వినమరుగైన

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవతలు, దానవులు మందర పర్వతము ను కవ్వముగా నాగరాజైన వాసుకి అనే సర్పమును తాడుగాను ఉపయోగించి పాలసముద్రమును చిలకగా అందులోనుండి కలువ పూవు మీద కూర్చుని కలువ పువ్వు చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఉద్భవించి విష్ణువును పతిగా స్వీకరించింది. రమా = స్వామి (పతి) ని సంతోషపరుచుట, భార్గవి=్భృగు మహర్షి యొక్కసంతతిలోని స్ర్తి, బ్రహ్మ మొట్టమొదటి సృష్టిలోని 0 మంది (నవ బ్రహ్మలు) మహర్షులలో భృగు మహర్షి ఒకరు. ఆయన దక్ష ప్రజాపతి పుత్రికను వివాహం చేసుకొని ఇద్దరు పుత్రులకు ఒక పుత్రికకు జన్మ నిచ్చా రు. ఆమె పేరు లక్ష్మి, ఆమె విష్ణువును వివాహం చేసుకొన్నారు. ఆయనకు కావ్యమాత (ఊసన) అనే ఇంకొక భార్యకి శుక్రాచార్యుడు అనే పుత్రుని ప్రసాదించారు. శుక్రాచార్యుల వారు దానవ గురువు. దేవతలు భృగు మహర్షిని బ్రహ్మ, విష్ణువు శివుని లో ఎవరు ఆధిపత్యం వహించగలరో కనుగొనమని కోరగా చులకన చేసిన బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలు జరగవు అని శపించి, శివునకు లింగరూపంలో పూజలు జరుగునని శపించి , విష్ణు యొక్క ఛాతీని కాలుతో తన్ని ముద్ర వేసి విష్ణువునకు ఆధిపత్యం ఇచ్చారు. ఆ ముద్రని ‘‘శ్రీ వత్స లాంఛన’’ అని పిలుస్తారు. అందువలన లక్ష్మీ దేవి ఆగ్రహించి వైకుంఠం వదలివేయగా విష్ణువు ఆమెను వెతుకుతూ భూలోకం వచ్చి వెంకటేశ్వరునిగా వెలిశాడు. భృగు మహరిష ‘్భృగు సంహిత’ అనే జ్యోతిష్య శాస్త్రాన్ని రచించారు. లోక జనని = లోక+జనని = లోకం + తల్లి = లోకమునకు తల్లి; క్షీర సాగర కన్యక = క్షీర+ సాగర+కన్య= పాలు +సముద్రం+ పుత్రిక= పాలసముద్రం యొక్క పుత్రిక
27 శ్లోకం
శంఖో లక్ష్మీ పతేః పాంచజన్య శ్చక్రమ్ సుదర్శనః
కౌమోదకి గద ఖడ్గో నందకః కౌస్త్భు మణిః
లక్ష్మీపతి= లక్ష్మి+పతి = లక్ష్మి +్భర్త =లక్ష్మి యొక్క భర్త, విష్ణు, శంఖం, విష్ణువు యొక్క శంఖం పాంచజన్యం; వాల్మీకి రామాయణంలో దేవ శిల్పి ఐన విశ్వకర్మ నిర్మించిన చక్రవాన్ అనే పర్వతం మీద పాంచజన అనే రాక్షసుని విష్ణువు సంహరించి అతని శంఖాన్ని తీసుకొని పాంచజన్యం అని పేరు పెట్టాడు అని పేర్కొనబడింది. హరివంశం లో ఇలా పేర్కొన్నారు. శంఖరూపంలో ఉన్న శంకాసుర్ (పాంచజన్) అనే రాక్షసుడు ప్రభాస సముద్రం (ప్రభాస్ సముద్రం సోమనాథ దగ్గర ఉన్న అరేమియా సముద్రంలో ఒక భాగం. అక్కడ సరస్వతి, హిరణ్య, కపిల అనే మూడు నదుల యొక్క త్రివేణి సంగమమైన ‘ప్రభాస తీర్థం’ ఉన్నది. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన స్థలం అదే) నివసించేవాడు. శ్రీకృష్ణుని గురువైన సాందీపని మహర్షి యొక్క పుత్రుని శంకాసురుడు ఎత్తికెళ్లినపుడు కృష్ణుడు శంకాసురుని సంహరించి బాలునితో పాటు శంఖంని తీసుకొచ్చి పాంచజన్యం అని పేరు పెట్టాడు. సుదర్శన చక్రం = విష్ణువు యొక్క చక్రం, సుదర్శన అనే పదం రెండు సంస్కృత పదముల కలయిక , సు= శుభప్రదం , దర్శన = దృష్టి; పురాణాల కథనం దృష్ట్యా విశ్వకర్మ కూతురు, సూర్యుని భార్య ఐన సంజనా దేవి సూర్యుని వేడిని భరించలేకపోవడం వలన విశ్వకర్మ సూర్యుని వెలుగు కొద్దిగా తగ్గించాడు. ఆ తగ్గించినంత వెలుగుతో ఆయన సుదర్శన చక్రం పుష్పక విమానం త్రిశూలం తయారు చేశాడు. సుదర్శన చక్రంలో ఎదురుబొదురు వరుసలలలో పది మిలియన్ల రంపపు చీలలు ఉన్నాయి. కౌవౌదకి విష్ణువు గద పేరు. కౌవౌదికి అనగా ‘నల్లకలువ’ భూదేవి యొక్క ఆనందం ‘‘ఖడ్గం= కత్తి, విష్ణువు యొక్క ఖడ్గం, పేరు ‘‘నందకం’’ విష్ణుపురాణంలో నందకంను ‘జ్ఞానం’ అని వర్ణించారు. వరాహ పురాణంలో నందకం ను ‘అజ్ఞానం ని నాశనం చేసేది’’ అని వర్ణించారు. కౌస్త్భు మణి సముద్ర మధనం లో పాలసముద్రం లో ఉద్భవించింది. ఆ మణి విష్ణువుకు అందించారు. ఈ ఆయుథాలు అన్నీ కృష్ణుని యొక్క ఉపకరణాలే.

ఇంకా ఉంది

- తీగవరపు వనజ, 7382762152