వినమరుగైన

ఆంధ్రుల సాంఘిక చరిత్ర( సురవరం ప్రతాపరెడ్డి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏం తిన్నారు, ఏం కట్టుకొన్నారు, ఎట్లా ఆడారు, పాడారు- ఈ సమాచారమంతా కళ్లకు కట్టినట్లువుంది. ప్రజాజీవనం, వారి వేషభాషలు, మతం, కళలు, వ్యవసాయం, వ్యాపారం, విద్యావ్యాపకం, ఆచారాలు, వినోదాలు, స్ర్తిల అలంకరణలు, యుద్ధతంత్రం, సైనిక వ్యవస్థ, చేతి పనులు, నాణాలు, పంచాయితీ సభలు- ఇట్లాంటివి ఎన్నో ఈ పుస్తకంలో వున్నాయి. శ్రీ రెడ్డిగారు వర్ణించిన కొన్ని పిండి వంటకాలు మనకు తెలియవు. కొన్ని వంటలను మనం వినే ఉండము. కొన్ని వాయిద్యాల పేర్లు మనకు అవగతం కావు. ఆనాటి చలివేంద్రాలలో ఎన్ని రకాల పానీయాలు ఇచ్చేవారో మన ఊహకు అందదు. నన్నయ, తిక్కనల కాలంలో పురుషులు కూడా మట్టెలు ధరించేవారట. పాచికలాటలో కులాన్ని బట్టి పావుల సంఖ్య మారేది. దొమ్మరి ఆట, పులిజూదం తెలుగువారివి. ఓనమాలలో ఓం నమఃశివాయ అనేది శైవులది, సిద్ధం నమః అనేది జైనులది.
కాకతీయుల నాడు ఎన్ని రకాల పట్టులున్నాయో ఈనాటి వస్త్ర వ్యాపారులకు కూడా తెలియవు. శ్రీకవిన్నియం, చీని, మహాచీని, భావజతిలకం, పచ్చని పట్టు, రత్నంపు పట్టు, సంకు పట్టు, మరకత పట్టు, పొం బట్టు, నెర పట్టు, వెలి పట్టు, నేత్రంబు పట్టు మొదలైనవి.
విజయనగర రాజుల కాలంలో గజమెత్తు స్టేజిపై ఆడిన నాటకాల వివరాలు చదివి ఆనందించవలసిందే.
మన పూర్వీకుల మిలటరీ బ్యాండ్‌లో ఏముంటాయో తెలుసా? తప్పెట, కాహళం, కాలికొమ్ము, డమాయా, బూర, శంఖం, సన్నాయి, డోలు, రుంజ, చేగంట ఇత్యాదులు.
మనవారి ఆటపాటలేమిటో తెలుసా? కోలాటం, గొండ్లి, చిందు, జక్కిణి, పేరిటి, ప్రేంఖణం, బొంగరాలాట, కోళ్లపందెం, పచ్చీసు, సిడి, పులిజూదం ఇత్యాదులు.
మన అమ్మమ్మలు, నానమ్మలు పెట్టుకొన్న నగలేమిటో తెలుసా? ముక్కర, నెత్తిబిళ్ల, దండెకడెము, వంకీ, తాటంకము, కమ్మ, సూపుర కణము, త్రిసరము, కడియం, వడ్డాణం, ముక్కుసత్తు ఇత్యాదులు.
వీటన్నింటినీ వెలికితీయడానికి శ్రీరెడ్డిగారు ఎంతో శ్రమించారు. నిఘంటువులలో కూడా ఇవని 600 పదాలకు అర్ధవివరణ ఇచ్చారు. ఇచ్చిన కొన్నింటిని సరిచేశారు. ఇంకా అనేకం సూచించి భావితరాలవారికి వదిలిపెట్టారు. వారికి ఆరోగ్యం, ఆయుష్షు రెండూ చాలలేదు!
ఉపసంహారం: శ్రీ నార్ల వారన్నట్లు సురవరంవారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర దాదాపు ఒక జీవితకాలపు పరిశోధనా ముక్త్ఫాలం. అయితే ఈ ముత్యాన్ని ఇంకా మెరుగులు పెట్టాలనే సూచనలు కూడా రాకపోలేదు. ఉదాహరణకు కంభంపాటి సత్యనారాయణగారు ఈ గ్రంథంలో సమాజ ఆర్థిక వ్యవస్థకు పూర్తి వివరణ లేదన్నారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
ఇంకా ఉంది

కె.వి. కోటిలింగం