వినమరుగైన

నా స్మృతి పథంలో ( ఆచంట జానకీరామ్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆల్ ఇండియా రేడియో, మద్రాస్ కేంద్రము, నిత్యజీవితంలో సౌందర్య పిపాస గురిచి శ్రీమతి క్షమించాలి శ్రీయుత అడివి బాపిరాజు ముచ్చటిస్తారు. అనౌన్సర్ జానకిరాం. ప్రకటన 63 సంవత్సరాల క్రితం సంగతి. మద్రాస్ రేడియో స్టేషన్‌కు త్రివేణి సంపాదకులు శ్రీ కొలవెన్ను రామకోటేశ్వరరావు, కవితా సామగ్రి పద్యాలతో పరిచయమైన శ్రీ కాటూరివారు, కళాతపస్వి బాపిరాజు వచ్చారు. చనువున్న మిత్రులు బాపిరాజుగారిని శ్రీమతి అని పిలిచేవారట. శ్రీ రామకోటేశ్వరరావుగారు వేళాకోళంగా శ్రీమతి బాపిరాజు అని పరిచయం చేస్తారా అని అంటే అలాగేనన్న ఫలితం పైప్రకటన. సుమ సౌకుమార్యం- సుగంధం- చందనాది పరిమళద్రవ్యాలు- పరీమళం కలగలసి, దృశ్యాదృశ్యంగా కనులముందు కదలాడుతుంటే తంత్రీ వాద్యాలపై నుండి వెలువడే సావేరీ రాగం- ఆ అస్పష్ట దృశ్యానికి తోడైనపుడవతరించిన శాపగ్రస్త యక్షుడిలా కనబడతాడు జానకిరాం. అలా అవతరించిన జానకిరాం అతి సన్నని యవనిక వెనుక మనిషి పరిపూర్ణ మానవుడిలా అవతరించే సాధనలో లీనమై తనని ఆవిష్కరించుకునేందుకు నా స్మృతిపథంలో.. సాగుతున్న యాత్ర రెండు భాగాలు ప్రకటించాడు.
తొలిప్రేరణ శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారిది. శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ, శ్రీ నీలంరాజు వెంకట శేషయ్య ప్రోత్సహించి ఉన్నంతలో సమగ్రంగా వెలువరించేలా చేయగలిగారు. నా స్మృతిపథంలో 1960 ఉగాదిలో, దేశీ ప్రచురణవారు, సాగుతున్న యాత్ర 1, 2 భాగాలు ఆదర్శ గ్రంథ మండలివారు పుస్తక రూపంలో ప్రచురించారు. రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
ఇంకా ఉంది

కొమ్మన రాధాకృష్ణారావు