వినమరుగైన

రసరేఖలు( సంజీవ్ దేవ్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హల్దార్ రేఖలు సూక్ష్మం. నారీ సహజం. అవి ఖండకావ్యాలు వంటివి. హల్దార్ రేఖలలోని లాలిత్యం అబ్దుల్ రహమాన్ చుగతాయ్ రేఖలలో మనకు తిరిగి ప్రత్యక్షం అవుతాయి.
సరళరేఖలు వక్రరేఖలు ఈ రెండూ కలసి హల్దార్ చిత్రాలలో లయాత్మకంగా లాస్య నృత్యం చేస్తూ ప్రేక్షకుల హృదయవీణను మీటుతాయి. అవన్నీ గొప్ప రేఖా కావ్యాలు.
ఈ వివరణలో ఒక సంస్కారవంతునికి పరిచయం ఉండదగిన అన్ని కళారూపాల పదసామగ్రిని ఏకత్ర వాడుకుంటారు. రేఖా కావ్యాలంటాడు. రేఖలు నాట్యం చేస్తాయంటాడు. రేఖలకు స్ర్తిత్వ పురుషత్వాలాపాదిస్తాడు. ఎట్లాగయినాసరే చిత్రరచనా నైపుణ్యాన్ని కళాకారుని హృదయాన్ని పాఠకునికి విస్పష్టంగా తెలియజేయడానికి తన సాహిత్య నైపుణ్యాన్ని అంతటినీ వినియోగిస్తాడు సంజీవ్ దేవ్. తాను చేసే చిత్రకళా విమర్శ అంతా తాను వాటిని చూచి పొందిన కళానుభవం నుండే వస్తుంది. సాంకేతిక వివరాలకు ద్వితీయస్థానమే.
రవీంద్రుని చిత్రకళ గురించి వివరిస్తూ రవీంద్రుని గీతాల్లో రంగులుంటవి. రవీంద్రుని చిత్రాల్లో రాగాలుంటవి. అతని సాహిత్య దృష్టిలో ఒక పరిపక్వత, ఒక సమగ్రత, ఒక దక్షత ఉంటే ఆయన చిత్ర సృష్టిలో ఒక లేతదనం. అసంపూర్ణత స్వచ్ఛందతా ఉన్నాయి అంటూ మొగమాటం లేకుండానే అసమగ్రత గురించి గూడా చెపుతారు. ఉన్నత కళాకారుల జీవనతత్త్వం వారి కళాసృజన నుండి తెలియవస్తుందని సంజీవ్‌దేవ్ గారి అనుశీలనా సారాంశం. అనిల్‌కుమార్ హల్దార్ గురించి చెపుతూ తన హృత్ వీణాతంత్రులను అనంత చైతన్యంలోకి అస్పష్ట నాదంతో మేళవింప చూస్తాడు. ప్రవృత్తి మార్గమని నివృత్తి మార్గమని ఆయనకు తారతమ్యం లేదు. సృష్టి శీలమయిన, జ్ఞానవంతమయిన, ధ్యానవంతమయిన ప్రవృత్తి అతనిది అంటారు.
అమృతా షేర్‌గిల్ గురించి వివరిస్తూ ఆమె ముఖంలో నవ్వు వెలుగుల కంటే విషాదచ్ఛాయలే ఎక్కువగా గోచరించేవి. ఆమె చిత్రించిన మూర్తుల ముఖాలలో కూడా అంతే. రాబోయే మృత్యువు యొక్క నీడలు ఆమె కళ్లముందు ప్రాకుతుండేవేమో! అంటారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

వావిలాల సుబ్బారావు