వినమరుగైన

ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి( ఖండవల్లి లక్ష్మీరంజనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలుకూరి వీరభద్రరావు, భండార్కరు, నేలటూరి వెంకట రమణయ్య, మాగంటి బాపినీడు, డి.సి.సర్కార్, కె.గోపాలాచారి, కె.సుబ్రమణియన్, ఇ.సి.గంగూలి, వేటూరి ప్రభాకరశాస్ర్తీ, కృష్ణస్వామి అయ్యంగార్, నీలకంఠ శాస్ర్తీ, సాలబోర్, ఫాదర్ హీరా, కురుగంటి సీతారామయ్య, సత్యనాథ అయ్యర్, బ్రిగ్స్, సురవరం ప్రతాపరెడ్డి, చాగంటి శేషయ్య, కందుకూరి వీరేశలింగము, కొమర్రాజు లక్ష్మణరావు, పి.శ్రీనివాసాచారి, ఆదిరాజు వీరభద్రరావు, పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్ర్తీ గారల రచనలు సంప్రదింపబడినట్లు వారిచ్చిన పట్టిక వలన, గ్రంథమునందు ఆయా చోట్లగల వారి వారి ఉధృత వాక్యముల ఉటంకింపులను బట్టి తెలియవచ్చుచున్నది. విషయ పరిచయముగలవారికి, పై వ్యక్తుల నామములను బట్టి, వారి వారి గ్రంథములను పేర్కొనవలసిన అవసరం లేదని భావింపబడుచున్నది. కారణమేమనగా పరిశోధకులకెట్లును అవి అవశ్యక గ్రంథములగుట, ఎట్లును వారి పరిచయములోనికి వచ్చును. సాధారణ పాఠకులకు ఎట్లును అందలి విషయములు వారికవసరమైనంతవరకు, గ్రంథము సమకూర్చుచునే యున్నది.
అది అట్లుండ 1981 నాటి ప్రస్తుత పరిశీలనా ముద్రణ ప్రతియందు, నేటి ఆంధ్ర ప్రదేశ పటము ప్రచురింపబడినది. కాని గ్రంథము 1951లో వెలువడుట కారణముగా (అప్పటికి ఆంధ్ర రాష్టమ్రుకూడా ఏర్పడలేదని జ్ఞాపకముంచుకొనవలయును), ఆంధ్రదేశమునందు చేరవలసిన ఆవశ్యక ప్రాంతముల వివరణ మీయబడినది. వారి ప్రతిపాదనకు ఉపబలకముగా ఎస్.సి.కేల్కరుగారి సూచనను, కె.వి.రెడ్డినాయుడుగారి వాదనను చేర్చబడినది. కావున ద్వితీయ ముద్రణమునందే దీనిని సంస్కరించి యుండిన బాగుండెడిది. 1981 వరకును పరిష్కరింపబడకుండుట లోపమని చెప్పక తప్పదు. అయితే ఇది గ్రంథము విలువను ఎంత మాత్రమును తగ్గించునది కాదు. సంస్కరించియున్న సమాచారము సమగ్రమై యుండెడిది. ఆంధ్రమునందు చేరవలసిన భూభాగము సూచింపననువు కలిగెడిది. అయినను నేడు రచయితల, కనీసము చారిత్రకుల అభిప్రాయమును గ్రహించి పనిచేయు అభినివేశముగల రాజకీయ నాయకులు గలరందురా! దానికేమి ఇట్లే మరికొన్ని సవరణలను ఈ గ్రంథము ఆశించుచున్నది. ఆ సవరణలున్నచో నిది మరింత సమగ్రమగును. అయినను దీని విలువ దీనికి గలదు. విశేష శ్రమకోర్చి ఆయా రచయితలను క్రోడీకరించి ఉన్నంతలో ఒక ఉత్కృష్ట గ్రంథమును వెలువరించిన గ్రంథకర్తలపట్ల, ఆంధ్ర జాతి కృతజ్ఞతా బద్ధము.
చరిత్ర విషయమున తమ నాటికి వెలువడిన చారిత్రక గ్రంథముల నన్నింటిని పరామర్శించినారు. అందు కొన్నింటిపై వారి అభిప్రాయములను ప్రకటించినారు. ఆ విషయములటుండ గ్రంథము మొదటి పుటలో సంస్కృతిని నిర్వచించుట జరిగినది. గ్రంథము ముఖపత్రముపైన సహనమే సంస్కృతియను సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని ఉవాచ నిబంధింపబడినది. సంస్కృతిని నిర్వచించు అనేక వాక్యములను కూర్చుచు, ముగింపుగా ఒక మాట అనినారు. దానిని రాధాకృష్ణ పండితుని ఈ మాటతో అనుసంధించినారు. అది ఇది. నిజమైన సంస్కృతి మానవాభ్యుదయమునకును, కళ్యాణమునకును దారితీయవలెను. మానవ సంఘైక్యతకు తోడ్పడునదియే సంస్కృతి. మానవులను విడదీసిన జాతి ద్వేషములకును, యుద్ధములకును, రక్తపాతమునకును హేతుభూతమగునది సంస్కృతి కాదు. దానిని యహం కృతి యనవలెను. రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
ఇంకా ఉంది

బాలేందు శేఖరం యార్లగడ్డ బాలగంగాధరరావు