వినమరుగైన

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11, 12, 13 శ్లోకాలు
బ్రహ్మత్మభూః సురజేష్టః పరమేష్టీ పితామహః
హిరణ్యగర్భో లోకేశః స్వయంభూశ్చతురాననః
ధాతా’బ్జయోనిర్దృణో విరించిః కమలాసనః
స్రష్టా ప్రజాపతిర్వెధావిధాతా వివ్వసృడ్విదీః
నాభిజన్మాండజః పూర్వో నిధనః కమలోద్భవః
సదానందో రజోమూర్తిః సత్యకో హంసవాహనః

బ్రహ్మ = సృష్టికర్త; ఆత్మ భూః = ఆత్మ (స్వయం) + భూః (జన్మించుట), విష్ణువు కూడా స్వయం భూః; సురజ్యేష్ట = సుర (దేవతలు) + జ్యేష్ట (అందరిలోకి పెద్దవాడు), విష్ణువు, వైష్ణవ పురాణం ప్రకారం విష్ణువే సృష్టికర్త (బ్రహ్మ); పరమేష్టి = అందరిలోకి ఉన్నతమైనవలాడు, బ్రహ్మ; పితామహ = తాతగారు, మ్రహ్మ; హిరణ్యగర్భ = బంగారు గుడ్డులోనుంచి జన్మించినవాడు, బ్రహ్మ; లోకేశః = లోక + ఈశ = లోకానికి బ్రహ్మ; స్వయం భూః = తనకు తానుగా జన్మించుట; చతురానన = చతుర ఙ ఆనన = 4 + ఆనన (ముఖములు), బ్రహ్మ; ధాతా = పవిత్రమైనవాడు, బ్రహ్మ; అబ్జయోని = అబ్జ + యోని = జన్మించుట + నీరు, నీటిలో జన్మించుట, కమలం, బ్రహ్మ; దృహిణ = నాయకుడు, బ్రహ్మ; విరించి = బ్రహ్మ; కమలాసనా = కమల + ఆసన = కమలం + కూర్చుండుట, కమలము మీద కూర్చున్నవారు, బ్రహ్మ; స్రష్ట = సృష్టికర్త, బ్రహ్మ; ప్రజాపతి = ప్రజా + పతి = ప్రజల + నాయకుడు, బ్రహ్మ; వెధా = పవిత్రమైనవలాడు, బ్రహ్మ; విధాత = విధి లిఖించేవాడు, బ్రహ్మ; విశ్వసృత్ = భం లేనివాడు, బ్రహ్మ; విధి = బ్రహ్మ; నాభిజన్మాండజ = నాభి + జన్మ + అండజ = అండం అనే మూలం నంచి జన్మించుట, బ్రహ్మ; పూర్వోనిధన = పూర్వ + నిధన = కుటుంబానికి పెద్దవాడు, బ్రహ్మ; కమలోద్భవ = కమల + ఉద్భవ = కమలముతో జన్మించినవాడు, బ్రహ్మ; సదానందో = సదా + ఆనంద = ఎల్లప్పుడు ఆనందంగా ఉండేవాడు, బ్రహ్మ; సత్యక = ఉత్తముడు, బ్రహ్మ; హంసవాహన = హంస వాహనంగా కలిగినవాడు, బ్రహ్మ.
14, 15 శ్లోకాలు
విశ్ణుర్ణారాయణః కృష్ణో వైకుంఠో విష్టరశ్రవాః
దామోదరో హృషీకేశః కేశవో మాధవః స్వభూః

విష్ణుః సర్వత్ర వ్యాపించి ఉన్నవాడు; నారాయణుడు = విష్ణువు; కృష్ణః = 28వ వైవస్వత మన్వంతరంలోని ద్వాపర యుగంలో విష్ణువు అవతారం; వైకుంఠః = వైకుంఠంలో నివసించేవాడు, విష్ణువు; విష్టరశ్రవాః = అన్నిటి గురించి తెలుసుకునేవాడు, విష్ణువు; దామోదరః = దామ + ఉదర = తాడు + పొట్ట = చిన్ని కృష్ణుని నడుముకు తాడు కట్టినందు వలన కృష్ణునికి దామోదరుడు అనే పేరు వచ్చింది, విష్ణువు; హృషీకేశ = జ్ఞాన అవయవాలకు అధిపతి, విష్ణువు; కేశవః = పొడుగైన గిరజాల జుట్టు కలవాడు, కేశి అనే రాక్షసిని చంపినవాడు, విష్ణువు; మాధవః = మహాలక్ష్మి భర్త, విష్ణువు; స్వభుః = స్వీయ ఉనికి కలవాడు, విష్ణువు;
16, 17 శ్లోకాలు
దైత్యారిః పుండరీకాక్షో గోవిందో గురుడధ్వజః
పీతాంబరో’చ్యుతః శారీ విశ్వక్సేనో జనార్దనః
ఉపేంద్ర ఇంద్రావరజశ్చక్రపాణిశ్చతుర్భుజః
పద్మనాభో మధురిపుర్వాసుదేవస్ర్తివిక్రమః

దైత్యారి = దైత + అరి = రాక్షసుల + శత్రువు, విష్ణువు; పుండరీకాక్ష = పుండరీక + అక్ష = కలువ రేకులు + కన్నులు = కలువ రేకుల వంటి కన్నులు కలిగినవాడు, విష్ణువు; గోవిందః = గోవులను కాచేవాడు, విష్ణువు; గరుడధ్వజః గరుడ + ధ్వజ = గరుడుని అధిరోహించేవాడు, విష్ణువు; పీతాంబరః = పసుపుపచ్చని దుస్తులు ధరించేవాడు, విష్ణువు; అచ్యుతః దృఢమైనవాడు, శాశ్వతమైనవాడు, విష్ణువు; శారీ = సారంగ అనే ధనస్సును (సముద్రము మధిస్తున్నపుడు పాల సముద్రము నుంచి వచ్చినది) పట్టుకున్నవాడు, విష్ణువు; విశ్వక్సేనః= రాక్షస సేనను నిరోధించినవాడు, విష్ణువు; ఉపేంద్ర = ఇంద్రుని సోదరడు, ఇంద్రవరజ = కృష్ణుని యొక్క మరి యొక పేరు, విష్ణువు; చక్రపాణి= చేతితో చక్రం పట్టుకున్నవాడు, విష్ణువు; చతుర్భుజః = నాలుగు భుజములు లకవాడు, విష్ణువు; పద్మనాభ= పద్మ+నాభ = కలువ పువ్వు + నాభి = నాభిలో కలువ పువ్వు ఉన్నవాడు, విష్ణువు; మధురిపు = మధు+రిపు = మధు (రాక్షసుడు) + శత్రువు, సృష్టి మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట విష్ణువు చెవిలోనుంచి మధు, కైటభ (కీటకం) అనే రాక్షసులు జన్మించి విష్ణువుతోయుద్ధం 1000 సంవత్సరాలు చేసి, ఆయన చేత చంపబడ్డారు. వారి ఇద్దరి శరీరంలోని క్రొవ్వు (సంస్కృతంలో మేధ అంటారు)తో ప్రస్తుతం మనం ఉంటున్న ఈ భూమి (ఆకృతి) తయారైంది. అందువలన భూమిని ‘మేధ’ లేక ‘మేధిని’ అని పిలుస్తారు.

ఇంకా ఉంది

- తీగవరపు వనజ, 7382762152