వినమరుగైన

నా స్మృతి పథంలో ( ఆచంట జానకీరామ్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు వేల ఏళ్ల క్రితం వ్రాసిన పద్యాలకు ఆంధ్రీకరణ చెప్పారటగాని ఆయన వ్రాసిన కుసుమగుచ్ఛం మాట చెప్పలేదంటూ- అది వారి నిగర్వానికి సాక్ష్యమంటారు.
పూలపూజింపుమని నిద్ర మేలుకొలిపి
తట్టలో కాయ, మొగ్గలు పెట్టినావు
నిశ్చలంబుగ మదిని ధ్యానింపు మనుచు
కుంటి ముక్కాలిపేట చేకూర్చినావు
పరవశంబుగ గొంతెత్తి పాడుమనుచు
తెగిన తంబుర చేతికందిచ్చినావు-
కుసుమగుచ్ఛంలో పరిహాసలీలను జానకిరాం ప్రస్తావించారు.
ఉత్తరదేశ యాత్ర, బరోడా అహ్మదాబాద్ మధ్య బసలో కోటు మరచిపోవడం, తరువాత బండిలో రావటం, టాంగా ప్రయాణం- బరోడా జాంపళ్ళు, ఘట్టాలు, ఎవరికివారే చదువుకోవాలి. రోషనారగా స్థానం, శివాజీగా మాధవపెద్ది వెంకట్రామయ్య- వేసవి సెలవుల్లో మేనత్తగారి ఊరు పోడూరుకు సమీపాన నరసాపురంలో ప్రదర్శన. జానకిరాం మాటల్లో మనమూ చూస్తాం. బెంగుళూరు ఖాదీ వస్త్రాలయం చూస్తున్న సదాశివంతో స్నేహం, తరువాత సదాశివం ఎమ్మెస్ సుబ్బలక్ష్మిల వివాహం. శ్రీ చక్రవర్తి రాజగోపాలచారిని అర్థించి గాంధీని బెంగుళూరు సైన్స్ ఇనిస్టిట్యూట్‌కు ఆహ్వానించడం కొన్ని స్మృతిరేఖలు. బెంగుళూరులో పరిచయమైన ఒకామెకు గుడివాడ జైల్లో దంతపు దువ్వెన నందించడం మరో సన్నివేశం. అబ్దుల్ కరీంఖాన్ రామ నీ సమానమెవరు- దాక్షిణాత్య సంప్రదాయంలో పాడి- అదే పాటను భక్తిగీతంలా పాడి వినిపించాడట. కరీంఖాన్‌ను తానే్సన్ అవతారంగా భావించేవారట. 40 రోజులు బాధపెట్టిన జ్వరం, స్నేహితులు, ప్రొఫెసర్ల ఉపచారాలు, తండ్రిగారి వైద్యంతో మటుమాయం కావడం, జ్వరం తగ్గినతర్వాత శివదీక్షాపరురాలనురా క్షీరసాగర శయనా చింతలు చెప్పవలెనా తిరువాయూర్ రాజాయి నను పాలింప నడచివచ్చితివో పాటలు విన్న అనుభూతి వింటూ శంకరమీనన్ ఇచ్చిన టీ తాగే జానకిరాం మన ముందుంటారు. ద్విజేంద్రలాల్ రాయ్ కుమారుడు దిలీప్ కుమార్ రాయ్ పాడిన రమీయే, రమీయే నాట్యమాడండి- అంటూ వెనె్నల రాత్రిల్లో యువతీ యువకులు పాడే పాట మనమూ మరచిపోము. ప్రభాబెన్, డాక్టర్ శుక్లాలు అతిథి మర్యాదలు మనమూ పంచుకుంటాము. అక్షరాలా కాదు, జనకిరాం అక్షరాల్లో.
బెంగుళూరులో ఏడేళ్లు గడిచిపోయాయి. పరిశోధనలోంచి ఫార్మసీ వ్యవహరాల్లోకి జానకి రాం లక్ష్మీపతిగారు. ఇద్దరూ చదివిన జాన్‌బోయర్ గ్రేట్ హంగర్‌లో కథాంశం మనలను ముగ్థులను చేస్తుంది. ఆనకట్ట కట్టిన ఇంజనీర్ దుర్భిక్షానికి కారకుడై రైతు విత్తుకొనేందుకో ధాన్యం లేకపోతే ఇంజనీరు తను దాచుకున్న ధాన్యం రైతు చేలో జల్లివస్తాడు.
రేపల్లెలో నోరి నరసింహశాస్ర్తీ స్టేషన్‌లో పరిచయమైన ఆరు పద్యాలు చదివిన మాధవపెద్ది, బుచ్చి సుందర రామశాస్ర్తీ హైదరాబాద్‌కు నూరునైళ్ళ దూరంలో వున్న ఆసీఫాబాద్ దేశ్‌ముఖ్‌గారింట అనుకోకుండా నెల రోజులు ఉండడం. ఆనక తాలూకదార్‌తో ఇంగ్లీషులో మాటాడడం, బొబ్బిలి నుండి వచ్చిన గాయకుడి పాటకు దేశ్‌ముఖ్ గారింట్లో మునగాల రాజువారి బంధువులు,....

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
ఇంకా ఉంది

కొమ్మన రాధాకృష్ణారావు