువ సర్పములకు (పాములు) జన్మ ఇచ్చింది. పక్షులు, పాములు యెప్పుడు గొడవలు పడుతుంటేవారు. వేయి తలల సర్పం ఐన ఆదిశేషుడు చాలా బలవంతుడు. విష్ణువు గరుడు ని వాహనం గాను, ఆదిశేషుని తల్పం గాను అమర్చుకున్నారు. గరుడుడు వాసుకి అనే సర్పం ను యజ్ఞోపవీతం గాను, ఆదిశేషుని ఎడమ చేతికి, గుళిక అనే సర్పమును కుడి చేతికి, తక్షకుని నడుము పట్టి లాగాను ధరిచాడు. తార్‌క్ష్య = దూరదృష్టి కలవాడు, ఖగేశ్వరః= పక్షులలో గొప్పవాడు, నాగాంతకః =నాగ + అంతక = సర్పములను +నాశనం చేయుట = సర్పములను నాశనం చేసేవాడు, విష్ణురథ= విష్ణు+ రథ= విష్ణువు యొక్క వాహనము, సుపర్ణః= ఉత్తమమైన రెక్కలు కలవాడు, పన్నగ నాశః= పన్నగ +నాశన= సర్పములను నాశనము చేసేవాడు.
31,32,33, 34, 35 శ్లోకాలు

శంభురీషః పశుపతిః శివః శూలి మహేశ్వరః
ఈశ్వరః శర్వా ఈశానః శంకర్చంద్రశేఖరః
భూతేషః ఖండపశుర్గురీషో గిరిషో మృడ
మృత్యుంజయః కృత్తివాసాః పినాకి ప్రమాధాధిపః
ఉగ్రః కపర్ధి శ్రీకంఠః శితికంఠః కపాలభృత్
వామదేవో మహాదేవో విరూపాక్షస్ర్తి లోచనః
కృశాను రేతః సర్వజ్ఞో దురటి నీల లోహితః
హరః స్మరహరో భర్గిస్యంబక శ్రీపురాంతకః
గంగధరో అంధకరిపుః క్రతు ధ్వంసీ వృషధ్వజః
వ్యోమకేశో భవో భీమః స్థాణు ఉమాపతిః
అహిర్వృఘ్న్యో అష్ట మూర్తిశ్చ గజారిశ్చ మహానాటః ॥
శంభుః=శ్రేయస్సు ఇచ్చువాడు, శివుడు, ఈశః= భగవంతుడు, శివుడు ; పశుపతిః= పశు+పతి= సకల చరాచర జీవరాసులు (కదిలేవి, కదలనివి) పతి= భరించేవాడు, శివుడు; శివః= పరమానందం; శూలి= త్రిశూలం ధరించేవాడు, శివుడు; మహేశ్వరః= మహా+ఈశ్వర =అన్నీ భగవంతుని రూపములలోకి శివరూపం గొప్పది, ఈశ్వర=్భగవంతుడు సర్వః =అంతటా ఉన్నవాడు, శివుడు; ఈశానః = రుద్రులలో ఒకడు, శివుడు, శంకరః= అందరికీ సంతోషం పంచేవాడు శివుడు, చంద్రశేఖరః= చంద్ర +శేఖర= చంద్రుడు +కిరీటం= శిరస్సు పైన చంద్రుని కిరీటంగా అలంకరించుకున్నవాడు, శివుడు; భూతేషా= భూత+ఈశ = భూతములకు రాజు, శివుడు, ; ఖండపరసు = ఖండ+ పరసు= ముక్కలుగా ఖండించుట, + గొడ్డలి, = రాక్షసులను గొడ్డలితో ముక్కలుగా ఖండించుట, శివుడు; గిరీష= పర్వతములకు రాజు శివుడు,

ఇంకా ఉంది

- తీగవరపు వనజ, 7382762152