వినమరుగైన

బుడుగు ( ముళ్లపూడి వెంకటరమణ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునికాంధ్ర సాహిత్యములో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకొని, చదివీ చదవగానే ఇది ‘రమణీయమయిన రచన’ అని చప్పున తెలిసిపోయేలా పాఠకుల హృదయాలలో నిలిచిపోయిన ఆహ్లాద రచయిత శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ.
రమణ ఇతివృత్తాలను ఎన్నుకోవటంలోనే గొప్ప వైవిధ్యము వుంది. వాటిలో ఒకటి అప్పుల ప్రహసనం ఋణానందలహరి, వేరొకటి సినీ మాయాలోక చిత్ర విచిత్రం. విక్రమార్కుని మార్కు సింహాసనం, సినిమాలపై సెటైర్స్ గిరీశం లెక్చర్లు, ఇంకోటి రాజకీయ చదరంగ రంగం గురించి రాజకీయ భేతాళ పంచవింశతి, మరొకటి ఇద్దరమ్మాయిలు, ముగ్గురబ్బాయిల ప్రేమాయణం. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవలసింది తెలుగు బాల సాహిత్యంలో ప్రఖ్యాతి చెందిన బుడుగు.
బాల సాహిత్యంలో మరచిపోలేని, మరపురాని పాత్ర బుడుగు. ఓ వారపత్రికలో సీరియల్‌గా వచ్చి ఆంధ్ర పాఠకులను ఆనందంతో ఒక ఊపు ఊపేశాడు బుడుగు అనే చిచ్చరపిడుగు. రచయిత పేరు లేకుండానే బడుగు ధారావాహికముగా పత్రికలో మొదలయింది. పాఠకులందరూ ఉత్కంఠతో ఎదురుచూశారు రచయిత పేరు కోసం. చివరి వారంలో బుడుగు తన పలకమీద వ్రాశాడు ‘ఇది రాసిచ్చినవాడు రమణ’ అని.
మానవ జీవితంలో అపూర్వమైనది బాల్యం. గడిచిపోతే తిరిగిరాని క్షణాలవి. మళ్లీ మళ్లీ తలచుకుంటే మనసంతా ఆనంద తరంగాలతో నింపే మధురమైన అనుభూతి అది. ఎలాంటి దిగులు, విచారం, చీకూ చింతా లేకుండా సుఖంగా, శాంతంగా, హాయిగా ఆడుతూ, పాడుతూ బ్రతికేస్తారు పిల్లలు. చిన్నపిల్లల మనస్తత్వాన్ని, వారి మాటల తత్త్వాన్ని రమణ బాగా ఆకళింపు చేసుకున్నారు అనిపిస్తుంది. బుడుగు పాత్రకి స్ఫూర్తి ముళ్ళపూడి వారి కుటుంబంలోని పిల్లలో, హిందూ పేపరు ఆదివారంనాటి కార్టూన్ ‘డెనిస్ ది మెనిస్’ అనో అంటారు. అంతమాత్రమే కాక నిజానికి బుడుగు పాత్ర సృష్టికి పునాది బాలకృష్ణుడు కూడా అని చెప్పవచ్చు. దానికితోడు చిన్నప్పుడు తాను చేసిన అల్లరి, చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా ప్రేరణ అని రమణ చెప్తారు.
అనగనగనగా ఒక బుడుగు. వాడికి ఒక అమ్మ, నాన్న- రాధ, గోపాలం. అడిగినవన్నీ ఇచ్చే ఒక మంచి బామ్మ, రెండు జతల సీత వస్తుంటే ఈలవేసిపెట్టమని, లవ్‌లెటర్ ఇచ్చి రమ్మని అడిగే బాబాయి, లావుపాటి పక్కింటి పిన్నిగారు, ఆవిడ మొగుడు గారు ఇంక బుడుగుకి గర్ల్‌ఫ్రెండ్ సీగాన పెసూనాంబ ఉన్నారు.
ఇంకా ఉంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

వావిలాల సుబ్బారావు