వినమరుగైన

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

21 శ్లోకం
నీలంబరో రౌహిణేయోస్తలాంఖో ముసలి హాలీ
సంకర్షణః సీరపాణిః కాళిందిభేదనో బలః
నీలాంబరః = నీల +అంబర = నీల + దుస్తులు = నీలీపు రంగు దుస్తులు ధరించేవాడు, బలరాముడు; రౌణేయ = వసుదేవని రెండవ భార్య రోహిణి పుత్రుడు, బలరాముడు; తాళంకః = తాళ పత్రం యొక్క చిహ్నం ధరించేవాడు, బలరాముడు; ఆయన రథం యొక్క ధ్వజమ్ పేరు తాళంక ధ్వజం, ముసలి = ముసలం ధరించేవాడు, బలరాముడు; హలి = హలంను పట్టుకునేవాడు, బలరాముడు; సంకర్షణ = గర్భము మార్పిడి చేయుట, దేవకి యొక్క 7వ గర్భమును విష్ణుమాయ చేత వసుదేవుని రెండవ భార్య అయిన రోహిణి దేవి (రోహిణి బృందావనంలో నంద, యశోద దంపతుల దగ్గర ఉన్నప్పుడు) గర్భమలో ప్రవేశపెట్టబడింది. అందువలన బలరాముడు సంకర్షణ అనే పేరుతో పిలవబడుతున్నాడు. ఈ బాలుడు తెల్లగా ఉన్నందువలన రామ అని, బలవంతుడగుటవలన బలరాముడు అని పిలవబడుతున్నాడు. గోకులంలోని యశోదాదేవి దగ్గరకు పంపబడ్డ దేవకీకి జన్మించిన 8వ బాలుడు, నలుపుగా ఉండుటవలన, కృష్ణుడు (నలుపుగా) పేరుగాంచాడు; సీరపాణి = సీర + పాణి = నాగలి + చెయ్యి = చేతితో నాగలి పట్టుకున్నవాడు, బలరాముడు; కాళింది భేదన = కాళింది + భేదన = కాళింది (యమున) నది + భేదించుట లేక పక్కకి తిప్పుట, బలరాముడు; బలః చాలా బలంగలవాడు.
22 శ్లోకం
మదనో మన్మథో మానః ప్రద్యుమ్నో మీనకేతనః
కందర్పో దర్పకో నంగః కామః పంచశరః స్మర
శాంభరారిర్మనసిజః కుసుమేషు రనన్యజః
పుష్ప ధన్వా రతిపతిర్మ కరధ్వజ ఆత్మభూః॥
మదన = ప్రేమ దేవుడు, కామదేవుడు, మన్మథుడు = మనస్సుని దహించేవాడు, కామ దేవుడు: మారః = ప్రేమ అనే భావావేశం కలిగిన వాడు కామదేవుడు: ప్రద్యుమ్న =శ్రీకృష్ణ మరియు రుక్మిణీ దంపదుల యొక్క పుత్రుడు కామదేవును యొక్క అవతారం; మీనకేతనః +కేతన= చేప + జండా= జెండా పై చేప బొమ్మ కలవాడు కామదేవుడు, కామదేవుడు; కందర్ప = కామదేవుడు, దర్పక = కామదేవుడు, అన + అంగ = లేనివాడు+ అంగములు = అంగములు లేనివాడు, అతను అ+తను = లేనివాడు +శరీరరం = శరీరం లేనివాడు కామదేవుడు; తారకాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేసే శివుని కుమారుని వలన తప్ప మిగిలిన ఎవరి చేత చావు రాకూడదని శివుని దగ్గర వరం సంపాదించుకున్నాడు. (అప్పుడు శివుడు భార్య (దక్ష ప్రజాపతి కూతురైన) సతీదేవి మరణ వియోగంలో మునిగి తీవ్రమైన తపస్సులో ఉన్నాడు) ఇది అవకాశంగా తీసుకొని తారకాసురుడు మునులను దేవతలను హింసించుతుండగా దేవతలు హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి ని (సతీదేవి అవతారం) శివుని తపస్సు భంగము చేసి వివాహమాడమని ప్రార్థించగా మన్మథుని సహాయంతో పార్వతి శివుని ప్రార్థించుచుండగా మన్మథుని బాణములు తగిలి శివుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిచి మన్మథుని భస్మము చేసెను. అపుడు రతీదేవి ప్రార్థనతో శివుడు సంతృప్తుడై మన్మథునికి రతీదేవికి మటుకు కనిపించేటట్టు ఆకారం ప్రసాదించాడు. కామః = కోరికలు కలవాడు,; పంచశరః= పంచ+శర= 5+ బాణములు = 5 బాణములు కలవాడు, కామదేవుడు, స్మరః = ప్రేమ విషయములను జ్ఞప్తికి తెచ్చుకొనుట శంబరారి = శంబర +అరి =శంబర అనే దానవునకు శత్రువు, కామదేవుడు, శంబరారి = శంబర+ అరి = శంబర అనే దానవునకు శత్రువు కామదేవుడు; మనసిజ = మనసి+ జ= శిష్ణువు కానీ బ్రహ్మ మనస్సు నుంచి జన్మించిన వాడు, కామదేవుడు; ఇంకా ఉంది

- తీగవరపు వనజ, 7382762152