వినమరుగైన

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

17, 18 శ్లోకాలు
దేవకీనందనః శౌరిః శ్రీపతిః పురుషోత్తమః
వనమాలి బలిద్వంసి కంసారాతిరధోక్షజః
విశ్వంభరః కైటభజిద్విధుః శ్రీవత్సలాంఛనః
పురాణపురుషో యజ్ఞపురుషో నరకాంతకః
జలశారుూ విశ్వరూపో ముకుందో మురమర్దనః
వాసుదేవః = వసుదేవుని కొడుకు, అంతట ఉండేవాడు; త్రివిక్రమః = ముల్లోకాలను దాటినవాడు; దేవకీనందనః = దేవకీదేవి కొడుకైన కృష్ణుడు, విష్ణువు; శౌరిః = శూరుని పుత్రుడు, ఇంద్రియములను స్వాధీనపరచేవాడు; శ్రీపతిః = లక్ష్మి + భర్త, విష్ణువు; పురుషోత్తముడు = పురుష + ఉత్తముడు = పురుషులలో గొప్పవాడు, విష్ణువు; వనమాలి = వన+మాలి = తోట + కాపలాదారుడు, విశ్వం అనే తోటకి మాలి, అడవిలో దొరికే పూలతో తయారుచేసిన దండను ధరించేవాడు (తులసిమాల), విష్ణువు; బలిద్వంసి = బలి +ద్వంసి, ప్రస్తుత 28వ వైవస్వత మన్వంతరంలోని త్రేతాయుగం మొదట్లో వామన అవతారంలో విష్ణువు, రాక్షస రాజైన బలి చక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కాడు; కంసారతి = కంస + ఆరతి = కంస + శత్రువు, మేనమామైన కంసుని 28వ వైవస్వత మన్వంతరంలోని ద్వాపరయుగంలో కృష్ణునిగా విష్ణువు సంహరించాడు; అధోక్షజ = ఎప్పటికీ నాశనం లేనివాడు, విష్ణువు; విశ్వంభర = అన్నీ భరించేవాడు; కైటభజిత్ = కైటభ +జిత్ = కైటభ అనే రాక్షసుని గెలిచిన (జిత్)వాడు, విష్ణువు; విధుః = చెడును నాశనం చేసి మంచిని రక్షించేవాడు, విష్ణువు; శ్రీవత్సలాంఛన = శ్రీ+వత్స+లాంఛన = లక్ష్మి + గుండె +్ధరించిన = లక్ష్మీదేవిని గుండెలమీద పెట్టుకున్నవాడు, విష్ణువు; పురాణపురుషుడు = మొదటినుంచి ఉన్నవాడు, 28వ వైవస్వత మన్వంతరములో ద్వాపర యుగంలో కృష్ణునిగా అవతరించి ప్రాగ్జ్యోతిష్పురం (ప్రస్తుతం గౌహతి, అస్సామ్, ఇండియా)ను పరిపాలించిన నరకుడు అనే రాక్షసుని అంతం చేసినవాడు, విష్ణువు; జలశారుూ = జల +సారుూ = నీరు + శయనించిన = నీటిపైన శయనించినవాడు, విష్ణువు = విశ్వరూపం = అన్ని రూపములు ధరించువాడు, విష్ణువు; ముకుందః = ముక్తి ప్రసాదించువాడు, విష్ణువు; మురమర్దన = ముర + మర్దన = ముర + చంపుట = ముర అనే రాక్షసుని చంపుటవలన విష్ణువు మురారి, మురహరి అనే పేరులతో పిలవబడుతున్నాడు.
19వ శ్లోకం
వాసుదేవస్య జనకః స ఎవానాకాదుందుభి
వాసుదేవస్యజనకః = వాసుదేవస్య+ జనక = కృష్ణుని యొక్క తండ్రి, వసుదేవుడు; అనఘదుందుభి = దుందుభి, వసుదేవుడు జన్మించినప్పుడు స్వర్గంలో దుందుభులు మ్రోగినవి. అందువలన వసుదేవుడు అనఘదుందుభిగా పేరుగాంచాడు.
20 శ్లోకం
బలభద్రః ప్రళమ్భజ్ఞో బలదేవో’చ్యుతాగ్రజః రేవతీరమణో రామః కామపాలో హలాయుధాః
బలభద్ర = ధారుఢ్యం గలవాడు, శక్తిమంతుడు, బలరాముడు; ప్రళమ్భఘ్న = ప్రలంభ + ఘ్న = ప్రలంభ అనే దానవుని చంపినవాడు, బలరాముడు; బలదేవ = వాయువు అంత బలం కలిగినవాడు, బలరాముడు; అచ్యుతాగ్రజః = అచ్యుత + అగ్రజ = కృష్ణుని పెద్ద అన్నగారు, బలరాముడు; రేవతిరమణ = రేవతి +రమణ = రేవతి + పతి = రేవతి యొక్క పతి, బలరాముడు; రామః = బలరాముని విష్ణువు 8వ అవతారంగా కూడా భావిస్తారు. విష్ణువు యొక్క అంశ మొదట బలరామునిలో ప్రవేశించి తరువాత కృష్ణునిగా విస్తరించింది. బలరామునిలో ఆదిశేషుని అంశ కూడా వున్నది; హలాయుధః = హల + ఆయుధం = నాగలిని ఆయుధంగా ధరించేవాడు, బలరాముడు;
ఇంకా ఉంది

- తీగవరపు వనజ, 7382762152