వినమరుగైన

ఊహాగానం ( తెనే్నటి హేమలత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విసురు ఇలాంటి అనుకరణలమీదే కాదు, లేనిపోని భేషజాల మీద, బంధువులనే వాళ్ళ ప్రవర్తనమీద ఇంకా రకరకాల వింత ప్రవర్తనలమీద చురకలు అంటిస్తూనే వుంటుంది. ఇలాంటి బాధలుపడేవారికి ఈ విసుర్లు నచ్చుతాయి. కానీ అలా చేస్తున్నవాళ్ళు మాత్రం ఆ చురక తగలంగానే వులిక్కిపడడం సహజం.
అలాగే భారతంలో ద్రౌపది అందాన్ని వర్ణించే పద్యం
‘‘అఖిల లావణ్యపుంజంబు నబ్జ్భవుడు
మెలతగా దీనియందు నిర్మించెనొక్కొ’’
చరణంతో మొదలుపెట్టి ‘‘ఆడదానికి అందం ఒక వరం, అయితే ఏది అందం? ఏది కాదు?’’ అని ప్రశ్నిస్తూనే ‘‘అందరూ అందాన్ని చూసి ఆనందించలేరు, ఆంతర్యం నిర్మలంగా వున్నవారే అందాన్ని లేదా ఆత్మ సౌందర్యాన్ని ఆనందించగలరు’’ అంటూ ముగిస్తే రుూ నిజాన్ని మనం కాదనగలమా?
లత తన ఊహాగానాల్లో ప్రేమ కవిత్వాన్ని, ఆకలి కవిత్వాన్ని కూడా విమర్శించింది. తన తలలో తళుక్కుమన్న ఒక ఊహను పట్టుకుని దాని ద్వారా తనలో కల్గిన భావ ప్రకంపనాలను నిర్భయంగా అవతలవాళ్లు ఏమనుకుంటారోనన్న మొహమాటం కూడా లేకుండా ఠపీమని అనెయ్యడం ఆమె ప్రత్యేకత. అదే బాణిలో ప్రేమ కవిత్వాన్ని గురించి చెబుతూ, ‘‘ఈ ప్రేమ కవిత్వం మానేసిన రోజున ప్రపంచం బాగుపడుతుంది. ఇలాంటి వెర్రిమొర్రి కవిత్లాలు చదివి యువత వాస్తవికతను మర్చిపోతున్నారు’’ అంటూనే,
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకాఉంది

ఎ. తేజోవతి