వినమరుగైన

ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి( ఖండవల్లి లక్ష్మీరంజనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర రాజ్య స్థాపనమును గూర్చి చర్చించిన 11వ అధ్యాయమున, సుచంద్రుని ప్రస్తావించిన బ్రహ్మాండ పురాణమునందలి విషయమును గ్రహించు మహేంద్ర పర్వతము, భీమేశ్వరము, కాళేశ్వరము, శ్రీశైలములనునవి ఆంధ్ర దేశమునకు చతుర్ద్వారములు గాను వానిని త్రిశూలపాణియైన శివుడు రక్షించుచున్నాడని అందు చెప్పబడినదని ఉటంకించిరి. అంతేగాక ఆ నాల్గింటిలోని మహేంద్ర గిరిన వదలి, మిగిలిన మూడింటితో త్రిలింగ సంజ్ఞ ఏర్పడినదని తాము పూర్వోక్తము గావించినట్లు చెప్పుకొనినారు.
ఇచట బ్రహ్మాండ పురాణ విషయమును తమ సమర్థనీయమునకు వీలుగా తప్పుగా వ్యాఖ్యానించినారని చెప్పవలసియున్నది. కారణమేమనగా బ్రహ్మాండ పురాణము భీమకాళీనమని వ్యవహరించినది తప్ప నాలుగుగా చెప్పలేదు. అనగా ఆ పురాణము మూడింటినే పేర్కొన్నది. నాలుగింటిని కాదు. అందు మహేంద్రగిరిని వదలుట, విద్యానాధుని వచనమునకు ప్రామాణికత కల్పించుట లేదా దానిని నమ్ముటయే తప్ప అన్యము కాదు. ఇది వీరి దోషము మాత్రమే కాదు. ఆంధ్రదేశమేదియును విషయమున, విదేశీ యాత్రికులు వ్రాసిన దానిని, చారిత్రకులు సమముగా అన్వయింపకపోవుట, వారి వ్రాతలలో ఆంధ్ర దేశము, కళింగ దేశము, గంగానదీ పరీవాహక ప్రాంతమునందలివి. ఆంధ్రులు దక్షిణమునకు తరలివచ్చి, నేటి ఆంధ్ర దేశమును అందుకు సముద్ర తీర ప్రాంతమును దాని నంటియున్న భూభాగమును ఆక్రమించిన నాటి విషయమును బ్రహ్మాండ పురాణాలు చెప్పినది వాస్తవము. విద్యానాధుడు చెప్పినది ప్రతాపరుద్రుని పాలనమునకుగల భూభాగమునకు పరిమితము. అట్లే పోతను నగరము నేడు బోధనుగా వ్యవహరింపబడుచున్నదని పండితులందరు చెప్పెడి మాటనే వీరును ఉటంకించిరి. పోతను నగరమే బోధను అను మాట వాస్తవమేగాని, పోతను కాలక్రమమున బోధను అయినదనుట పొరపాటు. ప్రాచీన కాలమున సరబులకు బదులు పరుషాక్షరములనే వ్రాయుట ఒక సంప్రదాయము. అందువలన బోధను పోతనుగా వ్రాయబడినది.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

బాలేందు శేఖరం యార్లగడ్డ బాలగంగాధరరావు